. *🌷 నేటి కథ🌷*
రచయిత: *ప్రభాకర్ గౌడ్ నోముల* వరంగల్ జిల్లా.
9440060852
రంగాపురంలో రమేష్ అనే బాలుడు ఉండేవాడు. తల్లిదండ్రులకు చదువు రాదు రమేష్ కు ఒక తమ్ముడు పాఠశాలకు వెళ్లేవారు. ఆ ఊరిలోనే ఒక రైతు వద్ద తోటమాలి రమేష్ వాళ్ళ నాన్న బావి వద్ద మామిడి చెట్లు, నేరేడు చెట్లు, జామ చెట్లు, ఉండేవి ఆ రైతుకు కొంత వ్యవసాయ భూమి పాడి గేదెలు ఉండేవి వ్యవసాయ పనులు చేస్తూ గేదె పాలు కూడా పితికి ఉచితంగా పనులు చేసి పెట్టేవాడు, ఆ పండ్ల చెట్లకు రమేష్ వాళ్ళ నాన్న అన్ని చెట్లకు నీళ్లు పెడుతూ పండ్లను తెంపితే ఆ పండ్లను రమేష్ వాళ్ళ తల్లి చుట్టుపక్కల గ్రామాలలో తిరుగుతూ అమ్ముకుంటూ జీవనం గడిపేవారు.
ఒకరోజు పాఠశాలలో టీచర్ అందరిని అడుగుచున్నాడు మీ తల్లిదండ్రులు ఏమి చేస్తారని రమేష్ మా తల్లిదండ్రులు తోట పని చేస్తారని చెప్పగానే అదే తరగతులో ఉన్న రైతు కొడుకు ఆ తోట మాదే అన్నాడు. రమేష్ కు ఆ క్షణం లోనే తోట మాది కాదు కదా అని ఆలోచించాడు. రోజు తల్లి తీసుకువచ్చే పండ్ల నుండి ఒకటి రెండు తీస్తూ ఎండబెట్టి విత్తనాలుగా మార్చి ఇంటి చుట్టూ అన్ని రకాల విత్తనాలను పెట్టాడు. ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి రాగానే నీళ్లు పోస్తూ చిన్న చెట్లు పెరగగానే రక్షణకు కంచెలు ఏర్పాటు చేసి పెంచి పెద్ద చేశాడు. కొన్నాళ్లకే చెట్లు పెద్దవి కాగానే చిన్నగా పండ్లు కాయడం ప్రారంభించాయి. కొన్ని రోజులకే రమేష్ తల్లిదండ్రులు ఇంటి వద్ద ఉండి చెట్ల పండ్లను తెంపి అమ్ముకుంటున్నారు.
అంతకు ముందు పని చేసే రైతు కుటుంబం వ్యవసాయ పని చేసేవారు లేక దివాలా
తీసింది.
రైతు కొడుకు మా తోట అన్నందుకు రమేష్ ఆలోచన తో వీళ్ళ కుటుంబం బాగుపడింది. ఒక చిన్నమాట, పెద్ద మార్పులకు కారణం అవుతుంది.
*✍️*
*┈┉┅━❀꧁ ప్రభాకర్ గౌడ్ నోముల ꧂❀━┅┉┈*
*꧁ᬊᬁ✧━⊱⊰━✧ᬊ᭄꧂*
No comments:
Post a Comment