Wednesday, October 18, 2023

ధ్యానం అంటే ఏమిటి ?

 🙏🏻🪷.   ధ్యానం అంటే ఏమిటి ?🪷🙏🏻
బుద్ధ ప్రోధిత " ఆనాపానసతి " అంటే మన ఉచ్చాస నిశ్వస ల తో మనము కూడుకుని ఉండటము అదే శ్వాస మీద ధ్యాస  " ఆనాపానసతి " 
    
ఆనాపానసతి అంటే
యిది గౌతమ బుద్ధుడు2500 సం..,క్రితం  పాళీ 
భాషలో ఉపయోగించిన పదము....
"  ఆన" అంటే  "ఉచ్ఛ్వాస " 
 "  అపాన " అంటే   నిశ్వాస 
    " సతి " అంటే కూడుకుని ఉండటం .
అంటే " మన శ్వాస తో మనము కూడుకుని ఉండటం . " 
 ఈ ధ్యానం అన్నదే సకల ఋషులు ,   ,యోగులు ఇచ్చిన అధ్భుత మైన  వరం 
  అన్ని పద్ధతుల్లో ఉత్తమ మైనది , సరియైనది " ఆనాపానసతి " 
 ధ్యానం చేసే పద్ధతి ......
 సుఖముగా,  హాయిగా  ఉండేలా కూర్చుని , చేతులు రెండూ వే ళ్లలో కి వేళ్ళూ పోనిచ్చి , ప్రశాంతముగా  కళ్ళు మూసుకుని కూర్చుని , మనలో సహజముగా జరుగుతున్న ధ్యాస నీ గమనించాలి . ఏ  దేవతారుపాన్ని  గురుతు చేసూకో రాదు .ఆలోచనలు వస్తీ ధ్యాస ను మరల్చాలి. అలా చేస్తూ ఉంటే ఆలోచన స్థితి లోని  మనసు శూన్య స్థితి కి వస్తుంది .ఆ  స్థితి లో " విశ్వ మయ ప్రాణ శక్తి ...కాస్మిక్ ఎనర్జీ  " అపారం గా మనలో ప్రవేశించి మన శరీరం లోని నాడి మండ లాన్ని శుద్ధి చేస్తుంది
   ధ్యానం వలన లాభాలు.....
   శారిక ఆరోగ్యం , ఏకాగ్రత ,జ్ఞాపక శక్తి , మానసిక ప్రశాంతత , జాగరూకత , అత్మ విశ్వాసం అవగాహన ,బుద్ధి సూక్ష్మ త , దివ్య చక్షువు , ఉత్తేజం , సూక్ష్మ శరీర యానము మొదలయినవి .
   శాంతి శ్రీ గారి జ్ఞాన సౌజన్యం తో .

No comments:

Post a Comment