*సీతా కాలంలో బరువు పెరుగుతారు... ఎందువల్ల...!☘️ప్రీతి హెల్త్ కేర్* టిప్స్🥦* చలికాలంలో బరువు పెరగడం చాలా సులువు. ఎందుకంటే చలికి భయపడి ఎంతో మంది వ్యాయామం మానేస్తారు. అలాగే ఒకే చోట ఎక్కువ సేపు కూర్చునేందుకు, పడుకునేందుకు ఇష్టపడతారు. చలి వల్ల దుప్పటి కప్పుకొని నిద్ర కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆహారం కూడా త్వరగా జీర్ణం కాదు. దీనివల్లే శీతాకాలంలో శరీరం బరువు త్వరగా పెరిగిపోతుంది. మీరు కొన్ని పనులు చేయడం ద్వారా చలికాలంలో మీ శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
ఏమి తిన్నా కూడా మీరు మితంగానే తీసుకోవాలి. అధికంగా తింటే అది కొవ్వు రూపంలో పెరిగిపోతుంది. చలికాలంలో మీరు పెద్దగా పనులు చేయరు. అలాగే జీర్ణవ్యవస్థ కూడా మందకొడిగా సాగుతుంది. అప్పుడు ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అది శక్తి రూపంలో వినియోగం జరగక కొవ్వరూపంలోకి మారిపోతుంది. కాబట్టి తక్కువ ఆహారాన్ని తినడం మంచిది. అలాగే క్యారెట్, ముల్లంగి వంటివి చలికాలంలో దొరికే కూరగాయలను తినడం చాలా ముఖ్యం. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ కూరగాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ కాలం పాటు శక్తిని అందిస్తూ ఉంటుంది. ఇతర ఆహారాలను తినకుండా అడ్డుకుంటుంది.
No comments:
Post a Comment