🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*భగవంతుని దృష్టి*
➖➖➖✍️
*”మనం చేసే ప్రతి పని భగవంతుని దృష్టిలో పడుతుంది అంటారు ... అదెలా సాధ్యం? ఎవరేం చేస్తున్నారో గమనించడం తప్ప వేరే కార్యకలాపాలు వుండవా ? దేవుడు మనలనే చూస్తున్నాడని మనకి ఎలా తెలుస్తుంది ?” అని ఒక శిష్యుడు తన గురువుగారిని అడిగాడు.*
*అందుకు గురువుగారు ఇలా చెప్పాడు... “కళ్ళుమూసుకొని పాలు త్రాగే పిల్లి తనను ఎవరూ గమనించడం లేదని భ్రమ పడుతూంటుంటుంది. కాని అది వాస్తవం కాదు. దానిని ఎవరో గమనించి తరిమి కొడుతూనేవుంటారు. అలాగే , తప్పుడు పనులు చేస్తూ దేవుడికేం తెలుస్తుంది అని భావించడం శుద్ధ అవివేకం. భగవంతుడు సర్వాంతర్యామి. లోకంలో జరిగే ప్రతీ మంచి చెడ్డలు ఆయన దృష్టిని దాటిపోలేవు.*
*"కుచేలుడు కృష్ణపరమాత్మని చూడడానికి వెళ్ళిన సమయాన తన నడుముకి చిరిగిన వస్త్రంలో కొంచెం అటుకులు మూటకట్టుకుని వెళ్ళాడు. కుచేలుడు తను తీసుకుని వచ్చిన అటుకులను గురించి కృష్ణునికి చెప్పనే లేదు. కాని కృష్ణుడు ఆ అటుకులను చూసి ఆతృతగా నోటిలో వేసుకున్నాడు. కుచేలుడి అదృష్టమే మారిపోయింది.”*
*దుర్యోధనుని సభలో అవమానాల పాలైన ద్రౌపది తపించినది, దుఃఖించినది. సభలోని మహాత్ములు, కులగురువులు, పరాక్రమశాలురు ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అయినా అక్కడికి చాలా దూరాన వున్న ద్వారక లో వున్న కృష్ణ పరమాత్మ అక్కడనుండే ద్రౌపదికి మాన సంరక్షణ చేశాడు.*
*’తిరునిన్డ్రయూరు పూసలార్’ అనే పరమ భక్తుడు శివునికి బ్రహ్మాండమైన దేవాలయం నిర్మించాలని ఆశించాడు. అయితే అతను నిరుపేద. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆలయం కోసం ధనం సేకరించాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు.*
*ఆఖరికి బాహ్యంగా రాళ్ళతో ఆలయం కట్టేకంటే, నిర్మలమైన భక్తితో మనసులోనే ఆలయం నిర్మించ దలచుకున్నాడు. ఆవిధంగానే మనసులోదేవుడికి ఒక పెద్ద ఆలయం నిర్మించాడు. ఈ విషయం ఎవరికీ తెలియదు. మనసు లోపలికి చూసే శక్తి ఏ మనిషికి లేదు. అయినా మహేశ్వరుడు చూశాడు. తన పరమ భక్తుని మనోదేవాలయం గురించి పల్లవ రాజు కి తెలియచేశాడు. ఆ పల్లవ మహారాజు ద్వారా పూసలారు నిర్మల భక్తి గురించి ప్రజలందరికి తెలిసింది.*
*కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయంలో దుర్యోధనుడు ఎవరికీ కనిపించకూడదని ఒక మడుగులో దాక్కున్నాడు. కానీ కృష్ణుని దృష్టిలో పడకుండా పోయాడా !*
*మారు రూపంలో వుంటే ఎవరూ తనను కనుగొనలేరని శూరపద్ముడనే అసురుడు అనేక రూపాలు మార్చు కున్నాడు. అయినా కుమారస్వామి వదలలేదు. పట్టుకు వధించాడు.*
*ఈవిధంగా భగవంతుడు అందరిని సదా గమనిస్తూనే వుంటాడు. అందుచేత సదా మనసా,వాచా,కర్మణా మంచినే తలవండి, మంచినే చేయండి" అని గురువు గారు తన శిష్యులకు బోధించారు.*
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment