#మాస్క్#
(ఇది కరోనా కాలంలో రాసినది)
అనుకోకుండా డెభై ఏళ్ళ సుబ్బారావు చనిపోయాడు.రోజూ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణ చేసే సుబ్బారావు కి నవ్వుతూ విష్ణు మూర్తి కనిపించాడు.
సుబ్బారావు చేతులు జోడించి స్వామీ నన్నిలా పట్టుకు పోవడం న్యాయమా? అన్నాడు.
స్వామి వారు నవ్వి ఎవరికేం చేయాలో ఏమేమి ఇయ్యాలో నాకు తెలుసు.ఎందుకయ్యాచింత మహా మహులకైనా లభించని సునాయాస మరణంనీ పుణ్యం వల్ల లభించింది అన్నారు స్వామి.
నా పిల్లలకి నా భార్య కి నేనంటే ప్రేమ నాకింకా బతకాలని ఉంది అన్నాడు సుబ్బారావు.
స్వామి వారు నవ్వి సరే నీకు మోహం నశించలేదు.
నీ పరివారం ని పరిశీలించడానికి నీ కో అవకాశం ఇస్తా
నువ్వు నేను చెప్పినట్లు చేయాలి అని సుబ్బారావు
చెవి లో ఏమి చేయాలో చెప్పాడు.సుబ్బారావుకి ప్రాణం పోసాడు.
గొల్లుమని ఏడుస్తున్న కుటుంబ సభ్యులు ఆశ్చర్య పోతుంటే సుబ్బారావు లేచి కూర్చున్నాడు.మరణ ధ్రువీకరణ చేసిన డాక్టర్ గారు కూడా విస్తు పోయాడు.
భార్య పిల్లలు చుట్టూ చేరి ఏమైందని అడిగారు.
సుబ్బారావు అందరిని ఓసారి చూసి నవ్వి నేను మరణించిన మాట వాస్తవమే కానీ నాకు మాస్క్
లేదని పంపించేశారు అన్నాడు.
వెంటనే భార్య పిల్లలు గబగబా తలో మాస్క్
తెచ్చి ఇచ్చారు.
***అప్పుడు స్వామి వారు చెవిలో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి నాయనా సుబ్బారావు మీ వాళ్ళు మాస్క్ లు తేకపోతే నీమీద ప్రేమ ఉన్నట్టు.తెస్తే ఇక నీ నిర్వాకం చాలు అన్నట్టు***
ఆ మాటలు గుర్తుకు వచ్చి సుబ్బారావు మరోసారి గట్టిగా నవ్వి నారాయణా అంటూ
ప్రాణం వదిలేసాడు బ్రహ్మానందం గా.
******
జయంతి లక్ష్మీ నరసింహం
No comments:
Post a Comment