*ఇంద్రియాల వాసన పోవాలంటే ఇంద్రియాల ద్వారా కలిగే ఆకర్షణ ఆసక్తి, కోరికల వాసన తగ్గిపోవడం లేదా పూర్తిగా లయమవడం.*
*ఇది ఆత్మస్థితికి తీసుకెళ్లే ముఖ్యమైన సాధన.*
*దృష్టి నియంత్రణ...*
*చూడటం వల్లే ఎక్కువ వాసనలు పుడతాయి.*
*అనవసర దృశ్యాలపై దృష్టిని తగ్గించడం*
*చూసినా లోపల ఆసక్తి* *కలగకుండా ఉండే సాధన చేయాలి.*
*శ్రవణ సంయమం...*
*అనవసర మాటలు, కామకథలు, ఉద్రేకపరిచే మాటలు వినడం వాసన పెంచుతుంది.*
మౌనం, సద్గ్రంథ పఠనం, సత్యవాక్య శ్రవణం వాసన తగ్గిస్తుంది.
రుచి నియంత్రణ (ఆహార శుద్ధి)...*
అతిగా రుచులపై ఆశక్తి ఇంద్రియ బలం పెంచుతుంది.
సాధారణ, సాత్విక ఆహారం
అవసరానికి తినడం – ఆసక్తికి కాదు.
స్పర్శ సంయమం...
అవసరం లేని స్పర్శ, సుఖాన్వేషణ వాసనకు మూలం.
శరీరం సాధనం మాత్రమే అనే భావన పెంచుకోవాలి.
వాసనపై అవగాహన...
వాసనలు వచ్చినప్పుడు అణచవద్దు.
“ఇది వాసన” అని గమనించు
గమనిస్తే వాసన క్రమంగా కరిగిపోతుంది.
కోరిక జన్మ స్థలాన్ని దర్శించడం
ప్రతి కోరిక, చూడటం, ఆలోచన, ఆసక్తి, కోరిక
ఈ శ్రేణిని మధ్యలోనే ఆపే జాగ్రత్త.
నిత్య అనిత్య విచారం. ఇది శాశ్వతమా? ఇది నశించేదా?
ఈ విచారం ఇంద్రియ వాసనకు తూట్లు పొడుస్తుంది.
ధ్యానం – దేహాతీత భావన...
“నేను శరీరం కాదు” అనే భావనలో కూర్చోవడం
ఇంద్రియాలు పనిచేస్తున్నా నేను వేరు అనే బోధ.
సాక్షి భావ సాధన...
సుఖం వచ్చినా – దుఃఖం వచ్చినా
చూస్తున్న వాడిగా మాత్రమే ఉండటం
అనుభవంలో కలవకుండా నిలబడటం.
సత్యాసక్తి పెంపకం...
ఇంద్రియాలు అసత్యానికి పరుగెడతాయి
ఆత్మ సత్యాన్ని కోరుతుంది.ఆదిత్యయోగీ.
సత్యాన్వేషణ బలం పెరిగితే
ఇంద్రియ వాసనలు స్వయంగా క్షీణిస్తాయి.
ఇంద్రియాలను బలవంతంగా కాదు
సాధనలుగా మార్చినప్పుడు
వాసన రాహిత్యం సహజంగా వస్తుంది.
శరీరం...గ్రహాలు. మానవ శరీరం నవగ్రహాల నిర్మితం.
శరీరంలోని ప్రతి భాగం ఫై ఒక్కొక్క గ్రహం
ఆధిపత్యం ఉంటుంది.
రవి. వెన్నెముక,శారీరకబలం,గుండే.
చంద్ర. పొట్ట,జీర్ణకోశం.
కుజ. తల,కండరాలు,ఎముకలలోనిమజ్జ,
రుచిని.వాసనని తెలిపేవి.
బుధ. జ్ఞానేంద్రియలు,చర్మం,చేతులు,అవటుగ్రంధి,నరాలు.
గురు. కాలేయం,తొడలు,పాదాలు,ఎదుగుదల.
శుక్ర. స్పర్శజ్ఞానం,మూత్రపిండాలు,మెడ.
శని. చర్మం,జుట్టు,పళ్ళుఎముకలు,వెన్నుముక.
రాహు. ఊపిరితిత్తులు,మోకాళ్ళు,వెన్నముక,కాటరాక్ట్.
కేతు. కళ్ళు,పొట్ట.!! *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment