"🍃🪷 ఆనందం అనుభూతుల
మేళవింపు 🧚♂️".
. .........................................
అందం,
ఆనందం,
ప్రకృతి,
మనిషికి
మాత్రమే
ఇచ్చిన
దైవ వరం,
ఆనందాల
అనుభవాల
అనుభూతులు.
పూలు, వాటి
పరిమళాలు,
చెట్లు, నదులు,
సెలయేరులు,
ప్రవాహాలు,
సముద్రపు అలలు,
కొండలు, కొనలు,
పర్వత శ్రేణులు,
శిల్పాలు,
గుడులు,
గోపురాలు,
దేవాలయాలు,
దర్శనాలు
అన్నీ అనుభూతులకు
దోహదాలే.
ఆనందం ఆస్వాదించ
లేని వాడిని
ఆగ్రహం ఆవహిస్తుంది.
ఉషోదయపు
ఉషః కాంతులు,
పున్నమి నాటి
చంద్ర కాంతులు,
నెల వంక
అంద చందాలు,
మనిషి కట్టు బొట్టు,
అతివల అలంకారం
అన్నీ ఆనందానుభూతులే.
ఆహారం, వ్యవహారం
రుచులు, పడచులు,
దానం, ధర్మం,
ధ్యానం
అనుభూతుల మయం.
అనందం
కొంటే
వచ్చేది కాదు,
ఇస్తే పుచ్చుకునేది కాదు.
ఆనందం అపరిమితం,
మానవ మాతృలకే
పరిమితం.
అనందానికి
హద్దులు లేవు.
మాట, పాట, ఆట,
సంగీతం, సాహిత్యం,
వినయం, వివేకం
అన్నీ ఆనందానికి
దారులే.
అనందానుభూతులను
ఆస్వాదించలేని వాడి కర్మ.
ఆనందానుభూతులు
పరమానందానికి
మార్గాలు.
ముభావం మూర్ఖత్వానికి
సంకేతం.
ఆనందం అవధులు
దాటినా అనర్ధమే.
అందుకే ఆనందాన్ని
అదుపులో ఉంచుకుందాం,
అవేశాలను ఆమడ
దూరం లో ఉంచుదాం.
అనునిత్యం
ఆనందానుభూతులకు
లోనవుతూనే ఉందాం.
అఆనందం ఆయుష్షుకు
దోహద కారి.
✒️ Dr. నండూరి రామకృష్ణ గారు 06.10.2023.
🍃🪷సే:వల్లూరి సూర్యప్రకాష్ కరీంనగర్
No comments:
Post a Comment