Sunday, June 14, 2026

దేహబ్రాంతి ఎలా పోతుంది #youtube#viral#viralvideo #trending #yt#vlog#bhakti#explore#funny#love

దేహబ్రాంతి ఎలా పోతుంది #youtube#viral#viralvideo #trending #yt#vlog#bhakti#explore#funny#love

Author Name:ajju-baipalli

Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli

Youtube Video URL:https://www.youtube.com/watch?v=v__Q5Wh7TCM



Transcript:
(00:02) దేహభ్రాంతి ఎలా పోతుంది అనే ఒక ప్రశ్న ఒక అన్య నాకు మెసేజ్ పెట్టాడు అసలు దేహభ్రాంతి అంటే ఏంటి ఈ ప్రశ్న రమణ మహర్షికి ఎదురైనప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పారు అనే విషయాన్ని నేను చెప్పి నా యొక్క అనుభవం కూడా చివర్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ అఫ్ ఆల్ దేహభ్రాంతి అంటే ఏంటి అంటే నేను ఈ శరీరము అని ఒక భావన.
(00:30) ఫైనల్ ఇంకా ఎవరైనా నిన్ను అడిగితే నేనే ఈ శరీరం ఈ శరీరమే నేను ఫైనల్ ఇంక మరి వేరే ఆప్షన్ ఏమ లేదు ఇంకా ఎవరైనా వచ్చి నువ్వు ఈ శరీరం కాదురా ఈ ఆలోచనలు కాదురా నువ్వు ఒక ఆత్మవర అంటే హే మీరు చెప్పేది చాలా నాన్సెన్స్ అండి ఈ శరీరమే నేను అని రూఢంగా నమ్మి బతుకు బతుకుతున్న ఒక భావన దేహభ్రాంతి అండి అది సాధారణంగా పుట్టుకతో ఏమి రాదండి కాస్త పెరిగే ేటప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు చుట్టాలు బంధువులు ఊర్లో వాళ్ళు అందరూ కూడా ఇంజెక్షన్ చేసేస్తారు మనకి ఒరేయ్ ఈ శరీరమే నువ్వు దానికి ఒక గెలుపు ఉండాలి ఆ దానికి ఒక మలుపు ఉండాలి దానికి ఒక కష్టం
(01:15) ఉండాలి దాన్ని నువ్వు ఎదిరించాలి ఇలా అన్ని మన యొక్క బుర్రలో పెట్టి పెట్టి ఈ శరీరమే నువ్వు అని ఒక భావనను కల్పిస్తారు అదే దేహ భ్రాంతి అది అంత ఈజీగా అయితే పోదుచాల చాలా స్ట్రగుల్ అవుతుంది చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది అది కొంతమందికి ఒక క్షణం పాటులో జరగొచ్చు కొంతమందికి ఏళ్లపాటు జరగొచ్చు అది నువ్వు ఎంత పరిశీలన చేశవు అన్న దాన్ని బట్టి ఉంటుంది.
(01:44) మరి రమణ మహర్షికి ఈ ప్రశ్న ఎదురైనప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పారో చూద్దామా అయితే ఒకసారి రమణాశ్రమంలో రమణులు కూర్చొని ఉండగా ఒక వ్యక్తి వచ్చి అడిగారు భగవాన్ దేహ భ్రాంతి ఎలా పోతుంది అసలు అని అంటే రమణులు ఒకటే [గొంతు సవరించుకోవడం] మాట అంటారు దేహ భ్రాంతి పోవాలి అంటే ఆత్మ విచారణ ఒక్కటే మార్గం అంటే సెల్ఫ్ ఎంక్వైరీ నీకు నువ్వు ప్రతిదానికి ప్రశ్నించుకో దేనికి ప్రశ్నించాలి అంటే ఎవరో వచ్చి నిన్ను తిట్టారు నువ్వు బాధపడ్డావు ఎవరో వచ్చి నిన్ను పొగిడారు ఆ క్షణం నువ్వు సంతోషించావు.
(02:20) అప్పుడు నువ్వు ప్రశ్నించుకోవాల్సింది ఏందంటే ప్రశ్నించుకోవాల్సింది ఏంటి అంటే బాధపడుతున్నది ఎవరు ఆనంద పడుతున్నది ఎవరు ఈ బాధ నిద్రలో ఉండట్లేదే ఈ వచ్చిన ఆనందం పొగిడితే వచ్చిన ఆనందం నిద్రలో ఉండట్లేదే ఏది నిజం ఎవరు ఆనందపడుతున్నారు ఎవరు బాధపడుతున్నారు అనే ఒక ప్రశ్న వేసుకుంటే అప్పుడు నీకు దొరికే సమాధానం సాక్షి భావన అది కొంతమందికి ఒక రెప్పపాటు క్షణంలో తెలుస్తుంది కొంతమందికి ఏళ్లపాటు జరుగుతుంది కొంతమందికి జీవితకాలం జరుగుతుంది అది నువ్వు ఎంత దృఢంగా ఎంత రూఢంగా నువ్వు వేసుకున్నావు ప్రశ్న ఎంత గట్టిగా పట్టుకున్నావు అన్న దాన్ని బట్టి
(03:05) ఉంటుంది. ఎలా అయితే ఒక ఆవు పాలుకే ఆవు పాలు పితికేవాడు రెండు కాళ్ళ మధ్యన బింది పెట్టుకొని ఆవు పాలు పిండేటప్పుడు ఆ యొక్క ఆవు పాలు బిందెలోనే పడాలి అని చాలా జాగ్రత్తగా ఏకాగ్రతో పిండుతాడు అంత ఏకాగ్రతగా గమనిస్తే పరిశీలన చేస్తే నీకు దొరుకుతుంది ఆ సమాధానం ఏంటి ఈ శరీరం నేను కాదు ఈ ఇంద్రియాలు నేను కాదు ఈ మనసు నేను కాదు ఈ శరీరం ఒకరోజు పుట్టింది.
(03:35) అది కొన్ని రోజులు కొన్ని రోజుల తర్వాత పెరుగుతుంది ఆబవియస్లీ పెరుగుతుంది. అది ఒకరోజు చచ్చిపోతుంది ఈ శరీరం కానీ నేను అనే ఒక భావన ఉంది చూసావా సాక్షి భావన అది మెలుకువులో ఉంటుంది నిద్రలో ఉంటుంది అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ నిరంతర చైతన్యం ఏదైతే ఉందో ఈ నిరంతర ఆనందం నిరంతర సాక్షి భావన ఏదైతే ఉందో అది అసలు ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవడమే ఆత్మ విచారణ అది కచ్చితంగా ఉంది నిద్రలో ఉంది నిద్ర పోయాను సుఖంగా నిద్రపోయాను అంటున్నావా? అసలు నాకు నిద్రలో ఏమి తెలియదు అంటున్నావా? ఏమీ తెలియదు అన్నవాడు నిద్ర లేచిన వెంటనే సుఖంగా నిద్రపోయింది అని చెప్పాడంటే
(04:16) నిద్రపోతున్న వాడిని ఏమీ తెలియదన్న విషయం తెలుసుకొని నిద్రపోతున్న వాడిని సాక్షిగా చూస్తున్నది ఒకటి ఉంది కదా అదే నువ్వు అదే సాక్షి భావన అదే ఆత్మ అదే పరమాత్మ పేర్లు ఎన్నైనా పెట్టుకో ఒకటే బంగారం అండి గొలుసుగా చూసుకోవచ్చు ఉంగరంగా చూసుకోవచ్చు నడుముకు వడ్డానంగా చూసుకోవచ్చు ఒకటే బంగారం పేర్లు మారుతున్నాయి ఇది ఇది కూడా అంతే అయితే అసలు దేహభ్రాంత అనేది ఎందుకు వస్తుంది అనిఅంటే అహంకారం వల్ల వస్తుంది అంటాడు రమణ మహర్షి నేను ఈ శరీరం మాత్రమే నేను ఈ శరీరమా అనే ఒక ప్రశ్న వేసుకున్నారు అనుకోండి అది సాక్షి భావన వైపు నడిపిస్తుంది నేను ఈ శరీరం మాత్రమే అనే ఒక
(05:03) భావనను కలిగి ఉన్నారు అనుకోండి అది అహంకారాన్ని ఇస్తుంది. అహంకారమే దేహ భ్రాంతికి మూలం. ఈ అహంకారం ఎక్కడి నుంచి పుడుతుందో వెతికితే అది తిరిగి తన మూలమైన ఆత్మలో లీనమైపోతుంది. ఎలా అయితే రోజంతా సిటీ మొత్తం తిరిగే సిటీ బస్సు రాత్రి అయ్యేసరికి బస్ స్టాండ్ కి వచ్చి బస్ స్టాండ్ లో ఉంటుందో అలా ఆలోచనలు ఎంత తిరిగినా ఎన్ని దేశాల్లో తిరిగినా ఎంతమంది మనుషులతో తిరిగినా ఆలోచనలు నిద్ర వచ్చే సమయానికి రాత్రి నిద్రపోయే సమయానికి మాత్రం తన యొక్క సాక్షి భావన స్థితిలోకి వచ్చేస్తుంది.
(05:38) ఆ సాక్షి భావన స్థితిలోకి వచ్చేటప్పుడు నువ్వు గమనించు గమనిస్తే నీకు ఏం అర్థం అవుతుంది అంటే నేను ఆత్మను ఈ శరీరం కాదన్న విషయం అర్థమైపోతుంది అప్పుడు దేహబ్రాంతి సహజంగా తొలిగిపోతుంది. మరి దీని కోసం ఏమైనా సాధన చెయ్యాలా రమణ భగవాన్ అని అడిగితే రమణుడు ఒక మాట అంటారు. కేవలం ఆలోచనలతో మాత్రమే పోతుంది అంటే అది కుదరని పని అయ్యా నీ యొక్క మనసును అంతర్ముఖం చెయ్ అంతర్ముఖం చేసినప్పుడు నేను అనే స్పృహ ఎక్కడి నుంచి పుడుతుందో ఒకసారి చూడు ఎవరైనా వచ్చి నిన్ను తిట్టారు వెంటనే బాధపడుతున్నావ్ అసలు ఆ [గొంతు సవరించుకోవడం] బాధ ఎక్కడి నుంచి పుడుతుంది ఒక్కసారి చూడు ఇప్పుడు
(06:18) అదే మనిషి నిద్రలో పడుకొని ఉండగా ఒక మనిషి వచ్చి తిట్టాడు అదే మనిషిని కానీ అప్పుడు బాధపడటం లేదే మరి బాధ ఎక్కడో ఒక దగ్గర పుడుతుంది కదా లేకుండా అయితే లేదు కదా అది అది ఎక్కడ పుడుతుందో నువ్వు పరిశీలన చేస్తే నీకు అర్థంవుతుంది. అలా నిలకడగా చూస్తే అహంకారం అనేది పోతుంది. పోతుంది మనం సాక్షిగా చూడలేకపోతున్నాం నిశ్చలంగా ఉండలేకపోతున్నాం.
(06:47) వెంటనే రియాక్ట్ అవ్వాలి ఎవరైనా వచ్చి ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నాం వెంటనే రియాక్ట్ అయిపోతున్నాం. కానీ మనం మౌనంగా ఉంటే కొన్ని ప్రశ్నలు మనలో బయలుదేరుతాయి. మౌనంగా ఉంటే సాక్షి భావన అలవాటు పడుతుంది కానీ మనం మౌనంగా ఉండలేకపోతున్నాం. దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా అంటే ఆయన చెప్పింది ఒకటే నిన్ను నువ్వు ఆత్మను అని అనుకో లేదా భగవంతుడికి సమర్పించుకో నాదేమీ లేదు అంతా భగవంతుడిదే అని ఒక శరణాగతి చెయి అంటే తనను తాను ఆత్మకి లేదా భగవంతుడికి సమర్పించుకోవడం పూర్తిగా సరెండర్ ఆత్మ నివేదన నా జీవితంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా సమస్తము భగవంతుడిదే నాది ఏమాత్రం
(07:24) సంబంధం లేదు అంతా శివుడిదే అంతా శివుడిదే అన్నావు ఎప్పుడో నీ జీవితంలో కష్టం వచ్చినా నువ్వు శివుడి ఇవ్వాలి నష్టం వచ్చినా శివుడికి ఇవ్వాలి సుఖం వచ్చినా శివుడికి ఇవ్వాలి ఆనందం వచ్చిన శివుడికి ఇవ్వాలి నీ అకౌంట్ లో వేసుకున్నావా మళ్ళీ అక్కడ అహంకారం చుట్టుముట్టుకుంటుంది మిత్రమా నీదంటూ ఏమీ లేదు అంతా శివుడిదే అంతా ఆత్మదే అంతా ప్రకృతిదే అనే ఒక భావనతో ఉన్నప్పుడు పరిపూర్ణమైన శరణాగతి జరుగుతుంది.
(07:50) అక్కడ మాత్రమే నీకు నేను అనే సాక్షి భావన దొరుకుతుంది. అంతే కదండీ సూర్యుడు పొద్దున్నే ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో సూర్యుడు ఉదయించడాన్ని అస్తమించడాన్ని నువ్వు నిగ్రహిస్తున్నావా నువ్వు కంట్రోల్ చేస్తున్నావా సూర్యుని నువ్వు కంట్రోల్ చేయలేవు సూర్యుడు నుండి వచ్చే ఎండని కంట్రోల్ చేసుకోవడంలో నీ యొక్క నీ యొక్క ప్రమేయం ఉంది ఒక గొడుగు అడ్డు పెట్టుకో లేదా ఒక క్యాప్ పెట్టుకో అంతేగాని సూర్యుని నేను అడ్డుకుంటాను సూర్యున్ని నేను నిగ్రహిస్తాను అంటే అది జరగని పని అలా ఎప్పుడైతే నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకొని పూర్తిగా అంతా ప్రకృతికో
(08:29) లేకపోతే ఆత్మకో భగవంతుడికో సమర్పించుకుంటావో ఆ దృష్టికోణాన్ని మార్చుకుంటావో అప్పుడు మాత్రమే నీకు నేను అనే సాక్షి భావన దొరుకుతుంది అని చెప్తాడు రమణ మహర్షి అంటే రమణ మహర్షి నేను ఎవరు అనే ఒక అన్వేషణ ఎంక్వయిరీ ఎప్పుడైతే మనిషి చేస్తాడో అప్పుడే వాడు దేహభ్రాంతిని జయిస్తాడు అని చెప్పాడు శరీరం మనది కాదు మనం శరీరానికి కాదు అని నిరంతరం గుర్తు చేసుకో ఇప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను ఒక మాట అన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి దున్న పోతులా ఉన్నావ అని అన్నారు అనుకోండి తక్షణమే నువ్వు అప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వు నువ్వు కోతిలా ఉన్నావురా అని
(09:08) అనకుండా ఐ యమ నాట్ దిస్ బాడీ అంటే బయటికి అనకు లోపల చెప్పుకో ఐ యమ నాట్ దిస్ బాడీ ఐ నాట్ దిస్ మైండ్ ఐ నాట్ దిస్ థాట్ ఓకే ఐ యమ నాట్ దిస్ బాడీ నేను ఈ శరీరం కానప్పుడు వాడు ఈ శరీరాన్ని అన్నాడు నన్ను అనలేదు కదా అని ఒక మంత్రంలో నువ్వు దాన్ని చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు సాధారణంగా ఓం నమఃశివాయ అనో అరుణాచల శివానో శ్రీమాత్రే నమః అనో ఏదో ఒక నామాన్ని పెట్టుకుంటూ ఉంటావు కదా నిరంతరం భగవాన్ నామాన్ని అలా ఐ యమ నాట్ దిస్ బాడీ నేను ఈ శరీరం కాదు ఐ యమ్ నాట్ దిస్ మైండ్ నేను నీ మనసు కాదు అనే ఒక భావన నిరంతరం నీ మైండ్ లో రన్ చేసుకో నీ లోపల లోపలే నువ్వు నాలిక నోరు
(09:44) మూసుకొని నాలికలో ఆ నాలిక లోపల ఆడిస్తూ చెప్పుకో ఎవరైనా వచ్చి నిన్ను ఒక పొగిడిన తిట్టిన ఏం చేసినా నువ్వు లోపల అనుకో ఐ యమ్ నాట్ దిస్ బాడీ ఐ యమ్ నాట్ దిస్ మైండ్ నేను ఇది చేసిందే నేను చెప్తున్నాను. నేను ఇది చేస్తుంటా ఎందుకంటే YouTube లో ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా మంది నన్ను తిడుతుంటారు బయట నన్ను చాలా మంది పిచ్చోడు అంటారు.
(10:03) సాక్షి భావన ఏంట్రా ఆ మాట ఏంట్రా నువ్వేంట్రా స్థితి ఏంట్రా రమణ మహర్షి ఏంట్రా అంటారు. నేను ఏమి అనను నేను లోపల లోపల అదే అనుకుంటా ఐ యమ్ నాట్ దిస్ బాడీ నేను ఈ శరీరం కాదు కదా ఈ శరీరాన్ని నేను కానప్పుడు నన్ను ఏమేనా అంటే ఏంటి నాకేంటి అనే ఒక విషయం ఆ స్పష్టత వచ్చింది కాబట్టి ఆ నిరంతర ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఎవరైనా దేహ భ్రాంతి ఎలా జయించాలి అని అంటే నేను ఎవరు అని ఒక ప్రశ్న వేసుకోండి.
(10:32) నిరంతరం నేను ఈ శరీరం కాదు ఈ మనసు కాదు అనే ఒక మంత్రాన్ని పట్టుకొని నిరంతరం దాన్ని గుర్తు చేసుకోండి మననం చేసుకోండి చివరాకరికి ఈ శరీరం నేను కాదు అని సమస్తము నిండి ఉన్న ప్రకృతిని నేను సమస్తము నిండి ఉన్న ఆత్మను నేను అని ఒక శరణాగతి చేయండి భగవంతునికి శరణాగతి చేయండి ఆత్మకు శరణాగతి చేయండి ప్రకృతికి శరణాగతి చేయండి తద్వారా నువ్వు వెంటనే తక్షణమే సాక్షి భావాన్ని అనుభవిస్తావు ముక్తిని అనుభవిస్తావ్ మరి ఇదే దేహ భ్రాంతి గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా రమణ మహర్షి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడండి నాకు చాలా ఇష్టం ఈ ఎగ్జాంపుల్ ఒక ఒక గదిలో కుండ ఉందనుకోండి ఆ కుండ లోపల
(11:13) కొంత ఖాళీ అనేది ఉంటుంది కదా అంటే ఖాళీ కుండ పెట్టారు అనుకోండి ఆ కుండ లోపల ఖాళీ ఉంది దాన్ని మనం ఆకాశం అనుకుందాం ఎందుకు ఆకాశం కూడా ఖాళీగా ఉంటుంది. మరి ఆ కుండ పగిలిపోతే ఏమవుతుంది లోపల ఉన్న ఆకాశం బయట ఉన్న ఆకాశంతో కలిసిపోతుంది. మీకు ఇది ఇంకా అర్థం కాలేదు అనుకోండి ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ ఒక బెలూన్ ఉంది బెలూన్ లో గాలి ఉంది.
(11:34) మరి ప్రకృతిలో కూడా గాలి ఉంది కదా ఇప్పుడు ఈ బెలూన్ లో ఉన్న గాలిని నేను తీసేసాను అనుకోండి ఏమవుతుంది ఆ బెలూన్ లో ఉన్న గాలి ప్రకృతిలో కలిసిపోతుంది అలాగే ఈ శరీరం కూడా నడవడానికి నీ యొక్క ఆలోచనలు నడవడానికి నీ యొక్క మనసు నడవడానికి ఒక చైతన్యం అవసరం అవుతుంది ఒక ఎనర్జీ అవసరం అవుతుంది ఒక శక్తి అవసరం అవుతుంది పేర్లు ఏవైనా కావచ్చు పేర్లతో సంబంధం లేదు మిత్రమా పేర్లు ఏదైనా ఓకే చైతన్యం అంటావా కాన్షస్నెస్ అంటావా విట్నెస్ అంటావా ఏదైనా ఓకే అది అవసరమవుతుంది అది నడిపిస్తుంది అది ఎప్పుడైతే ఈ శరీరం పడిపోతుందో అది ఈ ప్రకృతిలో ఉన్న కాన్షనస్ తో సాక్షి భావంతో
(12:10) కలిసిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సమస్తము ఉన్నావు అంతటా ఉన్నావు భగవంతుడు ఎలా అయితే విశ్వం విష్ణువు విశ్వమంతా ఉన్నాడో నువ్వు కూడా విశ్వమంతా ఉన్నావు అంటే విష్ణువు వేరు నువ్వు వేరు కాదు శివుడు వేరు నువ్వు వేరు కాదు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఇదే కాబట్టి ఈ కుండ ఆకాశం ఒక బిలు గాలి ఈ ఎగ్జాంపుల్ మీరు పట్టుకుంటే నాకు తెలుసు మీరు గట్టి ఎక్కేయచ్చు సో రమణుల ఉద్దేశంలో నువ్వు ఈ శరీరం అనే పరిమితమైన వస్తువు మాత్రం కాదు ఎందుకంటే శరీరం అన్నాక ఒక పరిమితులు ఉంటాయండి ఒకప్పుడు పుడతావ్ ఒకప్పుడు చనిపోతావ్ ఈ మధ్యలో కష్టాలు అంటావ్ సుఖాలు
(12:52) అంటావ్ బాధలు అంటావ్ బంధాలు అంటావ్ బరువులు అంటావ్ అవి నువ్వు తగిలించుకున్నావా లేకపోతే వాటంతట వచ్చి పడ్డాయా ఒక్కసారి ప్రశ్నించుకో రోజుకి కొన్ని కోట్ల ఆలోచనలు వస్తున్నాయి ప్రతి ఆలోచన నిన్ను బాధ పెట్టట్లేదు ఒకటో రెండో ఆలోచనలే నిన్ను బాధ పెడుతున్నాయి నిజమా కాదా ప్రశ్నించుకో ఆ ఒకటి రెండు ఆలోచనలు కూడా ఎందుకు బాధ పెడుతున్నాయి ప్రశ్న వేసుకో సమాధానం దొరుకుతుంది ఒక రోజు కాదు 10 రోజులు కాదు ఒక సంవత్సరం తర్వాత దొరుకుతుంది కంగారు ఏముంది కాబట్టి ఇదే దేహ భ్రాంతి మళ్ళీ ఎలా పోతుంది అనడానికి ఓషో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి
(13:30) అంటే ఓషో దృష్టిలో దేహబ్రాంతి ఎలా పోతుంది అని అంటే ఇదే ప్రశ్న ఒకసారి షోని అడిగినప్పుడు ఓషో ఒక మాట అంటాడు నీ శ్వాసను నీ యొక్క కదలికలను అంటే నీ యొక్క బాడీ మూమెంట్స్ వాటన్నిటిని కూడా ప్రతిక్షణం గమనించు పరిగెత్తేటప్పుడు గాని కూర్చునేటప్పుడు గాని పడుకునేటప్పుడు గాని నీ యొక్క శ్వాసను నీ యొక్క బాడీ మూమెంట్స్ నీ యొక్క హ్యాండ్ మూమెంట్స్ నీ యొక్క లెగ్ మూమెంట్స్ ప్రతిదాన్ని గమనించు అప్పుడు గమనిస్తే నీకు అర్థమయ్యేది ఏంటంటే నువ్వు ఈ శరీరం లోపల ఉన్న ఒక అతిధివి అంటే ఒక చిన్న టూరిస్ట్ గైడ్ లాంటి వాడివి ఎప్పుడైతే మీరు శరీరం నుండి వేరుగా ఒక సాక్షిగా
(14:16) ఉండడం మొదలు పెడతారో అప్పుడు మీకు ఈ శరీరం ఒక బట్టలా కనిపిస్తుంది. ఒక క్లాత్ దుస్తులు అయితే మీరు కాదు కదా మీరు వేసుకున్న దుస్తులు మీరు కాదు కదా అలా ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదని ఒక భావన నీకు కలుగుతుంది అంటే అక్కడ రమణ మహర్షి అయినా ఇక్కడ ఓషో అయినా చెప్పేది ఒక్కటే అండి అక్కడ రమణ మహర్షి నువ్వు ఆత్మవు అన్నాడు ఇక్కడ ఓషో నువ్వు సాక్షి భావన నువ్వు సాక్షివి విట్నెస్ వి అన్నాడు నువ్వు కాన్షస్నెస్ వి అన్నాడు పేర్లు మారొచ్చు భాషలు మారొచ్చు నేను తల కొట్టుకొని చెప్పేది అదే భాషలో పడిపో పోయి మోసపోకండి నిద్రలో ఏ భాష ఉండదు. ఆకలికి ఏ భాష ఉండదు.
(15:02) ఆకలి నింపే పదార్థాలకి భాష ఉంటుందేమో ఆకలికి ఏ భాష ఉండదు ఇడ్లీని ఇక్కడ ఒకలాగా అంటారు హిందీలో ఒకలాగా అంటారు కన్నడాలో ఒకలా అంటారు కానీ ఆ ఆకలి తినేటప్పుడు ఆ ఇడ్లీ తినేటప్పుడు కడుపు నిండుతుంది చూసావా దానికి ఏ భాష ఉండదు ఆకలికి నిద్రకి ఏ భాష ఉండదు ఆ స్థితిని అనుభవించడంలో ఏ భాష ఉండదు దానికి కావలసిన పదార్థాలు కావడంలో ఏదో ఒక భాష ఉంటుంది తప్ప ఆ స్థితికి ఏ భాష ఉండదండి జస్ట్ జస్ట్ మీరు అనుభవించడం ఉంటుంది అంతే ఓషో ప్రకారం ఎప్పుడైతే సాక్షిగా నువ్వు చూడడం మొదలు పెడతావో ఈ క్షణం ఈ స్థితిని నువ్వు పరిపూర్ణంగా అనుభవిస్తావ్ నీకు భవిష్యత్తు ఉండదు గతము
(15:46) ఉండదు కేవలం వర్తమానం మాత్రమే ఉంటుంది సాక్షి భావాన్ని అనుభవించిన వాడికి పరిపూర్ణంగా నేను అనే అహంకారం పోతుంది అహంకారం ఎప్పుడైతే పోయిందో నేను ఈ శరీరం అనే భ్రమ ఉండదు. అద్భుతమైన ఒక డాన్స్ చూసినప్పుడు గాని గాఢమైన నిద్రలో గాని గాఢమైన ధ్యానంలో గాని మనం ఈ శరీరం అనే విషయాన్ని మర్చిపోతామండి అలాంటి మర్చిపోయి ఈ శరీరంఅనే ఈ శరీరం నేను మర్చిపోయే ఒక విషయాన్ని మెలుకువ వచ్చిన మెలుకువలోకి వచ్చేటప్పటికి మాత్రం ఈ శరీరమే నేను అంటున్నావే ఇది ఏమన్నా న్యాయమా చెప్పు మిత్రం కాబట్టి నిద్రలో ఏదైతే నువ్వు ఆ స్థితిని అనుభవిస్తున్నావో ఒక ప్రకృతి దృశ్యాన్ని అందమైన ప్రకృతి
(16:27) దృశ్యాన్ని చూసిన నప్పుడు నువ్వు ఏ అనుభూతిని అనుభవిస్తున్నావో ఆ క్షణాలే నీకు నిజమైన స్వేచ్ఛని ఇస్తాయి అది గుర్తుపెట్టుకో అలాగే ఒకరోజు ఓషో అమెరికా నుంచి ఇండియా వచ్చినప్పుడు ఇండియాలో అక్కడ ఉన్న కార్ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ వాళ్ళ యొక్క యూనియన్స్ ఉంటాయి కదా ఆ యూనియన్స్ తో కలిసి ఒకరోజు కూర్చున్నాడు.
(16:50) కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా ఒక ప్రశ్న వేశారు. భగవాన్ ఈ శరీరం నేను కాదని ఎలా తెలుసుకోవాలి అంటే ఈ దేహ భ్రాంతి ఎలా పోతుంది అనే ప్రశ్న ప్రశ్న కొద్దిగా మారింది అంతే అడిగితే వాళ్ళు ఆటో డ్రైవర్స్ కార్ డ్రైవర్స్ కదా వాళ్ళకి ఎలా ఇచ్చాడంటే ఎగ్జాంపుల్ ఒక కార్ డ్రైవర్ మీరందరూ కార్లు డ్రైవ్ చేస్తుంటారు కదా ఒక కార్ డ్రైవర్ కార్ పాడైపోయింది అనుకోండి ఉన్న ఫలంగా బాధ పెడతాడు కానీ నేను కార్ని కాదు కదా అనే విషయం ఒక స్పష్టంగా తెలుసుకని ఉంటాడు కదా అలా అలాగే ఈ శరీరం కూడా ఒక వాహనం లాంటిది.
(17:27) దీని ద్వారా మనం ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్ని, వస్తువుల్ని అన్నిటిని అనుభవిస్తున్నాం. నేను ఈ శరీరం ఈ బాడీ కాదు ఈ వాహనం కాదు వాహనాన్ని నడిపే చైతన్యాన్ని కాన్షస్నెస్ అని తెలుసుకో అంటాడు. అంతే కదండీ ఇప్పుడు కార్ లో ఉన్న పైన ఉన్న స్పేర్ పార్ట్స్ అయితే కార్ కాదు కదా కార్ కార్ కార్ లో ఏం నడవాలి అంటే కార్లో ఉన్న ఇంజిన్ కి ఒక హార్స్ పవర్ ఉంటుంది అది నడవాలి అదే చైతన్యం అంటాడు దాన్నే కాన్షస్నెస్ అన్నాడు ఓషో పేరు ఏదైనా పెట్టుకోండి అది నడిపిస్తుంది అలాగే ఈ శరీరం నువ్వు కాదు ఎలా అయితే కార్ ఈ స్పేర్ పార్ట్స్ పైనఉన్న స్పేర్ పార్ట్స్
(18:04) సీట్ బెల్ట్ డెక్ అవి అవి కారు కాదో అవి కారు నడిపించవో ఎలా అయితే లోపల ఉన్న ఇంజిన్ లో ఉన్న హార్స్ పవర్ నడిపిస్తుందో ఆ ఎనర్జీ నడిపిస్తుందో అలాగే ఈ శరీరం కూడా నువ్వు కాదు ఈ శరీరం లోపల ఉన్న ఒక చైతన్యం నువ్వు ఒక కాన్షస్నెస్ నువ్వు అది నిన్ను నడిపిస్తుంది. నువ్వు దాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యి దాని కోసం ఏమి చేయకు సాక్షిగా చూడు.
(18:29) దీని కోసం ఓషో డైనమిక్ మెడిటేషన్ కూడా తీసుకొచ్చిరండి. అంటే ఎప్పుడైతే మీరు మీ శరీరాన్ని విపరీతంగా కదిలించి అంటే పరిగట్టడమో ఏదైనా ఒక పని గట్టిగా చేయడమో చేసినప్పుడు శరీరం కాస్త అలసటకు గురవుతుంది. అంత అలసటకు గురైన శరీరాన్ని ఒక్కసారిగా ఉన్న ఫలంగా మీరు ఆపితే మీలో రెస్ట్ అనేది అలాగ పై నుండి కింద వరకు అలా జరుగుతుంది అంటే నేను ఇది ప్రాక్టికల్ గా చేసి చూశానండి అంటే సముద్రంలో పరిగెట్టా సముద్రపు ఒడ్డున ఇసక తిన్నెలు నేను పరిగెట్టడం మొదలు పెట్టా వేగంగా పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టి ఉన్నఫలంగా ఆగిపోయి సముద్రంలో ఆ ఒడ్డున అలా పడుకున్న బోరల మెల్లగా ఊపిరి మెల్లగా
(19:10) తగ్గుతుంది ఆ స్పీడ్ అనేది ఊపిరి యొక్క స్పీడ్ అనేది మెల్లగా తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు ఒక నిశశబ్దం అనేది ఏర్పడుతుంది నీలో చెవులు మూసుకొని అంటే కళ్ళు మూసుకొని చెవులు అలా ఓపెన్ చేసి విన్నప్పుడు ఒక సౌండ్ మీకు వినిపిస్తుంది మెల్లగా బ్రీత్ తగ్గుతుంది. ఆ నిశశబ్దంలో మీకు ఒక విషయం అర్థమవుతుంది. లోపల ఒక ఎనర్జీ ఏదో ఉంది అది చాలా కాన్షియస్నెస్ గా నన్ను చూస్తుంది నన్ను అబ్సర్వ్ చేస్తుంది సమస్త ప్రపంచాన్ని అబ్సర్వ్ చేస్తుంది అన్న విషయం మీకు అర్థమవుతుంది.
(19:40) ఆ నిశ్శబ్దంలో మీరు మీ శరీరం కాదని ఒక అనుభవం వస్తుందండి అది అనుభవిస్తే తెలుస్తుందా అండి నేను ఒకటే విషయం చెప్తానండి ఇప్పుడు నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు వాడు బాగా చైన్ స్మోకర్ అంటే సిగరెట్లు ఎక్కువ తాగుతాడు నేను వాడికి వెళ్లి అడిగేవాడిని అరే నువ్వు దీని వల్ల ఏమ వస్తుంది రా మామా ఎప్పుడు సిగరెట్లు తాగుతున్నావు కదా అని అడిగితే వాడు ఒక మాట అన్నాడు మామ దీంట్లో ఎంత ఆనందం ఉందో నీకేం తెలుసు మామ అన్నాడు అది నిజమే కదా ఇప్పుడు వాడు సిగరెట్లు తాగుతున్నాడు అండి వాడికి తెలిసి దాంట్లో ఎంత ఆనందం వస్తుందో నాకు ఎట్లా తెలుస్తుంది నేను తాగడం లేదు కదా కాబట్టి దాంట్లో ఉన్న ఆనందం ఏంటో నాకు
(20:10) తెలియదు అది మంచిదా చెడ్డదా అవన్నీ పక్కన పెట్టేయండి. దాంట్లో ఉన్న ఆనందం ఏంటో నాకు తెలియదు ఎందుకంటే నేను తాగడం లేదు సిగరెట్ వాడు తాగుతున్నాడు కాబట్టి వాడికి ఆనందం తెలుసు అలాగే రమణులు ఓషో వీళ్ళందరూ కూడా సాక్షి భావన అనుభవించిన వాళ్ళు దాంట్లో ఉన్న ఆనందం ఏంటో వాళ్ళు అనుభవించారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఒక ఏడాది కిందట నేను ఒక ఏడాది కిందటగా నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు తెలుసు అంతకుముందు 29 సంవత్సరాలు నాకు తెలియదు.
(20:36) కాబట్టి ఏదైనా అనుభవిస్తేనే కదా తెలిసేది అనుభవించాలంటే ప్రశ్నించుకోవాలి నిన్ను నువ్వు నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి అలా చేసుకుంటే నీకు ఖచ్చితంగా అర్థంవుతుంది. రమణ మహర్షికి ఓషో కి ఉన్న తేడా ఒకటేనండి సింపుల్ గా అంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు చెప్పిన సంభాషణలు నేను చెప్పాను కదా రమణ మహర్షి నేను ఈ శరీరాన్ని కాదు అని ఒక విచారణ చేసుకుంటే ఆత్మ విచారణ చేసుకుంటే నువ్వు ఒక సాక్షి భావనవి అన్న విషయం నీకు అర్థం అవుతుంది.
(21:04) ఓసో శరీరాన్ని అంగీకరించు పూర్తిగా స్వీకరించు కానీ సాక్షిగా ఉండు విట్నెస్ గా కాన్షస్నెస్ గా చూస్తూ ఉండు అప్పుడు నువ్వు శరీరం కంటే వేరే అని నీకే అర్థమవుతుంది. ఇద్దరు చెప్పింది ఒకటే కాకపోతే ఆయన వేరేగా చెప్పారు ఈయన వేరేగా చెప్పారు. కానీ ఇద్దరిలో ఇద్దరి యొక్క మూలం ఒక్కటే మరి ఇదే ప్రశ్న శంకరాచార్యుల వారికి అడిగితే శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే అంటే తోటకాచార్యుల వారు ఒకరోజు స్నానం చేసి శంకరాచార్యుల వారు ముందుకు వచ్చి కూర్చొని పద్మాసనం వేసుకొని గురుదేవా దేహ భ్రాంతి ఎలా పోతుందని శంకరాచార్యుల వారిని అడుగుతాడు తోటకాచాల వారు అడిగితే శంకరులు ఒక ఉదాహరణ చెప్తారండి కలలో మనం
(21:46) పడుకునేటప్పుడు కల వస్తుంది ఆ కలలో మనం ఒక రాజుగా ఉంటాం కాసేపు కాసేపు ఒక బిచ్చగాడిగా ఉంటావ్ అంటే రాజుగా ఉన్నప్పుడు ఆ శరీరంతో సుఖాలు అనుభవించింది నువ్వే కలలో బిచ్చగాడిగా ఉన్నప్పుడు ఏమీ లేకుండా రోడ్డు మీద పడి అడుక్కు తిన్నది నువ్వే అంటే కష్టము సుఖము అన్ని ఉంటాయి కలలో మెలకువ రాగానే సడన్ గా ఆ కలతో నీకు బంధం తెగిపోతుంది సంబంధం పోతుంది అలాగే ఈ జగత్తు కూడా ఈ ప్రపంచం కూడా ఈ శరీరం కూడా ఒక పెద్ద దీర్ఘకాలపు కల అంటే ఒక లాంగ్ పీరియడ్ డ్రీమ్ నిద్ర అనేది ఒక ఐదు గంటలు ఆరు గంటలు నిద్ర అందులో కల అనేది ఒక గంట రెండు గంటలు ఉంటుంది.
(22:32) ఇప్పుడు మెలకోలు నువ్వు అనుభవిస్తున్న స్థితి ఉంది చూసావా ఇదిఒక 50 సంవత్సరాల కాలం అంతే తేడా అంతకుమించి ఏమీ లేదని చెప్పాడు అంతే అంటే శంకరాచార్యుల వారి దృష్టిలో జ్ఞానోదయం కావడం అంటే మెలుకువ మెలుకువ రావడం ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు ఈ ఆలోచన నేను కాదు అని ఒక మెలుకవలోకి రావడం అంతేగాని పడుకున్నవాడు లేచి రావడం కాదు ఆ స్థితిలో ఈ దేహం మనం కట్టుకున్న ఒక బట్టలో చూస్తామండి అది ఆ సాక్షి భావం అనుభవించిన వాడికి తెలుస్తుందా అండి చెప్తే ఎలా తెలుస్తుంది చెప్పండి అంటే శంకరులు కేవలం ఉదాహరణలే కాదండి ఒక పద్ధతిని కూడా చూపించారు ఈ ప్రపంచానికి ఈ
(23:15) దేహ భ్రాంతి ఎలా పోతుంది అనేదానికి ఒకటి శ్రవణం అంటే మనకు భక్తి మార్గంలో తొమ్మిది పద్ధతులు ఉన్నాయి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సక్యం ఆత్మనివేదనం అనే తొమ్మిది మార్గాలు ఉన్నాయి ఇందులో శ్రవణం అనేది చాలా గొప్పది అంటే ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు ముందు జాగ్రత్తగా విను అది గురువే కావాల్సిన అవసరం లేదు ఎవరు చెప్పినా విను అది నిజమా కాదా అనే విషయం అది నీకు సంబంధించిందా నీకు సంబంధించదా అనే విషయం నీకు నువ్వు ప్రశ్నించుకో ఎంక్వైరీ చేసుకో అది గురువు దగ్గరైనా పర్వాలేదు ఎవరి దగ్గరైనా పర్వాలేదు ఆత్మ విచారణ చేసుకో
(23:54) అంటే ముందు జాగ్రత్తగా విను మాట్లాడే ప్రయత్నం చేయకు ఎవరైనా చెప్తే జాగ్రత్తగా విను మాట్లాడకపోయినా పర్వాలేదు మౌనంగా వినడం మాత్రం నేర్చుకో అన్నాడు అలాగే మనం ఎప్పుడూ కూడా ఎవరైనా ఒక మాట అన్నా అది పొగిడినా తిట్టిన ఏమి చేసినా సరే లోలోపల ఈ శరీరం నేను కాదు ఈ ఆలోచన నేను కాదు ఈ మనసు నేను కాదు అనే ఒక మంత్రాన్ని నిరంతరం జపించు అని చెప్పాడు.
(24:20) మూడోది నిరంతరం కూడా అహం బ్రహ్మాస్మి అంటే నేను ఈ దేహాన్ని కాదు నేను శుద్ధ చైతన్యాన్ని అని నీకు నువ్వు అనుసంధానం చేసుకో ఇది నిదిసన అంటారండి. సో ఇది దేహబ్రాంతి ఎలా పోతుంది అనే ఒక ప్రశ్నకి రమణ మహర్షి ఓషో శంకరాచార్యుల వారు ఇచ్చిన సమాధానం. ఎవ్వరు చెప్పినా అదేనండి ఇంకా చాలామంది చెప్పిన నేను చెప్పొచ్చు కృష్ణుడు ఏం చెప్పాడో చెప్పొచ్చు రాముడు ఏం చెప్పాడో చెప్పొచ్చు శివుడు ఏం చెప్పాడో చెప్పొచ్చు ఎన్నైనా నేను చెప్పొచ్చు ఎగ్జాంపుల్స్ ఎన్నైనా ఉండని పేర్లు మారుతాయి నేను అదే చెప్తున్నా రమణ మహర్షి కుండను పెట్టుకొని ఎగ్జాంపుల్ గా చెప్పాడు ఓషో ఒక కార్ని
(25:01) పెట్టుకొని ఎగ్జాంపుల్ గా చెప్పాడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ మారుతాయి భాష మారుతుంది కానీ పడుకునేటప్పుడు అందరి యొక్క నిద్ర ఒకటే అందరూ అనుభవించే సాక్షి భావన ఒక్కటే దాన్ని గుర్తిస్తే సరిపోతుంది అంటున్నా దానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు నా అనుభవం ప్రకారం చెప్పాలంటే నేను చేసింది కేవలం పరిశీలన మాత్రమే ఎవరైనా ఒకప్పుడు నన్ను ఏదైనా ఒక మాట అంటే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యేవాడిని నేను మాట పడడం ఏంటి చ నన్ననే అంత వాడా అనే ఒక ధారణ ఉండేది ఇప్పుడు అట్లా కాదు ఎవరు ఎన్ని మాటలు అన్నా వింట మౌనంగా వింటా వాడు తిట్టనే బండ బూతులు మాట్లాడనే నన్ను పొగడనే
(25:37) ఆకాశానికి ఎత్తేనే నన్ను వింట వింటూ ఉంటా చివరాఖరిగా నాకు అర్థమైంది ఏంటంటే వాడు పొగిడేది నా మాటల్నే వాడు తిట్టేది కూడా నా మాటల్నే నా స్థితిని అయితే కాదు ఎందుకంటే నా స్థితి వాడికి తెలియదు కాబట్టి నా స్థితి నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఈ విషయం నాకు అర్థమైంది ఇది కేవలం పరిశీలన మౌనంగా ఉండి పరిశీలన చేస్తే నాకు అర్థమైన విషయం ఇది మీరు నమ్మండి నమ్మకపోండి నాకు అనవసరం ఎందుకంటే నా స్థితిని నేను అనుభవిస్తుంటాను మీ స్థితిని మీరు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి దేహబ్రాంతి ఎలా పోతుంది అని అంటే రమణ మహర్షి నేను ఎవరు అనే ప్రశ్న వేసుకోమన్నాడు అది పొగిడినా తిట్టినా
(26:18) బాధపడిన ఏ పరిస్థితుల్లో అయినా నేను ఎవరు ఆ బాధపడుతుంది ఎవరు ఆనంద పడుతుంది ఎవరు అని ఒక ప్రశ్న వేసుకోమన్నాడు శరణాగతి చేయమన్నాడు. అదే ఓషో సాక్షిగా చూడు విట్నెస్ గా చూడు కాన్షస్నెస్ గా చూడు అన్నాడు. అదే శంకరాచార్యులు వారు అహం బ్రహ్మాస్మి నువ్వు అంతటా ఉన్నవాడివి అని చెప్పేసాడు. నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను అనుభవించిన విషయం ఏంటంటే నిరంతరం పరిశీలన చేయి మౌనంగా ఉండు పరిశీలన చెయి ఇమ్మీడియట్ గా రియాక్ట్ కాకు దేనికి కూడా ఇమ్మీడియట్ గా రియాక్ట్ కాకు పోయేదేదో పోతుంది వచ్చేదేదో వస్తుంది ఇట్ డంట్ మటర్ సాక్షి భావను ఒక్కసారి నీకు
(26:58) గుర్తించగలిగితే అది నిరంతరం ఉంటుంది. నన్ను నమ్మండి నమ్మండి అని నన్ను తెలుసుకోండి కాబట్టి ఈ దేహ భ్రాంతి ఎలా పోతుంది అనే ఒక ప్రశ్నకు మీ అందరికీ సమాధానం దొరికింది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రమణ మహర్షి ఏం చెప్పాడో ఊషో ఏం చెప్పాడు శంకరాచార్యుల వారు ఏం చెప్పారో అదే స్థితి నాలో ఉంది మీలో ఉంది అన్న విషయాన్ని గుర్తించి దేహ భ్రాంతిని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ అజ్జు వైపల్లి

No comments:

Post a Comment