Saturday, April 18, 2026

 ఈ  ప్రపంచము జాగరుకులైన వ్యక్తులకు చేయబడినది  .. సోమరితనం  అజాగ్రత్తల నుండి అప్రమత్తంగా ఉన్నవారికే  ఈ లోకములో జ్ఞానము విజ్ఞానము ప్రాప్తిస్తాయి  వారినే మహా పురుషులంటారు ....
సోమరితనము వదిలి పురుషార్తం  చే నిజమైన జ్ఞానాన్ని పొందుటలో సమర్థులవుతారు   ..సుఖం శ్రేయస్సు ఐశ్వర్యము అన్ని వారికే లభిస్తాయి .. సోమరులు సుఖ సౌఖ్యాల వెంబడి పరిగెత్తుతూ ఉంటారు    కోరికలు ఉంటాయి కానీ ఏది పొందలేరు  వారు తామసిక మత్తులో పడి ఉంటారు .. సోమరితనాన్నీ మించిన శత్రువు ఈ ప్రపంచంలో  మరొకటి  లేదు ఉండదు ..
నేడు సమాజ స్థితి అత్యంత విషమంగా ఉన్నది పిల్లలు విద్యార్థులు తమ సమయాన్ని అశ్లీల సాహిత్యాన్ని ఆసక్తితో చదువుతూ తమ అమూల్యమైన సమయాన్ని నిరర్థకము చేయుచున్నారు  వీరే కాదు సమాజంలో డాక్టర్లు అధ్యాపకులు వ్యాపారులు రైతులు కూలీలు అధికారులు మొదలగు వారు తమ పని యందు  భక్తిశ్రద్ధలు లేక పనిని ఎగగొట్టే ప్రయత్నం లో సోమరులుగ  తయారవుచున్నారు ..
ఇది సమాజాభివృద్ధికి  భయంకర  సవాలు గా మారుచున్ఫది  శ్రమలేని జీవితాన్ని  కోరుతున్నారు ప్రజలంరు  ....

తస్మాత్  జాగ్రత్త .

హరిఃఓం 🙏🙏.

No comments:

Post a Comment