*అందరికీ ఒక శుభవార్త*.
వృద్ధాప్యం రాకుండా, బయోలాజికల్ ఏజింగ్ ప్రాసెస్‌ని ఆపొచ్చని ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు చెప్పారు. వయసును ఆపడమే కాదు. మీ వయసును తగ్గించవచ్చని నిరూపించారు. మన శరీరాల్లో టెలోమేర్ ఉంటుంది. టెలోమెర్ అంటే డీఎన్ఏకు సంబంధించిన ఓ స్ట్రక్చర్. అది మన షూ లేస్లా ఉంటుంది. రెండువైపులా క్రోమోజోములు ఉంటాయి. అవి నెమ్మదిగా కరిగిపోవడం వల్ల మనకు వృద్ధాప్యం వస్తుంది. దానివల్ల డీఎన్ఏ చిన్నగా మారుతుంది. అయితే..
ఈ టెలోమేర్ ఎడ్జ్‌లను రిపేర్ చేసి. ఆ క్యాప్స్‌ను దృఢపరిస్తే మళ్లీ యవ్వనంలోకి వెళ్లిపోవచ్చు. కానీ.. దాన్ని కేవలం ఆక్సిజన్ వాడి రిపేర్ చేయొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
ఆ ట్రీట్మెంట్ పేరు.. హెచ్‌బీఓటీ (హైపర్బారిక్ ఆక్సిజన్ ట్రీట్మెంట్). దీని కోసం 65ఏళ్లు దాటిన 35 మందిని ఒక ఆక్సిజన్ ఛాంబర్లో కూర్చోబెట్టి ప్రతిరోజూ గంటన్నర చొప్పున వారానికి ఐదుసార్లు ఆక్సిజన్ ఇచ్చారు.
ఇలా వాళ్లకు మూడు నెలల పాటు ఆక్సిజన్ ఇస్తే వాళ్లందరూ పాతికేళ్లు తగ్గి 40ఏళ్ల వ్యక్తుల్లా అయిపోయారు.
ఈమూడు నెలలల్లో కేవలం ఆక్సిజన్ వల్ల వాళ్ల టెలోమేర్స్ ఎండ్క్యాప్స్ స్ట్రాంగ్ అయిపోయాయి. క్రోమోజోమ్‌లు రీబిల్ట్ అయ్యాయి.
టెలోమేర్స్ మళ్లీ పొడుగ్గా తయారయ్యాయి. ఇది ఋజువైంది’’ అని పూరి అన్నారు.
‘‘ఈ ట్రీట్మెంట్తో వయసు తగ్గడమే కాదు. రాలిపోయిన జట్టు కూడా తిరిగి వస్తుందట. చాలా మంది పండగ చేసుకునే వార్త ఇది.
తెల్ల రక్తకణాలు తయారై ఊడిపోయిన జుట్టు కూడా వస్తే.. అంతకంటే ఏం కావాలి జీవితానికి. అతి త్వరలో ఈ చికిత్స అందుబాటులోకి వచ్చేస్తుంది. సైంటిస్టులు చెప్పేదేంటంటే.. వృద్ధాప్యం అనేది ఓ రోగం. దాన్ని మనం నివారించవచ్చు. అదికానీ నిజమై.. ఇప్పుడు 60ఏళ్లు దాటిన గొప్పవాళ్లంతా మళ్లీ పాతికేళ్లు వెనక్కి వెళితే ఎలా ఉంటదో తెలుసా.. వాళ్లు అద్భుతాలు సృష్టిస్తారు.
అమితాబ్‌బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ వాళ్లంతా పాతికేళ్లు వెనక్కి వెళితే సినిమా స్క్రీన్లు మరోసారి చిరిగిపోతాయి.
రాజకీయ నాయకులు, సైంటిస్టులు, వ్యాపారవేత్తలు వీళ్లందరికీ మరొక్క అవకాశం వస్తే కుమ్మేస్తారు. కేవలం ఆక్సిజన్ వల్ల మనలో ఇంత మార్పు వచ్చే అవకాశం ఉందంటే..
ఆక్సిజన్ ఎంత విలువైందో ఆలోచించాలి. ప్రతిరోజూ కాలుష్య వాతావరణంలో బతుకుతున్నాం. అందుకే మన శరీరాలు క్షీణించిపోతున్నాయి.
మనకు ఇలాంటి ట్రీట్మెంట్ అక్కర్లేదు. కాస్త స్వచ్ఛమైన గాలిలో తాజా ఆక్సిజన్ పీలిస్తే చాలు. అందుకే కొండలపై బతికేవాళ్లు మనకంటే దృఢంగా ఉంటారు.
మనకంటే ఎక్కువకాలం బతుకుతారు.
బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రాణాయామం నడక
తేలిక పాటి పరుగు
చిన్న చిన్న వ్యాయామాలు
సూర్యనమస్కారాలు ఎక్కువ ప్రాణవాయువు ( ఆక్సిజన్) తీసుకోవటానికి బాగా సహకరిస్తాయి
అందరూ తప్పకుండా చేయండి
No comments:
Post a Comment