*యోగి వేమన -11*
రచన : మాలయశ్రీ
*ఇప్పటి సిద్ధాంతాలకు అప్పుడే పునాదులు*
అహింసకు పట్టం-
పంచమ నిగమంబు భారతంబగునని
పొగడిరేల జనులు బుద్ధిలేక!
హింస కార్యము తమకిష్టమెట్లాయెరా ?
విశ్వదాభిరామ వినురవేమ
ఈ లోకమునందలి సుఖమే సత్యమనుట-
ఇహమునందు సుఖములీడేరగా లేదు
పరము నమ్మెనేని బ్రతుక నగునె?
మొదలులేని సుఖము తుదకెట్లు కలుగురా
విశ్వదాభిరామ వినురవేమ
పరిపాలకులను నమ్మరాదనుట-
ఎంత సేవచేసి ఏపాటు పడినను
పాలకులను నమ్మరాదు రన్న,
పాముతోడి పొత్తు పదివేల కైననుః విశ్వదాభిరామ వినురవేమ
ధర్మం-సమతకోసం పోరాటం తప్పదు -
ఇరుగు పొరుగువారి కెనయ సంపద
చూసి తమకు లేదటన్న ధర్మమేమి?
ధర్మమన్న తొల్లి తన్నుక చచ్చిరి.
విశ్వదాభిరామ వినురవేమ
సహపంక్తి భోజనాలకు కులనిర్మూలన కోసం—
ఉర్విజనులకెల్ల ఒక్క కంచముబెట్టి
పొత్తు గుడిపి కులము పొలియజేసి
తలను చెయ్యిబెట్టి తగనమ్మ జెప్పరా
విశ్వదాభిరామ వినురవేమ
చేసే పనినిబట్టి ఫలితముంటుందనుట-
వ్రాతకంటె హెచ్చు వరమీదు దైవంబు,
చేతకంటె హెచ్చు వ్రాతలేదు,
వ్రాత కజుడు కర్త, చేతకు తాకర్త
విశ్వదాభిరామ వినురవేమ
ధర్మమే దైవం-
వెలయ భూమి తల్లి—విత్తనమటు తండ్రి
పంటలరయ సుతులు పాడి పరము
ధర్మంబు తనపాలిదైవఁబు తలపగా విశ్వదాభిరామ వినురవేమ.
ఇంతకంటె ప్రగతిశీలి-మేధావి కవి వేరే ఎలా వుంటాడు. ఇప్పటికి మూడు నాలుగువందల యేండ్లక్రితమే అంతటి ఉన్నతమయిన భావుకుడు వేమన.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఇలా పురాణ గాధలను-విగ్రహారాధనలను వెక్కిరించి "సత్యార్థ ప్రకాశిక" రచించిన శ్రీదయానంద సరస్వతికి వేమన మార్గదర్శి అనుకోవచ్చు. ఇంకా ఆయన మెచ్చిన వేద ధర్మాలను, వైదిక క్రతువులను కూడా వేమన మెచ్చలేదు. క్షుద్రదేవతా రాధనలూ లేవు.
ఢాంబికాచారాలకు, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకి. వేమనది జ్ఞానయోగం యధార్థవాదం.
వేమన్నది మానవతావాదం. కులమతాలు నచ్చవు. జంగాల, వైష్ణవుల బ్రాహ్మణుల, విగ్రహారాధకుల, యజ్ఞయాగాల, స్వర్గ నరకాల, మంత్ర తంత్రాల జ్యోతిష్యముహూర్తాల, ఉపవాసవ్రతాల అపహాస్యం చేసాడు. తన పద్యాల్లో తాను నమ్మిన వేదాంతాన్ని ఇలా నిశ్చయంగా, నిర్భయంగా చాటిచెప్పాడు.
ఆత్మబుద్ధివలన ఆఖిలంబు తానయ్యె జీవబుద్ధివలన జీవుడయ్యె
మోహబుద్ధిలయము ముందర కనుగొను విశ్వదాభిరామ వినురవేమ-
📖
*దేవదాసి రాక*
మబ్బుతో కప్పబడిన చంద్రబింబంవలె అందాల మోముపై మేలి ముసుగు ధరించుకొని దేవదాసి ఒకనాడు వేమనను వెదకుతూ వచ్చింది. ఆయన పాదాలపై తలవాల్చి కూర్చుంది. నిప్పు కాలినప్పటివలె వేమన తన పాదాలను వెనుకకు లాగుకున్నాడు.
“ఎవరు?” అన్నాడు.
ఆమె అలాగే వుంది.
ఆంతలోకే ఆమె చెల్లెలు మందినుంచి త్రోసుకొని ముందుకు వచ్చింది. ఆమెను చూసి చరణాలవద్ద పడి వున్నదెవరో గ్రహించగలిగాడు.
"లే-సరిగా కూర్చో" అన్నాడు వేమన.
లేచి కూర్చున్నది కాని ఆమె యేడుస్తున్నది.
అతడు నవ్వాడు.
"ఈ దాసిని మరచిపోతిరా స్వామీ” అంది.
“ఊహు, ఆటవెలది నా వెంటనంటే వుంటుంది నీడలా" అన్నాడు-ఆ తర్వాత మెల్లగా తనలో ఇలా అనుకున్నాడు.
"ఆడదానిజూడ అర్థంబు జూడగా
బ్రహ్మకైనబుట్టు రిమ్మ తెగులు
బ్రహ్మ యాలిత్రాడు బండిరేవున దెంప విశ్వదాభిరామ వినుర వేమ."
ఆయన ఈ మాటలలో ఆమెకు ఆశ చిగురించింది.
"ఏమిటి మీకిది? ఏం తక్కువయిందని?" అంది.
“ఇప్పుడేం తక్కువుందని?" నిశ్చలంగా, తృప్తిగా అన్నాడు.
“ఈ గోచిపాక, ధూళినిండిన శరీరం, సంస్కారం లేని తల గడ్డం; ఏమిటి స్వామీ ఇది?" బాధగా అడిగింది.
“దేహమనెడి ఇల్లు దినదినంబును నూడ్చి
యలికి పూసి మెత్తి యనుదినంబు
కడకు వీడిపోవు కపటిరా జీవుండు
విశ్వదాభిరామ వినుర వేమ
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"రండి స్వామీ! నా సంపదంతా మీది”
“కుడువ ముడువలేక కూడబెట్టగలేక
విడువ నుడువలేక విద్యలేక
నడవ నేరని వాని నడపీనుగందురు.
విశ్వదాభిరామ వినుర వేమ
“నాకు మీరంటే పంచప్రాణాలు. ఏనాడూ మీ మనసు నొప్పించనని నిందింపనని ఒట్టు పెట్టుకుంటున్నాను”
"ఆపదకల వేళ అరసి బంధుల చూడు. భయమువేళ జూడు బంటుతనము
పేదవేళ చూడు పెండ్లాము గుణమెల్ల విశ్వదాభిరామ వినురవేమ”
"నిజం స్వామీ, నన్ను నమ్మండి. నాతోరండి, మిమ్ము పువ్వుల్లో పెట్టి పూజిస్తాను"
"భార్యమీద ఆశ పరగ పురుషునకుండు మగనిమీద ఆశ మగువకుండు
శివునిమీద ఆశ సిద్దున కుండురా
విశ్వదాభిరామ వినురవేమ."
"మిమ్మే నమ్ముకొని వున్న పాదదాసి పై దయలేదా స్వామీ మీకు?"
"ఆంగమెల్ల వణికి యటు దంతములువీడి తనువు ముదిమచేత తప్పియున్న
ముప్పు తిప్పలైన మోహంబు వీడరు విశ్వదాభిరామ వినురవేము”
ఆమె విచారగ్రస్థురాలై 'ఇక నాకు మరణమే శరణ్యం' అంది.
"జీవి జీవి జంప శివుని జంపుటె యగు జీవుడరసి తెలియ శివుడు కాడె
భావమందు వేగపరికించి చూడుమా?
విశ్వదాభిరామ వినుర వేమ
అని ఆత్మహత్యను నిరసించాడు వేమన.
"బ్రతికి ఏం చేయమంటారు నన్నింకా"
“లోకంలో దుఃఖంతో వున్నవారికి సాయం చేయాలమ్మా."
"ఏమిగొంచువచ్చె తానేమి గొనిపోవు
పుట్టువేళ నరుడు గిట్టువేళ
తాను ఇచ్చు ఈవె తనవెంట వచ్చును
విశ్వదాభిరామ వినుర వేమ
ఆమె విచారంతో వెళ్ళిపోయింది.
సంసారాన్ని వదలినా సంసార జీవితాన్ని వద్దనలేదు వేమన. చక్కని కుటుంబ జీవితాన్ని మెచ్చుకున్నాడిలా-
తల్లిదండ్రి యన్నదమ్ము లాత్మసఖులు
ఎలమి బంధు భృత్యులెల్ల జనము కలగి వర్ధిలంగ ఘనతతోనుండరా
విశ్వదాభిరామ వినుర వేమ
🤟
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment