Tuesday, October 10, 2023

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝 *’సర్వం ఖల్విదం బ్రహ్మ' బ్రహ్మమే సర్వమూ ఐనప్పుడు, అందరూ ఆత్మస్వరూపులే ఐతే దేవాలయాలకు వెళ్లడమెందుకు ?* 
💕*ఆహారనియమాలెందుకు*
💕*పూజలూ, ధ్యానాలూ, నియమనిష్టలూ ఎందుకు?*
💕*శాస్త్ర పఠనమెందుకు?*
💕*సత్సంగాలెందుకు?*
💖💖*మనది పరోక్ష జ్ఞానం. అంటే మన ఋషులు చెప్పింది పఠన శ్రవణముల ద్వారా తెలుసుకొన్నది. దానినే ప్రత్యక్షజ్ఞానం ద్వారా తెలుసుకొని ముక్తిత్వం పొందడానికే ఆయా సాధనలన్నీనూ…!*
💓 *దీపం గురించి తెలిసినంతట్లోనే చీకటి మటుమాయమైపోతుందా?*
💓*ఆహారం గురించి మాట్లాడితే ఆకలీ, నీటి గురించి మాట్లాడితే దాహమూ తీరుతాయా?*
💓💓*~కనుక వినడంవల్లా, తెలుసుకోవడం వల్లా ఏ విధమైన ప్రయోజనం లేదు.*
💞*భావనమయప్రజ్ఞ (అనుభవపూర్వకంగా తెలుసుకోవడం) అత్యంతావశ్యకం.*
❤️ *మనస్సును జయించడం, మనస్సుకు అతీతులమవడం, చెడుగుణాల్ని తొలగించుకోవడం, మనలోపల ప్రక్షాళన జరగడం, సంపూర్ణంగా జీవించడం, అర్ధవంతంగా ఆరోగ్యవంతంగా ఆనందదాయకంగా జీవించడం, పరమ గమ్యంకు చేరడం, మానవజన్మకు సార్ధకత చేకూరడం వంటివన్నీ సాధనల వల్ల మాత్రమే సాధ్యమౌతాయి.*
💖 *శ్రీ మలయాళస్వాములవారు చక్కటి వివరణ ఇచ్చారిలా:~ “వ్యవసాయకుడు తన క్షేత్రము నందున్న రక్కీస, చిల్లకంప మొదలగు కంటకముల పాదులను తొలగించి, సంపూర్ణంగా కలుపును దుక్కి దున్నుటచే హరింపజేసి పైరుబీజములను ఎట్లు జల్లునో, అట్లే సాధకుడు తన హృదయాంతరాళమున నున్న దుఃఖమయ రాక్షసగుణములనన్నింటిని సంపూర్తిగా తొలగించి యందు దైవగుణబీజములను జల్లి, పెంచి పోషించినచో దైవత్వమను పంటయే పండితీరును. ఎండాకాలంలో కలుపు ఏమియూ కనబడకపోయినను, బీజరూపమున దాగియుండి వర్షం కురియగానే యెట్లు మొలకెత్తునో, అట్లే అనేక జన్మవాసనలు మనయందు దాగియుండి, సమయం వచ్చినప్పుడు అంకురించి మొలకెత్తుచుండును. వాటిని పై సాధనల ద్వారా సాధకుడు పట్టుదలతో కృషిచేసి పెరికివేసినచో, తప్పక విజయుడై, విశుద్ధ హృదయుడై దైవత్వంను పొందగలడు. గీతలో దైవాసుర సంపద్విభాగయోగమందు శ్రీకృష్ణభగవానుడు జెప్పినట్లు సాధకులెల్లరు తమయందు దైవభాగమెంతగలదో, అసురభాగమెంతగలదో పరిశోధించి, అనుక్షణమును అసురగుణ నిర్మూలమునకును, దైవగుణ ప్రతిష్ఠకొరకును ప్రయత్నశీలురై యుండవలయును".*
❤️ *మరి ధ్యానాది సాధనలు చేసినవారంతా ఎందుకు మహర్షులు కాలేకపోతున్నారు? ముక్తులు కాలేకపోతున్నారు?*

💖 *”మీనః స్నానపరః ఫణీ పవనభుజ్మే మేషోస్తి పర్ణాశనః నీరాశీ ఖలు చాతకః ప్రతిదినం శైలే బిలే మూషికః భష్మోద్దూళిత విగ్రహస్తు శునకో ధ్యానాధిరూఢో బకః ఏతేషాం ఫలమస్తి కిం న హి న హి జ్ఞానం పరం కారణమ్”*~*గంగయందే పుట్టిపెరిగిన జలచరములన్నియు, నిత్యమూ గంగా స్నానమే చేసియు, అందే నివసించియు వున్ననూ, సర్పము వాయుభక్షణమును చేసినను, మేక ఆకులను తినినను, చాతకపక్షులకు జలమే ఆహారమైనను, ఎలుకలు సదా గుహలలోనే వున్ననూ, కుక్క బూడిద పూసుకున్ననూ, కొంగ మౌనమును శీలించినను వీటియన్నిటికిని ఎలాంటి విశేషఫలమును ఉండదు.*

💓 *~కనుక కాసేపు ధ్యానం, ఆహారనియమాలు, ప్రార్ధనలు, శాస్త్రపఠనాలు, ప్రవచనాలు వినడం వంటి సాధనలు బాహ్యంగా ఆచరించినంత మాత్రాన ఫలితముండదు. అంతరంగనిష్ఠ ఉండాలి. సాధకునికి శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. ఎలాంటి అవరోధాలు ఎదురైనా పట్టుదలతో అనన్య దైవభక్తితో సాగిపోవాలి, ఆత్మసాక్షత్కారం, ముక్తి లాంటి అత్యున్నత స్థితులను చేరుకోవాలంటే హృదయ పరిశుద్ధత అత్యవసరం. అందుకు ఎంతో సాధన అవసరమౌతుంది.*
💖*మంచివిషయాలను 'స్మరణ'లో అనివార్యంగా పదిలపరుచుకోవాలి.* 
💖 *మన మతిని బట్టి మన గతి ఉంటుందని గుర్తెరగాలి.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment