Monday, June 15, 2026

 *యోగి వేమన -13*

రచన : మాలయశ్రీ 


*వేమన కవితాసారం...*

వేమన భావాలు పండితమ్మన్యులకు, మత ఛాందసులకు, దుష్టపాలకులకు, దోపిడీ దొంగలకు తలకంటకంగా ఉండేవి. కాని, సామాన్య జనానికి ఆవే విత్ర మంత్రాలు, శిరోధార్యాలు.

ఏ ప్రభుత్వాలు కాదు, పండిత పరిషత్తులు కాదు, సామాన్య ప్రజలే వారి పద్యరత్నాలను తాళపత్ర గ్రంధాల్లో వ్రాసి అమూల్యంగా భద్రపరచు కొన్నారు. ఈ తరానికి తరగని నిధిగా అందించారు.

వేదాంత భావాలను పట్టిచూస్తే అద్వైత ప్రభావం, విగ్రహారాధన వ్యతిరేకత, కులమతాల విముఖత ఆయన కవితల్లో వుంది.
📖

*వేమన మానవతావాది*

ఆయన ఆరాధించిన శివుడు- జీవుడు. పేర్కొన్న యముడు మృత్యువు పరానికంటే ప్రస్తుతానికే విలువిచ్చాడు విశ్వసించాడు.

కాలానికి ముందున్నవాడే క్రాంత దర్శి. వేమన నిజమయిన ప్రజాకవి. ఆకలిని నిరసించి "సర్వేజనాః సుఖినోభవంతు” అనే ఆదర్శ సిద్ధాంత ప్రవర్తకుడు.

దైవానికి మించి ధర్మానికి విలువిచ్చాడు. విధి వ్రాతను కాదని స్వయం కృతానికి పట్టంకట్టాడు.

మంచియన్నది మాలయైతే-మాలనేయౌదున్, అనిన గురజాడ మహా కవి కంటే కొన్ని వందలేండ్లకు పూర్వమే మాలలను ఇతర మానవులతో సమానమన్నాడు..
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
గాంధీజీది దైవభక్తి ప్రేరితమైన హరిజనోద్యమం. కాని మన వేమనది కులమతాలు లేని నవ్యమానవతావాదం. కాలం దినదినం దిగజారిపోతున్నదా అనిపించుతుంది, ఇప్పటికీ మన సమాజంలో స్వార్ధ సంకుచిత భావాలు వుండడం శోచనీయం.

ఈ కాలంలో కొందరు దొంగసాధులు గుర్రపుస్వారితో పగటి దివిటీలు, బాజాలతో వేమన శిష్యులమని సంచారంచేస్తూ ప్రజల్ని దోపిడీ చేస్తూ కనిపించడం మనజాతి దౌర్భాగ్యానికి చిహ్నం.

ఆంధ్ర కవుల్లో నవీనుల సంగతి వదిలితే ప్రాచీనుల్లో ఇంతటి ప్రగతి శీలియైన ప్రజాకవి కాగడాలతో వెదకినా మరొకరు కనిపించరనుట అతిశయోక్తి కాదు.

భాషావ్యాకరణ దోషాలు ఏవైనా వుంటే అవి ఆయన భావసంపత్తి ముందు లెక్కలోనికిరావు. ఈనాడు సాగిస్తున్న వ్యావహారిక భాషా ఉద్యమానికి ఆయనే ఆద్యుడనొచ్చు. ఆ భావాల వెగటువల్లనే వేమనను శిష్టకవుల పంక్తికి రానీకుండా మనవాళ్ళు గట్టిప్రయత్నం చేశారు. అందుకేనేమో కవి వేమనను, యోగి వేమనగా ప్రచారం చేశారు. యోగానికి ఆ కవి పెద్దపీటను వేయలేదు, పైగా వెక్కిరించాడు కూడా. జనం వేమనను మరచిపోలేరు కనుక కవి పేరునయినా మరిపించాలని చూశారు. హిందూ మతాన్ని నిరసించిన గౌతమబుద్ధుని విష్ణుమూర్తి దశవతారాల్లో ఒకనిగా మార్చిన ఘనులు కదా మన పూర్వులు. అయినా సూర్యకాంతికి అరచేతిని అడ్డుపెట్టి ఆపగలరా? ఆది వారికి సాధ్యంకాలేదు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
వేమారెడ్డి తన పేరును వేమనగా చెప్పుకోవడమే ఒక విశేషం. కాదు అనుకుంటే రెడ్డి శబ్దాన్ని తన పద్య మకుటంలో ప్రయోగించేవాడే.

అసలు సిసలయిన అచ్చపు ఆంధ్రకవి వేమన. అజరామర కవితను మనకు అందించినందులకు కృతజ్ఞతాపూర్వక అంజలు లర్పించుకుందాం.

తన సాహిత్యంతో జనం గుండెల్లో గూడుకట్టుకొని నాలుకలపై ఆట వెలదిని నాట్యమాడించి, గుండె బలం ఆదర్శం పెంచిన ఈ మహాకవి తన వార్ధక్య దశలో కీర్తిశేషులైనారు, కడప [అనంతపురం] జిల్లాలోని కటారుపల్లెలో వేమన సమాధిని భక్తిశ్రద్ధలతో జనం నేటికీ పూజిస్తున్నారు.
📖
*వేమన జన్మ ధన్యం ఆయన పద్యాలు మాన్యం*

ఆంధ్రదేశంలో తెలుగు కవిత నిలిచి వున్నంత కాలం వేమన కవిత నిలిచి వుంటుంది. వారి పద్యాలు ఆణిముత్యాలు — అక్షర సత్యాలు. అందులో ఏ కొద్ది మొత్తమో కాలదోషం పట్టిన భావాలు వుండవచ్చును. కాని ముప్పాతిక మువ్వీసం చెన్ను తరగనివి, వాసి చెడనివి, వాడి వీడనివి. అందులో అర్ధాంశమైనా ఆచరణ లోకి తెస్తేనే మనం ఆంధ్రులం — లేకుంటే? అంధులం — అని వేరే అనాలా! అచ్చమైన ప్రగతిశీల సజీవ కవితా చైతన్యమూర్తి వేమన.

ఆ ప్రజాకవి కీర్తి అజరామరం ! 
📖

*కొన్ని వేమన పద్యాలు*

అన్ని దానములకు అన్నదానము మిన్న కన్న వారికంటె ఘనులులేరు ఎన్న గురునకంటె ఎక్కువలేదయా విశ్వదాభిరామ వినురవేమ.

ఉప్పులేనికూర ఒప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలములేదు అప్పులేనివాడె ఆధిక సంపన్నుడు —విశ్వదాభిరామ వినురవేమ.

తామసింపజేయ తగదెట్టి కార్యంబు 
వేగిరింప నదియు విషమమగును పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనె—
విశ్వదాభిరామ వినురవేమ.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా ?
విశ్వదాభిరామ వినురవేమ.

చిత్తశుద్ధిచేత చేసిన పుణ్యంబు 
కొంచెమైన నదియు కొదువ కాదు 
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత ?
విశ్వదాభిరామ వినురవేమ.

చంపదగిన యట్టి శత్రువు తన చేత
చిక్కెనేని కీడు చేయరాదు
పొసగమేలు చేసి పొమ్మనుటయే చాలు
విశ్వదాభిరామ వినురవేమ.
🙏🙏
*సమాప్తం*
*సర్వేజనా సుఖినోభవంతు* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment