*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝 *గ్రూపు సభ్యులకి మనవి.*
💖 *ముఖ్యంగా స్త్రీ సభ్యులకు మనవి.*
❤️ *మీరున్నది ఆధ్యాత్మిక-భక్తి సమూహంలో.*
💓 *ఈ కలికాలంలో ఎంత మంచి ఉంటుందో, కనిపించకుండా అంత చెడు కూడా వుండే అవకాశం ఉంది.*
💕 *ముందు కీడెంచి, మేలెంచమన్నారు కదా…!*
💞 *కనుక మంచి జరగకపోయినా నష్టం లేదు, చెడు జరగకూడదు.*
❤️ *కనుక మీతో మాట్లాడేవారు అందరూ మంచివారై ఉండాలని లేదు. వారు పలువిధాల మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఎవ్వరినీ నమ్మే ఉద్దేశం పెట్టుకోకండీ.*
💖 *మీరు రెస్పాండ్ కాకున్నా, రోజూ మీకు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్ లు, అలానే పర్వదినాలకు విషెస్, ముఖ్యంగా కొత్త సంవత్సరాలకి, కొన్ని ముఖ్యమైన పండుగలకు శుభాకాంక్షలు పెడుతూ ఎప్పటికైనా మీరు రెస్పాండ్ అవుతారని వేచి చూస్తారు.*
💓 *ఇలాంటి వాటిని ముందుగా అరికట్టాలంటే, మెసేజ్ చేసిన వెంటనే రిపోర్ట్ చేసి, బ్లాక్ చేయడమే. అలా చేస్తే టెలిగ్రామ్ అయినా వాట్సప్ అయినా వాళ్ళని కొత్త వాళ్ళకి మెసేజ్ చేయడానికి అనుమతించదు.*
💞 *~అలా చేయడం ద్వారా మున్ముందు మీలాంటి, తోటి స్త్రీలకు జరిగే నష్టాన్ని అడ్డుకున్నవారవుతారు.*
💝 *లేదా ఏ పూజలో, వ్రతాలో మూకుమ్మడిగా చేస్తున్నామనీ, మమ్మల్ని సంప్రదిస్తే మీ పేరుపై కూడా చేయిస్తామనీ,*
💕 *లేదా దీన పరిస్థితిలో ఉన్నామని, సాయం చేయాలని,*
💕 *లేదా NGO అనీ, మీరెమైనా సాయం చేయగలరా అనీ,*
💕 *లేదా మీ dp బావుంది., ఎక్కడ దొరికిందనీ,*
💕 *మీ పేరు బావుంది, లేదా మీ బయో బావుందనీ,*
💕 *మీరు బాగా మాట్లాడుతారనీ,*
💕 *మీతో స్నేహం చేయాలని ఉందనీ, లేదా ముందుగా మీతో పరిచయం చేసుకోవాలని.*
💕 *~ఎందుకంటే మీరో గొప్ప వ్యక్తనీ... మిమ్మల్ని పొగడడం వంటివి చేస్తుంటారు.*
💝 *మరో విషయం, అశ్లీల దృశ్యాలు పంపి, మీరు చూశాక డిలీట్ చేయడం చేస్తుంటారు, మీ ఉద్దేశాన్ని గమనించడానికి... పొరబాటున వచ్చింది, క్షమించమని వేడుకుంటారు.*
💖 *మీరు మౌనంగా ఉంటే పచ్చ జెండా ఊపినట్లేనని, మరో ముందడుగు వేసి, మీ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు.*
💞 *~లేదా కేవలం hi, hello వరకూ మెసేజ్ చేసి, మీ రిప్లై కోసం చూస్తుంటారు.*
💞 *~మీరు రిప్లై ఇచ్చారంటే, మీకు బయటి వ్యక్తులతో మాట్లాడే ఉద్దేశం ఉందని గ్రహిస్తారు.*
💕 *ఇక్కడ మరొక విషయం, కొంత మంది స్నేహం, ప్రేమ వంటివి కూడా వాడుతున్నారు.*
❤️ *~ఇలాంటి హేయమైన చేష్టలకి అలాంటి పదాలు వాడడం బాధాకర విషయం,*
💓 *మీ బయో, లేదా డీపీ లలో మీ వ్యక్తిత్వాన్ని స్ఫురించేలా పెట్టుకోవడం మంచిదే, కానీ అవతలి వారికి అవకాశం కాకూడదు, గమనించగలరు.*
💝 *దయచేసి స్త్రీ సభ్యులు ఎవరూ ఎవ్వరికీ రిప్లై ఇవ్వనవసరం లేదు. కొత్తగా మెసేజ్ చేసిన వారిని ఎంత త్వరగా మీరు రిపోర్ట్ చేసి బ్లాక్ చేస్తారో, అంత మంచిది మీకు.*
💝 *బాగా తెలిసిన వారు పంపితే తప్ప, ఎటువంటి యాప్స్ నీ, లింకులనూ డౌన్లోడ్ చేయకండి.*
💝 *మహిళా సభ్యులకు మరీ మరీ చెప్పేదేమిటంటే.... మిమ్మల్ని ఎవరు ఏ రకంగా సంప్రదించాలని ప్రయత్నించినా వెంటనే బ్లాక్ చేయడమే ఉత్తమమైన మార్గం.*
💖 *మౌనం వహిస్తే, అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. అంటే తెలియనివారు మాట్లాడితే, మీరు పరిచయం చేసుకోడానికి సుముఖంగా ఉన్నారనే అర్థం చేసుకుంటారు.*
💝 *మిగతా సభ్యులకు... టెలిగ్రామ్, వాట్సప్ అనేవి అన్నీ సోషల్ నెట్వర్క్స్ వంటివికాదు.*
💞 *జనంతో పరిచయం చేసుకోడానికి ఉపయోగపడే మాధ్యమాలు కావు.*
💓 *మీరు జాగ్రత్తగా వాడితే, మీతో పాటు అందరూ భద్రంగా వుంటారు.*
💝 *తస్మాత్ జాగ్రత్త*
❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment