*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝*జిజ్ఞాసులకి ఒక ప్రత్యేక సందేశం:~*
💖 *మొదటిగా వ్యక్తమైన శివుని రూపం పంచముఖాల రూపం.*
💓 *ఆ ఒక్కో ముఖానికి మూడు కళ్ళు. పది దిక్కులలో విస్తరించిన అనంత తత్వానికి సంకేతంగా పది చేతులున్నాయి.. ఆ పంచ ముఖములో సద్యోజాత, వామదేవ, అఘోర తత్పురుష ,ఈశాన.*
💕 *ఐతే నిజానికి చివరిది ముఖం కాదు నిర్గుణ స్వరూపానికి సంకేతం. ఈ ఐదు ముఖాలూ ఓంకారానికి సంకేతం. ఓంకారం ఉండే అకార, ఉకార, మకార, నాద, బిందువులకు ప్రతీక. ఓంకారాన్ని సూక్ష్మ ప్రణవం అంటారు. స్థూల ప్రణవం అంటే పంచాక్షరి.*
💓 *శివుడి రూప సంకేతార్థం:~ మంచు లాంటి తెల్లని ఛాయ. చీకటిని అంటే అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానానికి ప్రతీక.*
💓 *సూర్యనేత్రం - కాంతికి,*
💓 *చంద్ర నేత్రం- జీవానికి*
💓 *అగ్ని నేత్రం- జ్ఞానానికి*
💓 *పులిచర్మం- కోరికపై ఆధిపత్యం*
💓 *ఏనుగు చర్మము - పాశవిక ప్రవృత్తులను అణచడం*
💓 *చితాభస్మం - లయ*
💓 *కపాల మాల - యుగాల పరిభ్రమణం, మానవ జాతి ఆవిర్భావం-అంతరించడం*
💓 *గంగ - పవిత్రం చేసి ఉద్ధరించే శక్తికి*
💓 *నెలవంక - కాలానికి*
💓 *సర్పములు - కుండలినీ శక్తికి*
💓 *త్రిశూలం-త్రిగుణములకు సంకేతాలుగా ఉన్నాయి.*
💖 *మృత్యుంజయ నిరూప వర్ణన:~*
💞 *’మృత్యువు’ అంటే ‘ఈ స్థూల దేహాన్ని వదిలిపోవడం’ అంటే “మరణము” అని మాత్రమే కాదు అర్థం.*
💕 *”మనము పరమాత్మ స్వరూపులం” అని మరిచిపోవడమే మృత్యువు*
💕 *అలాంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు మృత్యుంజయుడు.*
💖 *మామూలుగా “మృత్యుంజయుడు” అనగానే ‘మృత్యువులేకుండా చేస్తాడు’ అనే భావన వ్యవహారంలో ఉంది. కానీ పుట్టుక ఉన్న ప్రతి ప్రాణికీ మరణం ఉండి తీరుతుంది కదా. కనుక ఇక్కడ మనం ‘మృత్యుంజయుడు’ అంటే “జ్ఞాన ప్రదాత” అనీ, ‘అపమృత్యువు’ను తొలగిస్తాడు అనీ అర్థంచేసుకోవాలి.*
❤️ *మృత్యుంజయుడి మూడు కళ్ళు మూడు కాలాలకు సంకేతాలు. ఎనిమిది చేతులు ఉంటాయి. పై నాలుగు చేతులలో రెండు అమృత కలశాలని పట్టుకొని తనకు తానే అభిషేకం చేసుకుంటున్నాడు. మరో చేతితో మృగీ ముద్ర, అది ‘మనస్సుని నిగ్రహించడం’ అనే సంకేతం. మరో చేత్తో అక్షమాల ఏ మంత్రం అయినా అక్షరాల సముదాయమే అందుకు అన్ని మంత్రములుకలిసి స్వామి చేతిలో అక్షమాల గా అయింది.*
💕 *రెండు చేతులు తొడ మీద పెట్టుకున్నాడు. వాటిలో అమృత కలశములు ఉన్నాయి. పై వాటిలో అమృతం ఐపోతే క్రింది వాటిలో అమృతం పైకి వెళ్తుంది. ప్రక్కన అమ్మ ఉన్నది.*
💖 *అగ్ని నేత్రం దోషాలనూ, పాపాలనూ నిర్మూలిస్తుంది. సూర్య నేత్రం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. చంద్ర నేత్రం శాంతి నిస్తుంది.*
💖 *~అదే “త్ర్యo బకం.”*
💞 *ఝటాజూటం …దానిపైన నెలవంక, అమృత తత్వానికి సంకేతం. అపమృత్యువును తొలగించి, మోక్షమును ప్రసాదిస్తుంది.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment