శక్తిపాతం రహస్యం | How a Guru Transfers Divine Energy
Author Name:సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%95%E0%B0%AE%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5
Youtube Video URL:https://www.youtube.com/watch?v=r4fvL-xRc0Q
Transcript:
(00:23) [సంగీతం] శ్రీ గురుభ్యో నమః సింహి అపరాజిత మహా మంత్రాలయానికి స్వాగతం అహం కమలానందనాథ శక్తిపాతం ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం అన్నమాట వేరేవాళ్ళకి అందించడం తనను ఆశ్రయించిన వాళ్ళు తీవ్రంగా కష్టపడక్కర్లేకుండా తాను సముపార్జన చేసుకున్నటువంటి చైతన్యాన్ని శిష్యులకు అప్పచెప్పేటువంటి పద్ధతి కింద లేదా ఆపదలో ఉన్నవారికి అప్పచెప్పేటువంటి పద్ధతి కింద శక్తిపాతాన్ని ఉదాహరిస్తారు శక్తిపాతం అంటే ఇప్పుడు నేను కొంత ధనాన్ని సంపాదించాను ఎవరో ధనం కోసం నన్ను ఆశ్రయించారు చాలా ఇబ్బందుల్లో ఉన్నానుని నేను ఏం చేస్తాను అంటే దాంట్లోనుంచి కొంత లెక్కపెట్టి నేను
(01:05) ఎంతవరకు ఇస్తే నాకు ఇబ్బంది లేకుండా ఉంటుందో అది వాళ్ళకి అప్ప చెబుతారు. ఇక ధనం లౌకికమైన అంశాల్లో అయితే అది తిరిగి వస్తుందా రాదా అనేదానికి చెప్పొచ్చు శక్తిపాతం అనే దాంట్లో మాత్రం ఒకసారి ఇస్తే గనుక మళ్ళీ వెనక్కి రావడం అనేది జరగదుఅన్నమాట. ఇక నేను ధనాన్ని ఇచ్చాను దాంతో అతడు తన సమస్యలు తీర్చుకుంటాడు. అలాగే శాస్త్రజ్ఞానంలో కూడా వ్యక్తిగతంగా ప్రేరణ చేస్తూ తీవ్రమైనటువంటి సాధనలు చేసి దాని వల్ల సముపార్జన చేసినటువంటి శక్తి ఏదైతే ఉందో దానితో సమానమైనటువంటి ఫలితాన్ని గురువుగారు ప్రియ శిష్యుడికి ఇవ్వగలుగుతారు. శిష్యుడికి నిజంగా అవసరం
(01:40) వచ్చినప్పుడు గురువుగారు తన శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో తన విద్యలు పాడైపోకూడదు అని చెప్పేసి దానికోసం సాధన మార్గాలు మంత్రోపదేశం ఇవన్నీ చేసి వీడిని ఉద్ధరించాలంటే అయ్యే పని కాదు గురువుగారిని చాలా నమ్మి చాలా జాగ్రత్తగా చూసుకున్నటువంటి శిష్యుడు అటువంటి వాడికి ఈ వైభవాన్ని అప్పచెప్పడానికి ఏకకాలంలో చేసేటువంటిదే శక్తి పాపం దీన్ని శక్తి క్రియ అని కూడా అంటారు కాకపోతే ఏదైనా వనరుకు చేస్తే దాన్ని శక్తి క్రియ అంటారు రు వ్యక్తులకు చేస్తే శక్తిపాతం అంటారు.
(02:12) శక్తిపాతం అనేది అందరూ అందరికీ చేయలేరు. ఒక మంత్రానికి సంబంధించి ఒక మార్గానికి సంబంధించి తన జీవితంలో ఆరుగురికి మించి శిష్యులకు శక్తిపాతం చేయడానికి గురువుకు అర్హత లేదు. ఎందుకంటే ఒక ఆరుగురికి ఆ ఎనర్జీని ఇచ్చే విధానం ఉంటుంది కదా ఈ గురువు జీవితాంతం సాధన చేసినా గాని ఆరుగురిని దాటి శక్తిపాతం చేయడానికి కావలసిన కెపాసిటీ పొందలేడు.
(02:38) అంటే తన జీవితంలో తను తీవ్రంగా సాధన చేస్తే ఒక ఆరుగురిని ఉద్ధరించడానికి తనతో సమానమైనటువంటి ఎనర్జీని పంచడానికి అర్హుడు అవుతాడు గురువుగారు శక్తిపాతం అనేది ఏ మంత్రానికైనా ఉంటుంది. గురువుగారు ఏ మంత్రాన్ని ప్రధానంగా సిద్ధి చేసుకుంటారో ఆ మంత్రాన్ని తన చివరి రోజుల్లో గాని తన అభిష్టం మేరకు తనని ఆశ్రయించి తనని జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి శిష్యుని ఉద్ధరించడం కోసం ఇటువంటి మంత్రం నా తర్వాత వీరి దగ్గర ఉంటే బాగుంటుంది.
(03:07) ఎందుకంటే వీడైతే దీన్ని ఉద్ధరిస్తాడు మంచిగా చూసుకుంటాడు అని నమ్మినటువంటి గురువు మాత్రమే ఆ శిష్యుడికి శక్తి క్రియ శక్తిపాతం చేయగలుగుతాడు. శక్తిపాతానికి పట్టేది మూడు నుంచి ఐదు రోజులు అది మంత్రం మీద ఆధారపడి ఉంటుంది శుద్ధ విద్యాక్రమంలో తాను సిద్ధి పొందినటువంటి మంత్రాన్ని శిష్యుడికి అప్ప చెప్పేటప్పుడు మూడు రోజుల క్రియ సరిపోతుంది లేదు తీవ్రతరమైనటువంటి మంత్రం అది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాడినైనా ఉద్ధరించడానికి ఉపయోగపడుతుంది.
(03:38) ఆపద్ ధర్మంగా ఎవరికైనా ఉపయోగించచ్చు తీవ్రత లక్షణం కలిగింది తామస మంత్రం కనీసంగా ఐదు రోజులు శక్తి క్రియ చేయాల్సి ఉంటుంది. ఈ ఐదు రోజుల్లో రోజుకి మూడు ముహూర్త కాలాలు దాటి శక్తి క్రియ చేస్తారు. ముహూర్తం అంటే సుమారుగా ఒక గంట అనుకోండి 48 నిమిషాలు ఒక గంట అలా రోజుకి మూడు గంటలు చొప్పున శుద్ధ విద్యల్లో చిన్న చిన్న విద్యలు సిద్ధిపరుచుకున్నప్పుడు మూడు రోజులు తామసమైనవి ప్రయోగానికి పనికవచ్చేటువంటి మంత్రాలు చేసేటప్పుడు ఐదు ఐదుకు పైబడి రోజులు ఈ శక్తి క్రియ అనేది శక్తిపాతం అనేది చేస్తారు.
(04:14) శక్తిపాతం చేసే రోజుల్లో గురువుగారు ఘన పదార్థాలు స్వీకరించకూడదు. కేవలం ద్రవ పదార్థాలే స్వీకరిస్తూ ఉండాలి. నవలడం లాంటివి చేయకూడదు అన్నమాట. అంటే అన్న పదార్థాన్ని నవిలి తినాలి కదా అలా నవలడానికి పనికిరాదు అందుచేతను ఏదనా ద్రవ పదార్థాలే తీసుకుంటూ ఉంటున్నాడు. శిష్యుడికి అంటే గ్రహించేటువంటి వాడికి రోజులో ఒక్కసారి మాత్రమే వండినటువంటి పదార్థాన్ని ఘన పదార్థాన్ని ఇస్తారు.
(04:39) అందుచేతనే ఎక్కువగా శక్తి క్రియలు అనేటువంటివి లేదా శక్తిపాతాలు అనేటువంటివి ఒకటి లేదా మూడు రోజులకు పరిమితం చేశారు. ఒక రోజులో శక్తి క్రియ చేయడం అనేది సాధ్యపడే అంశం కాదు. ఒక ఇంటిని నేను రెండు రోజుల్లో కట్టేసాను పూర్తిగా సిమెంట్ తోటి అన్నాడు. అది నిలబడే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఒక రోజులో కట్టుబడి అనేది భవిష్యత్తుకి దృఢమైనది కాదు అది భవిష్యత్తులో అలాగే శక్తిక్రియనే ఒక్క రోజులో చేసేసాను అరగంటలో చేసేసాను అని వాళ్ళు ఉంటారు.
(05:07) దీనివల్ల ఆ గ్రహించినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో క్షణికంగా అప్పటికప్పుడు ఏదో అని గాలి పీల్చుకుని వాడికి ఏదో కొత్తదనం కలిగిందని ఇలా భావించిన ఆ తర్వాత తర్వాత వాడు దాన్ని ఆస్వాదించలేడు. శక్తి క్రియ చేయాలంటే శుద్ధ విద్యాక్రమంలో మూడు రోజులు తామస విద్యలు పెద్ద స్థాయి ప్రయోగ విద్యలు అయితే ఐదు రోజులు చేయాల్సి ఉంటుంది.
(05:27) ఇలా గురువుగారు మనం ఎవరైనా గురువుని ఆశ్రయించి వారి దగ్గరికి వెళ్లి గురువు గారు నాకు శక్తి క్రియ చేయండి శక్తిపాతం చేయండి అని అడగడానికి ఉండదు అది ఆయన అభీష్టం మేలక చేస్తారు ఈ సమయంలో చాలా పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షల్లో 99 శాత మంది ఇంటికి పారిపోతారు ఎవరో ఒక్కలే మిగులుతారు ఆ మిగిలిన వారికే వారిని కూడా అనేక రకాలుగా పరీక్షించిన తర్వాత తర్వాత శక్తిపాతం అనేదాన్ని ఆపాదిస్తారు.
(05:51) శక్తిపాతం ఇచ్చేటప్పుడు లాలాజలంతో దాడిమి కలకలంతో అంటే గురువుగారి యొక్క లాలాజలంతో దాడిమి కలకం దానిమ పుల్ల తీసుకుని ఆ మంత్రాన్ని ఆ లాలాజలంతో శిష్యుడి యొక్క నాలిక మీద రాస్తారు ఆ సంప్రదాయం అక్కడి నుంచి ప్రారంభమయింది. ఈరోజున సరస్వతి మంత్రం నాలిక మీద రాసేదాకా వచ్చింది ఒక మంత్రానికి సంబంధించిన సాధనాక్రమం చాలా పెద్దదిగా ఉంది. అది గురువుగారు బహుశా ఆయనకు ఉన్న ఆ రోజుల్లో ఆ శిష్యుడికి నేర్పడం అంతా కష్టం అనిపించింది.
(06:20) వీన్నఎందుకు అంతలా ఇబ్బంది పెట్టడం నాకు అన్ని రోజులు అవకాశం లేదు కదా కాబట్టి త్వరితంగా వీడికి ఏదైతే ముడి పదార్థం ఉందో అది వాడి దగ్గర పని చేసే విధంగా వాడికి మనం వసగుదాం అనిపించినప్పుడు లాలాజలంతో అది రాస్తారన్నమాట అదే మంత్రాన్ని ఆయన ఉచ్చరిస్తూ కుడి చెవులోకి వినేలాగా తన లాలాజలంతో శిష్యుడి యొక్క నాలిక మీద రాసేటువంటి సంప్రదాయం ఎప్పుడో పూర్వం నుంచి ఉంది.
(06:44) అది ఇప్పుడు కొత్తగా చెప్పాను కదా సరస్వతీ మంత్రాలు నాలిక మీద రాయడం ఏమో రకరకాల మంత్రాలని నాలిక మీద రాయడం ఇవన్నీ వచ్చాయి. నాలిక మీద ఒక వ్యక్తి ఒక బీజాన్ని రాసినంత మాత్రాన అదేం పని అవ్వదు మనం రీఫిల్ లేకుండా ఈ పెన్ తీసుకుని వైట్ పేపర్ మీద రాసినట్టు అన్నమాట దాని మీద ఏం లేఖనం ఏం జరగదు దాంట్లో ముడిసరుకు ఏముంది దేని వల్ల అది యాక్టివేట్ అవుతుంది దానిమీద కలకం తోట పుల్లతోట ఆ ఇంక్ గురువుగారి యొక్క స్పృసిిత లాలాజలం ఆయనలో ఉద్భవించి ఆయనలో ఉన్నటువంటి లాలాజలాన్ని తీసి రాస్తారు దాన్ని ఇది అందరికీ అన్వయించేది కాదు చెప్పాను కదా గురువుగారు చాలా శిష్యుని పరిశీలించిన తర్వాత
(07:27) పరీక్షించిన తర్వాత వీడికి నేను ఈ విధానం అంతా కూడా చెప్పే లోపల బహుశా నేను ఉన్నానేమో అనుకున్న సందర్భంలో కొంతమంది తీసుకునే నిర్ణయం కిందే దీన్ని చెప్తారు ఇది కూడా శక్తిపాతంలో ఒక క్రియే శక్తిపాతం అంటే శక్తిని ఇవ్వడం ట్రాన్స్ఫర్ చేయడం అన్నమాట ఎదుటి వాళ్ళకి అలా ట్రాన్స్ఫర్ చేసేటువంటి క్రమం ఏదైతే ఉందో దాంట్లో అనేక రకాలు ఉంటాయి నెత్తి మీద చెయ్యి పెట్టి మంత్రం చదివితేనే శక్తిపాతం కాదు అనేక రకాల శక్తిపాత విధులు ఉన్నాయి అనేక రకాలుగా దీంట్లో అది అభ్యసించిన వాళ్ళు ఉన్నారు దాన్ని గ్రహించి ఉద్ధరించబడిన వాళ్ళు కూడా ఉన్నారు.
(08:03) శక్తిపాతం అనేది ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసున్నది ఏంటంటే కూర్చోబెట్టి వాళ్ళ నెత్తి మీద చేయబెట్టి మంత్రాలు చదివితే వీళ్ళ దగ్గర నుంచి శక్తి అంతా కూడా వాళ్ళకి వెళ్తుంది వాళ్ళకి కావలసినంత వాళ్ళని ఎనర్జిటిక్ గా తయారు చేస్తారు దీంట్లో ఇంత లోతు ఉంటుంది ఇది ఆ సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాలి మనం ఎవరో గురువు గారి దగ్గరికి వెళ్లి ఏవండీ నేను రెండు సంవత్సరాల పాటు సాధన చేయలేను కాబట్టి నాకు శక్తిపాతం చేసేసేయండి ఎనర్జీ నాకు ట్రాన్స్ఫర్ చేసేయండి అని అడగకూడదు ఆయన అన్ని పరిశీలించిన తర్వాత ఒకవేళ ఆయనలో అలాంటి ఉద్దేశం ఉంటే కనుక అది వసగుతారు
(08:33) అర్థమైంది కదా శక్తిపాతం అంటే ఇది శక్తిపాతాన్ని అందరు గురువులు ఇవ్వలేరు ఒక మంత్రాన్ని సాధన చేసే ఓ గురువు తన శిష్యుడికి శక్తిపాతాన్ని ఇవ్వలేడు అలా ఇవ్వాలంటే ఆ గురువు దాంట్లో చాలా తీవ్రమైన కండిషన్స్ లోకి వెళ్ళాలి అంటే చాలా లోతైనటువంటి శక్తిని సముపార్జన చేసిన వాడై ఇవ్వడానికి అర్హుడైతేనే శక్తిపాతం అనేదాన్ని నిర్వహించగలుగుతాడు ఇది కేవలం లౌకికమైనటువంటి గురుష్యుల సంబంధంలే కాదు ప్రధానమైనటువంటి పీఠాలలో అనుకోకుండా ఏదైనా విపత్తు చేత వాళ్ళు తనువు చాలించాల్సి వస్తే పరమపరించాల్సిన సమయం వస్తే తర్వాత తరం ఏదైతే ఉందో ఉత్తర పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ
(09:15) శక్తిక్రియ రూపంలో త్రిరాత్రము పాంచరాత్రము మూడు రాత్రులు లేదా ఐదు రాత్రులు ఈ విధులు చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది. సర్వేదనా సుఖినో భవంతు కార్యక్రమం మీకు అర్థమైతే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కి సపోర్ట్ చేయండి. అహం కమలానందనాథ
No comments:
Post a Comment