Tuesday, October 17, 2023

ట్రూకాలర్ పని చేసే విధానం తెలుస్తే ఎవరు దాన్ని వాడకు...

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *ట్రూకాలర్ పని చేసే విధానం తెలుస్తే ఎవరు దాన్ని వాడకు. ఆ ఆప్ని ఇన్స్టాల్ చేసిన వెంటనే అది చేసే మొట్టమొదటి పని మీ కాంటాక్ట్స్లనీ, ఎస్.ఎమ్.ఎస్. లనీ వారి సర్వర్లలోకి అప్లోడ్ చెయ్యటం. ఎంతమంది వినియోగదారులు ఉంటే అంత ఎక్కువగ మీకు ఫోన్ చేసినవారి వివరాలు ఇవ్వగలుగుతుంది.*
💖 *అందుకే ట్రుకాలర్ ద్వారా తెలిసినన్ని వివరాలు వెరే ఏ ఆప్ ఇవ్వలేదు. ముఖ్యంగా మన దేశంలో మనం మన వివరాలన్ని ఇచ్చేసాం. వ్యక్తిగత సమాచార భద్రత లేదు. ఇంకొక సమస్య ట్రూకాలర్ ఇంస్టాల్ చేసుకోక పోయినా, వేసుకున్న మరెవరో ఫోన్లో మన నంబర్ ఉంటే మన సమాచారం వారి వద్దకి వెళ్ళిపోతుంది. ఏమి చేస్తాం ప్రభుత్వాలు, ప్రజలకి చెప్పవు, సామాన్యులకి తెలీయదు.*

❤️ *చాలా ఉపయోగకరంగా కనిపిస్తూ, చాలా హానికారకమైన యాప్ లలో దేశవ్యాప్తంగా గల మొదటి పదిస్థానాలలో ఒకటిగా ఉంది. కానీ ఎవరూ దీనిపై వ్యతిరేకంగా స్పందించరు.*
❤️ *నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చాలావరకు ఇది సురక్షితం కాదు. కానీ అవసరమైనపుడు వాడుకుని వదిలేయవచ్చు. సురక్షితంకాదు అనటానికి కొన్ని తార్కాణాలు :~*
💞 *ఇందులో చూపించబడే ఇతరుల వ్యక్తిగత సమాచారం చాలావరకు నిజంకాకపోవచ్చు. ఉదాహరణకి మనం చాలామంది మొబైల్ నంబర్ తో వారిపేర్లు వెతుకేందుకు వాడతాం. కానీ ఇందులో ఇతరులు ఏ పేరుపెడితే ఆ పేరు మాత్రమే చూపిస్తుంది. అంటే మీరు పొందే సమాచారం నిజం కాకపోయే అవకాశం ఉంది. మోసగాళ్లు వారికి నచ్చిన పేరు పెట్టిఉంటారు మనం ఇందులో వెతికితే అదే పేరు కనపడితే నిజమేమో అనుకుంటే లాభంలేదు కదా…!*
💞 *మన ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారం తీసుకోవటం :~*
*మన కాంటాక్ట్స్ , వ్యక్తిగత సమాచారం, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మనకు ఎలాంటి ఎస్.ఎం.ఎస్ లు వస్తున్నాయి , ఫోన్ ఇన్ఫర్మేషన్ , లొకేషన్ , ఫైల్స్ మెరుగైన సేవలకు అని చెప్పి మన వ్యక్తిగత సమాచారం మన నుండి సేకరిస్తున్నారు. వాటిని సరైన రక్షణ గల సర్వర్లు లలో స్టోర్ చేయలేకపోతే మనకు అది సురక్షితం కాదనట్టే కదా.*
💖 *ఆప్ పర్మిషన్స్ :~ రీ రౌటింగ్ కాల్స్ (మన కాల్స్ వేరే దగ్గరికి పంపటం), మోడిఫైయింగ్ కాంటాక్స్ (మన పర్మిషన్ లేకుండానే మన కాంటాక్ట్స్ పేర్లు మార్చటం), ఫైల్స్ రీడింగ్(వ్యక్తిగత ఫైల్స్ పర్మిషన్స్ ) , దిస్ ఏబుల్ స్క్రీన్ లాక్ (స్క్రీన్ లాక్ పనిచేయకుండా చేయటం) , మోడీఫై సిస్టం సెట్టింగ్స్ (మన పర్మిషన్ లేకుండానే మన ఫోన్ సెట్టింగ్స్ ఆప్ కి అనుగుణంగా మార్చుకోవటం ) , ఇంకా కొన్ని పెర్మిషన్స్ తీసుకోవటం జరిగించి కానీ ఇవి మన అవసరాలకోసం వాడితే మంచిదే కానీ వారి అవసరాల కోసం వాడితే సురక్షితం కానట్లే కదా..!*
💓*సైబర్ అట్టాక్స్ :~* *ఇదివరకే రెండు మార్లు దాడులు జరిగాయి. వీటిని అధికారికంగా వెల్లడించారు కూడా. వాటి వివరాలు వికీపీడియాలో కూడా జతచేయబడ్డాయి. 2013 జూలై 17 న, ట్రూకాలర్ సర్వర్లను సిరియన్ ఎలక్ట్రానిక్ ఆర్మీ హ్యాక్ చేసిందని ఆరోపించింది.* *ఈ బృందం తన ట్విట్టర్ హ్యాండిల్‌లో 459 జిబిల డేటాబేస్‌ను ప్రధానంగా సర్వర్‌లలో బ్లాగ్ ఇన్‌స్టాలేషన్ యొక్క పాత వెర్షన్ కారణంగా తిరిగి పొందిందని పేర్కొంది. 2013 జూలై 18 న, ట్రూకాలర్ తన బ్లాగులో ఒక ప్రకటనను విడుదల చేసింది, వారి వెబ్‌సైట్ వాస్తవానికి హ్యాక్ చేయబడిందని పేర్కొంది, అయితే ఈ దాడి పాస్‌వర్డ్‌లు లేదా క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని వెల్లడించలేదని పేర్కొంది.*
💓 *2019 నవంబర్ 23 న భారతీయ ఆధారిత భద్రతా పరిశోధకుడు ఎహ్రాజ్ అహ్మద్ వినియోగదారుల డేటాతో పాటు సిస్టమ్, స్థాన సమాచారాన్ని బహిర్గతం చేసే భద్రతా లోపాన్ని కనుగొన్నారు. ట్రూకాలర్ ఈ సమాచారాన్ని ధృవీకరించారు.*
💕 *థర్డ్ పార్టీ వారికి మన డేటా అధికారికంగా ఇవ్వటం :~*
*కంపెనీ ప్రైవసీ పాలసీలలో వారే అధికారికంగా పేర్కొన్నారు. మన సమాచారం ఇతరులకి చేరవేయటం. అడ్వేటైసింగ్ కోసం వాడుకోవటం, ఇతరులకి చేరవేయటం. ఇలా చాల ఉన్నాయి ఒక్కసారి పరిశీలిస్తే మీకే తెలుస్తుంది.*
💝 *టర్మ్స్ అండ్ కండిషన్స్:~ ఇవి కూడా చాలా ఇబ్బంది కరంగానే ఉన్నాయి.*
💖 *’ఇది సురక్షితము’ అని చెప్పలేం కనుక ఫ్రాడ్, స్పామ్ కోసం అయితే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో గూగుల్ వారి కాలర్ ఆప్ లో కూడా సమాచారం చూడొచ్చు*
💓 *”మనకి ఎవరో కాల్ చేసారు?” అని తెలుసుకోవాలి అనుకుంటే యాప్ని వాడుకుని అనిన్స్టాల్ చేయడం మంచిది*
💓*బిజినెస్ పరంగా వాడే వారైనా, వ్యక్తిగతంగా వాడే వారైనా తమతమ డేటా మీద జాగ్రత్త పడాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉన్నది.* 
💓 *’ఇదంతా సాధారణమే కదా’ అని కొందరు అనుకోవచ్చు, కానీ వ్యక్తిగత సమాచారం, మన కంట్రోల్ వారి చేతిలో పెట్టి, వారి భద్రతాపరమైన లోపాలను ఉహించకుండా ఉంటే ఎలా ఎంతగా నష్టపోతామో మాటల్లో చెప్పలేము.తస్మాత్ జాగ్రత్త.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕 *~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment