Saturday, August 8, 2026

Why Spirituality Became So Complicated | The Path of Inner Silence

Why Spirituality Became So Complicated | The Path of Inner Silence

Author Name:SVL Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@svltelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zddI825lAjw



Transcript:
(00:07) ధర్మం అనేది అత్యంత సరళమైనది సులువైనది మరియు సహజమైనది. కానీ మనుషుల మనసు కారణముగా పూజారులు పురోహితులు దానిని ఎంతో సంక్లిష్టంగా మార్చివేశారు. మనసుకు ఎల్లప్పుడూ కష్టమైన విషయాల పట్ల సంక్లిష్టమైన ఆధ్యాత్మిక మార్గాల పట్లనే ఆకర్షణ ఎక్కువ. అందువల్లనే సమాజంలో ధర్మం పేరుతో అనేక రకాల విపరీతమైన, విచిత్రమైన ఆచారాలు చలామణి అవుతున్నాయి.
(00:33) శరీరానికి అపారమైన కష్టాలు కలిగిస్తూ ఉపవాసాలు ఉండడం, శరీరాన్ని రకరకాల పద్ధతుల్లో పీడించడం, [సంగీతం] తలకిందులుగా నిలబడి శీర్షాసనాలు వేయడం వంటివన్నీ ఆధ్యాత్మికత పేరిట సాగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు కొనసాగుతున్నాయి అంటే ఇవే సరి అయినవని మీ మనసు నమ్ముతుంది కాబట్టి. ఒకవేళ నేను మీతో సత్యం చాలా సరళమైనది మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు కేవలం ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఒకచోట కూర్చుని మీ అంతరంగం వైపు చూడండి అని చెబితే మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు.
(01:04) ఏమీ చేయవలసిన పని లేనప్పుడు ఇక్కడ సమయం ఎందుకు వృద్ధా చేసుకోవడం కష్టపడి ఏదో ఒక సాధన చేసే మరొక ప్రదేశానికి వెళదాం అని మీరు అనుకుంటారు. నూరుగురు గురువులలో 99 మంది కేవలం ఈ సంక్లిష్టతను ఆసరాగా చేసుకునే జీవిస్తున్నారు. వారు మీకు ఎన్నెన్నో తంత్రాలు, ఉపాయాలు, క్లిష్టమైన సాధనలు చెప్తారు. మీరు కూడా ఆ పద్ధతులలో చిక్కుకు పోతారు అలా చిక్కుకు పోవడం లోనే మనసుకు ఒక విధమైన రసజ్ఞత, ఆనందం లభిస్తుంది.
(01:29) కానీ మీరు ఎప్పటికీ గమ్యాన్ని చేరుకోలేరు. మీరు గమ్యం చేరుకోలేకపోయినప్పుడు ఆ గురువులు పరమాత్మను చేరుకోవడం అంత తేలికైన విషయమా ఇది జన్మ జన్మల సుదీర్ఘమైన ప్రయాణం మీ కర్మల జాలం చాలా పెద్దది. అంత త్వరగా ఇది ఎలా సాధ్యమవుతుంది? శతాబ్దాలుగా యుగాలుగా ప్రజలు దీనికోసం ప్రయత్నిస్తున్నారు అని సర్ది చెప్తారు.
(01:50) వచ్చే జన్మలో మళ్ళీ ఇదే గురువును కలవడానికి ఏమైనా ఉపాయం ఉందా లేదా క్రితం జన్మలో [సంగీతం] మీకు క్లిష్టమైన సాధనలు ఇచ్చిన గురువులను ఈ జన్మలో కలిసి స్వామి నేను ఇంకా గమ్యం చేరుకోలేదు అని అడిగే మార్గం ఉందా? అటువంటి అవకాశం ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు మరిచిపోయారు. మీ గురువులు కూడా తమను తాము మరిచిపోయారు. [సంగీతం] అందువల్లనే ఈ సంక్లిష్టత ఆధారంగా ఆధ్యాత్మిక వ్యాపారం నిరంతరం సాగుతూనే [సంగీతం] ఉంది.
(02:16) ప్రపంచంలో వజ్రాలు రత్నాలు అత్యంత విలువైనవిగా భావించబడడానికి కారణం [సంగీతం] అవి చాలా అరుదుగా లభించడమే. వాటి విలువ వాటి కొరతలోనే ఉంది. తప్ప స్వయంగా వాటిలో ఏ ప్రత్యేకమైన విలువ లేదు. కోహినూర్ వజ్రం నిజానికి రెండు కాసుల విలువ కూడా చేయదు. దానిని తిని కడుపు నింపుకోలేరు. [సంగీతం] దానితో దాహం తీర్చుకోలేరు. ఒకవేళ కోహినూరు వజ్రాలు ప్రతి వీధిలో రోడ్డు పక్కన రాళ్లు రప్పల్లా పడి ఉంటే దానికి ఏమైనా విలువ ఉంటుందా దాని విలువ పూర్తిగా [సంగీతం] నశిస్తుంది.
(02:43) అందుకే ప్రపంచవ్యాప్తంగా లభించే వజ్రాలన్నింటిని ఒకేసారి మార్కెట్లోకి తీసుకురారు. అలా తీసుకొస్తే వాటి ధర తక్షణమే పడిపోతుంది. వజ్రాల వ్యాపారులు వాటి పెద్ద పెద్ద నిల్వలను తమ వద్దే దాచి ఉంచి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే బయటకు విడుదల చేస్తారు. ఎందుకంటే కొరత ఉంటేనే వాటికి అపారమైన విలువ ఉంటుంది. [సంగీతం] 400 కోట్ల మంది మనుషులు ఉండి ఒకే ఒక్క కోహినూరు ఉన్నప్పుడు అక్కడ తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది.
(03:08) అదే ప్రతి గ్రామంలో ప్రతి దారిలో కోహినూరు వజ్రాలు పడి ఉంటే పిల్లలు వాటితో ఆడుకుంటే ఏ మహారాజో లేదా రాణియో దాన్ని తమ కిరీటంలో పెట్టుకుంటే ప్రజలు చూసి నవ్వుతారు. కొన్ని వస్తువులకు మార్కెట్లో అత్యధిక ధర నిర్ణయించినప్పుడు మాత్రమే అవి అమ్ముడిపోతాయి. మనసు యొక్క విచిత్రమైన ఆర్థిక శాస్త్రం ఇది. ధర తక్కువగా ఉంటే ఎక్కువ మంది కొంటారని మనం అనుకుంటాం.
(03:30) కానీ కొన్ని వస్తువులకు ఎక్కువమంది కొనలేనంట భారీ ధర ఉన్నప్పుడే కొనుగోలుదారులు లభిస్తారు. ఉదాహరణకు రోల్స్ రాయిస్ కార్ ను ఎందరు కొనగలరు. దాని ధరను ఎంతగానో పెంచి ఉంచాలి. అప్పుడే దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తికి సమాజంలో ఒక హోదా ప్రతిష్ట లభిస్తాయి. [సంగీతం] దానికి చెల్లించే అంత విలువ ఆ వస్తువులో లేకపోయినా మనుషులు దాని వెనక పిచ్చిగా పరుగెత్తుతున్నారు.
(03:51) ఇదంతా మనసు ఆడే విచిత్రమైన ఆట. పరమాత్మ కూడా మీకు మీ ఇంటి వెనక చాలా సులభంగా లభిస్తే మీరు దాన్ని నమ్మలేరు. ఇది జన్మ జన్మల సాధన ద్వారా లభించేది అంత తేలిగ్గా ఎలా దొరుకుతుంది అని మీరు విసిరి పారేస్తారు. ఒకవేళ పరమాత్మ స్వయంగా ఒక రోజు మీ ముందుకు వచ్చి [సంగీతం] నువ్వు నన్ను ఎంతో ప్రార్థించావు శీర్షాసనాలు వేశవు ఇదిగో నేను వచ్చాను అని చెబితే మీరు వెంటనే కళ్ళు మూసుకొని ఇది నిజం కాదని ఏదో భ్రమ అని అనుకుంటారు.
(04:18) ఒకసారి ముల్లా నస్రరుద్దీన్ వలవేసి ఒక అపారమైన పెద్ద చేపను పట్టుకున్నాడు. అది ఎంత పెద్దది అంటే అంతకుముందు ఎన్నడూ ఎవరూ అటువంటి చేపను చూసి ఉండరు. కేవలం జాలర్లు చెప్పుకునే కల్పిత కథల్లో మాత్రమే అటువంటి కథలు వినబడతాయి. సముద్రతీరంలో ఒక పెద్ద చేప నిశ్చలంగా ఉంటే జాలర్లు దాని వీపుపై రొట్టెలు కాల్చుకొని తిన్నా ఆ చేపకు తెలియలేదట.
(04:43) వారు భోజనం పూర్తి చేసిన తర్వాతే అది కదిలిందట. అటువంటి విచిత్రమైన పెద్ద చేపను చూసి జనం గుమిగూడారు. నసరుద్దీన్ దానిని చుట్టూ తిరిగి చూసి తల ఊపుతూ లేదు ఇది నిజం [సంగీతం] కాదు ఇదొక అబద్ధం పుకారు దీనిని ఎవరు నమ్ముతారు సోదరులారా నాతో చేతులు కలపండి దీనిని తిరిగి సముద్రంలో పడేద్దాం. ఇది చేపే కాదు కేవలం ఒక అబద్ధం అన్నాడు. పరమాత్మ కూడా నిశశబ్దంగా మీ వద్దకు వచ్చి నిలబడితే మీరు కూడా నమ్మలేరు.
(05:12) ఇదేదో కల అనుకుంటారు ఎందుకంటే సరళమైన దానిని మీరు అంగీకరించలేరు కానీ పరమాత్మ అలా నిశ్శబ్దంగానే వస్తాడని నేను మీకు చెబుతున్నాను. మీ మనసు యొక్క వంకరకరమైన ఆలోచనలు వంకర మార్గాలు ఆగిపోతే మీరు సూటిగా సరళంగా ప్రశాంతంగా కూర్చుంటే పరమాత్మ అటువంటి నిశశబ్దంలోనే అవతరిస్తాడు. ఆయన వచ్చేవరకు ఆయన అడుగులు చొప్పుడు కూడా వినబడదు. ఒక్క క్షణం క్రితం వరకు ఆయన అక్కడ లేదు కానీ మరుక్షణంలో మీ అంతరంగం ఆయన దివ్యానుభూతితో నిండిపోతుంది.
(05:42) [సంగీతం] ఆయన అమృత వర్షం మిమ్మల్ని ముంచెత్తుతుంది. నాలో ఏ అర్హత ఉందని పరమాత్మ నన్ను అనుగ్రహించాడు అని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే అర్హత అనే పదం తర్కానికి వ్యాపారానికి సంబంధించినది. పరమాత్మ మీ సాధనల వల్లనో అర్హతల వల్లనో లభించడు. ఆయన మీకు ఇప్పటికే లభించి ఉన్నాడు. మీరు ఏదైనా సాధన చేయడానికి ముందే మీ ఉనికికి ముందే ఆయన మీలోనే ఉన్నాడు.
(06:10) మీరు ఆయనను ఎప్పటికీ కోల్పోలేరు కానీ మీ మనసు యొక్క వంకరకరమైన మార్గాల వల్ల పరమాత్మను కోల్పోయామనే భ్రమ మీకు కలుగుతుంది. దాంతో మళ్ళీ అన్వేషణ మొదలు పెడతారు. ఎన్నడూ కోల్పోని దానిని మీరు వెతకడానికి బయలుదేరుతున్నారు. పరమాత్మ లభించిన రోజున అది కేవలం ఆయన అపారమైన ప్రసాదంగా నిష్కారణంగా అనుగ్రహించబడినట్లు మీకు తెలుస్తుంది. మీరు కేవలం నిశశబ్దంగా కూర్చోండి.
(06:34) పిచ్చిగా పరిగెత్తకండి. మనసును విసర్జించండి. మనసు చెప్పే మాటలను వినకండి. మనసు అనే పొగ నుండి మిమ్మల్ని మీరు విముక్తులను చేసుకుని ఆ అవతలి ఒడ్డుకు చేరుకోండి. మనసు అనే లోయ నుండి కాస్త పక్కకు తప్పుకోండి. మనసుకు మరియు పరమాత్మకు మధ్య ఉన్న దూరం చాలా స్పష్టమైనది. మీరు ఎంతగా మనసుకు దగ్గరగా ఉంటారో అంతగా పరమాత్మకు దూరమవుతారు.
(06:58) ఎంతగా మనసుకు దూరంగా జరుగుతారో అంతగా పరమాత్మకు దగ్గరవుతారు. ఇదొక అత్యంత సరళమైన గణితం. ఏ రోజున మీలో మనసు అనేది శూన్యం అవుతుందో ఆ రోజే మీరు పరమాత్మగా మారుతారు. మీరు పరమాత్మను కోల్పోలేదు కేవలం మనసును పట్టుకొని వేలాడుతున్నారు అదే మీ అసలు సమస్య. కబీర్దాస్ గారు అంటారు చలత్ టేడో టేడోరే నవద్వార నరకధర్ ముందేతు దుర్గంధకో భేడోరే ఎందుకు నువ్వు అంత వంకరగా అహంకారంతో నడుస్తున్నావు అని కబీర్ ప్రశ్నిస్తున్నారు.
(07:31) మనుషులు అహంకారం కారణంగా వంకర వంకర నడకలు నడుస్తారు. కొంచెం ధనం చేతికి రాగానే మనిషి అహంకారంతో విర్రవీగుతాడు. ఎన్నితల్లో గెలిస్తే కాళ్ళు నేలపై ఆనవు వంకరగా నడుస్తాడు. కబీర్ అంటున్నారు నీ అహంకారానికి ఏ తగిన కారణము నాకు కనిపించడం లేదు వ్యర్థంగానే నువ్వు నిక్కబొడుచుకుంటున్నావు. నిజం చెప్పాలంటే అహంకారానికి ఎటువంటి ప్రాతిపదిక లేదు.
(07:55) నీ శరీరంలోని తొమ్మిది రంధ్రాలు అనగా రెండు కళ్ళు రెండు చెవులు రెండు నాసికా రంధ్రాలు నోరు రెండు విసర్జన అవయవాలు కారణంగానే నువ్వు నరకంలో పడతావు. ఈ తొమ్మిది ద్వారాల ద్వారానే మనసు తన వాసనలను కోరికలను ప్రపంచమంతటా వ్యాపింపజేస్తుంది. ఈ ద్వారాల గుండానే మనసు వెలుపలికి వెళ్లి పదార్థాలను అంటిపెట్టుకుంటుంది. లోభం, [సంగీతం] కామం, క్రోధం వంటి వికారాలను సృష్టిస్తుంది.
(08:20) ఇవన్నీ నిన్ను నరకం వైపు నడిపిస్తాయి. నీ శరీరం నుండి ఎలాంటి సుగంధము రావడం లేదు. కేవలం దుర్గంధమే వస్తుంది. నువ్వు దుర్గంధానికి [సంగీతం] నిలయము అయినా ఎందుకు ఇంత అహంకారంతో తిరుగుతున్నావు ఈ సత్యాన్ని కాస్త లోతుగా అర్థం చేసుకోండి. మీ అంతరంగంలో మీ మనసుతో మీరే సంభాషించడం అనేది ధ్యానంలో అత్యంత లోతైన ఒక ప్రయోగం. మీరు మీ మనసుతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు మీకు మీ మనసుకు మధ్య ఒక స్పష్టమైన దూరం ఏర్పడుతుంది.
(08:46) మీరు మనసుతో ఓ మనసా ఎందుకంత వంకరగా నడుస్తున్నావు అని అన్నప్పుడు మీరు మాట్లాడే వ్యక్తిగా మారుతారు. మనసు వినేదిగా మారుతుంది. మీ మనసుతో మీరు సంభాషించడం వల్ల అపారమైన ప్రయోజనం లభిస్తుంది. మీరు సరిగ్గా విషయాలను స్పష్టంగా ఉంచితే మనసు వద్ద ఎటువంటి సమాధానము ఉండదు. మనసు నుండి ఎప్పుడూ వికారాలేనే దుర్గంధం తప్ప మరేమీ వెలువడదు.
(09:07) ఒకవేళ ఎప్పుడైనా మనసు నుండి సుగంధం వస్తున్నట్లు అనిపిస్తే మీరు లోతుగా పరిశోధించండి. ఆ సుగంధం మనసు నుండి రావడం లేదు. మనసుకు అవతల ఉన్న అంతరాత్మ నుండి వస్తుంది. క్రోధం, ద్వేషం, ఈర్ష, అసూయ, మత్సరం అన్ని రకాల అశాంతులు మనసు నుండే పుడతాయి. మనసు నుండి పుట్టే ప్రేమ కూడా దుర్గంధంతో నిండి ఉంటుంది. ఎందుకంటే అది ద్వేషానికి మరొక రూపం మాత్రమే.
(09:30) కానీ మనసుకు అవతల ఉన్న అంతరాత్మ నుండి ఉద్భవించే ప్రేమ మరొక ఉంది. దాని సుగంధం పూర్తిగా వేరైనది. దానిని మీరు తక్షణమే గుర్తించగలరు. [సంగీతం] ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించని ఎటువంటి కోరికలు లేని ఎటువంటి అంచనాలు లేని ప్రేమ బుద్ధుని కళ్ళల్లో కనిపిస్తుంది. ఆ ప్రేమ మనసు నుండి రావడం లేదు. అది మనసుకు అతీతమైన స్థలము నుండి వస్తుంది.
(09:50) [సంగీతం] దానిలో ఎటువంటి దుర్గంధం ఉండదు. ద్వేషపు ఛాయలు కూడా ఉండవు. బుద్ధుని ప్రేమను మీరు ద్వేషంగా మార్చలేరు. కానీ మీ లౌకిక ప్రేమను సులభంగా ద్వేషంగా మార్చవచ్చు. అసలు కులమానం ఏమిటంటే ఏది తన వ్యతిరేక భావంగా మారగలదో అది మనసు నుండి వస్తున్నట్లే లెక్క. ఏది తన వ్యతిరేక భావంగా మారదో అది మనసుకు అతీతమైన అద్వైత స్థితి నుండి వస్తుందని అర్థం చేసుకోండి.
(10:12) ఉదాహరణకు మీరు ఒక స్త్రీని ప్రేమిస్తున్నారు అనుకుందాం. నేడు ఆమె అందంగా ఉంది, రేపు వృద్ధురాలైపోతుంది. అయినా మీరు అలాగే ప్రేమిస్తారా? నేడు ఆరోగ్యంగా ఉంది, రేపు అనారోగ్యం పాలై క్యాన్సర్ లేదా కుష్ట వ్యాధి వచ్చి శరీరం కుందిపోతే మీరు అలాగే ప్రేమిస్తారా? నేడు ఆమె మిమ్మల్ని పూజిస్తోంది రేపు మిమ్మల్ని దూషించి అవమానిస్తే అలాగే ప్రేమిస్తారా నేడు మీ వెనుక నీడలా నడుస్తూ మీ అహంకారాన్ని తృప్తి పరుస్తోంది రేపు మరొకరిని ప్రేమగా చూసినా లేదా మరొకరి వెనుక నడిచినా మీరు అలాగే ప్రేమిస్తారా మీరు లోతుగా ఆలోచిస్తే మీరు అలా ప్రేమించలేరని తక్షణమే గ్రహిస్తారు. ఆ
(10:45) పరిస్థితిలో మీరు ఆమెను హతమార్చడానికి కూడా వెనుకాడరు. అంటే మీ లౌకిక ప్రేమ ద్వేషంగా మారిపోతుంది. ఏ విషయమైతే తన వ్యతిరేక రూపంలోకి మారగలదో అది మనసు నుండి వస్తున్నదే లెక్క. ఎందుకంటే మనసు వద్ద ద్వైతం ఉంది. మనసుకు అవతల అద్వైతం ఉంది. మీ శాంతిని ఏ రకమైన అలజడి కూడా భంగపరచలేకపోతే చుట్టూ తుఫానులు వీచినా ఆ శాంతి నిశ్చలంగా ఉంటే అది మనసుకు అతీతమైన అద్వైత స్థితి నుండి వస్తుందని అర్థం చేసుకోండి.
(11:13) మనసు నుండి మీరు ఏది చేసినా మీ జీవితం అంతగా దుర్గంధంతో నిండిపోతుంది. ఇప్పటికైనా మేల్కోండి. ఎంతకాలం మీ మనసును నమ్ముతారు ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది. ఈ శరీరాన్ని తగలేసినప్పుడు శరీరంతో పాటు మీ మనసు కూడా భస్మమై బూడిదైపోతుంది. ఒకవేళ శరీర భాగాలు ఏవైనా మిగిలిపోతే క్రిములు కీటకాలు వాటిని తినివేస్తాయి. మరి దేనికోసం ఈ అహంకారం దేనికి ఈ శిరాన్ని అంతగా పైకెత్తి నడవడం ఈ జెండాలు దేనికి ఎగురవేయడం చైతన్యం ఈ శరీరాన్ని విడిచిపెట్టి పక్షిలా ఎగిరిపోయినప్పుడు హంస తన దివ్య ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఈ శరీరాన్ని పందులు, కుక్కలు, కాకులు పీకు తింటాయి. అలాంటప్పుడు ఈ శరీరం గురించి ఈ
(11:47) మనసు గురించి ఇంతగా విర్రవీగడంలో అర్థం ఏముంది? మనసు మిమ్మల్ని ఆక్రమించుకోవడం వల్ల మీరు పొందింది ఏమీ లేదు కానీ కోల్పోయింది మాత్రం చాలా ఎక్కువ. మనసు మీ హృదయాన్ని పూర్తిగా మూసి వేసింది. మనసు యొక్క కళ్ళు సజాగంగా ఉన్నాయి కానీ హృదయపు కళ్ళపై ఆసిడ్ పోసినట్లుగా దానిని గుడ్డిది చేసి వేసింది. మనసు మీపై పూర్తి ఏకాధిపత్యాన్ని సాధించి నా ద్వారానే ప్రపంచాన్ని చూడు అని చెబుతోంది.
(12:13) ప్రేమ గుడ్డిదని మనసు మీకు నూరి పోస్తుంది. కానీ నిజానికి ప్రేమ ఒక్కటే నిజమైన చూపు. మనసు మిమ్మల్ని హృదయపు స్వరాన్ని విననివ్వదు. చాలా కాలం పాటు మీరు హృదయపు స్వరాన్ని వినకపోవడం వల్ల ఆ స్వరం క్రమంగా క్షీణించిపోతుంది. మనసు చేసే కోలాహలంలో హృదయపు సన్నని శబ్దం వినబడదు. మనసు కాస్త నిష్క్రమించి దానికి మీకు మధ్య దూరం పెరిగినప్పుడు మీలో ఒక హృదయం కూడా ఉందనే సత్యం మీకు మొదటిసారి అనుభవంకి వస్తుంది.
(12:39) హృదయం ద్వారా చూసినప్పుడు ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. మనసుతో పరమాత్మను చూస్తే అది కేవలం ఒక రాయిలా కనిపిస్తుంది, కానీ హృదయంతో ఒక రాయిని చూస్తే అది పరమాత్మ కంటే భిన్నంగా కనిపించదు. గుడులలో రాతి విగ్రహాలను ప్రతిష్టించిన మహనీయులు తమ హృదయపు చూపుతోనే వాటిని తయారు చేశారు. హృదయపు కళ్ళు ఉన్నప్పుడు రాయి అనేది రాయిలా కనిపించదు.
(13:02) అది పరమాత్మగా రూపాంతరం చెందుతుంది. ఎందుకంటే పరమాత్మ ప్రతి చోట నిండి ఉన్నాడు. ప్రతి అణువులో దాగి ఉన్నాడు. నీరు భూమిలో దాగి ఉన్నప్పుడు బావి తవ్వితే నీరు బయటపడినట్లు హృదయం అనే సాధనంతో తొవ్వినప్పుడు పరమాత్మ ప్రకటన అవుతాడు. హృదయం బంధిస్తుంది మనసు విడదీస్తుంది. మనసు ఖండ ఖండాలుగా ముక్కలు చేస్తుంది. హృదయం అఖండంగా ఒక్కటిగా చేస్తుంది.
(13:25) మనసు యొక్క సూత్రం విశ్లేషణ, అనాలసిస్, హృదయపు సూత్రం సంశ్లేషణ, సింతసిస్. మనసు ఉన్న చోట భిన్నత్వం కనిపిస్తుంది. హృదయం పరిపూర్ణంగా క్రియాశీలమైనప్పుడు ఈ సమస్త విశ్వం ఒకే ఒక్క అద్వైత చైతన్యంగా భాసిిస్తుంది. మనసు ఎంతో సమాచారాన్ని జ్ఞానాన్ని సేకరిస్తుంది. శాస్త్రాలు, శబ్దాలు, సిద్ధాంతాలు మనసు వద్ద కొల్లలుగా ఉంటాయి. [సంగీతం] కానీ ఆ జ్ఞానంలో ఆత్మ ప్రజ్ఞ, మతి యొక్క చిన్న కాంతిరేఖ కూడా ఉండదు.
(13:52) మనసు ఎంతో తెలుసుకుంటుంది కానీ నిజానికి ఏమీ తెలియదు. మనసు ఒక చిలకలాగా ఇతరులు చెప్పిన మాటలను పదే పదే వల్ల వేస్తుంది. అది ఉచ్చి తెచ్చుకున్న జ్ఞానం మతియేన జాని అంటే ఆ ఏకమైన పరమాత్మ గురించి ఏమీ తెలుసుకోలేదు అని అర్థం. అనేకం గురించి తెలుసుకున్న మనసు అసలైన ఆ ఒక్కదాని గురించి తెలుసుకోలేకపోయింది. ఉపనిషత్తులు చెప్పినట్లు ఆ ఒక్కదానిని తెలుసుకున్నవాడు సమస్తాన్ని తెలుసుకున్నట్లే కానీ మనసు మాయ మోహం మమకారం అనే త్రాళ్లతో మిమ్మల్ని బంధించి నీరు లేని చోటే ముంచివేసింది.
(14:24) మనసు మిమ్మల్ని ఎంత క్షుద్రంగా మార్చివేసిందంటే మునిగిపోవడానికి పెద్ద నది లేదా సముద్రం కూడా అవసరం లేదు. నీరు లేకుండాను చనిపోయేంత అజ్ఞానంలో పడేసింది. నువ్వు ఇసుక ఇంటిలో కూర్చొని ఉన్నావు. కొద్దిగా గాలి వీచిన కూలిపోయే ఇసుక మేడ వంటిది ఈ శరీరం. ఏ క్షణంలో ఇది కూలిపోతుందో ఎవ్వరికీ తెలియదు. రేపటి రోజు వరకు ఈ శరీరం ఉంటుందని మనం నిశ్చింతగా ఉండలేము. మహాభారతంలో ఒక చిన్న కథ ఉంది.
(14:48) ఒక భిక్షకుడు వచ్చి ధర్మరాజును భిక్ష అడిగాడు. ధర్మరాజు ఏదో పనిలో ఉండి రేపు రా అని చెప్పాడు. పక్కనే ఉన్న భీముడు అది విని వెంటనే ఒక పెద్ద డోలు తీసుకొని ఊరంతా బిగ్గరగా వాయిస్తూ పరిగెత్తాడు. ధర్మరాజు ఆశ్చర్యపోయి ఏమైంది భీమ ఎందుకు డోలు వాయిస్తున్నావు అని అడిగాడు. దానికి భీముడు మా అన్నయ్య కాలాన్ని జయించాడు. ఆ భిక్షకుడికి రేపు రమ్మని మాట ఇచ్చాడంటే రేపటి వరకు తను జీవించి ఉంటాడని ఆ భిక్షకుడు కూడా జీవించి ఉంటాడని అన్నయ్యకు ఖచ్చితంగా తెలుసు అంతటి గొప్ప విజయాన్ని ఊరందరికీ చాటడానికే ఈ డోలు వాయిస్తున్నాను అన్నాడు. ధర్మరాజుకు వెంటనే తన పొరపాటు
(15:24) అర్థమై పరిగెత్తుకెళ్లి ఆ భిక్షకుడిని పిలిపించి తక్షణమే దానం ఇచ్చాడు. ఇసుక మేడ లాంటి జీవితంలో ఉంటూ కూడా మనిషి ఇంకా మేలుకోవడం లేదు. మనస్సు ఎంతో తెలివైనదిగా నటిస్తుంది. తనకు అన్ని తెలుసని గురువుగా మారడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇతరుల జూత మాటలను చెత్తను పోగు చేసుకొని గొప్ప పండితుడిగా భావిస్తుంది.
(15:46) ఒకసారి సూఫీ సంతు జునైద్ [సంగీతం] ఒక గ్రామం గుండా వెళుతున్నాడు. ఆయన గొప్ప పండితుడు తన జ్ఞానాన్ని ఇతరులకు బోధించాలని తపత్రయ పడుతుండేవాడు కానీ ఆ రోజు ఆయనకు ఎవరూ దొరకలేదు. చివరకు ఒక చిన్న బాలుడు సమాధి వెద్ద దీపం పెట్టడానికి దైవ ప్రార్థన చేస్తూ కనిపిస్తాడు. జునైద్ ఆ బాలుడిని ఆపి చిన్నారి ఈ దీపాన్ని నువ్వే వెలిగించావా ఈ జ్యోతి వెలగడానికి ముందు ఎక్కడుంది ఏ దిక్కు నుండి వచ్చింది అని అడిగాడు.
(16:16) ఆ బాలుడు [సంగీతం] నవ్వి వెంటనే ఆ దీపాన్ని ఊపి ఆర్పేసి స్వామి ఇప్పుడు ఈ జ్యోతి మీ ముందే ఆరిపోయింది కదా అది ఏ దిక్కుకు వెళ్ళిందో మీరు చెప్పండి అప్పుడు అది ఎక్కడి నుండి వచ్చిందో నేను చెప్తాను అన్నాడు. ఆ మాట వినగానే జునైద్ అహంకారం తక్షణమే పటాపంచలయింది. తన ముందున్న చిన్న జ్యోతి ఎటు పోయిందో చెప్పలేని తాను ప్రపంచం ఎక్కడి నుండి వచ్చింది దేవుడు ఎవరు అనే పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడటం ఎంత హాస్యాస్పదమో గ్రహించాడు.
(16:43) ఆ రోజే ఆయన తన పాండిత్యాన్ని అహంకారాన్ని త్యాగం చేసి నేర్చుకునే శిష్యుడిగా మారాడు. జునైద్ తన జీవితంలో తొమ్మిది మందిని గురువులుగా స్వీకరించాడు. వారిలో రెండవ గురువు ఒక దొంగ ఒక రాత్రి జునైద్ ఆలస్యంగా ఒక గ్రామానికి చేరుకున్నాడు. సత్రాలన్నీ మూసివేసి ఉన్నాయి. చీకటి వీధిలో ఒక దొంగ ఆయనకు ఎదురై నేను దొంగను నా ఇంట విశ్రాంతి తీసుకోవడానికి నీకు అభ్యంతరం లేకపోతే రావచ్చు.
(17:09) నాతో ఉంటే నువ్వు చెడిపోతావని భయపడితే వేరే చోటు చూసుకో అన్నాడు. జునైద్ అతని ఇంట్లో నెలలూజులు ఉన్నాడు. ఆ దొంగ ప్రతిరాత్రి దొంగతనానికి వెళుతూ ఈరోజు రాజమహల్లోనే దొంగతనం చేస్తాను అని అపారమైన ఆశతో వెళ్లేవాడు. రాత్రి ఖాళీ చేతులతో తిరిగి వచ్చినా ఈరోజు అవకాశం దొరకలేదు కానీ రేపు ఖచ్చితంగా సాధిస్తాను అని పూర్తి ఉత్సాహంతో చెప్పేవాడు.
(17:33) నెల రోజుల పాటు ఒక్క దొంగతనం కూడా విఫలమైనా అతడు నిరాశ చెందలేదు. కాలక్రమంలో జునైద్ పరమాత్మ అన్వేషణలో అలిసిపోయి ఈరోజు లభిస్తే సరి లేదంటే సాధన వదిలేస్తాను అని నిరాశ పడినప్పుడు ఆయనకు ఆ దొంగ గుర్తుకు వచ్చాడు. తుఛమైన లౌకిక ధనం కోసం ఒక దొంగ నిరంతరం ఆశతో ప్రయత్నిస్తుంటే పరమ సత్యాన్ని వెతికే తాను ఇంత [సంగీతం] త్వరగా ఎలా నిరాశ పడగలదు అని మేల్కొని తన సాధనను పూర్తి చేసి సత్యాన్ని సాధించాడు.
(18:00) మనస్సు పండితుడిలా నటిస్తుంది కానీ అంతరంగంలో అజ్ఞానపు అంధకారం నిండి ఉంటుంది. బయటి [సంగీతం] శాస్త్రాల కాంతి మీ అంతరంగాన్ని వెలిగించలేదు. బుద్ధుడు తన అంతిమ క్షణాలలో అప్పో దీపోభవ నీకు నీవే వెలుగుగా మారు అని చెప్పాడు. ఇతరుల వెలుగులు ఆర్పి వేసిన శాస్త్రాల దీపాలు నీకు ఉపకరించవు. కబీర్ దాస్ గారు అంటారు కహే కబీర్ ఏక్ రామ్ భగత్ బిన్ బూడే బహుత్ సయానా రాముని భక్తి అంటే ఆ ఏకత్వమైన పరమాత్మ శరణాగతి లేకుండా ఎంతటి గొప్ప పండితులైనా అజ్ఞానంలో మునిగిపోతారు.
(18:34) వంకరగా నడవకండి అహంకారపు జెండాలను పక్కన పెట్టండి. మీ ఆలోచనల నుండి దృష్టిని మరళించి మీలోని అంతరాత్మ వైపు చైతన్యపు మూలం వైపు మళ్ళంచండి. ఆ గంగోత్రి ఉద్భవించే మూలస్థానం [సంగీతం] మీ అంతరంగంలోనే ఉంది. కస్తూరి జింక తనలోని సుగంధాన్ని బయట వెతికినట్లు కాకుండా మీలోని పరమాత్మను మీ అంతరంగంలోనే దర్శించండి. ఓం

No comments:

Post a Comment