Monday, June 15, 2026

 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀```

నరనరానా జీర్ణించుకున్న…```

                    *దేశభక్తి..!*
         ➖➖➖✍️

*ఒక లాయరు నలభై ఆరు మంది దోషుల్ని ఉరిశిక్ష నుండి విడుదల చేయించాలని కోర్టులో సీరియస్‌గా వాదిస్తున్నారు.

*లాయర్‌గారి అసిస్టెంట్‌ చిన్న చీటీ తీసుకొచ్చి ఇచ్చాడు.

*అది చూసుకుని...లాయర్‌ గారు దాన్ని జేబులో పెట్టుకుని, తన వాదన కొనసాగించారు.

*ఇంతలో లంచ్‌టైం అయ్యింది.

*”వాదిస్తుండగా మధ్యలో వచ్చిన చీటీ ఏమిట”ని న్యాయమూర్తి లాయర్‌ను అడిగాడు.

*“నా భార్య చనిపోయింది జడ్జి గారూ...”  అని చెప్పాడు లాయరు దీనంగా.

*జడ్జి గారు ఆశ్చర్యపోయి.. “ఇంకా ఇక్కడేం చేస్తున్నారూ? ముందు వెళ్ళండి. ఇంటికి వెళ్ళండి!” అని అరిచినంత పనిచేశాడు జడ్జి.

*“అయ్యా! నేను వెళ్ళి నా భార్య ప్రాణాలు తీసుకురాలేను. ఇక్కడ ఉండి వాదించి, నలభై ఆరు మందిని ఉరిశిక్ష నుండి రక్షించగలనేమో కదా?” అని అన్నాడు లాయర్‌ ఆశగా.

*అది విన్న బ్రిటిష్‌ జడ్జి నలభై ఆరు మందిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

*ఆ నలభై ఆరు మంది స్వాతంత్య్ర సమరయోధులు!

*ఆ లాయరు మరెవరో కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్!

*ఈ స్థాయి దేశభక్తి ఉంటుందని నేటి ఈ కాలపు ఈ దేశభక్తులకు కనీసం అర్థమవుతుందా?

*ఏమో? అనుమానమే.

*సర్దార్ వల్లభాయ్ పటేల్ సాక్షిగా ఆలోచనాపరులు మొదలు పెట్టిన శాంతి ఉద్యమ కాగడాను ప్రజలు అంది పుచ్చుకోవాల్సి ఉంది.✍️```
              🇮🇳జైహింద్🇮🇳
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
        🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment