Saturday, April 18, 2026

ఆలోచించకపోతే భవిష్యత్తు అగాధం

 *ఆలోచించకపోతే భవిష్యత్తు అగాధం*

1 . గత 25 ఏళ్లలో మనం చూసిన సమాజం వేరు . ఇక మనం చూడబోతున్న సమాజం { అన్ని విషయాల్లో కాదు ; అనేక విషయాల్లో } తీరు వేరు .
2. ఇప్పటిదాకా చదువు సాగిన తీరు వేరు ; ఇప్పుడు చదువు సాగాల్సిన తీరు వేరు . అదే పాత పద్దతి అనుసరిస్తే భవిషత్తు అంధకారం .
3. సాఫ్ట్వేర్  స్వర్ణ యుగం ముగిసింది . 
ఇప్పటిదాకా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల 
ఆదాయం 14 . వ్యయం 13 
. అవమానం -1 , రాజ్యపూజ్యం - 14 . 

ఇక పై ఆదాయం -4 . వ్యయం - 14 . 
అవమానం -14 ; రాజ్యపూజ్యం -1 . 
సాఫ్ట్వేర్ ఉద్యోగులతో మొదలు పెట్టి అనేక మంది.. అధిక జీతం - అధిక ఖర్చులు - విలాసాలు పద్ధతిలో ఇప్పటిదాకా జీవితాన్ని సాగించిన వారు ఇక గడ్డు  రోజుల్ని ఎదుర్కోనున్నారు . 
“ ఇలా కూడా జరుగుతుందా ? “ .. అని అందరూ షాక్ తినే రోజులు రానున్నాయి 
4. తక్కువ శాతం వ్యక్తులు అపర కుబేరులు అవుతారు . మధ్య తరగతి చితికి పోతుంది . 
కారు లో ఇంటర్నేషనల్ బడిలో బిడ్డను దిగబెట్టిన పేరెంట్స్ ... ప్రభుత్వ / బడ్జెట్ పాఠశాలల వైపు చూసే రోజులు రానున్నాయి . . సాఫ్ట్వేర్ మార్పులు తీవ్రంగా ప్రభావం చూపనున్నాయి . 

"1980 లో కంప్యూటర్ లు.. బ్యాంకు ఉద్యోగాలు "  అని చెప్పుకొంటూ కొంతకాలం నిర్భయంగా బతికెరు .  ఇప్పుడు ఆ పరిస్థితి లేదు

5. ఒంటరి తనం అతి పెద్ద వ్యాధిగా విస్తరిస్తుంది . 
అదే సమయం లో వ్యాపారులకు జనాల ఒంటరి తనం పెద్ద బిజినెస్ గా మారనుంది .
6 . స్ట్రెస్,  వ్యాకులత,  మానసిక కుంగుబాటు, ఆటో ఇమ్యూన్ డిసార్డర్ , షుగర్ , అధిక బిపి , ఫాటీ లివర్ డిసీస్ , కాన్సర్ .. విచ్చలవిడిగా విస్తరిస్తాయి . 
స్ట్రెస్  వల్ల నిద్రాణంగా ఉన్న  మానసిక రోగాలు   ప్రళయ తాండవం చేస్తాయి 
7 . ఆత్మ హత్యలు , హత్యలు , నేరాలు సర్వ సాధారణం అయిపోతాయి .

 *పరిష్కారం* . 
చాలా సింపుల్ .. 
మనిషి మనిషిలా బతకాలి .
వేల్యూ జడ్జిమెంట్ కాదు . 
బయలాజికల్ రూల్స్ .. !!
మన పూర్వీకులు జీవించిన  విధానం మన బాడీ ని సెట్ చేసింది .
ఇక్కడ దాక చదివాక .. దీని అర్థం మనిషి ఆకులు అలములు కట్టుకొని అడవి లోకి వెళ్ళిపోవాలి అని నేను చెబుతున్నట్టు  ఎవరికైనా అనిపిస్తే ..  వారు   వర్తమానాన్ని అర్థం చేసుకోలేదని అనిపిస్తుంది 

ఆలా అనుకోని నా మిత్రుల కోసం .. 
   1. ఆధునికత  అంటే బయోలాజికల్ రూల్స్ ని అడ్డంగా అతిక్రమించడం కాదు .

2 అమ్మాయిలు -25 ; అబ్బాయిలు -27-  పెళ్లి వయస్సు . పెళ్ళొద్దు అని వారు అంటున్నారంటే అది  పెంపకం లోపం . వారి చదువు సరైన రీతిలో సాగలేదు అని అర్థం . 

3 బతకడం కోసం ఉద్యోగం ; ఉద్యోగం కోసం బతకడం కాదు . నీ బతుకు పరమార్థం కంపెనీ  కూలి కావడం కాదు అని ప్రతి తల్లితండ్రి పిలలలకు చెప్పాలి . 

4. గొప్పగా బతకాలి అనే తాపత్రయం వద్దే వద్దు . హ్యాపీ  గ బతకాలి . 

5. 1980 కి ముందు చదువులు  ఎలా సాగేవో అదే రీతిలో సాగాలి . ఇంకా తెలుసుకోవాలంటే నా బాలమిత్ర క్లాసులకు రండి .
6 తిండి తినాలి ; రసాయనాలు కాదు . బతకడం కోసం తినాలి ;  తినడం కోసం బతక కూడదు . ఆకలేస్తే తినాలి ;  బోర్ కొడితే కాదు .
7. ఇంట్లో పిల్ల జిల్లా .. బయట స్నేహితులు,  బంధువులు .. ఇవి ఉన్నవాడు  కోటీశ్వరుడు . లేని వాడు బికారి . 

8 టెక్నాలజీ ని  వాడాలి ; దానికి బానిస కాకూడదు . కొంపలోకి వైఫై తెచ్చే  వరకే నీ కంట్రోల్ . తెచ్చాక ఎవరికి వారే యమునా తీరే . వైఫై ఉన్న  కుటుంబాలు విచ్చినం అయిపోతాయి .. ఒక రోజులో కాదు .. నెమ్మది గా .

ఇంత సోది వద్దు .. లైఫ్ ఫండమెంటల్స్ పాటిస్తూ ..    మీ అమ్మ  నాన్న  ఎలా బతికారో అలాగే బతకండి . మీ అమ్మ  నాన్న..   మిమ్మల్ని ఎలా పెంచారో అలాగే పెంచండి . కాలం మారింది అని పిచ్చి పిచ్చి వేషాలు వేసే వారు  కలగర్భం లో కలిసిపోతారు . 
ఆ పోవడం కూడా మామూలుగా ఉండదు . 
ఇక్కడే నరకం అనుభవించి పోవాల్సి ఉంటుంది.. కావున *భవిష్యత్తును గురించి ఆలోచించండి ఇప్పుడే జాగ్రత్తలు తీసుకో ండి*
.      ✍️  మేలు కోరే మిత్రుడు 🙏

No comments:

Post a Comment