Monday, October 16, 2023

హార్ట్ ఫుల్ నెస్🌍కథతో, దృష్టికోణంలో వ్యత్యాసం

 *365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో* 

 ♥️ *కథ-44* ♥️

 *అనుభూతి : నా సానుకూల ఆలోచనకు నేను కృతజ్ఞతతో ఉన్నాను.* 

 *దృష్టికోణంలో వ్యత్యాసం* 

 ఒక పేదవాడు తన కుటుంబo కోసం ఎంతో కష్టపడి ఇల్లు కట్టించాడు. అతను గత 20 సంవత్సరాలుగా ప్రతి పైసాను కొద్దికొద్దిగా పొదుపు చేసి, తద్వారా తన కుటుంబం చిన్న గుడిసె నుండి పక్కా గృహంలో సంతోషంగా జీవించవచ్చు అని భావించాడు. 
మొత్తానికి ఇల్లు సిద్ధమైంది. చాలా చర్చల తరువాత, గృహప్రవేశానికి ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయించారు.
అయితే గృహప్రవేశానికి రెండు రోజుల ముందు భూకంపం వల్ల అతని ఇల్లు కూలిపోయింది.
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఆవ్యక్తి మార్కెట్ కు పరిగెత్తి, మిఠాయిలు కొని, ఘటనా స్థలానికి మిఠాయిలతో చేరుకున్నాడు. 
అక్కడ అందరూ జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.
' అయ్యో పేదవాడికి ఎంత దౌర్భాగ్యం కలిగింది. అతికష్టం మీద పైసా, పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్నాడు' అని,
ప్రజలు తమలో తాము చర్చించుకున్నారు.
పేదవాడు అక్కడికి చేరుకుని తన సంచిలోంచి మిఠాయిలు తీసి అందరికీ పంచడం ప్రారంభించాడు.
అతని చర్యకు అందరూ ఆశ్చర్యపోయారు!
చివరగా అతని మిత్రుడు ఒకడు అడిగాడు, "నీకు పిచ్చి పట్టిందా? నీ ఇల్లు కూలిపోయి, నీ జీవితకాల సంపాదన వృధా అయిపోతే, నువ్వు ఆనందంగా మిఠాయిలు పంచుతున్నావా!?"
 ఆ వ్యక్తి నవ్వుతూ, "మీరంతా ఈ సంఘటనలోని ప్రతికూలతను మాత్రమే చూస్తున్నారు, సానుకూలతను కాదు. ఈరోజే ఇల్లు కూలిపోవడం మంచిదయింది. లేకుంటే ఆలోచించండి, ఈ ఇల్లు రెండు రోజుల తర్వాత కూలిపోయి ఉంటే, అప్పుడు మొత్తం  నా కుటుంబం - నేను, నా భార్య, పిల్లలు, అందరం చనిపోయి ఉండేవాళ్ళం. అది ఎంత పెద్ద నష్టం?!"  అని బదులిచ్చాడు.

ఏదైనా సంఘటనకు లేదా విషయానికి రెండు పార్శ్వాలు ఉంటాయి - సానుకూల అంశం, ప్రతికూల అంశం.  ఆ విషయం లేదా సంఘటన యొక్క ఏ కోణాన్ని మనం చూస్తున్నాం అనే దానిపైనే మన జీవిత విధి ఆధారపడి ఉంటుంది.

               ♾️

 *ఎటువంటి పరిస్థితినైనా అంగీకరించగలిగే తత్వం* *మిమ్మల్ని ఎటువంటి ప్రాణాంతకమైన ప్రమాదాలు లేకుండా మార్గంలో ముందుకు తీసుకువెళుతుంది. 🌼* 
 *దాజీ* 


 
 హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

HFN Story team
💜🔺💜🔺💜🔺💜🔺💜

No comments:

Post a Comment