Sunday, October 29, 2023

పక్కింటి గుసగుసలు

 🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

*BeautifuL $tor¥...®️✍🏻*   

   *పక్కింటి గుసగుసలు*

      _వనజా .... భోజనమైందా ? అంటూ ఇంట్లోకివచ్చింది రమ. ఆఁ వదినా  రండి ! ఇప్పుడే తిన్నాను అంది వనజ. సరే రా ...ఇటు కూర్చో అంటూ చొరవగా సోఫాలో సెటిల్  అయ్యి.... పక్కింటి_ *"ప్రియా వాళ్ళకోడలు ఇంట్లోంచి  వెళ్ళిపోయింది తెలుసా..!*  _అంది. ఆఁ ఆఁ  ఎప్పుడు ?కళ్ళు పెద్దయి  ,చేసుకుని సగం ముందుకు వాలి , నోరు తెరిచింది వనజ._

_ఇందాకే ! నేను వంటింట్లో నుంచి చూస్తుంటే,లిఫ్ట్ లోకి 'పెద్ద సూటుకేసు  లాక్కుంటా ,కళ్ళు తుడుచుకుంటా వెళ్ళింది . గబా గబా బయటికి వచ్చి వాళ్ళింటేపు చూస్తే, వాళ్ళత్త ధడాలున  తలుపేసుకుంది . ఏమైఉంటుందంటావ్ ?మీ  పక్కనేగ వాళ్ళు ?ఆరాగా అడిగింది._

_ఏదో ఆలోచిస్తున్నట్టు మొకం పెట్టి , నిజమే!వదినా .. నిన్న రాత్రి ప్రకాష్  అరుపులు విన్పించాయి  కూడా !అంది._
 _"మరే ఏదన్నా సమస్య వచ్చినపుడు ఇరుగు పొరుగు   సాయం తీసుకోవచ్చు కదా ఎప్పుడూ తలుపులు బిగించుకొని ఉంటారు. మనతో కూడా పెద్దగా కలవరు కూడాఎందుకో ?ఏంటో"అనుమానం గా  చెప్తుంది._

_ఇంతలో కరుణ కూడా తలుపు తోసుకుని వచ్చింది._  _"ఏంటక్కా ? వనజ ఫ్లాట్ కి రమ్మని ఫోన్ చేసావ్" అంటూ,_
_"ఆఁ  రారా ...ఇక్కడైతే వాసు రాత్రి దాక రారు కదా !! ఫ్రీ గా  మాట్లాడుకోవచ్చని రా !కూర్చో" అంటూ రమ, కూర్చో కరుణా ...అంటూ ప్రియ కోడలి గురించి చెప్పుకొచ్చింది వనజ .మొన్న సాయంత్రం టెర్రస్  మీద ఒక్కటే కూర్చొని ఉంది. నేను పలకరించినా...సరిగ్గా మాట్లాడలేదు  కూడా" కరుణ కూడా మాట  చేర్చింది._

_ఇంకో నలుగురికి ఫోన్లు వెళ్ళినాయి .అందరూకలిసి "ఆ అమ్మాయి ని ,అత్తా, మామ ,మొగుడు రాచి రంపాన బెటుతుంటే , భరించలేక పిల్లాడ్ని కూడా ,వదిలేసి వెళ్ళిపోయింది" అని మేటర్ రెడీ చేసారు. ఫ్లాట్స్ మొత్తం తిరిగిందీ విషయం. అందరికీ  ఈ  విషయం తెల్సినా ,ప్రియా నెవరూ అడగరు._
_ఎందుకంటే ? ఎవరు చెప్పారంటే ...మరి ఎవరి పేరు చెప్పకూడదుకదా._

_సాయంత్రం ప్రియా,ఆమె భర్త, కొడుకు ,మనవడ్ని  తీసుకుని   లిఫ్ట్ దగ్గరకొచ్చి  నిలబడ్డారు .వీళ్ళని చూసిన  రమ"కోడలు గాని ..పోలీస్ రిపోర్ట్ పెట్టిందా ఏమిటి వీళ్ళమీద పరారవుతున్నట్టున్నారు._
_ఈమధ్య ఆడపిల్లలు , అత్తింటి మీద కేసులు  బాగానే పెడుతున్నారు."కథ  అల్లేసుకుని ,ఫోన్ చేతిలోకి తీసుకుంది._ 

_ఇంతలో "రమా గారు" ....అంటూ పిలిచింది  ప్రియ.  "ఆఁ  ఏంటండీ ప్రియా గారు అంటూ వచ్చి ఏమి తెలియనట్టు ఎక్కడికండీ  ప్రయాణం" ?అని అడిగింది._
*మా వియ్యపురాలికి హార్ట్ అటాక్* _వచ్చిందని  వాళ్లన్న  ఫోన్ చేస్తే మా కోడలు పొద్దున  హడావుడిగా వెళ్ళింది._
_నేను వీళ్లిద్దరికీ ఫోన్లు చేసి ,మనవడ్ని  స్కూల్ నుండి తీసుకు రమ్మని చెప్పిఇప్పుడెళ్తున్నాము."_
_వాళ్ళమ్మగారి  పాత  మెడికల్ రిపోర్ట్స్, అన్నీ మాఇంట్లో మర్చిపోయారు. మొన్న చెకప్ కి వచ్చినపుడు ,అవి తీసుకుని ఫ్లయిట్  కి వెళ్ళింది. మేము ఇప్పుడెళ్తున్నాము. ప్రమాదమే అంటున్నారు  పాపం" అని  బాధగా చెప్తూ లిఫ్ట్ లోకి వెళ్లిపోయారు._
 

_చూడండి మిత్రులారా..! ఇప్పుడైనా... ప్రియా గారు ఈ విషయం చెప్పకుండా వెళ్ళిపోతే  ,ఇంకెన్ని_ *పుకార్ల పొగ పెట్టేవారో* 
_కదా ! ఈనాటి కాలంలో పక్కింట్లో ఏం జరుగుతుందో ఎదురింట్లో ఏం జరుగుతుందో గమనించే ఆసక్తి మన ఇంట్లో ఏం జరుగుతుందో గమనించరు._  
*నిజం నోరు తెరిచే లోగా  అభద్ధం ఊరంతా  చుట్టేసింది"* 

_ఇలాంటి పక్కింటి వారి గుస గుసలకి_ *ఏకైక పరిష్కార మార్గం* 
_👉🏼అందరితో కలిసి నవ్వుతూ పలకరించడం..!_
_👉🏼కష్టసుఖాల్లో అండగా ఉండడం..!_ 
_👉🏼శుభ అశుభ కార్యక్రమాల్లో పాల్గొనడం.!_

మీ.....®️✍🏼

🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️

 *ॐ* _:సర్వేజనాః సుఖినోభవంతు:_ *ॐ*
        ::::::::::::::::::::::::::::::::::::::::

No comments:

Post a Comment