Monday, June 15, 2026

 P. Saroja.             9866521414.

అమృత కర్రీ  సెంటర్.

నుదుట ను పట్టిన చెమట తుడుచు కుంటూ, గేటు తీసుకుని లోపలికి వచ్చింది తులసి. 
       వీధి గదిలో కూర్చున్న  భర్త నారాయణ కేసి చుస్తూ,,,,
ఎంత సే పయ్యింది, వచ్చి అని అడుగుతూ,, ఎదురుగా వున్న కుర్చీ లో కూర్చుంటూ,, ఏ మయ్యింది?వెళ్ళిన పని?,,,,జగన్నాధాన్ని, కలిసారా?...అంటూ,, భర్త  కేసి ప్రస్నార్ధకంగా చూసింది.

జగన్నాధాన్ని కలిసాను. పరిస్థితి అంతా చెప్పాను. ఏ వన్నా వుంటే ఫోన్ చెస్తా నన్నాదు. అక్కడి నుండి మా అన్నయ్య ఇంటికి వెళ్ళాను. ఇప్పటి కిప్పుడు వుద్యొగ మంటే, ఎక్కడ దొరుకు తుంది, చుస్తాన్లె, అన్నాడు. 
   మన బాధ వాళ్ళ కేం తెలుస్తుంది. వాళ్ళు వడ్డున వున్నారు, మనం నడి సముద్రం లో వున్నాం.,,,,, 

సరేలే !ఒకర్ని అనుకోవడం దేనికి.
ఇంతకీ,,,, ఇంత ఎండ ,లో నువ్వెక్కడ కి వెళ్ళావు.??

టీ పొడి అయిపోయింది.  ఎండన పడి వచ్చే మిమ్మల్ని మళ్ళీ బయటికి పంపడం ఎందుకని, సందు చివర శెట్టి, కొట్టు వరకూ వెళ్ళాను.
వస్తూ , వస్తూ, ఒక సారి పక్కనే వున్న మాస్టారు గారి ఇంటికి వెళ్ళాను. పిన్నిగారు ఎలా వున్నారొ, ఒక్కసారి పలకరించి వద్దామని వెళ్ళే సరికి, పిన్నిగారు జ్వరం వచ్చి పడుకున్నారు. మాస్టారు, వంటి ట్లో కాఫీ పెట్టడానికి, అవస్త పడుతుంటే కాస్త కాఫీ పెట్టి  శాంతమ్మ గారికి ఇచ్చి,మందులెసి కాస్సెపు కుర్చొని కబుర్లు చెప్పి ,,,,, ఇలా వచ్చేసరికి కాస్త లేట్ అయ్యింది.
   అన్న ట్టు మర్చి పోయాను. మాస్టారు గారికి భోజనం పంపిస్తా నన్నాను. కాస్త సర్ది ఇస్తాను, పట్టుకెళ్ళి  ఇస్తారా??? ,,అంటూ,,, వంటి ట్లోకి  వెళుతున్న  భార్య తులసి కేసి ఆనందంగా చూసాడు, 
నారాయణ. 

భార్య లో వుండే ఈ గుణం చాలా ఇష్టం నారాయణ కి. 
   పెద్ద వాళ్ళం టే గౌరవమ్, అడగ కుండా నే అవతలి వాళ్ళ అవసరం గుర్తించి,, వాళ్ళ కు సాయపడే మనస్తత్వం, అన్నీ బాగా నచ్చు తాయి.
  నారాయణ ఆలోచనల్లో ఉండ గానే , అన్నం, పప్పు, కూర,  సర్ది  
ఒక బుట్టలో పెట్టి, నారాయణ చేతిలో, పెట్టింది.

మీ ఫోన్ నెంబర్ మాస్టారు కు ఇచ్చి రండి. ఏ దన్నా అవసరం అయితే ఫోన్ చెయ్య మనం డి,,, అంటూ , వెనకనుండి తులసి చెప్పే మాటలకి అల్లాగే,, ,,అంటూ బైటికి కదిలాడు నారాయణ.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

అత్తయ్యా!భోజనానికి రండి, అంటూ ఏమీ తోచక , నడుం వాల్చిన, అత్తగారిని లేపి భోజనం వడ్డి స్తూ, మళ్ళీ స్టవ్ మీద అన్నం పడేసి, అట్టా కోడలు, ఇద్దరూ కబుర్లలో, పడ్డారు.  కబుర్లు శాంతమ్మ గారి సంసారం మీదకు వెళ్లా యి.
మాస్టారు పేరు రామచంద్ర కీర్తి. అదే వూళ్ళో మాస్తారుగా పనిచేసి ,రిటైరు  ,అయి ,అదే ఊళ్ళో స్తిర పడ్డారు. మాస్టరు గారికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. 
అందరికి పెళ్ళిళ్ళు అయి,తలో చోట, వుద్యొగాల్లొ వున్నారు.  మనవలు కూడా పెద్దవాళ్ళు అయి చదువుల్లొ, వున్నారు. 
   వీళ్ళు ఇద్దరే ఇక్కడ వుంటారు.  ఎవరి సంసారాలు వాళ్ళ వి.
వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ గొడవల్లో వాళ్ళు వుంటారు. 
కోడళ్ళు ఉద్యోగాలు చెస్తు న్నారు. 
పెద్దవాళ్ళ  నిద్దరిని "రండి మాదగ్గర ఉండండి," అనే ధయిర్యమ్ ఎవరూ చేయరు. ఎందుకంటే, వీళ్ళకి వేళ కి అన్నీ చేసి పెట్టె ఓపిక లేక.
  పెద్దవాళ్ళు వస్తే, తమ స్వేచ్చ పోతుందేమో ,అనే భయం కొంతా,
సొంత ఇల్లు, అక్కడ వున్న సదుపాయమ్ ఇక్కడ వుండదు, అంటూ,,ఏది  యెమయినా అక్కడ వాళ్ళు బానే వున్నారు అంటూ, అడగని వాళ్ళకు, అడిగిన వాళ్ళకు , తమ కనుకూలమయిన మాటలు చెబుతూ,,, తప్పించుకు తిరిగే పిల్లలను, ఏమీ అనలేక, వాళ్ళు రమ్మని అతనప్పుడు, వాళ్ళ దగ్గరకు వెళ్ళడం ఎందుకు, అనిపెద్ద వాళ్ళు ఇద్దరూ ఇక్కడే, కాలం వెళ్ళ  దీస్తున్నారు.
     మాస్టారు గారికి 78 ఏళ్ళు. చూపు తగ్గింది. కొద్దిగా మతి మరుపు వచ్చింది. శాంతమ్మ గారికి 72 ఏళ్ళు.
    భర్త అవసరాలు ఎప్పటికప్పుడు చూసే శాంతమ్మ కి కూడా ఈ మధ్య 
తనని కూర్చో పెట్టి, ఎవరయినా కాస్త అన్నం వండి పెడితే బాగుండును, అని అనిపిస్తుంది.
 కానీ జరగదు. 
      ప్రస్తుతం వంట్లో బాగుండ క పడుకుంది,, కానీ, భర్త తనకోసం పడుతున్న, ఆరాటం, అలవాటు లేక పడుతున్న అవస్త చూస్తూ, విల విల లాడి పోతున్న సమయం లో తులసి రాక,,,, సాయం,,, ఆవిడకు  ఎంతో స్వాంతన నిచ్చింది.

🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

ఒకే వీధి. చిన్న పరిచయం.  కనిపించి నప్పుడల్లా" బాగున్నారా పిన్నిగారు "అంటూ  ఆత్మీయంగా ,,, అభిమానంగా, పలకరించే ,,, చిన్న పలకరింపు,,
అదే ఈ రోజు ఆసరా అయ్యింది కదా! అనుకుంటుంది శాంతమ్మ. నిజానికి శాంతమ్మ పెద్దగా ఎక్కడికి వెళ్ళదు. తులసె ఎప్పుడయినా వచ్చి ,, కాస్సెపు కుర్చొని, నాలుగు కాలక్షేపం కబుఇంట్లోవున, వెళుతూ వుంటుంది.

నాల్గు రోజుల్లొ తులసి,, నారాయణ,
ల సాయం వలన, జ్వరం తగ్గి ,
 తేరుకుంది, శాంతమ్మ. ఇన్ని రోజులు,  మాస్టరు భోజనం, టిఫిను అన్నీ నారాయణ, తులసె చూసు కున్నారు.
నాల్గు సార్లు తిరగ వలసి వచ్చినా, బాధ పడలేదు. మా కెందుకు,,,,, అని అనుకోలేదు. 
 ముఖ్యంగా, తులసి చేతి వంట అమృత మే,. ఎవరన్నా కూర్చో బెట్టి కాస్త అన్నం వండి పెడితే బాగుండు నన్న కోరిక ఈ విధం గా తీరింది.

జ్వరం తగ్గి మూడు రోజు లయినా  తులసి  శాంతమ్మ ని వండు కొనివ్వ లేదు.
నాల్గు రోజులు కాస్త ఓపిక రానివ్వంది అంటూ  ,,, తనే  రోజు భోజనం తెచ్చి పెడు తోంది. 
టైమ్ పన్నెండు అయ్యింది.  జ్వరం తగ్గి న, నీ రసంతొ హాల్లో కార్చుని 
 ,T.V. చూస్తోంది శాంతమ్మ.
తులసి భోజనం కెరెజ్ తెచ్చి లోపలికి వెళ్ళి డై నింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది, వచ్చి ఆలా వుందమ్మా ఒంట్లో?అంటూ,,, ఎదురుగా కూర్చుంది. 
   కడుపున పుట్టిన వాళ్ళ కంటే ఎక్కువగా ఆదుకున్నావు తులసి. 
నీ చేతి వంట తిన్నాకా  ఇంకా, తేరు 
కొకుండా ఉంటా నా??
అయినా ఎండలొ నువ్వెందుకు వచ్చావ్  తులసి? నారాయణ చేత పంపక పొయావా,?

నారాయణ లేరమ్మా!!రైస్ మిల్లు లో పని పోయింది కదా! ఉద్యోగం కోసం ఎరుగున్న వాళ్లని కాలవ డానికి వెళ్లారు.

అదే ఇన్నాళ్లు నాకు చెప్పావు కాదె. 
ఎందుకు పోయింది ఉద్యోగంరైస్ మిల్లు ఓనర్ పోయి ఏదాది అయ్యిందమ్మ. వాళ్ళ పిల్లలు  ఎక్కడెక్కడో ఉద్యోగాలు చెస్తున్నారు. వాళ్ళకి  ఎవరికీ ఈ బిజినెస్స్ చేసె ఉద్దేశ్యం లేదు.  ఆరు కోట్లకి రైస్ మిల్ వున్న స్థలం అమ్మెసారు. దాంతొ మాఆయన ఉద్యోగం పొయిందమ్మా!
మీ ఆరోగ్యం బాగుండ నప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పడం, అని చెప్పలెదమ్మా! అప్పటినుండి ఉద్యోగం కోసం తిరుగుతూనె వున్నారు. 
ఇప్పు డు ఏ వుద్యొగానికి వెళ్ళినా 
కంప్యూటర్ వచ్చా అంటున్నా  రమ్మ. 
నిజమేలే ఇప్పుడు రెండు ,నాలుగు కలపాలన్న కంప్యూటర్ కావాలి.
మునుపు,పాలమ్మెవాడు,పనిమనిషి
కూడా వేళ్ళతో లెక్కలు చెప్పెవారు, 
ఇప్పుడూ ,,M.A,,,, ,చదివినా, లాభం లేదు. మాస్టారు అదే తిడతారు. 
    సరే !!నేనూ మాస్తారితొ మాట్లాడు తాలె. 
ఏదో ఒకటి దొరక్క పోదు . కంగారు పడకు. 
వస్తానమ్మా!భోంచెయ్యండి, అంటూ
ఇంటికి,బయలు దేరింది, తులసి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

"భొంచెద్దామ్ రండి. "పడుకుని పుస్తకం చదువు కుంటున్న 
మాస్థార్ని పిలిచింది శాంతమ్మ.

ఇద్దరూ   భోజనం చెస్తున్నారు.
అరటి కాయ ఆవ బెట్టి న కూరా, 
మ జ్జిగ పులుసు, దొసకాయ పచ్చడి 
అన్నం,.
తులసి వంట చాలా రుచిగావుంది,
శాంతా!!!
అన్నం తింటూ భర్త అన్న మాటలకు చిన్నగా తలూపుతూ,,
అవును,,,,,మంచి చెయ్యి,!
యేం వండి నా చాలా రుచిగా వుంటాయి. కానీ, ఇప్పుడే చెప్పింది. 
నారాయణ ఉద్యోగం పోయింది ట. 
కొత్త ఉద్యోగ వేటలో వున్నారు. 

వింటే చాలా బాధని పించింది. 
మనమే మన్నా సాయం చేయ గలమెమొ ఆలో చించం డి. 

ఒక్కనిముషమ్ , మోనం తరువాత, ఒక పని చెద్దామా శాంతా? అన్నారు మాస్టారు. 
ఏమీ ట న్న ట్లు, చూసింది ,శాంతమ్మ

నీ కా ఓపిక తగ్గింది. చేసి నాన్నాళూ, చెసావ్. ఇక వంట పనికి, విస్రాంతి నిచ్చి,మనం ఎప్పటి లాగే రోజు మనకి, కే రెజ్  తెచ్చి యిమ్మందామ్.
నీకు చాలాపని తగ్గు తుంది. కాస్త  రెస్ట్ కూడా దొరుకు తుంది. వాళ్ళు అడిగిన దాని కంటే కాస్త ఎక్కువే ఇద్దాం. ఈ వంకన వాళ్ళకి, సాయం చేసినట్లు , వుంటుంది.,,,

బాగానే వుంది. కానీ ఏమను కుంటా రో. తప్పు గా అర్ధం చెసు కోరు కదా!

వాళ్ళు చిన్న బుచ్చు కునే లా చెబుతామా?,,
అయినా!ఈ రోజుల్లో మనలాం టి పెద్దవాళ్ళు, చేసుకో లేని వాళ్ళు, వీధికి నలుగురు, ఉంటున్నారు.
నెమ్మది నెమ్మదిగా, ఇల్లు పెంచు
కుంటే,ఇంట్లో కూర్చుని వాళ్ళే సంపాదించు కోగలరు. 
సాయంత్రం తులసి, నారాయణ ,తో
 మాట్లాడు  దాం.
అయినా !!ఈ  పదిరొజులకి డబ్బు లిద్దామను కుంటున్నాం, కదా!
అవి ఇస్తూ,ఈ విషయం ప్రస్తావిద్దామ్.

సరే !అలాగే చెద్దామ్.
,🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

సాయంత్రం భోజనం తెచ్చి నప్పుడు 
నారాయణ ను కూడా రమ్మని ఫోన్ చేశారు, కీర్తి మాస్టారు.
తులసి లోపలికి వెళ్ళి ఫలహారమ్ బాక్స్ లు టేబుల్  మీద పెట్టి, ఉదయం ఇచ్చిన కే రెజ్  తీసుకుని వచ్చింది. 
నారాయణ,మాస్టారు ఎదురుగా కూర్చుని మాట్లా డు తున్నాదు.
నారాయణా,, ఇంత వరకూ మీరిద్దరూ చేసిన సాయం,మీకు మేము ఏ  మిచ్చినా,, మీ రుణం మేం తీర్చుకొ లేము. 

కన్న బిడ్డల కంటే ఎక్కువగా, మాగురించి ఆలొచించారు. మాకెంతొ  వెన్ను దన్ను గా నిలబడ్డారు.  
ఇన్ని వుపొద్గాతాలు వద్దు నారాయణ! మిఆవిద చేతి వంట ఇంకా కొన్నాళ్ళు తినా లని వుందయ్యా!నీకు తులసికి అబ్య్ంతరమ్ లేకుంటే, ఇంకా కొన్నాళ్ళు మాకు నీ ఇంటి నుండే కెరెజ్ రావాలని అనుకుంటున్నా ము

మాపిల్లలు మాదగ్గర ఉండి మా అవసరాలు తిర్చలెరు.కష్ట సమయం లో మాదగ్గర వున్న మీరే, మా పిల్లలు,. ఏ  మంటావు?

ని ఆర్ధిక పరిస్థితి ఆసరా చేసుకుని ఇలా అడిగానని ఏ మీ అనుకోకండి
భర్త  మాటలకు మాట కాలిపింది, శాంతమ్మ.

యేం చెప్పాలొ తెలియక , భార్య ముఖం లోకి చుసా డు నారాయణ. 
ఏం చెప్పాలొ తెలియక ఆలోచిస్తోంది, తులసి.  కష్టం తన ది అయినప్పుడు నేనేం చెబుతాను మాస్టారు.  తననే అడగండి. 
అయ్యో!!పెద్దవాళ్ళు. మీకు చేయడం, మాకు ఎప్పు డూ ఆనందమె మాస్టారు.
తన అంగికారమ్ తెలిపింది తులసి. మాస్టారు లేచి లోపలికి వెళ్ళి కొంత డబ్బు తెచ్చి, తులసి చేతిలో పెట్టి,

ఇక మీద ట కొన్నాళ్ళు మాకు కెరెజ్ మీ ఇంటి నుండే రావాలి, అన్నారు. 

అలా అనుకోకుండా మొదలెట్టిన ప్రయాణం, రెండు ఏళ్ళు తిరిగే సరికి పదింత లయ్యి, ఆదంపతు లిద్దరి చేత," అమృత  కేటరింగ్ సర్విసెస్స్"
అని,బోర్డు పెట్టించింది.

శాంతమ్మ, మాస్టారు  లాంటి  వృద్ధ దంపతులకి  కొంతమందికి  రోజు కెరెజ్ పంపిస్తుంది తులసి. 
సాయానికి ఒక మనిషిని పెట్టుకుంది. రెండేళ్ళు తిరిగే సరికి బిజినెస్సు బాగా పెరిగింది.  
నెలకి ఖ్ర్చులు పోను, యాభై వేలు వరకూ, మిగులు తుంది. 

రెండు సంవత్సరాల తరువాత,,,,

నారాయణ, తులసి, పిల్లలని తీసుకుని మాస్టారు ఇంటికి వచ్చారు. 
మాస్టారు, శాంతమ్మ, ఇద్దరుT.V.
చుస్తూ చాగం టి వారి ప్రవచనాలు వింటున్నారు. 

లోపలికి వచ్చిన దంపతుల కేసి సంతిషమ్ గా చుస్తూ, రండి అని సాదరమ్ గా ఆహ్వానించారు. 

తులసి నారాయణ, తమ తో బాటు తెచ్చిన బట్టలు, దంపతు లిద్దరికి పెట్టి, కాళ్ళకి దండం పెట్టారు. తులసి, పిల్లలచెత కూడా ఆ పెద్ద వాళ్ళకి దండ పెట్టించింది. 

ఏమిటి ది నారాయణ?ఆశ్చర్య పోయారు, మాస్టారు, భార్య. 

"""మాకు అన్నం పెట్టారు. మాస్టారు".
కళ్ళనీళ్ళు తిరుగు తుం డగా,ఇద్దరూ ఒక్క సారె అన్నారు.

లేదు. నారాయణా!మీ దంపతులె మాకందరికి అన్నం పెడుతున్నారు. 
ఆశీర్వదిస్తూ,,,,, అక్కున చెర్చు కున్నారు మాస్టారు, శాంతమ్మ.
        🌹సుభమ్,🌹

No comments:

Post a Comment