ఏకాంతంగా ఉండడానికి, ఒంటరిగా ఉండడానికి తేడా ఏమైనా ఉందా?
పాత జానపద సినిమాలో పౌరణికాలో చూస్తో ఒక సాధారణ సంభాషణ ఉంటుంది. రాజు గారు ఏకాంతంలో ఉన్నారు లేడా మహర్షులవారు ఏకాంతంలో ఉన్నారు అంటారు. దేవుడికి కూడా ఏకాంత సేవ ఉంటుంది. కొరియన్ జపనీస్ చైనీస్ రాజసంస్కృతులలో కూడా రాజుగారి అనుమతి లేకుండా భార్య, పిల్లలు కూడా కలవకూడదు. వారిది కూడా ఏకాంతమే. విశ్రాంతి, భోజనం, ఆలోచనలు అన్ని ఏకాంతంలోనే చేస్తారు.
ఒంటరితనం ఇందుకు పూర్తి విరుద్దం, అందరూ మనల్ని వదిలివేయడం, ఎవ్వరూ మనల్ని దగ్గరకి రానీయకపోవడం వంటివి ఒంటరితనంకి లక్షణాలు. మాకు నలుగురు స్నేహితులు ఉన్నారు అనుకుందాం, అందరికీ మందు సిగరెట్ అలవాటు ఉండి మనకు లేకపోతే వారు మనల్ని ఎక్కువగా కలుపుకోరు. అలా కలుపుకోవాలి అంటే లేని వ్యసనాలు అలవాట్లు చేసుకోవాలు. లేదంటే మీకు మిగిలేది ఒంటరితనం. అలా కాకుండా వాళ్ళ సాంగత్యం మీకే నచ్చక వాళ్ళు పిలిచినా వెళ్ళక సముద్రం ఒడ్డునో లైబ్రరీ లోనో మీరే ఒక్కరూ ఉండి మీ ఆలోచనలను ప్రశాంతతను ఇష్టపడితే అది ఏకాంతం అవుతుంది.
విధి మిమ్మల్ని ఒంటరి చేయగలదు, మిమ్మల్ని మీరు ఏకాంతప్రియులు గా మార్చుకోవచ్చు. నేను ఒక్కోసారి మూడు రోజులు నాలుగు రోజులు ఇంట్లో ఒక్కడినే ఉండటానికి ఇష్టపడతాను. ఎంత ఏకాంతం అంటే గుమ్మం దాటి కాలు బయట పెట్టకుండా తలుపు వేసుకుని ఇంట్లోనే వండుకోవడం, టీవి చూడటం, పుస్తకాలు చదువుకోవడం, ఇలా కోరా లో ఏదో ఒకటి రాసుకోవడం, బొమ్మలు వేయడం వంటివి అన్ని ఏకాంతపు లక్షణాలే. అలా బ్రతకడం వస్తే మీకు ఎవ్వరి కంపెనీ అక్కరలేదు, మీ కంపెనీని మీరు ఎంజాయ్ చేయడమే ఏకాంతం.
No comments:
Post a Comment