*365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో*
♥️ *కథ-56* ♥️
*చదివే ముందు.. మెల్లగా కళ్లు మూసుకోండి... దీర్ఘంగా శ్వాస తీసుకోండి... ఈ క్షణంలో మీలోని పవిత్రతను అనుభవించండి...*
*గుర్రపుజీను క్రింద ఆభరణాలు*
ఒక వ్యాపారి మార్కెట్ గుండా నడుస్తూ, అమ్మకానికి తయారుగా ఉన్న నాణ్యమైన ఒంటెను చూశాడు.
వ్యాపారి, ఒంటెలు అమ్మేవాడు, ఇద్దరూ బేరసారాలలో నైపుణ్యం కలిగిన వారు కావడంతో ఇద్దరూ గట్టి బేరం కుదుర్చుకున్నారు. ఒంటెలు అమ్మేవాడు తన నైపుణ్యాన్ని ఉపయోగించి, తాను అనుకున్న మంచి ధరకు వ్యాపారిని ఒప్పించి, సంతోషంగా తన ఒంటెను వదిలేసి వెళ్లిపోయాడు. వ్యాపారి కూడా మంచి బేరం కుదుర్చుకున్నందుకు చాలా సంతోషించి, తనకున్న పెద్ద పశుగణానికి కొత్తగా చేరిన ఒంటెను తీసుకొని గర్వంగా ఇంటికి నడిచాడు.
ఇంటికి రాగానే, వర్తకుడు తన సేవకుడిని ఒంటె జీను తీయడంలో సహాయం చేయమని పిలిచాడు. జీను భారీగా ఉండడంతో, సేవకుడికి ఒక్కడే తీయడం చాలా కష్టంగా అనిపించింది.
ఒంటెజీను కింద దాగిఉన్న ఒక చిన్న సంచి, సేవకుడికి దొరికింది, దానిని తెరిచిచూడగా అది విలువైన ఆభరణాలతో నిండిఉండడం అతను చూసాడు!
సేవకుడు ఉద్వేగంతో అరుస్తూ, "అయ్యా ! మీరు ఒంటె కొన్నారు...కానీ దానితో పాటు ఉచితంగా ఏం వచ్చిందో చూడండి!" అన్నాడు.
తన సేవకుని అరచేతిలోని ఆభరణాలను చూసి వ్యాపారి ఆశ్చర్యపోయాడు. అవి అసాధారణమైన నాణ్యతతో, సూర్యకాంతిలో మెరుస్తూ, ధగధగలాడుతున్నాయి.
" నేను ఒంటె మాత్రమే కొన్నాను, నగలు కాదు. నేను వాటిని వెంటనే ఒంటె అమ్మినవానికి తిరిగి ఇవ్వాలి",అని అన్నాడు.
సేవకుడు విస్తుపోయాడు, అతని యజమాని నిజంగా మూర్ఖుడు అనుకుని, "అయ్యగారు! మీరు వాటిని ఉంచుకున్నా ఎవ్వరూ కనిపెట్టలేరు" అన్నాడు.
కానీ వ్యాపారి మార్కెట్కి తిరిగి వెళ్లి, ఆ చిన్న సంచిని ఒంటె అమ్మినవానికి తిరిగి ఇచ్చేసాడు.
ఒంటెలు అమ్మేవాడు చాలా సంతోషించాడు, "నేను ఈ నగలను భద్రంగా ఉంచడం కోసం ఈ ఒంటెజీనులో దాచానని మర్చిపోయాను! ఇదిగో, బహుమతిగా మీకు నచ్చిన ఒక ఆభరణాన్ని ఎంచుకోండి" అన్నాడు.
వ్యాపారి "నేను ఒంటె కోసం మాత్రమే తగిన ధర చెల్లించాను, కాబట్టి వద్దు, నాకు ఎటువంటి బహుమతి అవసరం లేదు."
కానీ వ్యాపారి నిరాకరిస్తున్న కొద్దీ, ఒంటెలు అమ్మేవాడు మరింత పట్టుబట్టాడు.
చివరగా వ్యాపారి ఇబ్బందిగా నవ్వుతూ ఇలా అన్నాడు, "వాస్తవానికి నేను మీ వద్దకు సంచిని తీసుకురావాలని నిర్ణయించుకున్నప్పుడే, నేను రెండు విలువైన ఆభరణాలను తీసుకొని, నా కోసం ఉంచుకున్నాను."
ఇది విన్న ఒంటెలు అమ్మేవాడు చాలా ఆశ్చర్యపోయి, వెంటనే సంచిని ఖాళీ చేసి, ఆభరణాలను లెక్కించి, చాలా అయోమయంలో పడ్డాడు.
‘‘నా నగలన్నీ ఇక్కడే ఉన్నాయి.. ఏ నగలు ఉంచుకున్నావు? అని అడిగాడు.
"రెండు అత్యంత విలువైనవి, నా సమగ్రత, నా ఆత్మగౌరవం" అని వ్యాపారి చెప్పాడు.
మీరు చిన్నపిల్లలకు సమగ్రత అనే అంశాన్ని ఎలా వివరిస్తారు?
రోజర్ జెన్ కిన్స్ దీనిని - " మీరు తప్పు చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు కూడా, సరైన పనిని చేయగలగడం లేదా సరైన పనినే చేయాలని ఎంచుకోవడం" - అని వివరించారు.
♾️
" *అన్ని కార్యకలాపాలలో, వివిధ పరిస్థితులలో మానవుని సరైన వైఖరి యొక్క వ్యక్తీకరణమే* *మనస్సు యొక్క సమతుల్య స్థితి. విస్తృత కోణంలో, ఇది మనిషి ప్రవర్తనకు ప్రతిబింబం." 🌼*
*లాలాజీ*
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment