*కాలము*
రెండు సంఘటనల మధ్య వ్యవధే కాలము. కాలము యొక్క ప్రధాన లక్షణం కొనసాగింపు. కాలము ఆగదు.దానికి ఒక నిర్ధిష్ట వేగం వుంది. మన ఆధినంలో లేనిది.ఇది భౌతిక కాలం.ఈ కాలంతో మనకు సమస్య లేదు.
*మన సమస్యల్లా మానసిక కాలం.*
ఏదైనాసరే కొనసాగాలి అనుకోవడమే మానసిక కాలాన్ని సృష్టిస్తూ ఉంది.
ఏదో ఒక అనుభూతి
ప్రతి క్షణం మనకు కలుగుతూ
వుంటుంది.
ఎప్పటికప్పుడు కలుగుతూ వున్న అనుభూతులలో ఎప్పుడైతే ఒకానొక అనుభూతి కొనసాగాలనో, కొనసాగ కూడదనో, సంభవించాలనో, సంభవించకూడదనో అనుకుంటామో/కోరుకుంటామో,
అప్పటి నుండి మానసిక కాలం తిరుగుతుంది.
ఈ కాలం మనలను నించో నివ్వదు, కూర్చో నివ్వదు.
*ఇట్లు*
కాలపురుషుడు లేని కాలం.
No comments:
Post a Comment