Saturday, June 13, 2026

Think Out of the Box | Bold Thoughts | Anukula Vedam || Telugu Podcast

Think Out of the Box | Bold Thoughts | Anukula Vedam || Telugu Podcast

Author Name:Anukula Vedam

Youtube Channel Url:https://www.youtube.com/@anukulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=f4AGPTBb26I



Transcript:
(00:00) [సంగీతం] ఎలా ఆలోచించాలో నేర్చుకోండి భిన్నంగా ఆలోచించండి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించండి ఓపెన్ మైండ్ తో ఆలోచించండి అని ఇలాంటివి చాలా మంది చెప్పేస్తుంటారు కానీ అలా ఎలా చేయాలో మాత్రం ఎవ్వరూ చెప్పరు మన చిన్నప్పుడు సపోజ్ మనం దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే బట్టల కొట్టలో రెడీమేడ్ డ్రెస్సులు లాగా మనకి రెడీమేడ్ ఆన్సర్స్ ఇచ్చేస్తుండేవారు అదే మన బుర్రలో ఇన్ఫర్మేషన్ లాగా స్టోర్ అవుతూ వచ్చింది ఇంతవరకు అయితే ఆ రెడీమేడ్ ఆన్సర్స్ యొక్క వాలిడిటీ ఏంటి దాని వెనకాతలో ఉన్న లాజిక్ ఏంటి అసలు ఆ ఆన్సర్స్ కరెక్టా రాంగా అని డౌట్స్ కూడా రైస్ చేయకుండా మనకంటే
(00:46) పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి అది అంతే అనే స్టేట్ లో పెరుగుతూ వచ్చాం ఇప్పటికీ ఈ క్షణంలో కూడా మన అలవాట్లు ఆలోచనలు చాలా వరకు అలాగే ఉన్నాయి మన ఆలోచన సామర్థ్యం గురించి పూర్తిగా మర్చిపోయి ఆ రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ మీదే ఆధార పడుతూ ఉన్నాం ఇంటర్నెట్ లో జస్ట్ ఒక్క క్లిక్ దూరంలో ఏ ఆన్సర్ అయినా రెడీమేడ్ గా లభించేస్తుంది కాబట్టి ఆ లభిస్తున్న ఆన్సర్ నచ్చకపోతే మనకు లభించే ఆన్సర్ దొరికేంత వరకు ఆ ఇంటర్నెట్ క్లిక్స్ పైన డిపెండ్ అవుతున్నాం కానీ మనకంటూ సొంతంగా ఒక బుర్ర ఉందని దానిలో ఒక మెదడు ఉందని అసలు దాని ఆలోచన సామర్థ్యానికి ఈ ప్రపంచంలో ఏ
(01:21) కంప్యూటర్ సరితూగలేదు అనే వాస్తవాన్ని కూడా మర్చిపోయి మన సమస్యలకు పరిష్కారం ఈ ఇంటర్నెట్ లోనే దొరుకుతుంది అనే ఒక మాయలో బ్రతికేస్తున్నాం ఆఖరికి అది ఏ స్టేజ్ కి వచ్చిందంటే ఎవరు ఎంత ఫాస్ట్ గా రెడీమేడ్ ఆన్సర్స్ వెతకగలరో వాళ్లే తెలివైన వారు అనే స్టేజ్ లో ఉన్నాం అయితే ఇప్పుడు నా బుర్రం నేను వాడాలంటే ఈ ఇంటర్నెట్ పుస్తకాలు చదవడం ఇవన్నీ ఆపేయాలా కానే కాదు మీరు ఒక పుస్తకం చదవాలనుకున్నప్పుడు గాని ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక కంటెంట్ వింటున్నప్పుడు గాని అసలు ఆ ఇన్ఫర్మేషన్ మీ జీవితానికి ఏ మాత్రమే అయినా రెలవెంట్ ఆ కాదా అని ఆలోచించండి ఒకవేళ రెలవెంట్ అయితే
(01:55) అసలు అది మీ జీవితానికి ఎలా అన్వయించుకోవాలో దాని గురించి ఆలోచించండి అలా ముందు అసలు మీ జీవితంలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులు ఏంటో వాటిని ఒక దగ్గర రాసుకోండి ఎందుకంటే చాలా సార్లు మనం తెలుసుకుంటున్నది యాస్ ఇట్ ఇస్ గా డిట్టో టు డిట్టో అప్లై చేయడం అవ్వదు మనం పెరుగుతున్న వాతావరణం మనం ఉన్న సిట్యువేషన్స్ బట్టి మన అవసరాలకు అనుగుణంగా ఏదో ఒకటి మార్చుకోవాల్సి ఉంటది సో నా జీవితానికి ఇది ఉపయోగపడుతుందా అనే వాటిని తప్ప ఇంకే ఇన్ఫర్మేషన్ అయినా సరే మీ బుర్రలోకి ఎక్కించడం ఆపండి ఇది ఎలాంటిది అంటే మార్కెట్ లోకి వెళ్లి మీకు అవసరం ఉన్న లేకపోయినా చూడ్డానికి
(02:30) ఇంట్రెస్టింగ్ గా ఉన్న వాటన్నిటిని మీ ఇంట్లోకి తెచ్చేసి పెడితే మీ ఇల్లు అసలు ఒక ఇల్లులా ఉంటుందా పెద్ద సంతలా తయారవుద్ది అదే మీ బుర్రకు కూడా వర్తిస్తది సో మీ జీవితం ఒక సంతలా తయారవ్వకుండా ఉండాలంటే టీవీ లో వచ్చే ప్రోగ్రామ్స్ గాని ఇంటర్నెట్ లో చూసే వీడియోస్ గాని చదివే బుక్స్ గాని ఈవెన్ మీకు ఉపయోగపడే ప్రోగ్రామ్స్ మధ్యలో వచ్చే అడ్వర్టైస్మెంట్స్ తో సహా ప్రపంచమంతా ఆ ప్రోగ్రామ్స్ కోసం కింద మీద పడి జుట్టు పీక్కుంటున్న సరే మీరు మాత్రం ఏది చూడాలో ఏది చూడొద్దో అనే మీ జీవితం యొక్క రిమోట్ కంట్రోల్ ని పూర్తిగా మీ కంట్రోల్ లో ఉంచుకోవాలి అప్పుడే ఓపెన్ మైండ్ తో అవుట్
(03:05) ఆఫ్ ది బాక్స్ వెళ్లి ఆలోచించడం అంటే ఏంటో మీకు మీకే అర్థమవుతుంది ఈ ప్రపంచంలో నూటికి నూరు శాతం వారు ఏం చెప్పినా కరెక్టే వారు ఏం చేసినా కరెక్టే అనేవారు ఉండరు అలాగే వారు ఏం చెప్పినా తప్పే ఏం చేసినా తప్పే అనేవారు కూడా ఉండరు అలాగే ఈ వ్యక్తి నుండి నేర్చుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అనేవారు కూడా ఉండరు ఆ నేర్చుకోవాల్సింది ఏంటో మన కళ్ళకి కనబడకపోయి ఉండొచ్చు అంతే అయితే ఎవరి గురించి అయినా సరే లోతుగా ఆలోచించే ఓపిక తీరిక ఉద్దేశం ఈ మూడు మనకు ఉండవు కాబట్టి సింపుల్ గా మనుషులందరినీ రెండుగా విడగొట్టేయడం మనకు అలవాటు హీరోలు విలన్లు
(03:41) అని కానీ వాస్తవానికి మనుషులు పూర్తిగా మంచివారు కాదు చెడ్డవారు కూడా కాదు సపోజ్ మీరు ఎవరినైనా ఒక హీరోగా చూస్తున్నప్పుడు ఒక రోల్ మోడల్ గా ఫీల్ అవుతున్నప్పుడు అసలు వాళ్ళు ఏ తప్పులు చేసే ప్రసక్తే లేదని మీకు మీరే అనేసుకుని వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తారనే భ్రమలో అసలు వారు ఎలాంటి వారు ఎవరికీ తెలియని వారి వ్యక్తిత్వం ఏంటో అనేవి ఏవి పట్టించుకోకుండా వాళ్ళు చేసిన తప్పులను కూడా పక్కన పడేసి వారిని గుడ్డిగా కాపీ కొట్టడం స్టార్ట్ చేస్తారు ఎప్పుడైతే మనం ఒక మనిషిని జస్ట్ ఒక మనిషిలా మాత్రమే చూడడం స్టార్ట్ చేస్తామో మనం ఎక్స్పెక్ట్
(04:15) కూడా చేయని అన్ ఎక్స్పెక్టెడ్ విషయాలన్నీ కూడా క్లియర్ గా కనపడటం స్టార్ట్ అవుతాయి సో మనం ఎవరినైనా ఒక రోల్ మోడల్ గా ఫీల్ అయితే కేవలం వాళ్ళు ఏ స్కిల్ వల్ల ఆ స్టేజ్ కి ఎదిగారో ఆ స్కిల్స్ కి మాత్రమే అడ్మిర్ అవ్వాలి ఆ టాలెంట్ కి గౌరవం ఇవ్వాలి ఆ స్కిల్స్ నుండి మనం ఏదైనా నేర్చుకోవాలి కానీ ఆ అసలైన దాన్ని పక్కన పెట్టేసి అతన్ని ఒక దేవుడి లాగా ఆరాధించడం మాత్రం స్ట్రెయిట్ గా చెప్పాలంటే మూర్ఖత్వం సో ఆ టాలెంట్ అండ్ స్కిల్ కాకుండా వారికి సంబంధించి ఇంకేదైనా సరే పూర్తిగా మనకి సంబంధం లేని విషయం వాటిని మాత్రం మనం ఫాలో అవ్వకూడదు ఇట్స్ నన్ ఆఫ్
(04:46) అవర్ బిజినెస్ నెక్స్ట్ పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుద్దాం [సంగీతం]

No comments:

Post a Comment