Saturday, October 28, 2023

దేశం గెలవాల్సింది స్టేడియాల్లో కాదు. పచ్చని పొలాల్లో.

 *దేశం గెలవాల్సింది స్టేడియాల్లో కాదు. పచ్చని పొలాల్లో.*

వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందేమోనని భయపడే 
దేశభక్తులారా. ఈ విషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా.
ఒక్కసారి ఆలోచించండి.
దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్ 
పట్టించుకుంటున్నావా.
ఇష్టమయిన క్రికేటరెవరో 
వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు, నీకు తెలిసిన రైతు ఎవరైనా వంద బస్తాలు పండించాలని ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా.
రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను "గాడ్ " అయితే నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?
దేశాన్ని గెలిపించడానికి 
కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్. దేశాన్ని బతికించే నదులు, చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్ అనే ఆందోళన నీకుందా ?
నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్
నిన్ను బతికించే రైతుల కెవరూ 
ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా?
నీకు ఏ స్టేడియంలో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ, నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా?
పాకిస్తానీ టీంని దేశంలో రానియ్యాల వద్దా అని 
నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్. అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశి బియ్యమో,
విదేశి దిగుమతి బియ్యమో తెలుసా. ఇండియన్ క్రికేట్ బోర్డో, క్రికేట్ టీమో చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్, వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశంలో 
ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని
అసలెప్పుడయినా పట్టించుకున్నావా.
ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన నీకు రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా.
ఎప్పుడయినా, గిట్టు బాటు ధరలకోసమో, విద్యుత్తు కోసమో పోరాటం చేస్తూ లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను బాధలను చూసావా.
ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు 
రాజ్యం, దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా.
కామెంట్రీలు వింటూ టీవిలకు అతుక్కు పోయినట్లు రైతుల గురించి చర్చా కార్యక్రమాలు  ఏనాడైనా చూసావా?
పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం.
కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం?
ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు, పచ్చని పోలాల్లో. అందుకు రైతులు "నాటౌట్ " గా నిలవాలి మంచి లీడర్స్ ను ఎన్నుకోవాలి.🙏

No comments:

Post a Comment