Tuesday, October 10, 2023

పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝*”పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం"*
❤️ *”గతజన్మలో మనం చేసిన పాపాలే రోగాల రూపములో అనుభవములోనికి వస్తాయి”పూర్వ జన్మలో మనం చేసిన పాప పుణ్యాలనుబట్టి, మన జన్మ వుంటుంది. మన జాతక చక్రం తదనుగుణంగానే తయారౌతుంది. మన కర్మే, గ్రహాల రూపంలో వచ్చి, మనల్ని బాధ పెట్టడమో, సుఖపెట్టడమో జరుగుతుంది. అనవసరంగా గ్రహాలను తిడతాం మనం. ఆ గ్రహాలు కూడా మనిషి రూపములోనో, రోగాల రూపంలోనో వచ్చి, మనల్ని బాధ పెడుతుంటాయి.* 
💕 *పాపమంటే ఏంటి? ‘చెడు కర్మ’, ‘చెడ్డపని’ పాపం అన్నారు. ‘చెడు పని’ అంటే? శాస్త్ర వచనమునకు తద్భిన్నమైనది, విరుద్ధమైనది. అంటే “ఇతర జీవుల పట్ల అనుచితముగా ప్రవర్తించడం”*
💞 *ఒకర్ని తిట్టినాము, కొట్టాము అనరాని మాటలు అన్నాం, ఒక ప్రాణిని హింసించాం, ఎదుటి వారిని బాధ పెట్టాం, అన్యాయంగా ప్రవర్తించాం, మోసం చేశాం. పరుల సొమ్మును దొంగిలించాం, అప్పణంగా అనుభవించాం. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు.*
💖 *నా భుక్తం క్షీయతే కర్మ, కల్ప కోటి శతైరపి । అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్॥*
💓 *~”అనుభవించనిదే ‘కర్మ ఫలం’ కోటి బ్రహ్మ కల్పములు గడిచినా నశించదు. అది శుభమైనా, అశుభమైనా దాని ఫలితాన్ని తప్పక అనుభవించ వలసినదే” అని అర్ధము.* 
💕 *కనుక “పరమాత్ముడికైనా తిప్పలు తప్పవు”. ఇలా అనడంలో అర్ధం ఏమిటంటే, “ఎంతటివాడికైనా… జన్మ తీసుకొంటే, కర్మను అనుభవించ వలసిందే” అని అర్ధము. ఇక్కడ ‘పరమాత్మ’ అంటే “పరమాత్మ”అని కాదు. “ ‘కోటీశ్వరుడికైనా’ క్షుద్భాధ తప్పదు” అని అంటే “కోటీశ్వరుడు” అని అర్ధం కాదు కదా…! “ఎంతటివాడికైనా ఆకలి బాధతప్పదు” అనే అర్ధములో ‘కోటీశ్వరుడు’ అనే పదాన్ని వాడుతాము.* 
💓 *~’నా భార్య బంగారం’ అంటే “పుత్తడిబొమ్మ”అని కాదు “నా భార్య చాలా మంచిది” అని అర్ధం. పదాన్ని ఏ సందర్భంలో వాడినామో తెలుసుకోకుండా, పరమాత్మకు జన్మ లేదు, ఆయనకు తిప్పలు లేవు, పరమార్ధం తెలుసుకోవాలి, అని దురుసుగా మాటలాడకూడదు. అదే పాపం అనేది.* 
❤️ *పెద్దలను, ఇతరులను నోటికి ఇష్టం వచ్చినట్లు అహంకారంతో మాటలు అంటే, వాళ్ళు ఎంత నోచ్చుకొంటారో అనేది తెలియక పోతే… కనీసం ఆ తర్వాతైనా పశ్చాతాపంతో క్షమాపణలు చెప్పకపోతే, ఎవరికి నష్టం? నోటి దురుసుతనానికి జన్మజన్మలూ బాధలకు గురికావలసి వస్తుంది.*
💞 *తెలిసి చేసినా, తెలియక చేసినా పాపం పాపమే. ఒకరి పట్ల మనమేదైనా తప్పు చేస్తే వెంటనే వారిని క్షమాపణలు అడగాలి, లేదంటే అది జన్మ జన్మలు మనల్ని వెంట తరుముతూనే వుంటుంది.* 
💓 *~నిన్నే కాదు, నీ కుటుంబాన్నీ, నీ పిల్లల్నీ కూడా వదలిపెట్టదు. మనం చేసిన తప్పుల ఫలితాలను మన పిల్లలూ అనుభవించాలి. తాతలూ, ముత్తాతలూ చేసిన తప్పులు ఆ వంశంలో ప్రతి ఒక్కరినీ వెంటాడుతూనే వుంటాయి. కొందరి జాతకాలను పరిశీలించినప్పడు, ఇలాంటివి బయటపడుతూ వుంటాయి. ముఖ్యముగా సర్పదోషములు, రాహు కేతు దోషాలు. కొడుక్కు వుంటుంది, కూతురుకి వుంటుంది, భార్యకు, భర్తకు, తల్లికి, తండ్రికి, తాతకు అందరికీ ఒకే విధంగా ఉండడాన్ని నేను చాలాసందర్భాల్లో గమనించాను. జ్యోతిషులందరి అనుభవాల్లో ఉన్నాయి ఇవి. ఎవరో, ఎప్పుడో ఎక్కడో చేసిన చిన్న తప్పు, తరతరాలు వెంటాడుతూ వస్తుంది. ఇలాంటివే కాల సర్ప దోషాలు కూడా. అహంకారముతో చేసిన పనులు చాలావరకు పాపాలుగా మారుతాయి.*

💖 *చేసిన చిన్నచిన్నతప్పులు మహా పాపాలుగా మారకుండా ఉండాలంటే ఏమిచేయాలి? కుటుంబాన్ని వేధించకుండా ఉండాలంటే ఏంచేయాలి?*
💓 *”ప్రాయశ్చిత్తై రపైత్యేనః".*
💕*~ప్రాయశ్చిత్తంతో పాపాలు తొలగిపోతాయి. ‘పశ్చాతాపంతో కూడిన ప్రాయశ్చిత్తం’చేసుకొంటే తప్పకుండా పాపాలు నశిస్తై అని “పరాశర స్మృతి” చెబుతోంది.*
💖 *ప్రాయో నామ తపః ప్రోక్తం చిత్తం నిశ్చయ ఉచ్యతే | తపోనిశ్చయ సంయుక్తం ప్రాయశ్చిత్తం తదుచ్యతే ||*
💓*~’ప్రాయాస్’అంటే తపస్సు. ‘చిత్తము’ అంటే నిశ్చయము. “నిశ్చయంతోకూడిన తపస్సు చేయడమే ప్రాయశ్చిత్తం”.*
❤️ *~నీకై నీవే దండన విధించుకోవడం. లేదా మీ గురువుల దగ్గరకో, పెద్దలదగ్గరకో వెళ్లి “అయ్యా.. నేను ఫలానా తప్పుచేశా. నా తప్పుపోవాలంటే ఏమి చేయాలో శెలవివ్వండి”అని విధేయతతో అడగాలి. గురువులు చెప్పిన విధముగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.* 
💖 *ఒకవేళ క్షమాపణలడగలేని పరిస్థితి, ఆ వ్యక్తి కనిపించలేదు, లేదా ఏదన్నా ప్రాణిని తెలిసో, తెలియకో హింస పెట్టావు. అలాంటప్పుడు గురువులనడిగి ప్రాయశ్చిత్తం తెలుసుకొని చేయాలి. పశ్చాతాపంతో కూడిన ప్రాయశ్చిత్తమైనా, క్షమాపణలైనా తత్సంబంధిత పాపాలను ప్రక్షాళన చేస్తాయి. ‘మనస్పూర్తిగా క్షమాపణలడగడం’ సులభమైన ప్రక్రియ. గురువులూ, పెద్దలూ లభించనప్పుడు నీకై నీవే ప్రాయశ్చిత్తం విధించుకోవచ్చు. నీ సుఖాన్ని నీవు త్యాగం చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. కొన్ని రోజులు ఉపవాసముండడం, మౌన వ్రతాన్ని పాటించడం, నేలపై పరుండడం, వంటి ప్రక్రియలూ మేలుచేస్తాయి.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment