ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా ప్రశాంతత లేకపోతే జీవితం వృధా🌹DO YOU AGREE🌹POSTCARD (105) from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Gv66RSRY87A
Transcript:
(00:01) ఆ అడుగు ఏదో అడుగుతాను నువ్వు ప్రశాంతత గురించి ఒకసారి చెప్పవ ఆ ఏదేమైనా నువ్వు ప్రశాంతంగా ఉండాలి ఏది పోయినా ఏది ఉన్నా అని చెప్తుంటావు కదా అవును అది నా జీవన విధానం అది మనకు ప్రకృతిలో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మనిషి సంపాదించుకునేవి రెండు మనిషి గుర్తించేవి అని ఓకే అందుకే ఆధ్యాత్మికతను సెల్ఫ్ రియలైజేషన్ అని పిలిచారు ఓకే సెల్ఫ్ మనిఫెస్టేషన్ అనలేదు లేదా సెల్ఫ్ అచీవ్మెంట్ అనలేదు సెల్ఫ్ రియలైజేషన్ రియలైజేషన్ అంటే ఒకడు తన వీపు ఎక్కడ ఉందని వెతికాడంట హమ్
(00:45) దేశమంతా వెతికిన దొరకలే ఓకే అప్పుడు గురువు దగ్గరికి వెళ్లి ఎక్కడో పుస్తకంలో చదివాను మనిషికి వీపు ఉంటుందట నాకు వీపు నేను ఎప్పుడూ చూడలేదండి. నేను వీపు లేకుండా పుట్టానా నేను గొప్ప ఆందోళనలో బతుకుతున్నాను. మ్ అంటే నీ వీపు నువ్వు చూడాలనుకుంటున్నావా నాయనా అని అడిగాడంట గురువు ఓకే అవును చూడాలనుకుంటుందా అంటే తప్పకుండా కళ్ళు మూసుకో అని కళ్ళు మూసుకొని ఒకసారి వంగు అని అంగి లేపి ఈపు మీద ఒక్కటి కొడితే ఇప్పుడు ఏదైతే నీకు నొప్పి నొప్పి మంటలు వేస్తుందో అదే వీపు నాయన కంటికి కనబడకపోతే అది లేదని కాదు అన్నాడంట ఓకే అట్లనే మనం మనిషి సంపాదించుకునేదంతా ప్రపంచం
(01:29) మ్ మనిషి గుర్తించేదంతా అంత ప్రకృతి ఆధ్యాత్మికం ఓకే ఆధ్యాత్మికత అంటే ఏంది నీలో ఉన్న వాటిని గుర్తించి వాటిని అనుభవించడం అంతే ప్రాపంచికం అంటే ఏంది నీ దగ్గర లేని వాటిని సంపాదించి వాటి కోసం పోరాడుతూ ఉన్న శాంతిని పోగొట్టుకోవడం ఓకే ఇప్పుడు మనిషి సంపాదించుకునేవి ఏంటివి ప్రపంచంలో డబ్బు, పేరు ప్రఖ్యాతులు, బంగారము, గాజులు, ఇల్లు, ప్రాపర్టీ మేకప్ు ఉమ్ ఆ తర్వాత పేపర్ ఆర్టికల్ పాలిటిక్స్ సంస్కరణలు అహంకారం ఇదంతా మనిషి సంపాదించ ఏమి లేవా లేవు కదా మ్ ప్రకృతిలో ఏముంది ప్రశాంతత హాయి నిశ్చలత ఉమ్
(02:14) ఇవి ప్రకృతి సంపదలు తర్వాత గాఢమైన నిద్ర భేదభావం లేని స్థితి అహంకారపు లేని స్థితి పోలిక లేని స్థితి నిరంతర సామరస్యము ఒక సహజమైన అందము ఇదంతా ప్రకృతిది ఇప్పుడు ఒక జింక ఉంటే సహజంగా అందంగా ఉంటది మేకప్ వేసుకొని కాదు అదే ఒక హీరోయిన్ ఉంది హీరో ఉన్నాడు ఏదో చేసుకొని ఉన్నారు అంటే అది సహజంగా లేదని కదా అంటే అసహజత్వాన్ని మనం మనం లైక్ చేస్తున్నాం.
(02:44) ఓకే నిజంగా ఇప్పుడు హీరో హీరోయిన్ వాళ్ళు నిద్ర లేస్తానని చూస్తే మనకు నచ్చకపోవచ్చు వాళ్ళు బయటికి రారు. కాదు రమణ మహర్షి నిద్ర లేచినప్పుడు అలాగే ఉంటాడు. ఓకే ఎదురులోన అలాగే ఉంటాడు రోడ్డు మీద అలాగే ఉంటాడు కొండ మీద అలాగే ఉంటాడు సహజంగా సహజం సహజం అంటే ప్రయత్నము అప్రయత్నము అని ఓకే అసహజం అంటే ప్రయత్నం వల్ల ఒరిగింది అని ఓకే సో ఇప్పుడు నేను రియలైజ్ అయిన చిన్న విషయం అదేంటంటే మూర్ఖుడు ప్రశాంతతను వదిలి ప్రపంచాన్ని పట్టుకుంటాడు.
(03:20) ఓకే గాని జ్ఞాని ఎవడు లేదా వాడు వాడు ప్రపంచాన్ని అవసరం కోసం ఉపయోగించుకుంటాడు కానీ వాడు ప్రశాంతత వదిలిపెట్టడు. ఓకే ఇది ఎలా ఉందంటే నువ్వు ఆ ఏమంటారు అమెరికా వెళ్తున్నావ్ నువ్వు పాస్పోర్ట్ అవసరం వీసా అవసరం కదా అవును ఇప్పుడు అమెరికా వెళ్ళేవాడు వీసాతో పాటుగా బ్యాగ్ తీసుకెళ్తాడు, బంగారం తీసుకెళ్తాడు, అద్దాలు తీసుకెళ్తాడు, డబ్బులు తీసుకెళ్తాడు అన్ని తీసుకెళ్తాడు కదా అవును కానీ ఏది ఏమైనా అమెరికా వెళ్లే వరకు వీసాని మర్చిపోడు వాడు పాస్పోర్ట్ ని అవును వాడు పాస్పోర్ట్ పట్టుకొనే ఉంటాడు ఎప్పుడు ఎందుకంటే అది గనుక పోతే నీ ప్రయాణమే ఆగిపోతది. ఆగిపోతది
(04:03) ఏది లేకపోతే అసలు ప్రయాణమే లేదో అది ఎట్లైతే మనిషి వదిలిపెట్టడం లేదో ఏది లేకపోతే జీవితం లేదో దాన్ని వదిలిపెట్టకూడదు అదే ప్రశాంతత ఓకే ప్రశాంతత అంటే ఉన్నదే రియలైజ్ అవ్వాను ఎప్పుడు ఉంటుంది అది ప్రాపంచిక విషయాలు మనసులో దూరకపోతే మిగిలింది ప్రశాంతత ప్రయత్నం వదిలేస్తే మిగిలింది ప్రశాంతత నీలో ద్వేషము కోపము వైమనష్యత అసహ్యము ప్రతి కారమ ఇవన్నీ లేకపోతే మిగిలింది ప్రశాంతత మ్ నువ్వు చేసే పని నిష్కామ కర్మ అయితే అందుకే నిష్కామ కర్మ చేయమని చెప్తుది భగవద్గీత నిష్కామ కర్మనే ఎందుకంటే కామ కర్మలో పోలిక ఉంటుంది.
(04:45) జయపజయాలు ఉంటాయి. ఇస్ ఏ గేమ్ బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆసిలేట్ అవుతా ఉంటాడు మనిషి నిష్కామ కర్మలో అసలు వేరేవాడు లేడు నాకు ఇది సాధ్యం కాబట్టి చేస్తున్నాను అని ఉంటుంది. ఓకే సాధ్యమైనది చేసినప్పుడు ప్రశాంతత పోయే అవకాశమే లేదు. అందులో ఎవరో వచ్చి ఆ పక్కింటోడు చూసారా వాడు పెద్ద బిల్డింగ్ కట్టాడు అవునా నేను కూడా చూసాను చాలా బాగుంది ఆయనక అది సాధ్యమే ఉంది అన్నాడు.
(05:09) ఓకే అంటే ఎవరికి ఏది సాధ్యం తులసి చెట్టుకు సాధ్యము ఇంతే ఎదగడం రెండు ఫీట్లు ఆగిపోయింది. మామిడి చెట్టుకు సాధ్యం 50 ఫీట్లు ఎదగడం అందెత్తులో ఆగింది అది ఇప్పుడు తులసి చెట్టు మామిడి చెట్టుతో పోటీ పడితే ఎట్లా ఆ తులసి చెట్టు ఎందుకు గొప్పది అంటే సహజంగా ఉంది మామిడి చెట్టు ఎందుకో సహజంగా ఉంది తులసి చెట్టు ఒక్కసారి మామిడి చెట్టు అవ్వాలని ట్రై చేస్తే తులసి చెట్టు తులసి చెట్టు కాకుండా పోతది రెండోది అది ఎప్పటికీ మామిడి చెట్టు ఎదగలేదు.
(05:36) అవును దాంట్లో ఆ గుణము లేదు కాబట్టి లేదు కాబట్టి అందుకని ఇది నాకు చాలా ఏళ్ల క్రితం రియలైజ్ అయిన నేను గుర్తించిన అంశం నేను ఏం గుర్తించాను అంటే నేను మానగర్లో ఉన్నప్పుడు ఒకసారి నన్ను కలుస్తూ ఉండేవాడు ఓకే హాయిగా ప్రశాంతంగా బ్రతుకుతున్న రోజు నా దగ్గర చిల్లిగవ లేదు రెండే జతల పట్టుకు నాకు అప్పుడు నేను ఏం రియలైజ్ అయ్యాను అంటే నా దగ్గర ఏమీ లేవు కానీ నేను చాలా హాయిగా ఉన్నాను.
(06:03) ప్రశాంతంగా ఉంది ఉన్నాను ఓకే ఇప్పుడు నేను చెప్పినవి ఏమీ లేవు నాలో ఎవరి మీద ద్వేషం లేదు నాకు ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద ఒపినియన్ కూడా లేదు నాకు ఓకే ఒక జింక చూస్తది ఇట్లా తీయటగా చూస్తది చిన్న పిల్లలు చూస్తారు. చిన్న పిల్లలు ఎట్లా చూస్తారు నీ గురించి ఏదో అనుకోరు మనసుల ఊరికే చూస్తారు అవునా అవును అట్లా చూసేవాడిని నేను ఇప్పటికి అట్లాగే చూస్తాను నా మనసులో ఏమ ఉండదు.
(06:28) ఓకే అది రుజువు చేయలేదు ఎవరికీ ఓకే సో అట్లా ఉన్నప్పుడు ఒకసారి నా దగ్గరికి వచ్చి నువ్వు యువకుడివ ఏదైనా చేయాలనేవాడు ఆయన అప్పుడు నేను ఒకసారి ఏం చెప్పానంటే మీరే ఇంకా ఏదో చేయాల్సి ఉందండి అదేందయ్యా నేను ఇల్లు కట్టుకున్నా రెండు అంత అస్సలు నేను ఉద్యోగం చేసిన అన్నాడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండి ఇక్కడికి ఎందుకు వస్తున్నావ్ అంటే నీ మనసు ప్రశాంతంగా లేదు.
(06:52) ఓకే నువ్వు ఇంకా ఎవరికో ఏదో చెప్పాలని గుర్తింపు కావాలని కోరుకుంటున్నావ్. మీకు విషయం తెలుసా నేను మిమ్మల్ని అసలు గుర్తిస్తలేను. నా స్థితిలోకి మీరు రావాలంటే మీకు వెయ్యేలు పడుతది. మీ డబ్బునే సంపాదిస్తే ఎంతసేపు సార్ నాకు ఎవడనా ఒక ఫ్రెండ్ ఇచ్చినా కట్టేసుకుంటా ఇల్లు డబ్బు చిన్న విషయం అండి ఆ డబ్బు ఉన్న ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉన్నారా లేదా నేను ఈ చిన్న ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాను.
(07:16) రెండోది నేను పెద్ద ఇల్లు కట్టిన చిన్న ఇల్లు కట్టిన నిద్ర అంతే ఉంటది. కోటేశ్వరుడికి ఎక్కువ ఆకలి మామూలు వాడికి తక్కువ ఆకలి ఎట్లా ఉంటుంది? అందుకని జ్ఞానం అంటే ప్రశాంతతని మూలాన్ని పట్టుకోవడం అజ్ఞానం అంటే ఆకులు పట్టుకోవడం అందుకే మన మహాభారత కథలో ఓ గొప్ప విషయం ఉంది. ఇదేంటో తెలుసా దుర్యోధనుడు అర్జునుడు వస్తారు కృష్ణుడి దగ్గరికి ఫస్ట్ బావా ఎప్పుడు ఎప్పుడు నేను ఫస్ట్ వచ్చిన కాబట్టి నేనే ఫస్ట్ కోరిక కొరుతా అంటే అప్పుడు అర్జునుడు చెప్తాడు నా సైన్యం అంతా ఒక దిక్కు సారీ కృష్ణుడు చెప్తాడు నా సైన్యం అంత దిక్కు నేను ఒక దిక్కు మ్ ఎవరిని చూస్ చేసుకుంటాం అంటే అర్జునుడు
(07:59) కృష్ణుడినే చూస్ చేసుకుంటాడు మ్మ్ దాని అర్థం ఏంటో తెలుసా మూలాన్ని చూస్ చేసుకున్నవాడు ఎప్పుడు గెలుస్తాడని ఓకే సైనికులు లక్ష మంది ఉంటే ఏమి మూలం ఇంపార్టెంట్ ఇప్పుడు దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి ప్రశాంతత లేదు నాకు ఒక్కడిని చూపి నాకు సక్సెస్ పేరు ప్రఖ్యాతులు కీర్తి ఉంటే చాలు నేను ప్రశాంతత లేకపోయినా పర్వాలేదు అనేవాడు ఒక్కడు లేడు భూమిమీద ఓకే ఎవ్రీవన్ నీడ్స్ ఇట్ అది ఎగజస్టెన్షియల్ లా అది నాకు అన్ని ఉన్నా నేను పని చేస్తాను నిద్రపోను అనేవాడు ఒక్కడు ఉండు నిద్రపోవాలని అనుకుంటా అనుకుంటాడు.
(08:32) నాకు అన్ని కావాలి నాకు బంగారం కావాలి ఎవ్రీథింగ్ కావాలి నాకు ఆకలి వద్దు అనేవాడు ఒక్కడు లేడు సో మూలం కచ్చితంగా కావాలి ఆ మూలంలో ప్రత్యక్షంగా మనకు ఉన్నట్టు తెలుస్తున్నది ఆకలి నిద్ర మైధునము పరోక్షంగా ఉన్నట్టు తెలుస్తున్నది ఈ ప్రశాంతత అవి ప్రత్యక్షంగా కనబడవు కాబట్టి మనిషి నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఆకలి తినకపోతే నీకు కడుపులు పీకుతాయి కాబట్టి తింటున్నావు.
(09:00) కానీ ప్రశాంతంగా లేకపోతే ఫర పడదని ఒక చిన్న ఆలోచన ఏ ప్రశాంతంగా రేపైనా ఉండొచ్చులే ఇప్పుడు కష్టపడదాం అనుకుంటున్నాడు. ఎలాగైతే ప్రతిరోజు ఆకలి అయిందో తింటున్నావో ప్రతిరోజు నువ్వు ప్రశాంతంగా ఉన్నావో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే ఒక్కసారి ప్రశాంతతని వదిలిపోతే తిరిగి రాదు. ఓకే ఇప్పుడు మనిషి ప్రశాంతతగా ఉన్నాడా లేదా అనే విచారణ నిశ్చయ సింపుల్ పరచింతన ఉండదు.
(09:26) ఉమ్ ఏ పని చేస్తావో దాంట్లో పూర్ణ సంలగ్నత ఉంటది. ఓకే ఎవరితో పోల్చుకోవడం ఉండదు. ఓకే ఎక్కడ ఉంటే అక్కడ హాయిగా ఉంటది కంప్లైంట్ మైండ్ ఉండదు. ఓకే ఇంతకుమించి వేరే ప్రమాణాలు అక్కర్లేదు రెండోది చింత ఉండదు పశ్చాత్తాపం ఉండదు దుఃఖం ఉండదు. ప్రశాంతత అనేది నీ ఒరిజినల్ స్టేట్ ఎగ్జిస్ట్ నువ్వు ఎప్పుడైనా అడవికి వెళ్ళు అడవికి వెళ్తే ఎందుకు బాగుంటదో తెలుసా ఓకే అదే మనిషి షాపింగ్ మాల్ కి వెళ్తే ఎందుకు దమా ఖరాబ్ అయితది అంటే షాపింగ్ మాల్ లో అంతా గందరగోళం ఉంది.
(10:01) అవును అందుకే నీ దమా ఖరాబ్ అయిపోతది నీకు అడవిలో ఆ వాస్ట్నెస్ లో ఒక మౌనం ఉంది ఒక నిశ్చలత ఉంది. ఎలా ఉంటదింటే అలా ఉంటది అడవి అవును అది జస్ట్ [నిట్టూర్పులు] అంటా ఉంటది అది అవును వెంటనే సైలెన్స్ అదంతా నీలోకి వచ్చి చొరబడతది అన్నమాట ఓకే చొరబడి అడవిలోకి వెళ్ళినవాడు కేకలు కీకలు ఐదు నిమిషాలు వేసి ఏక్దం సైలెన్స్ అయిపోయి వాడు చెట్టులో చెట్టు అయిపోతాడు.
(10:34) అక్కడి నుంచే దేవులపల్లి కృష్ణ శాస్త్రి పాట కూడా రాశడు ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి సాగిపోనా అన్నాడు అది అది రియల్ ఎక్స్పీరియన్స్ అది ఇది ప్రశాంతంగా లేనివాడు అడవికి వెళ్తే ప్రశాంతత ప్రశాంతం ఉన్నవాడికి ఉన్నదే అడవి అని తెలుస్తది. ఎందుకో తెలుసా పరచింతన లేదు కాబట్టి పరచింతనలో ఎప్పుడు మనిషి మనిషి గురించి ఆలోచిస్తున్నాడు అవునా అవును మనిషి ఎప్పుడు రాయి గురించి ఆలోచిస్తాడా విలువైన బంగారం గురించి ప్రాపర్టీ గురించి మనిషి గురించి ఆలోచిస్తున్నాడు చీపురు కట్ట గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే
(11:18) నిద్రపోతాడా మనిషి చీపుర్లో రెండు పుల్లలు పోయాయి నాకు బాధిస్తుంది ఎవడైనా అంటాడా అదే చీపురు కట్ట లక్ష రూపాయలు అనుకో బంగారం 50 రూపాయలు అనుకో బంగారం బయట ఉండేది చీపురు కట్ట బీరువాలో ఉండేది అవును అది మనిషి యొక్క స్టుపిడిటీ వాడు వస్తువుకు అత్యంత ప్రాముఖ్యతనిఇచ్చి వాడిలో ఉన్న అత్యంత ముఖ్యమైన వాడిని వాడు తాకట్టు పెట్టాడు.
(11:42) అందుకని నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎట్లాగైతే అర్జునుడు కృష్ణుడిని ఎంచుకున్నాడో ప్రతి మనిషి ప్రశాంతత ఎంచుకోవాలి కృష్ణుడు అంటే ప్రశాంతత కృష్ణుడు అంటే చైతన్యం కృష్ణుడు అంటే హాయి అంటే యుద్ధం జరుగుతుందా హాయిగా ఉన్నవాడు ఓకే చంపేది నేనే చచ్చేది నేనే బతికించేది నేనే అని చెప్తూ కూడా ప్రశాంతంగా ఉన్నాడు ఆవేశపడి చెప్తున్నాడు బాలకృష్ణులాగా ఓకే రెండోది అంతటి కృష్ణ భగవానుడు ప్రతిపాదించిన విషయాలు శరణాగతి నిష్కామ కర్మ నిస్వార్థ కర్మ ఇది నాకు తెలిసి అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అది నిష్కామ కర్మ అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని పరిపూర్ణంగా
(12:23) చదువుతున్నావో పూర్తిగా చదువు ఫలితం ఆశించొద్దు అంటే ఫలితం రాదని కాదు కాదు మ్ ఏదో ఒక ఫలితం వస్తుంది నువ్వు అంగీకరిస్తావా లేదా ఆడితే గెలవడం ఫలితమే ఓడిపోవడం ఫలితమే మ్ అట్లా దాని అర్థం అన్నమాట ఫలితం ఎలాగ వస్తుందిఅంటే నేను కోరుకున్నది ఫలితం అని కాదు. ఓకే ఏదో ఫలితం వస్తుందండి అందుకని ఒకవేళ ఓకే నేను ఎంచుకున్నది ఏంటి ఏమైనా నేను ప్రశాంతతని ఏకాంతాన్ని హాయిని నిశ్చలతని నిశశబ్దాన్ని మౌనాన్ని ఎంచుకున్నాను నేను నా లైఫ్ లో ఓకే బంగారము ఆస్తి గీస్తే అవసరం కోసమే ఉన్నాయి నేను గుర్తిస్తున్నాను.
(13:00) ఉన్నా కూడా దాన్ని జస్ట్ అవసరం అవసరం కానీ అవసరం కోసమే దాన్ని బాగా ఉపయోగించుకో ఇంకోటి ఎవడికైతే అటాచ్మెంట్ ఉంటదో వాడు సక్కగా వార్డు వాడు దాసి పెట్టుకుంటాడు. అవును అటాచ్మెంట్ లేనివాడే దాన్ని సరిగ్గా ఉపయోగించగలిగేది. ఓకే అటాచ్మెంట్ ఉన్నవాడు కుక్క గడ్డితో ఉన్నట్టే వాడు గడ్డి కుక్క తినదు ఇంకో కుక్కని తినని ఇంకో మేకం తిననియదు.
(13:21) మ్ అట్లనే ఉంటది కదబ్బా ఆస్తి వాడు అనుభవించడు చెల్లెలకి ఇయ్యడు. ఇంకొక అవును అట్లా సో అదంతా స్టూపిడ్ కదా ఆధ్యాత్మికతనేమో పైకి ఉంది లోపట ఎంత భోగలాలసత్వం ఉంది చూడు అవును ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా కనబడదు ఆ ఇప్పుడు ప్రాపంచికంలో ప్రశాంతత లేదంటావా 100% లేదు ఎందుకు లేదు అనేదానికి ఒక కారణం ఉంది. ప్రాపంచికం అంటే డబ్బే కదా ప్రపంచం అనేది ఏమి లేదు డబ్బు బంగారము ఆస్తి ఇవి కంటే కనపడేవి ప్రత్యక్షంగా ప్రపంచం ఇది పరోక్ష ప్రపంచం అంటే ఏంటి పేరు ప్రఖ్యాతులు కీర్తి గౌరవం పరువు ప్రతిష్ట ఇవన్నీ పరోక్షంగా ఇవి తీసేస్తే ప్రపంచం ఎక్కడిది అందుకని ప్రపంచంలో ఎందుకు ప్రశాంతత ఉంది
(14:06) అంటే అవన్నీ బయట నుంచి వస్తున్నాయి కాబట్టి నువ్వు అనుకున్నట్టు ఎప్పుడు రావు ప్రశాంతతకి ప్రపంచానికి తేడా చెప్పనా నీకు ప్రశాంతత అంటే నీ కాళ్ళు ప్రపంచం అంటే ఆర్టిసి బస్సు ఓకే ప్రశాంతత అంటే నువ్వు అనుకుంటే లేచి వెళ్ళిపోవచ్చు నీ చేతిలో ఉంది అది అవును ప్రపంచం అంటే ఎప్పుడు వస్తదో తెలియదు నువ్వు అనుకున్నావో రాలేదు అది మేకప్ వేసుకొని పోయిన ఇప్పుడు ఎండలో మొత్తం మేకప్ అంతా కారిపోయింది.
(14:35) దాంతో కండక్టర్ మీద కోపం వచ్చింది గవర్నమెంట్ వాళ్ళందరి మీద కోపం వచ్చింది. అవును ఫస్ట్ టైం కి రావచ్చు అంటే ఈ డబ్బు అధికారము గౌరవం నీ చేతులో లేవు వేరే వాళ్ళ చేతులు ఉన్నాయి అవి అందుకని ఎప్పుడో ఒకప్పుడు మనస్థాపన చెందుతావ్ నువ్వు అనుకున్నట్టు ఎప్పుడు జరగదు బయట ఉమ్ నువ్వు ఒకడి నుంచి గౌరవం ఆశిస్తావు వాడు ఏనాడు ఇయ్యాడు దానితో ధమా ఖరాబ్ అయితది అవును ఈ ఉద్యోగం రావాలని కోరుకుంటావ్ రాలేదు ధమా ఖరాబ్ అయితది ఉద్యోగం వచ్చింది ఇక్కడ పోస్టింగ్ కావాలంటావ్ రాదు ధమా ఖరాబ్ అయిద్ది అక్కడే పోస్టింగ్ వచ్చింది కానీ బాస్ బాలేడు దమా ఖరాబ్ అయింది.
(15:11) బాస్ బాగున్నాడు కానీ శాలరీ తగ్గుతుంది. మళ్లా దమా ఖరాబ్ అయింది శాలరీ బాగుంది బాస్ బాగున్నాడు కానీ మొగుడు చెప్పిన మాట వింటలేడు. వాడు అనుమానిస్తున్నాడు దమాకు ఖరాబ్ అయింది. మొగుడు చెప్పిన మాట వింటున్నాడు కానీ పిల్లలు అయితలేరు ధమాకు ఖరాబ్ అయింది. పిల్లలు అయిరు కానీ వాడు అందంగా పుట్టలే ధమాకు ఖరాబ్ అయింది. వాడు మంచిగా పుట్టిరు కానీ వాడు స్కూల్ కి పోయి సక్కగా చదువుతలేడు.
(15:32) మళ్ళ దమా ఖరాబ్ అయింది. చక్కగా చదువుతున్నాడు అన్ని వచ్చినాయి కానీ బీడి అలవాట అయింది దమా ఖరాబ్ అయింది. ఇదంతా బయట నుంచి కదా అవును కానీ లోపట అంటే ఏదిఉన్నా లేకున్నా నీవు ఉన్నావ అని గుర్తుపెట్టుకో ఎవ్వరున్నా లేకున్నా నీవు ఉన్నవి నేను చెప్తున్నది ఆర్డినరీ సెన్స్ లో కాదు ఇప్పుడు నేను చెప్తున్న మాట భూమి మీద మానవజాతి మొత్తంలో 100 మంది కూడా చెప్పలే మ్ ప్రశాంతతను వదిలిపెట్టకు ఏదఉండని ఏదన్నా పోని ఏదైనా తప్పు జరిగితే సవరించు ప్రశాంతతలోనే సవరించు ఓకే ఏదైనా పోతే వెతుకు ప్రశాంతతలోనే వెతుకు ఏదైనా ఇరిగిపోతే అతికించు ప్రశాంతంగానే అతికించు
(16:17) ఎవరైనా నిన్ను విడిపోతా అంటే ప్రశాంతంగానే గుడ్ బై చెప్పు ఓకే అంతేగాని దమా ఖరాబ్ చేసుకోవద్దు అనేది సారాంశం. నేను చెప్పింది అర్థం చేసుకునే నేను చెప్పింది అర్థం చేసుకునే మానసిక పరిపక్వత కొద్దిమందికి ఉంటది అది నీకు ఉంది. అందుకే ఇంత ఈ ఇప్పుడు పడుకునే ముందు నీతో మాట్లాడుతున్నా అదర్వైస్ వై షుడ్ ఐ వేస్ట్ మై టైం అవును ఎవరికి చెప్తే నా సందేశము భవిష్యత్తులో ఇంకొందరికి చేరుతదో అట్లా నువ్వు కూడా ఒక వ్యక్తివ అందులా ఓకే థాంక్యూ బావ అలాగే సరే మరి పడుకో ఇంకా ఆ ఓకే బాబు
(17:01) చేతన కూడా ఫోన్ చేస్తుంది మాట్లాడుతాను బాయ్ ఆ ఓకే బా
No comments:
Post a Comment