Monday, June 15, 2026

 కర్తవ్య పరాయణత

తలపెట్టిన కార్యాన్ని దైవసమానంగా భావించి, నిజాయతీగా నిర్వర్తించడమే కర్తవ్య పరాయణత. లోకంలో ప్రతి ఒక్కరికీ చేయాల్సిన పనులెన్నో ఉంటాయి. వ్యక్తిగా తల్లి దండ్రులు, తోబుట్టువులు, భాగస్వామి, కన్నబిడ్డల పట్ల కొన్ని బాధ్యతలు వహించాల్సి ఉంటుంది. సమాజంలో బాధ్యత గల పౌరుడిగా మరో రకం కర్తవ్యాలను నిర్వహిం చాల్సి ఉంటుంది. వాటన్నిటిని మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా ఎవరైతే ఆచ రించడానికి ప్రయత్నిస్తారో వాళ్లని మాత్రమే విజయం వరిస్తుంది. కర్తవ్యపాలనలో తమకు ఎదురయ్యే కష్టాలను, విమర్శలను పట్టించుకోకుండా స్థితప్రజ్ఞతతో దూసుకు పోయేవాళ్లకు దైవసహాయం తప్పక లభిస్తుంది.

కర్తవ్య పరాయణత వ్యక్తుల అభివృద్ధికి, సమాజ భవితకూ అవసరమైన కీలక శక్తి. ధర్మానికి హాని చేయకుండా త్రికరణ శుద్ధిగా కర్తవ్యాన్ని పాటించే వాళ్లంతా తప్పక ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వారితో పాటు సమాజమూ పురోగతి చెందుతుంది. కర్తవ్య పరాయణతకు నిలువెత్తు ఉదాహరణ రామకథ. తన వెంట అడవులకు వచ్చిన బాలరాముణ్ని 'కర్తవ్యం దైవమాహ్నికమ్' అని మేల్కొలుపు తాడు విశ్వామిత్రుడు. అంతే శ్రద్ధగా గురువాజ్ఞ పాటిస్తాడు రాముడు. పద్నాలుగేళ్లు వనవాసం చేసిన శ్రీరాముడిది పితృవాక్య పాలనతో కూడిన కర్తవ్య పరాయణత. సీతను కనిపెట్టి, లంకా దహనం చేసి, సంజీవని మూలికల కోసం ఏకంగా పర్వతాన్ని పెకలించి తీసుకు వచ్చిన హనుమంతుడిది స్వామి భక్తి, అంకితభావాలతో కూడిన కర్తవ్య పరాయణత.
తండ్రి శంతనుడికి ఇచ్చిన మాట కోసం ఆజ న్మాంతం బ్రహ్మచర్యం పాటించి, చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడిన భీష్ముడిది కుటుంబ శ్రేయస్సు, రాజ్య క్షేమం కోరిన కర్తవ్య పరాయణత. పుట్టింది మొదలు గండాలను ఎదుర్కొంటూ, జీవి తమంతా శత్రు బాధలు భరించాడు యదునందనుడు. కురుక్షేత్రంలో పాండవుల విజయం కోరుతూ, నెపం అర్జునుడి మీద నెట్టి లోకానికి గీతోపదేశం చేసిన శ్రీకృష్ణు డిది ధర్మరక్షణతో కూడిన కర్తవ్య పరాయణత. శంబరాసురుడితో జరిగిన యుద్ధంలో గాయపడి, మూర్ఛపోయిన దశరథుణ్ని రక్షించుకుంటూ, రథసారధ్యం చేయడమే కాకుండా, రథచక్రం మేకు జారిపోతే, వేలు అడ్డు పెట్టి భర్తను కాపాడిన కైకేయిది విజ యకాంక్షతో కూడిన కర్తవ్య పరాయణత. ఆ విజయం దశరథుడిదని లోకం చెప్పు కొన్నా వెనకుండి నడిపించిన ఘనత కైకేయిది.

విభీషణుడు, భరతుడు విపరీత పరిస్థితుల్లో కూడా మానసిక సంతులనాన్ని నిలు పుకొన్నారు. అందువల్ల వారికి అనంతమైన శ్రేయస్సు దక్కింది. ధర్మాన్ని రక్షించడానికి కర్తవ్యపాలన చేసినందుకుగాను పక్షి జటాయువు కూడా సాక్షాత్తూ ఆ దైవం ద్వారానే ఘన సన్మానాన్ని పొందగలిగింది.

'కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన' అన్నది గీతాకారుడి ఉపదేశం. ఫలితం భగ వంతుడి మీద వదిలేసి పనిలో నిమగ్నమైతే ఉత్తమ ఫలితాలు వాటంతటవే సిద్ధిస్తాయి.

నారంశెట్టి ఉమామహేశ్వరరావు

No comments:

Post a Comment