Monday, October 16, 2023

హార్ట్ ఫుల్ నెస్🌍కథతో, సూఫీ మోక్షగామి ప్రార్థన - శిష్యుల ప్రశ్న

 *365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో* 

❤️ *కథ-40* ❤️

 *అనుభూతి - నా హృదయ ఔదార్యానికి  నేను కృతజ్ఞతతో ఉన్నాను.* 

 *సూఫీ మోక్షగామి ప్రార్థన - శిష్యుల ప్రశ్న* 

చాలా కాలం క్రితం, ఒక సూఫీ ఆధ్యాత్మికవేత్త ఉండేవారు, ఆయన ప్రతిరోజూ దైవానికి తాను చేసే ప్రార్థనలలో,  "మీరు నా కోసం చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. సదా నేను మీకు  కృతజ్ఞుడను. మీ రుణమెలా తీర్చుకోగలను?" అని చెప్పేవారు.
ఒకసారి, అతను చాలా దూరం ప్రయాణించవలసి వచ్చింది. 
వరుసగా మూడు రోజులుపాటు, అతడిని నాస్తికుడు (అవిశ్వాసి) గా భావించి అందరూ ఆశ్రయం నిరాకరించారు, ఆహారం, నీరు కూడా ఇవ్వలేదు. 
మొత్తం మూడు రోజులు కూడా, ఆకలితో, దాహంతో తిరుగుతూ ఉన్నాడు.
మూడు రోజుల ఆకలి, దాహం తర్వాత కూడా, ప్రతీ రాత్రి ఇలానే ప్రార్థించేవాడు, "ధన్యవాదాలు, ప్రభూ!  నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను. మీ రుణమెలా తీర్చుకోగలను?"

ఆయనతో ప్రయాణిస్తున్న శిష్యులలో ఒకరు ఇది చూసి, “గురుదేవా, దయచేసి నేను ఒక విషయం అడగవచ్చా?
మీరు దేనికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు?  మూడు రోజులుగా ఆకలితో, దాహంతో, ఆశ్రయం లేకుండా తిరుగుతున్నందుకా! లేక మనలని ఏమీచేయని ఎడారిలో అడవి జంతువుల కరుణకా! 
దేనికి కృతజ్ఞతతో ఉన్నారు?" అని అడిగాడు.

ఆధ్యాత్మికవేత్త చిరునవ్వుతో , "నీకు అర్థం కాలేదు. నాకు మూడు రోజులు తినడానికి లేదా త్రాగడానికి ఏమీ లేదంటే, ఈ మూడు రోజులు ఆకలితో ఉండడం నాకు అవసరమై ఉంటుంది!
భగవంతుడు ఎల్లప్పుడూ నాకు ఏది అవసరమో అదే ఇస్తాడు." 

 " ఈ మూడు రోజులు నాకు ఈ పరిస్థితి అవసరం అయివుండాలి, లేకపోతే, దైవం నాకు ఇవ్వడు.  
దానికి నేను చాలా కృతజ్ఞుడను.
ఆయన ఎల్లప్పుడూ నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు.  నా కోరికలతో సంబంధం లేకుండా, నాకు సరైనదని భావించేదాన్ని మాత్రమే నాకు ఇస్తాడు.
నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే, మూడు రోజులుగా ఆహారం, నీరు, ఆశ్రయం లేకుండా, బహిరంగ ఆకాశంలో, ఎడారిలో నక్షత్రాల క్రింద నిద్రిస్తున్నప్పటికీ... ఏ అడవి జంతువులు కూడా మనపై దాడి చేయలేదు!
మీరు విచారంగా ఉన్నారా?!  దేనికి?  ఇది మనకు నిజమైన అవసరం అయి ఉండాలి!
నిజమైన విశ్వాసం అంటే ఇదే;  ఇదే హృదయపూర్వక కృతజ్ఞత.  

జీవితంలోని ప్రతి క్షణాన్ని, ప్రతి పరిస్థితిని సంతోషంగా స్వీకరించడమే నిజమైన హృదయ ఔదార్యం.  ఉదార హృదయం ఉన్న వ్యక్తి మాత్రమే తన జీవితపు నిజమైన లక్ష్యం వైపు ముందుకు సాగగలడు", అని చెప్పాడు.

శిష్యుడి ముఖంలో ఇప్పుడు సంతృప్తి కనిపించింది.  తన గురువు చెప్పిన ఈ మాటలు అతనికి లక్ష్యం వైపు వెళ్లే రహస్యాన్ని వెల్లడించాయి.

  
   ♾️

 *అన్ని పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉండే వ్యక్తే, అత్యంత సంతోషకరమైన వ్యక్తి.* 

  *బాబూజీ* 


 హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం💌 

HFN Story team
💜🧘‍♂️🔺🧘‍♀️💜🧘‍♂️🔺🧘‍♀️💜

No comments:

Post a Comment