Sunday, June 14, 2026

 *• అమృత తుల్యం... కొబ్బరిపాలు!*
*🌱ప్రీతి హెల్త్ కేర్ టిప్స్🌿*. *🫛కొబ్బరి..పాలతో*.... ఎన్నో ఉపయోగాలు.......పోషకాల గని అయితే, కొబ్బరిపాలు... అమృత తుల్యమైనవి. వాటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోగలిగితే ప్రయోజనాలు బోలెడని పరిశోధనలు చెబుతున్నాయి.
*చర్మానికీ*...
🌲కొబ్బరిపాలలోని ఫ్యాటీ యాసిడ్లు చర్మానికి తేమనందించి, నిగనిగలాడేలా చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్‌ చర్మంపై మృతకణాలను తొలగిస్తాయి. ముడతలు, మచ్చలు తగ్గించి, యవ్వన చర్మాన్నిస్తాయి. యాక్నే, ఎగ్జిమా, సొరియాసిస్‌... వంటివీ తగ్గిస్తాయి. అంతేకాదు, ఆలివ్‌నూనె, కొబ్బరిపాలను 2:1 నిష్పత్తిలో కలిపి మేకప్‌ రిమూవర్‌గానూ వాడుకోవచ్చు.
*కురులకీ*........
🥦పొడిబారిన కురులకు కొబ్బరిపాలు తేమనందిస్తాయి. దీన్లోని విటమిన్లు, ఖనిజాలు, కెరటిన్‌ వంటివి కుదుళ్లను దృఢపరుస్తాయి. ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు దెబ్బతిన్న కురులను బాగుచేస్తాయి. అందుకే, వీటిని షాంపూతో కలిపి సహజ కండిషనర్‌లానూ వాడుకోవచ్చు.
బరువు నియంత్రణకూ...
☘️కొబ్బరిపాలలో మీడియం -చైన్‌ ట్రైగ్లిజరాయిడ్స్‌ అనే శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. ఇవి మెటబాలిజాన్ని మెరుగుపరిచి... బరువు అదుపులో ఉండేలా చేస్తాయి. కొబ్బరి పాలు షుగర్‌ లెవెల్‌ను నియంత్రిస్తాయి. కొవ్వుని కరిగిస్తాయి. రోగనిరోధకతను పెంచుతాయి. ఎముకలకు బలాన్నీ ఇస్తాయి. వీటిలోని శాచ్యురేటెడ్‌ ఫ్యాట్‌లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గిస్తాయి.
*తల్లిపాల ఉత్పత్తికీ*...
🌱కొబ్బరిపాలలోని విటమిన్లు, ఖనిజాలు ప్రెగ్నెన్సీలో పిండం ఎదుగుదలకు సాయపడతాయి. వీటిల్లోని లారిక్‌ యాసిడ్‌ తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది. గర్భధారణ సమయంలో వచ్చే కీళ్ల నొప్పులనూ, రక్తహీనతలను తగ్గిస్తాయి. అయితే, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, అవసరమైనంతే వాడుకోవాలి.
ఇలానూ వాడుకోవచ్చు...
🌿కాఫీ, స్మూతీ, ప్రొటీన్‌ షేక్, ఓట్‌మీల్, సెరియల్స్‌ లాంటి వాటిలో వీటిని కలుపుకోవచ్చు. బెర్రీలు, బొప్పాయి... లాంటి పండ్ల ముక్కలపైన చల్లుకోవచ్చు. మలేసియన్‌ కొబ్బరిపాలలో ఆవు, మేక పాలల్లో కంటే అధికంగా యాంటీ ఆక్సిడెంట్ల ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిలోని ఫినోలిక్‌ పదార్థం... ఒత్తిడి వల్ల శరీరంలోని ప్రొటీన్, డీఎన్‌ఏ, లిపిడ్‌లు పాడైపోకుండా కాపాడుతుందట.
ఇవీ చూద్దాం!
☘️బయటకొనే వాటిపై లేబుల్‌ చెక్‌ చేసుకోవాలి. బీపీఏ ఫ్రీ ఉన్నవీ, కేవలం కొబ్బరి, నీళ్లు మాత్రమే ఉన్నవీ ఎంచుకుంటే మేలు.
ఎలాంటి చక్కెరలూ కలపకుండా ఉండే కార్టాన్లను ఎంచుకోవాలి. తక్కువ కెలొరీలు ఉండాలంటే పలుచగా ఉండే, లైట్‌ క్యాన్‌డ్‌ కొబ్బరిపాలను ఎంచుకోవచ్చు.
ఇవేవీ వద్దనుకుంటే... తాజా కొబ్బరిపాలను ఇంట్లోనే తయారుచేసుకుంటే ఇంకా మంచిది. కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టి, రెండు కప్పుల పాలకు నాలుగు కప్పుల నీళ్లను కలిపేసి వడకట్టుకుంటే చాలు. తాజా కొబ్బరిపాలు తయారవుతాయి.ఎల్లప్పుడూ మీ ఆయురారోగ్యాలను కోరుకునే *ప్రీతి హెల్త్ కేర్*🥦విశాఖపట్నం

No comments:

Post a Comment