Sunday, June 13, 2021

నీతి కథ *అత్యాశతో ఆపదపాలైన సుందరం*

నీతి కథ అత్యాశతో ఆపదపాలైన సుందరం

సింగరాయగుంట అనే ఊర్లో నలుగురు మిత్రులు ఉండేవారు. రాము, సోము, చిన్నా, సుందరం వారి పేర్లు. ఒకేలాంటి అలవాట్లు లక్షణాలు కలిగిన వీరందరూ చాలా పేదవారు. నిలువ నీడలేని వీరు ఒక పూట తినీ మరోపూట పస్తులుంటూ కాలం వెళ్లదీస్తుండేవారు.

ఒకరోజు వీరందరూ ఒకచోట చేరి ఎలాగైనా సరే డబ్బు సాధించాలనే నిర్ణయానికి వచ్చి, ఊరు వదలి బయటపడ్డారు. అలా బయలుదేరిన వారు ఒక నది గట్టుమీద ప్రయాణం సాగిస్తుండగా... జడలు అట్టలు కట్టుకుపోయిన జట్టుతో ఒక సన్యాసి ఒకడు కనిపించాడు.

భక్తిశ్రద్ధలతో సన్యాసికి నమస్కరించిన నలుగురు స్నేహితులు తమ కష్ట నష్టాలను అతడికి విన్నవించారు. యోగశక్తి కలిగిన మీరు ఎలాగైనా తమను కరుణించాలని సన్యాసిని వేడుకున్నారు. వీరి బాధలను విన్న సన్యాసి కరుణతో వారికి ఒక జ్యోతిని ఇచ్చి... "ఈ జ్యోతిని పట్టుకుని మీరందరూ పర్వతాల వైపుకు బయల్దేరి వెళ్ళండి. చేతిలో నుండి జ్యోతి ఎక్కడ కింద పడితే అక్కడ భూమిని త్రవ్వారంటే మీకు కావాల్సినంత ధనం లభిస్తుంది. దాంతో మీరందరూ సంతోషంగా జీవించండి" అంటూ దీవించాడు.

జ్యోతిని పట్టుకుని సంతోషంతో మునిగిపోతూ నలుగురు స్నేహితులూ దగ్గర్లోని పర్వతాల వైపుకు నడవటం ప్రారంభించారు. అలా వెళ్తుండగా వారి చేతిలోని జ్యోతి ఒకచోట కింద పడిపోయింది. దీంతో నడకను ఆపేసిన వారు అక్కడ త్రవ్వటం మొదలుపెట్టారు. త్రవ్వుతుండగా అక్కడో పెద్ద రాగి గని బయటపడింది. దీంతో నలుగురిలో మొదటి వాడైన రాము తనకు ఈ రాగిగని మాత్రం చాలునంటూ... తృప్తిగా వెనుకకు వెళ్ళిపోయాడు.

తరువాత మిగిలిన ముగ్గురూ మళ్ళీ జ్యోతిని పట్టుకుని యధాప్రకారం పర్వతాలవైపు నడక ప్రారంభించారు. అలా వెళ్తుండగా మరోచోట జ్యోతి జారి కింద పడిపోయింది. దీంతో అక్కడ కూడా త్రవ్వి చూడగా పెద్ద వెండిగని బయటపడింది. అప్పుడు రెండోవాడైన సోము తనకు ఈ వెండిగని చాలునంటూ తృప్తిపడి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.


మళ్ళీ మిగిలిన ఇద్దరూ ఇంకా మంచివి దొరుకుతాయన్న ఆశతో... జ్యోతిని పట్టుకుని పాటు పర్వాతాల వైపు నడక సాగించారు. వీరి ప్రయాణంలో జ్యోతి మళ్ళీ ఒకచోట జారి కింద పడిపోయింది. అక్కడ త్రవ్వి చూస్తే... పెద్ద బంగారం గని. దీన్ని చూసిన మూడోవాడైన చిన్నా బాగా తృప్తిపడి తనకు ఇది చాలునంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.

ఇక అందరిలో నాలుగోవాడైన సుందరం అత్యాశతో, ఇంకా గొప్ప గొప్ప వజ్రాలు, రత్నాలు, వైఢూర్యాలు లాంటి వి సొంతం చేసుకోవాలన్న దురాశతో జ్యోతిని పట్టుకుని తిరిగీ నడక ప్రారంభించాడు. అలా చాలా దూరం నడుస్తూనే ఉన్నాడు సుందరం. ఒకచోట ఎప్పట్లాగే జ్యోతి కింద పడింది.

మొదటి మూడుసార్లుకంటే... ఇప్పుడు ఇంకా ఎక్కువ విలువైనవి దొరకవచ్చన్న ఆశతో సుందరం త్రవ్వసాగాడు. ఎంత త్రవ్వినప్పటికీ ఏమీ బయటపడలేదు. త్రవ్వి, త్రవ్వి నీరసం వచ్చిన సుందరం అలాగే ఆ గోతిలోనే పడిపోయాడు. తరువాత మెలకువ వచ్చి చూసేసరికి సుందరానికి జ్యోతి కనబడలేదు.

దొరికనదానితో సంతృప్తి పడకుండా... అత్యాశతో ప్రవర్తించిన సుందరానికి చివరికి ఏమీ మిగలలేదు. పైగా గోతిలో పడిపోయి, రక్షించేవారు లేక, తినడానికి ఏమీ లేక ఏడుస్తూ... ఎవరైనా కాపాడండి... అంటూ కేకలు వేస్తూ ఉండిపోయాడు. దొరికిన వాటితో సంతృప్తి పడిన అతడి ముగ్గురు స్నేహితులైన రాము, సోము, చిన్నాలు సంతోషంగా జీవితం గడపసాగారు.

కాబట్టి పిల్లలూ...! దురాశ దుఃఖానికి చేటన్న విషయం ఈ కథ ద్వారా అర్థమైంది కదూ...! అలాగే, మీరందరూ ఈ కథలోని నీతిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

మనిషి ఏ విషయాల్లో అసంతృప్తి చెందకూడదు..వేటి విషయంలో ఇక చాలు అని అనుకోకూడదు..ఆచార్య చాణక్య ఏం చెప్పారు?

మనిషి ఏ విషయాల్లో అసంతృప్తి చెందకూడదు..వేటి విషయంలో ఇక చాలు అని అనుకోకూడదు..ఆచార్య చాణక్య ఏం చెప్పారు?

సంతృప్తి అనేది మనిషికి కచ్చితంగా ఉండాల్సిన లక్షణం. సంతృప్తికి కొలమానం ఉండదు. ఒకటి దొరికితే, మరోటి కావాలనిపిస్తుంది. అది దొరికితే ఇంకోటి.. ఇలా కోరికల చిట్టా పెరిగిపోతూనే ఉంటుంది సంతృప్తి లేకపోతే. కొన్ని విషయాల్లో మనిషి సంతృప్తి చెందకపోతే కనుక.. జీవితమంతా అసంతృప్తితో బాధాకరంగా సాగుతుంది. ఇక కొన్ని విషయాల్లో మాత్రం సంతృప్తి చెందనే కూడదు. దానితో జీవితం అక్కడే ఆగిపోతుంది. సంతృప్తి-అసంతృప్తి మధ్య ఉండే తేడా తెలిసి.. దేనిని ఎక్కడివరకూ పొందాలో తెలుసుకుని మసలుకునే వారికి జీవితం సాఫీగా ఆనందంగా సాగిపోతుంది. ఆచార్య చాణక్య సంతృప్తి అనేదానిపై ప్రత్యేకంగా వివరించారు. చాణక్య విధానం పదమూడో అధ్యాయంలో 19వ చనంలో, ఆచార్య చాణక్య ఏ విషయాలలో మనం సంతృప్తి చెందాలి అనే విషయంపై స్పష్టంగా చెప్పారు.

1.ఆచార్య చాణక్య వివరించిన దాని ప్రకారం, మీ మనస్సుకు భార్య అందంగా లేకపోయినా, మీరు సంతృప్తి చెందాలి. ఏది జరిగినా, వివాహం తరువాత, ఒక పురుషుడు ఇతర మహిళల వెనుక ఎప్పుడూ పరిగెత్తకూడదు, లేకపోతే, అతని జీవితం నాశనమవుతుంది. ఒక వ్యక్తి తన భార్య బాహ్య సౌందర్యం కంటే ఎక్కువగా మానసిక సౌందర్యాన్ని చూడాలి. సున్నితమైన భార్య ఏ వ్యక్తి జీవితాన్ని అయినా సంతోషపరుస్తుంది.
2. మీకు ఏ ఆహారం దొరికినా, మీరు దానిని దేవుని ప్రసాదంగా ఆనందంగా అంగీకరించాలి. అంత అదృష్టం లేని చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి ఆహారం విషయంలో కోర్కెలు కలిగినపుడు.. దొరకిన ఆహరం నచ్చలేదనిపించినపుడు, ఆ వ్యక్తుల గురించి ఆలోచించండి. మీకు లభించినది దేవుని చిత్తం నుండి. దాన్ని ఆనందంతో స్వీకరించడం నేర్చుకోండి.

3. ఎవరైనా తన వద్ద ఉన్న డబ్బుతో సంతృప్తి కలిగి ఉండాలి. ఎక్కువ డబ్బు కావాలనే కోరికతో, తప్పు చేయకూడదు, మరెవరి డబ్బు వైపు చూడకూడదు. ఈ అలవాట్లు జీవితంలో సమస్యలను సృష్టిస్తాయి, తరువాత ఇవి చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. దుఃఖం కలిగిస్తాయి. అందువల్ల, మీ ఆదాయంతో సంతృప్తి చెందడం నేర్చుకోండి అలాగే మీ ఆదాయానికి అనుగుణంగా డబ్బు ఖర్చు చేయండి.

ఒక వ్యక్తి సంతృప్తి చెందాల్సిన విషయాలు ఇవి. కానీ కొన్ని విషయాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉండాలి, అంటే, ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశం ఎప్పుడూ ఉండాలి. ఆచార్య చాణక్య చెప్పినదాని ప్రకారం, ఏదైనా నేర్చుకునే విషయంలో సంతృప్తి చెందకూడదు. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఎప్పుడూ ఎదో ఒక విషయం గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఇక విరాళాలు లేదా దానం ఇవ్వడం విషయంలో కూడా సంతృప్తి కూడదు అంటారు ఆచార్య చాణక్య. అదేవిధంగా పూజలు.. జపాలు ఎప్పుడు ఇక చాలు అని అనుకోకూడదు. ఎందువలన అంటే, ఇవి ఎంత ఎక్కువగా ఆచరిస్తే అంత ధర్మాన్ని కూడగట్టుగోగలుగుతారు. తద్వారా గౌరవాన్ని సంపాదించుకుంటారు.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Saturday, June 12, 2021

భయం

భయం పలురకాలు. అందంగా ఉన్నవారికి అది తరిగిపోతుందని భయం. యౌవనం శాశ్వతం కాదన్న ఆందోళన, వార్థక్యం చుట్టుముడుతుందని, రోగాలు పీడిస్తాయనే బాధ. సంపద కరిగిపోతుందనే మానసిక వ్యధ. ఇలా ఎన్నింటికో మనిషి భయపడుతూ భీరువవుతాడు. సహజ పరిణామాలకు చింతిస్తూ భీతిల్లుతాడు. భయపడవలసినవాటికి భయపడడు. అదే మానవ జీవితంలోని వింత!
సూర్యోదయం, చంద్రోదయం, వర్షాలు, ఉరుములు, మెరుపులు... ఇటువంటి అనేక ప్రకృతి పరిణామాలు మనిషిని భయపెట్టాయి. క్రమక్రమంగా భాషాపరంగా, విజ్ఞానపరంగా ఎదిగాడు. తనను భయపెట్టిన మార్పులు సహజమని అర్థం చేసుకున్నాడు. వాటివల్ల ఉపయోగాలు తెలుసుకున్నాడు. మనల్ని భయపెట్టే విషయాలపట్ల అవగాహన పెరిగిననాడు భయం తొలగిపోతుంది.

భయం మూఢనమ్మకాన్ని పెంచుతుంది. అది మన హేతుబద్ధతను, తార్కికతను, ఆలోచనాశక్తిని నశింపజేస్తుంది. విజ్ఞాన, శాస్త్ర రంగాల పురోగతిని నిలువరిస్తుంది. భయం గురించి మనం ఎంతగా భయపడితే అంతగా భయభ్రాంతుణ్ని చేస్తుంది. భయాన్ని అధిగమించాలంటే దాన్ని ఎదుర్కోవాలి. దానినుంచి పారిపోకూడదు.
పుట్టుకెంత సహజమో చావూ అంతే. ఈ రెండు పరిణామాల మధ్య సాగవలసిన జీవితాన్ని అర్థరహిత, ఆధారరహిత భయాలతో గడిపేయకూడదు. భయపడుతూ జీవించే జీవితం జీవితమే కాదు. అది మృతప్రాయమే. భయం వల్ల సంకల్పం వీగిపోతుంది. ఆలోచనాశక్తి సన్నగిల్లుతుంది. ఉత్సాహం నీరైపోతుంది. ఉద్యోగంలో, జీవితంలో చేరుకోవలసిన స్థితికి చేరలేం. జీవన క్రమంలో కొన్ని అవసరవేళల్లో తీసుకోవలసిన నిర్ణయాలు తీసుకోలేం.

భయం రెండు రకాలు. ఆరోగ్యకరమైనది, అనారోగ్యకరమైనది. మొదటిది- మనల్ని రుజుమార్గంలో నడిపే పాపభీతిని నేర్పుతుంది. స్వీయక్రమశిక్షణ ఇస్తుంది. మనస్సాక్షికి బద్ధుల్ని చేస్తుంది. ఎదుటివారికి హాని కలిగించాలనే ఆలోచననే దరిచేరనివ్వదు. ధర్మచింతనతో ప్రవర్తించే విధంగా ఉపకరిస్తుంది. ఇక రెండోది- జీవితంలో ముందుకు వెళ్లనీయదు. ఆలోచించనీయదు, ఎదగనీయదు.
మానవులు విపరీతంగా భయపడే విషయం మృత్యువు. నిజానికి ఈ భయం వల్ల మేలే జరుగుతుంది. చావు తప్పదన్న స్పృహ మనల్ని అప్రమత్తుల్ని చేస్తుంది. బాధ్యతలను నిర్వర్తించేలా, లక్ష్యాలను చేరేలా, చేయదలచుకున్న సత్కార్యాలను పూర్తి చేసేలా చేస్తుంది. అనివార్యమైన ఆ ప్రకృతి ధర్మం- మన జీవితానికొక అర్థాన్ని, సార్థకతను ఆర్జించుకొమ్మని హెచ్చరిస్తుంటుంది. ఈ మృత్యుభయాన్ని వీడిన క్షణం- మనిషికి ఆనంద సామ్రాజ్యమే. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలే. మన బుద్ధికే కాక మనసుకూ తెలియవలసిన విషయమిది. ఆ స్థితికి చేరుకున్ననాడు చావునైనా నవ్వుతూ ఆహ్వానిస్తాం.
మన మనసులోకి చూసినప్పుడు తప్పు అన్నది లేకుండా ఉండాలి. అప్పుడు ఏ అపరాధ భావమూ దరిచేరదు. అప్పుడిక దేనికీ విచారించవలసిన అవసరమే ఉండదు. మనిషి ఈ ప్రపంచాన్ని మోసం చేయవచ్చు. కానీ, అంతరాత్మను వంచించలేడు- అంతరాత్మ ఎప్పడూ వాస్తవాన్నే చూపుతుంది.
భయపడుతూ జీవించడమంటే అనేకసార్లు మరణించడమే. భయాన్ని వదిలిననాడే జీవితాన్ని నిర్భయంగా, ఆహ్లాదంగా, ఆనందంగా గడపగలం. అదే అసలైన జీవితం. భయపడటం మానేసినప్పుడే మన జీవితం మొదలవుతుందంటాడు ఓ తాత్త్వికుడు.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

సంతోషకరమైన జీవితానికి నేను నమ్మే కొన్ని సూత్రాలు!

సంతోషకరమైన జీవితానికి నేను నమ్మే కొన్ని సూత్రాలు!

1. సంతోషం అనేది ఒక మానసిక స్థితి మాత్రమే.. దానికోసం ప్రత్యేకంగా మనం చేయాల్సింది ఏమీ లేదు అన్నది మొదట గ్రహించటం! ఆ మానసిక స్థితి మనం కోరుకున్న వెంటనే పొందగలగవచ్చు. వస్తువులతోనూ, మనుషులతోనూ, సమాజంతోనూ వచ్చే సంతోషం కన్నా నిరంతరం మనసులో ఉండే సంతోషం చాలా బలమైనది.

2. ఏ వ్యక్తి గురించీ కంప్లయింట్ చెయ్యకుండా ఉండడం. మనకు ఎవరూ హాని చెయ్యరు. మనల్ని ఎవరూ వెనక్కి లాగలేరు. ఒకవేళ ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే అది మన చేతకానితనమే తప్పించి.. అది వారి తప్పు కాదు. ఏదైనా సిట్యుయేషన్ ఉంటే ధైర్యంగా ఫేస్ చేయాలి తప్పించి మనుషుల మీదా, పరిస్థితుల మీదా కంప్లయింట్ చెయ్యకూడదు. ఏదీ అనుకూలించడం లేదు అని మన మీద మనం జాలి పడకూడదు.

3. మంచి లైఫ్ స్టైల్ కలిగి ఉండాలి. కంటి నిండా నిద్ర, శరీరానికి తగినంత ఎక్సర్‌సైజ్ ఉండాలి. నాణ్యమైన జీవన విధానం మాత్రమే గొప్ప జీవితాన్ని అందించగలుగుతుంది.

4. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అందరూ తాగుతున్నారు కాబట్టి, అందరూ స్మోక్ చేస్తున్నారు కాబట్టి అది మంచి అలవాటైపోదు. నీ శరీరాన్ని నాశనం చేసేది ఏదైనా అది చెడు అలవాటు క్రిందే లెక్క. శరీరాన్ని హింస పెట్టే హక్కు నీకు లేదు. ఎంతకాలమని నీ శరీరం నీకు కోపరేట్ చేస్తుంది? పనికిమాలిన అలవాట్లన్నీ కలిగి ఉండి.. అదేదో గొప్పలా ఫీలవ్వకు. జీవితం ఎప్పటికప్పుడు మరింత మెరుగు పరుచుకోవాలి తప్పించి దిగజార్చుకోకూడదు.

5. ఆలోచనలు ఎప్పుడూ స్పష్టంగా ఉండాలి. ఒక విషయాన్ని ఉన్నదున్నట్లు గ్రహించాలి తప్పించి దానికి ఎమోషన్లు, రాగద్వేషాలూ జతచేసి.. మనకు నచ్చినట్లు ప్రాసెస్ చెయ్యకూడదు. మనం ఆలోచించేది తప్పు అయితే నిజాయితీ‌గా ఒప్పుకోవాలి. ఒకవేళ మనం ఏదైనా విషయం తెలియకపోతే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి.

6. మనచావాచాకర్మణా ఏ వ్యక్తికీ హాని చెయ్యకూడదు. ఒక వ్యక్తిని కించపరుస్తూ గానీ, ఒక వ్యక్తిని తక్కువ చేస్తూ గానీ నువ్వు ప్రవర్తించావంటే ఖచ్చితంగా అది నిన్ను మనిషిగా దిగజారుస్తుంది. తోటి మనుషుల్ని ప్రేమించాలన్న, గౌరవించాలన్న సంస్కారం లేని రోజున నువ్వు మనిషిగా ఉండటానికి అర్హత లేనట్లే.

7. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోవటం మాత్రమే జీవితాన్ని డైనమిక్ గా ఉంచుతుంది. ఎప్పుడూ కంఫర్ట్ జోన్‌లో బ్రతక్కు. శ్రమించు, కష్టపడు, సాధించు.. నిన్ను నువ్వు ఎప్పటికీ ఎనర్జటిక్‌‌గా ఉంచుకో!

8. సమాజానికి ఏదైనా చేయాలనిపిస్తే నిజాయితీగా రంగంలోకి దిగి చేయి. ఒక వ్యక్తికి మాట సాయం గానీ, లేదా వ్యవస్థకి నీ ప్రొడక్టివిటీతో సాయం గానీ లేదా ఇంకోటేదైనా.. అది ప్రాక్టికల్‌గా ఉండాలి. అంతే తప్పించి, సామాజిక బాధ్యత అని మేకప్పు వేసుకుని.. మాస్ హిస్టీరిక్‌గా రోజూ పేపర్లలో, టివిల్లో వచ్చే విషయాలకు ఎమోషన్లు పారేసుకోకు. నిజమైన సామాజిక బాధ్యత ఖచ్చితమైన ఫలితాన్ని కలిగి ఉంటుంది. అది ఊహాజనితమైనది కాదు.

9. మనుషులతో కలువు. మాట్లాడు. సంతోషంగా గడుపు. నువ్వెక్కడ నుండో దిగివచ్చినట్లు ఫీలవ్వకు. భూమ్మీదే బ్రతుకు. మనస్సులో ఇగోలు క్యారీ చెయ్యకు. ఇక్కడ ఎవడూ గొప్ప కాదు. జీవితం అనే ప్రయాణంలో ఒక బెర్త్ బుక్ చేసుకుని ఈ భూమ్మీదకి వచ్చాం. కొంతకాలం పాటు అందరూ కలిసి జర్నీ చేసి, ఎక్కడ దిగాల్సిన వాళ్లు అక్కడ దిగిపోతారు. సో చుట్టూ ఉండే మనుషులతో సంతోషంగా బతకడమే జీవితం.

10. నీకు సాయపడిన వారి పట్ల కృతజ్ఞత చూపించు. అలాగే చిన్న వాళ్లని మెచ్చుకో.. నీకు తెలిసిన నాలుగు విషయాలు ఇతరులకి నేర్పించు. గురువుగా బ్రతుకు తప్పించి స్వార్ధపరుడిగా బ్రతక్కు. ఈరోజు ఈ భూమ్మీద నాలుగు ముద్దలు తినగలుగుతున్నాం అంటే.. వ్యవసాయం చేసిన రైతు మొదలుకుని ఇంటికి బియ్యం డెలివరీ చేసిన బిగ్ బాస్కెట్ బాయ్ వరకూ.. ఇంట్లో కష్టపడి ఓపిక తెచ్చుకుని అన్నం వండి ప్రేమగా వడ్డించిన తల్లి, భార్య వరకూ అందరి కష్టం దాగుంది. ఆ మాత్రం కృతజ్ఞత చూపించకపోతే ఇంకేం మానవత్వం ఉందని మనలో?

సేకరణ. మానస సరోవరం 🙏🙏🙏🙏

Source - Whatsapp Message

బ్రాహ్మీముహూర్తంలో లేస్తే

బ్రాహ్మీముహూర్తంలో లేస్తే ఏంటట అనేవారికి సమాధానం
ఉదయాన్నే నిద్రలేవాలని మన పెద్దవాళ్లు తెగ పోరేవారు. అలా చెప్పీ చెప్పీ చాలా తరాలు వెళ్లిపోయాయి. తరం మారుతున్న కొద్దీ జీవవనశైలి మారిపోతోంది. నిద్రలేచే సమయాలూ, పనిచేసే వేళలూ మారిపోతున్నాయి. కొన్నాళ్ల తరువాత పని చేయడానికీ, నిద్రపోవడానికీ రాత్రీపగలుతో సంబంధమే లేకపోవచ్చు. కానీ ఇప్పటికీ బ్రాహ్మీముహూర్తం` అన్న మాట అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ బ్రాహ్మీముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది. ఆ సమయంలో నిద్రలేవడం వల్ల ప్రయోజనం ఏంటి!
సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. అయితే రుతువుని బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి కాబట్టి, 4:00 -4:30 a.mని బ్రాహ్మీముహూర్తంగా అనుకోవచ్చు. బ్రాహ్మీ అంటేనే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించే ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగే ప్రశ్నకు చాలానే జవాబులు వినిపిస్తాయి.
ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా, నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది, కానీ వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్నీ, పగటివేళ చురుకుదనాన్నీ ఏకైక కాలంలో కలిగిఉండే సమయం ఇదన్నమాట! అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు కాబట్టి, ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యనమస్కారాలు చేయడమో, వ్యాహ్యాళికి వెళ్లడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది.
మనలో జీవగడియారం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరుచుకున్న అలవాట్లను బట్టీ, ప్రకృతిని బట్టీ నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం… ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. సాక్షాత్తూ ఆయుర్వేదమే తన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ కాపాడుకోవాలని అనుకునేవాడు బ్రాహ్మీముహూర్తంలో లేవాలి అని చెబుతోంది. పైగా ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం వాత ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికలనీ, ఆలోచనలనీ, రక్తప్రసరణనీ ప్రభావితం చేసేది ఈ వాత లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం; ప్రశాంతంగా ఉండగలం; మంచి ఆలోచనలు చేయగలం; చదివినదానిని ఆకళించు చేసుకుని దీర్ఘకాలం జ్ఞప్తికి ఉంచుకోగలం.
ధ్యానం చేయాలనుకునేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమని యోగశాస్త్రం చెబుతోంది. మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయిని యోగుల నమ్మకం. బ్రాహ్మీముహూర్తంలో సుషుమ్న నాడి చాలా ఉత్తేజితంగా ఉండి… ధ్యానం చాలా సులువుగానూ, ప్రభావవంతంగానూ సాగే అవకాశం ఉంటుందట.
ఉదయాన్నే మన శరీరంలోనూ, చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల యోగా, ధ్యానం, చదువు… చాలా తేలికగా ప్రభావవంతంగా సాగుతాయి. రోజువారీ చేయాల్సిన విధులకు (ఉద్యోగం, కాలేజ్‌, వంటావార్పూ…) ముందు కాస్త సమయం చేజిక్కుతుంది. అలా కాకుండా ఆలస్యంగా లేచి ఒక్కసారిగా మన పనులలో చేరేందుకు పరిగెత్తడం వల్ల… మన మనసు, శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి.
గుండెజబ్బులు ఉన్నవారికి తెల్లవారుజామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, పైగా అలా వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందనీ వైద్య గణాంకాలన్నీ సూచిస్తున్నాయి. గుండెల్లో రక్తనాళాలను గడ్డకట్టించే థ్రోంబస్‌ అనే సమస్య ఉదయం వేళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఖచ్చితమైన కారణాలు ఏవీ చెప్పలేకపోతున్నారు వైద్యులు. పైగా ఇదే సమయంలో మనం హడావుడిగా లేచి విధుల్లోకి చేరాలనే టెన్షన్‌లో మనలోని రక్తపోటు మరింత ఎక్కువై అది గుండెపోటుకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే బ్రాహ్మీముహూర్తంలోనే నిద్రలేచి, వీలైతే కాసేపు ధ్యానం చేసుకుని… స్థిమితంగా రోజువారీ పనులకి సిద్ధపడితే మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని చదివిని తరువాత బ్రాహ్మీముహూర్తంలో లేవడాన్ని ఛాదస్తం అని ఎలా అనుకోగలం చెప్పండి!

Source - Whatsapp Message

విశ్వాసం

విశ్వాసం
""""""""""""

విశ్వాసం అనేది ఒప్పందం కాదు -

విశ్వాసం అనేది పరిధులు లేని నమ్మకం.

విశ్వాసం అనేది గెలుపు, ఓటములకు అతీతమైనది.

భయపడుతూ ఉన్నవాడు ఎలా విశ్వసించగలుగుతాడు?

ఆ మనిషి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు.

ఆ మనిషి ఎప్పుడూ కపటంతో ఉంటాడు.

ఆ మనిషి ఎప్పుడూ తనని తానూ కాపాడుకుంటూ ఉంటాడు.

అటువంటి మనిషి ఎలా విశ్వసించగలుగుతాడు?

విశ్వాసం మేదాపరమైన విషయం కాదు.

మనస్సును ఒప్పించడం వల్ల కాదు.

అది మన హృదయంలో వుంటుంది. కాబట్టి మనం విశ్వసించి దానిని చెయ్యాలి.

విశ్వసించాలంటే మనకు ధైర్యం ఉండాలి.

విశ్వసించాలంటే మనకు సాహసం కావాలి.

విశ్వసించాలంటే ఓ అపాయాన్ని స్వీకరించే సామర్థ్యం మనకుండాలి.

విశ్వసించా లంటే ఒక ప్రమాదంలోకే మనం ప్రవేశించగలగాలి.

మనం నడిచే దారిలో ఎదురొచ్చే అడ్డంకులకు భయపడరాదు.

అడ్డువచ్చే శక్తులు ఎంత బలీయమైనవైనా చలించరాదు.

పైకి కనబడేవి వ్యతిరేకంగా ఉన్నప్పుడే విశ్వాసంతో ప్రవర్తించాలి.

ఎంతసేపూ మోండిగా వ్యవహరిస్తే సత్యమేమితో గ్రహించలేము.

మనం నిజాయితీపరులమైనప్పుడు భీతి చెందవలసిన పనేలేదు.

సత్యం, ప్రేమ, విశ్వాసం ఉంటే ఏదీ అనభిగమ్యం కాదు.

..... ☀మోహన్........

Source - Whatsapp Message

కర్మ ఫలం తప్పదు

కర్మ ఫలం తప్పదు

🙏అందర్నీ హెచ్చరించే మంచి వ్యాసం. అందరూ చదవాలని మనవి 🙏

కర్మఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు.
మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది. ఎందుకంటే? కర్మ బలీయమైనది.

పరీక్షిత్తు మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు.
కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు గొప్ప మంత్రవేత్త. రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు. దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.

తక్షకుడు కూడా బ్రహ్మణ వేషధారియై, కశ్యపుని చూసి మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం? అని అడిగాడు.
ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.

అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటూవేయబోయేది ఏదో నీటిపామో, బురద పామో అనుకుంటున్నావా? సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు తక్షకుడే స్వయంగా అయితేనో? అన్నాడు.

తక్షకుడైనా కానిమ్ము! అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! నా దగ్గర ఉన్నది గారడీవాడి పాముమంత్రమో, విషకీటక మంత్రమో అనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు కశ్యపుడు.

అంత గొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని అని నిజరూపం చూపించాడు తక్షకుడు.

అంతటా కశ్యపుడు, సర్పరాజా! నీకిదే నా ప్రణతి! దీనితోపాటే నా వినతి కూడా విను! మంత్రాధిష్ఠాన దైవానుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను! తక్షణం విషహరమంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను. ఇది నా దృఢవిశ్వాసం అని అన్నాడా కశ్యపుడు.

అపుడా తక్షకుడు, తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టునుచూడు! దీని ఊడలు ఏవో, మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా! లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విషశక్తి చూడు! అని ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు.

కశ్యపుడు అదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు. తక్షకుడు చెప్పినదాంట్లో ఆవగింజంతయినా అబద్ధంలేదు. ఆ మహా విషకీలలకు, చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి, అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు! అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశి నుంచి తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్రజపం చేసి అభిమంత్రించి
ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచినాడు.

చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహావృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది.

వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని మహామంత్రద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసినాను, నా అజ్ఞానాన్ని మన్నించండి! తమకు తెలుసో... లేదో, నిజానికి పరీక్షిత్తు శాపరూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే, అంతటి ధర్మమూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. త్వరలో కలిప్రవేశం జరగబోతోంది. అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం పరీక్షీతుని అంకం పరిసమాప్తం కావాలి! ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు.

ఇంతకూ తమకు కావలసింది.... అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా ధనమయ్యా! ధనం! అన్నాడు. అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపివేసినాడు.

ఇంతవరకూ కథ బాగుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది చాలా వున్నది.

మన తలరాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు.
ఓక వేళ కశ్యపుడు లాంటివాడు బయలుదేరినా వారిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం.
అదే మనం చేసుకొన్న పాపం,కర్మఫలం.
పాపకర్మ బలీయంగా వుంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, ఆఖరికి భగవంతుడు కూడా.

ఎందుకంటే వాడి కర్మ కలిసిరావాలి.
కౌశికుడు రాజును రక్షించుదామని బయలుదేరినా, పరీక్షిన్మహారాజు యొక్క పాపకర్మ అడ్డు పడినది.
ఏమిటి ఆ పాప కర్మ?
ఓక ముని మీద చచ్చిన పామును వేయడం.
మంచివారితో మహాత్ములతో చెలగాడటం.
కోరి కోరి తన మృత్యువును అహంకారంతో కొని తెచ్చుకొన్నాడు.

రాజు, మునిశాపం వలనో, తక్షకుడి కాటు వలనో చనిపోలేదు, కేవలం తన కర్మ చేతనే చనిపోయినాడు.

పరీక్షిత్తు మహారాజుకు, గ్రహముల వలన కీడు జరగలేదు. ఇక్కడ తక్షకుడు ఎంత నిమిత్తమాత్రుడో, అదే విధముగా గ్రహములు కూడా! మానవునికి, కర్మ ఫలము నొసగడంలో గ్రహముల యొక్క ప్రమేయం వుంటుంది.

మన పాపములు గ్రహముల రూపములో మనల్ని కర్మఫలం అనుభవింప జేస్తాయి.
నిజానికి ఏ గ్రహమూ మనల్ని ఏమీ చేయదు.
మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది.
కర్మ బలీయమైనది.

గోవిందా, నారాయణా, రామా,శివా!కాపాడు!కాపాడు!అని ప్రార్ధిస్తూ ఉంటాం. ప్రాణాపాయంలో వున్నవాడి జాతకం చూసి భగవంతుడు ఇలా అంటాడు. ఓయి, నీవు ఎప్పుడన్నా పుణ్యం చేశావా? నీ భార్య చేసిందా? నీ బిడ్డలు చేసినారా? నీ మిత్రులు నీకు పుణ్యం ధారపోసినారా? నీకు గురువుల అనుగ్రహం వున్నదా? నీవు చేసిన పుణ్యం లేదు, ఇతరులు నీకు ధారపోసిన పుణ్యం లేదు. మరి నేను ఎక్కడి నుంచి తెచ్చేది? అనుభవించు! నీ కర్మ అని అంటాడు.

మన పుణ్యపలం మన జాతకంలో గురురూపంలో కనిపిస్తుంది.
గురు అనుగ్రహం వున్నదా?
గురు దృష్టి వున్నదా?
శుభగ్రహ దృష్టి వున్నదా?
వుంటే బ్రతికిపోతాము. లేదా బాధ పడాలి, తప్పదు.
పాపం అంటే శరీరాన్ని తద్వారా మనసును బాధ పెట్టడమే.

"మనసు బాధ పడితేనే పాపకర్మ క్షయం అవుతుంది."
"మనసు సుఖ పడితే పుణ్యకర్మ క్షయం అవుతుంది" .

పాపానికి, పుణ్యానికీ కారణం మనస్సే. ఆ మనసు చలించకుండా వుంటే పుణ్యమూ లేదు,పాపమూ లేదు. అదే అకర్మ,వికర్మ,సుకర్మ.
కోరిక లేకుండా చేస్తే కర్మ మనసును పట్టుకోదు.

తాతముత్తాతలు చేసిన పుణ్యఫలం, పాపఫలం తప్పక పిల్లలకు వస్తుంది, వచ్చి తీరుతుంది.
ఆ పుణ్యమే మన సంతానాన్ని, మనుమలన్ని కాపాడుతుంది. మన వంశాన్ని కూడా కాపాడుతుంది.
ఇదే మన జాతకంలో రెండవ స్తానం, తొమ్మిదవ స్తానం స్పష్టంగా చెబుతుంది.

మనం చేసిన పాపాలు, ప్రారబ్ధం మన పితృదేవతలు చేసిన పుణ్యఫలితం వలన బ్రతికి బయట పడతాము.
వారి పుణ్యఫలం మనల్ని కాపాడుతుంది.
మనం చేసిన పుణ్యఫలం మన బిడ్డలను కాపాడుతుంది.

సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్షములు వున్న పరీక్షిత్తు అంతటి వాడు కూడా మాయలో పడ్డాడు గదా!
కలిపురుషున్ని నిలదీసిన వాడు కూడా అహంకారానికి లోనైనాడు. శ్రీకృష్ణ పరమాత్మ
చేత రక్షింపబడి, గర్భం నుండి బయటపడిన వాడు నేడు మృత్యువు నుండి ఎందుకు బయట పడలేదు.
అదే కర్మఫలం, కాల మహిమ.

కాలానికి, మాయకు ఎవ్వరూ అతీతులు కారు. దీనిలో మనం మరోకటి కూడా గమనించాలి.
తక్షకుడు విషనాగు అంటే ప్రారబ్దకర్మ. దానిని కూడా జయించింది మంత్రశాస్త్రం.
కాటు చేత పుష్పించిన మహావృక్షం కాలి బూడిద అయితే, మంత్రం మరలా దానిని చిగురింప జేసినది.
అంటే మంత్రం చేత ప్రారబ్దకర్మ తొలగబడుతుంది అని మనం తెలుసుకోవాలి.
మంత్రం ప్రాణం పోస్తుంది.
కానీ ఆ మంత్రం పనిచేయాలంటే ప్రారబ్ధకర్మ బాగుండాలి! అంటే మనం సత్కర్మలు మాత్రమే ఆచరించాలి!🙏అందర్నీ హెచ్చరించే మంచి వ్యాసం. అందరూ చదవాలని మనవి 🙏

Source - Whatsapp Message

హనుమ నేర్పిన నీతి...

హనుమ నేర్పిన నీతి...


సాక్షాత్తు భగవంతుడిని కూడా ప్రశ్నించవచ్చా? ఎవరిని.. ఎలా అడగాలి? అన్న ప్రశ్నలకు హనుమంతుడు ఒక సమాధానంగా నిలుస్తాడు.

సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు.

సుగ్రీవుడి నివాస ప్రాంతం అది. తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు.

మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు.

‘రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ!
దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!’

మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు. మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది. గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమృగాలు సంచరించే ఇలాంటి చోటుకు రారు’ అని ప్రశ్నిస్తాడు హనుమ.

ప్రశ్న అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ.
ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు. వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు. వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు. హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు..

మనం కూడా మన సందేహాన్ని ప్రశ్నను కూడా గొప్పగా అడగ గలగాలి..✍️

Source - Whatsapp Message

Friday, June 11, 2021

రెండు వాస్తవ కథలు

రెండు వాస్తవ కథలు: చదివిన తర్వాత మీ జీవన విధానంలో మార్పు వస్తుంది....

మొదటి కథ:

శ్రీ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా రాష్ట్రపతి అయిన తర్వాత ఒకరోజు (వారి సురక్ష బలంతో కలిసి )వారి అంగరక్షకులతో కలిసి హోటల్ కు భోజనంకు వెళ్తారు. అందరు కూడా వారికి ఇష్టమైన పదార్థాలను ఆర్డర్ ఇచ్చి వాటి రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నారు.
అదే సమయంలో మండేలా గారి సీటుకు ముందు ఉన్న సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి భోజనం రాకకై ఎదురు చూస్తున్నారు. మండేలా తన అంగరక్షకులతో చెప్పి ఆ వ్యక్తిని కూడా వారి టేబుల్ దగ్గరికి పిలిపించుకున్నాడు. తర్వాత భోజనం వచ్చింది, అందరూ భోజనం చేస్తున్నారు. ఆ వ్యక్తి భోజనం చేస్తున్నాడు కానీ చేతులు వణుకుతున్నాయి. భోజనం పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి తల కిందకి పెట్టుకొని హోటల్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత మండేలా గారితో వారి అంగరక్షక అధికారి ఆ వ్యక్తి అనారోగ్యంతో వణుకుతున్నాడు అని చెప్పారు. అప్పుడు మండేలా గారు అది కాదు నేను జైల్లో ఉన్నప్పుడు పని చేసిన జైలు అధికారి అతను..... నన్ను రోజంతా నానా రకాలుగా హింసించేవారు. ఆ బాధలు భరించలేక దాహం వేసి నీళ్ళు అడిగితే ఇతడు నాపై మూత్రం పోసేవాడు.
ఇప్పుడు నేను రాష్ట్రపతిని అయ్యాను. నేను కూడా అతని లాగానే వ్యవహరిస్తనేమోనని ప్రతీకారము తీర్చుకుంటానేమోనని భయపడినట్లు ఉన్నాడు కానీ నా స్వభావము అది కాదు. “ ప్రతీకారం తీర్చుకోవాలనే భావన వినాశనమునకు దారితీస్తుంది. ధైర్యం మరియు సహిష్ణుత కలిగిన మానసిక స్థితి వికాసానికి దారితీస్తుంది"


రెండవ కథ:

ముంబై నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న రైలులో సీటు కింద దాగి ఉన్న అమ్మాయిని.... నీ టికెట్ ఎక్కడ ఉందని టి. సి అడుగుతాడు?. అమ్మాయి వణుకుతూ భయపడుతూ నా దగ్గర టికెట్ లేదు సార్ అంటుంది. లేకుంటే దిగిపో అంటాడు టి. సి . వెనక నుండి ఒక యాత్రికురాలు ఉషా భట్టాచార్య వృత్తిరీత్యా ప్రొఫెసర్. ఆ అమ్మాయికి టిక్కెట్టుకు డబ్బులు నేను ఇస్తాను సార్...
ఉషా జి: నువ్వు ఎక్కడికి వెళ్లాలి?
పిల్ల: తెలియదు మేడమ్!
ఉషా జి: అయితే నాతో రా బెంగళూరు దాకా!
ఉషా జి: నీ పేరు ఏంటి?
పిల్ల : చిత్ర
బెంగళూరు చేరుకున్న తర్వాత తెలిసిన స్వచ్ఛంద సంస్థతో మాట్లాడి ఆ అమ్మాయికి వసతి, ఒక మంచి పాఠశాలలో చదువు కొరకై చేర్పిస్తుంది.
ఉషా జి కి త్వరలోనే ఢిల్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని కారణంగా చిత్ర తో సంబంధం తెగిపోతుంది. అప్పుడప్పుడు ఫోన్ ద్వారా మాట్లాడడం జరుగుతుండేది.
సుమారు 20 సంవత్సరాల తర్వాత ఉషా గారు శాన్ ఫ్రాన్సిస్కో( అమెరికా) ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళవలసివచ్చింది. ఉపన్యాసం తర్వాత హోటల్ లో బిల్ చెల్లించడానికి రిసెప్షన్ దగ్గరికి వెళితే అప్పటికే వారి వెనక నిలబడిన దంపతులు చెల్లించినట్లు తెలిసింది.
ఉషా జి : "నా బిల్లు మీరెందుకు చెల్లించారు"
" మేడం ముంబై నుంచి బెంగళూరుకు తీసుకున్న రైలు టికెట్ ముందు ఇదేం పెద్ద విషయం కాదు"...
ఉషా జి: "అరే చిత్ర"
చిత్ర ఎవరో కాదు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా మూర్తి మరియు ఇన్ఫోసిస్ కంపెనీ సంస్థాపకులు నారాయణ మూర్తి గారి భార్య..
ఈ చిన్న కథ సుధా మూర్తి రాసిన పుస్తకం "ద డే ఐ స్టాండ్ డ్రింకింగ్ మిల్క్” పుస్తకం నుండి తీసుకోబడింది. అప్పుడప్పుడు చేసే చిన్న చిన్న సేవలు కొందరి జీవితాల్లో వెలుగులు నింపుతాయి.

కాబట్టి జీవితంలో ఏదైనా సంపాదించాలంటే పుణ్యాన్ని సంపాదించుకోండి. అదే మనల్ని స్వర్గం దాకా తీసుకెళుతుంది.

మరి ముఖ్యంగా కరోనా వ్యాప్తి చెందుతూ అనేకులు బాధించబడుతున్న ఈ తీవ్ర దుర్భిక్ష దినములలో మన కనీస కర్తవ్యం గా అవసరతలో ఉన్న వారిని చేతనైన విధంగా ఆదుకుందాం.. జీవుల్లో దేవుడ్ని చూద్దాం. ఆ కైలాసవాసుడు లేదా మీరు నమ్మిన దైవం మిమ్మల్ని చల్లగా చూస్తాడు*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻. .

Source - Whatsapp Message

Thursday, June 10, 2021

శ్రీ రాముడు ఆదర్శనీయుడు

🕉️ శ్రీ రాముడు ఆదర్శనీయుడు🕉️

✍️ మురళీ మోహన్

🙏 భారతీయులలో చాలామంది రాముణ్ణి ఆరాధిస్తారు. కానీ మీరు అతని జీవిత పరిస్థితులను, అతని జీవితం నడచిన తీరును గమనిస్తే, అది అంతా ఓ విపత్తుల పరంపరగా అనిపిస్తుంది. అతను ధర్మ బద్ధంగా తనది కావలిసిన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. పైగా అడవులు పట్టి పోవలసి వచ్చింది. అంతలోనే అతని ధర్మపత్ని అపహరణం. అందుకోసం అతనికి ఇష్టం లేకపోయినా ఒక ఘోర సమరం చేయవలసి . అప్పుడామె నిండు గర్భవతి. కవలలకు జన్మనీయబోతూ ఉంది. ఆ తరువాత, తన కన్నబిడ్డలే అని తెలియని పరిస్థితిలో, వారితోనే యుద్ధం చేశాడు. చివరకు తన భార్యను కూడా కోల్పోయాడు. అతని జీవితం ఒక ఎడతెగని విపత్తు. ఇంత జరిగినా, ఎందుకు జనులు రాముణ్ణి ఆరాధిస్తారు ?

రాముని ప్రత్యేకత జీవితంలో అతడు ఎదుర్కొన్న పరిస్థితులలో లేదు. ఎదురైన విపత్తులలో అతను ఎంత ఉన్నతంగా నడుచుకున్నాడన్న దానిలోనే అతని ఔన్నత్యం ఉన్నది. ఏనాడూ అతనిలో కోపం లేదు, ఎవరినీ నిందించటం లేదు, గగ్గోలు పెట్టడం లేదు. అతడు అన్ని సందర్భాలలోను ఉదాత్తంగా, హుందాగా నడుచుకున్నాడు.

అందువల్లనే పవిత్ర జీవనాన్నీ, ముక్తినీ సాధించాలని తపించే వ్యక్తులు రామునిలా జీవించాలని తపిస్తారు. ఎందుకంటే బాహ్య పరిస్థితులు ఏక్షణంలోనైనా విషమించగలవు అని వారు తెలుసుకున్నారు. ఆ విజ్ఞతను వారు పొందారు. ఎన్నో రకాలుగా జీవిత పరిస్థితులను చక్కదిద్దుకుంటూ ఉన్నా కూడా, బాహ్య పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు విషమించే ఆస్కారం ఉంది. మీరు అన్నీ సక్రమంగానే నిర్వహించుకోవచ్చు. కానీ ఒక వేళ తుఫాను లాంటి సమస్య వస్తే మాత్రం అది మీ ఇంటిని, మీ సమస్తాన్ని తుడిచిపెట్టేస్తుంది. “నాకేమీ అలా జరగదులే’’ అని అనుకోవడం మూర్ఖంగా బ్రతకటమే అవుతుంది. “ఒకవేళ అదే జరిగినా కూడా నేను దానిని ధైర్యంగా ఎదుర్కొంటాను’’ అని అనుకోవడం వివేకమైన జీవనమార్గం. ఈ మహత్తరమైన విజ్ఞత రామునిలో కనిపిస్తుంది. అందుకే జనులు అతన్ని ఆరాధిస్తారు.

మీ వద్ద ఎంత ఉంది, మీరు ఏం చేసారు, ఏం జరిగింది, ఏం జరగలేదు, ఇవన్నీ ప్రశ్నలు కావు. ఏది జరిగినా, మిమల్ని మీరు ఎలా నిలుపుకుంటున్నారు? అదే అసలు విషయం

దీని అర్థం, మన జీవితాన్ని మనం సక్రమంగా నడుపుకోకూడదనా? కానే కాదు! మన చుట్టూ ఉన్న వ్యవహారాలను చక్కగా సరిదిద్దుకోవాలి. అది అందరికీ మంచిది. అలా ఒక పరిస్థితిని చక్కగా నిర్వహించినప్పటికీ కూడా, మనలో అది తప్పకుండా ఒక అద్భుత భావనను కలిగిస్తుందని చెప్పలేము. కాని ప్రతి పరిస్థితిలోనూ మనల్ని మనం మనోజ్ఞంగా నిలబెట్టుకోగలిగినప్పుడు, మనలో అది తప్పకుండా ఒక అద్భుత భావనను కలిగిస్తుంది. ఐనా, అందరి శ్రేయస్సు పట్లా మనకి శ్రద్ధ ఉంది కాబట్టి, మనం ఏ పరిస్థితినైనా సక్రమంగా నిర్వహించాలి.

తన జీవితంలోని పరిస్థితులను చక్కదిద్దటానికి రాముడు ప్రయత్నించాడు. కానీ అన్ని వేళలా అది వీలుకాలేదు. అనేక విషమ పరిస్థితులు అతడు అనుభవిస్తూ వచ్చాడు. పరిస్థితులు నియంత్రణను దాటిపోయాయి. కానీ ముఖ్యమైన విషయం ఒక్కటే. అతడు అన్నివేళల ఉదాత్తంగా, హుందాగా నడుచుకున్నాడు. ఇదే ఆధ్యాత్మికతలోని మౌలిక సారాంశం. మీ జీవితం ఒక సుందర పరిమళపుష్పంలా వికసించాలంటే దానికి సానుకూలమైన అంతర్గత పరిస్థితిని కల్పించుకోవాలి. అటువంటి స్థిరమైన అంతర్గత వాతావరణాన్ని మీరు ఎల్లప్పుడూ సృష్టించుకోవాలి. ఇందుకు శ్రీరాముడు ఆదర్శప్రాయుడు. అందుకే ఆయన అందరికీ ఆరాధ్యనీయుడు! 🙏

Source - Whatsapp Message

క్రొత్త శరీరములు మార్చే యోగి

🍁క్రొత్త శరీరములు మార్చే యోగి🍁

అనుభవం : స్వామి జ్ఞానానందగిరి మహారాజ్

📚✍️ మురళీ మోహన్

🙏.. . ....నేను హిమాలయాలను తిలకిస్తూ, తిరుగుతున్నాను. అమర్ నాథ్ దారిలో, చందన్ వాడి నుండి లోపలికి 50 కిలోమీటర్ల దూరంలో మంచు గుహలోని ఒక యోగి గురించి ఒక సాధువు చెప్పారు, వారిని వెతుకుతూ వారి దర్శనార్థం వెళుతున్నాను. అమర గంగా జలపాతం , మంచుపర్వతాలు, మహావృక్షాలు, కొండల నుండి జాలువారే జలపాతాలు..... మహా ఆహ్లాదంగా ఉంది ప్రకృతి. ఒక మంచు కొండకు ఒక గుహా సొరంగం ఉంది. గుహలోకి ధైర్యం చేసి వెళ్లాను. పెద్ద జడలతో, భారీ శరీరముతో ఒక వృద్ధుడైన యోగి ధ్యాన ముద్రలో ఉన్నారు. వారికి ప్రణమిల్లి ధ్యానంలో రెండు రోజులు అలాగే కూర్చున్నాను. ఆ యోగి లేచి నన్ను చూశారు. ఏమనలేదు. ఎప్పటికీ లేవనందున తట్టిలేపాను.

ఎవరు? ఎందుకొచ్చావ్ ? అని అరిచారు.

సాష్టాంగ ప్రణామం చేసి బాబా, తమరి దర్శనానికి వచ్చాను. తమరు ధ్యానంలో ఉన్నందున, ధ్యాన భంగం చేయడం ఇష్టం లేక, నేను ధ్యానంలో కూర్చున్నాను.... అన్నాను.

నీకేమి కావాలి? అన్నారు బాబా.....

మీ గురించి తెలుసుకోవాలి, అన్నాను నేను.

ప్రశ్న :- తమరి పేరు?

జ :- ఏ శరీరంలోని పేరు ?

ప్రశ్న :- అదేంటి, బాబా ఈ శరీరములో ఉన్నారు, కాబట్టి ఈ పేరే చెప్పండి....

జ :- నాయన నాకు 100 సం||లు నిండాయంటే ఒక శరీరం మారుస్తా..... ఇది మూడో శరీరం. 100 నిండింది 4వ శరీరం కోసం వెతుకుతున్నాను, అన్నారు.

ప్రశ్న :- అదేంటి బాబా, మీరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. మరణం అనేది లేదా?

జ :- ఉంది. కాని యోగికి ఇచ్చామరణం. తనకు ఇష్టమొచ్చినప్పుడు దేహం విడిచే అర్హత యోగి సంపాదిస్తాడు. తన తీవ్ర సాధనల ద్వారా.....

ప్రశ్న :- మీరు మార్చబోయే శరీరం ఎక్కడుంది?

జ :- పహల్గామ్ లో....ఈ రోజు నుండి 4 రోజులకు 20 సంవత్సరాల యువకుడు మరణిస్తాడు. వాడిని ఊరుబయట పూడుస్తారు, నీవు వెళ్ళి మట్టి తీసి, వాడిని తీసి, పైకి లేపు. ఆ శరీరంలోకి నేను ప్రవేశిస్తాను.

ప్రశ్న :- ఊరు వాళ్లు నన్ను దండిస్తే...... అన్నాను?

జ :- నేనిచ్చే విభూతి చుట్టూ.... చల్లుకో! నీవు ఉన్న చాలా దూరం చీకటైపోవును. అర్ధరాత్రి ఆ శవంపై మట్టితీసి ఉంచు. నీవెవరికి కనిపించవు.

ప్ర :- బాబా ఇంత శ్రమదేనికి కొత్త శరీరం ధరించొచ్చుగదా?

జ :- కొత్త శరీరం ధరిస్తే 9 నెలలు గర్భనరకం, పుట్టాక అజ్ఞాన దశలో 12 సంIIలు బాధలు, చదువు - విద్య ,మళ్ళీ తపస్సు పెద్ద తతంగం, ఎంచక్కా దేహం మార్చితే, పూర్వజ్ఞానమంతా నా వెంటనే ఉండును. అందుకే ఇలా చేస్తున్నాను.

(ఈ వాదం నిరాక్షేపణీయమైనది. కానీ తీవ్ర సాధన చేయాలి.)



ప్రశ్న :- మిమ్ములను గుర్తించేదెలా?

జ :- ఆ యువకుడి శరీరంలోకి ప్రవేశించినా, నా పూర్వజ్ఞానం నా దగ్గరే ఉండును. నా కంఠం మారదు. నా విద్య, నా వద్దనే ఉండును. నీవు నా వద్దకు ఏ సందేహాలు తీర్చుకోవాలని వచ్చావో అన్నిటికీ, జవాబిచ్చెదను.

ప్రశ్న :- బాబా తమరి పేరు?

జ :- మంచు గుహలో ఉన్నందున, నన్ను "బరఫ్ బాబా" అంటారు.
నేను వచ్చి ఊరి బయట ఉన్న స్మశానంలో కొత్తగా పూడ్చి పెట్టిన శవంపై మట్టి తొలగించి ఎదురు చూస్తున్నా.... బాబా పై పూర్తి విశ్వాసం ఉంది ! చుట్టూ విభూతి చల్లడంతో చీకటిగా ఉంది. అందులో అది అర్ధరాత్రి. 5 నిముషములలో శవంలోకి ఏదో వెలుగు ప్రవేశించినట్టు అయింది. కొన్ని క్షణాల్లో నిద్రలో నుండి లేచినట్టు, ఆ యువకుడు లేచి ఉన్నాడు. నాయనా! మంచిపని చేశావు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళి పోవాలి. లేదంటే, నా శరీరమును చూసి దయ్యం అనుకుంటారు. లేదా గుర్తించి మావాడు, అని ఇంటికి తీసుకెళతారు అని ఆ మహాత్ముడు తెలిపెను.
బరఫ్ బాబా మరియూ నేను, ఆ ప్రాంతం వదిలి కాశ్మీర్ లోని ఒక లోయలో గుహలో వచ్చి ఉన్నాము.

ప్రశ్న :- బాబా ఇలా శరీరాలు మార్చే విద్య మీకెలా వచ్చింది ? దయచేసి చెప్పండి. అని అడిగాను.

జ :- నాయనా! నా నాలుగో శరీరం పేరు, ధుని బాబా. నేను నాథ సాంప్రదాయ సాధువును. ఎప్పుడూ , ధుని వెలిగించు కోవడంతో ఆ పేరు పిలిచేవారు. కర్ణ ప్రయాగ నుంచి 50 కిలో మీటర్ల లోపల లోయలో పర్వత గుహలో ఉండేవాడిని. మా గురువు యోగ
విద్యలో ప్రవీణుడిని చేశారు. నలబై సంవత్సరాలు కఠోర తపమాచరించాను. నేను నా శరీరాన్ని, ఈగలు దోమలుగా మార్చే శక్తిని కూడా పొందాను. విదేశాలు చూడాలని కోరిక కలిగింది. విమానం ఎక్కేవానిపై ఈగనై వాలి అలా విదేశాలు కొన్ని చూశాను. మళ్లీ తిరిగి వచ్చి 20 సంవత్సరాలు తపస్సు చేసి ఆకాశంలో ప్రయాణించే సిద్ది పొందాను. (ఆకాశ గమన విద్య) ఆకాశగమన విద్య సహాయంతో.... చాలా దేశాలు తిరిగాను. నేను రహస్యంగా హిమాలయాల్లో తపోజీవనానికే, అలవాటు పడినాను. నాకు బయటి ప్రాపంచికులంటే, ప్రదేశాలంటే ఇష్టం ఉండేది కాదు. 100 సం||రాలు నిండాక ......
బద్రినాథ్ యాత్రకొచ్చే ఒక యాత్రికుల గుంపులో 15 సంవత్సరాల బాలుడు చనిపోతే, ఆనాడు ప్రయాణ వసతులు లేనందున, అతన్ని అక్కడే పూడ్చారు. నేను వెళ్ళి ఆ శవంపై మట్టి తీసి అందులోకి ప్రవేశించి ధుని బాబా అనే ఈ శరీరాన్ని గంగలో పారవేశాను. శరీరం మార్చినా, గాని నేను నేర్చిన విద్య, జ్ఞానం నాతోనే ఉంది. నేను కర్ర ఎప్పుడు చేతిలో పట్టుకొనే వాడిని. లక్కడ్గిరి అనేవారు. ఆ శరీరంకు 100 సంIIలు నిండిన సమయానికి, దూద్ కాశిలోని కొండ గుహలో ఉన్నాను. కొండ ప్రక్కన గల గ్రామం వారింట్లో ఒక యువకుడు అడవికొచ్చి ప్రమాదంలో, లోయలో పడి చనిపోతే , అతడి శరీరం స్వీకరించాను. ఆ తరువాత నేను టిబెట్లో స్థిరపడ్డాను, కుటీరం వేసుకొని ఉన్నాను. "కుటియా బాబా" గా పిలువబడ్డాను. తిరిగి ఒక గుహలో చేరాను.

అక్కడ ఆ దేహానికు 100 సం||లు నిండితే ముక్తినాథ్ యాత్రికులలో ఒకడు టిబెట్ లోయలో 18 సం||రాల యువకుడు లోయలో జారిపడ్డాడు. అతని చొక్క చెట్లకు చిక్కుకొని లోయ లోతు చూసి భయపడి చనిపోయిన, ఆ యువకుని చొక్కా చిరిగి జలపాతంలో శరీరంపడి కొట్టుకొని 2వ రోజు, నా గుహముందు రాయికి ఆనుకొని ఉంది. బాగా పరిశీలించా శరీరం చక్కగానే ఉంది. అందులోకి ప్రవేశించి అక్కడి నుండి పాదయాత్రలు చేస్తు తీర్థాలన్ని తిరుగుతూ, అమర్ నాథ్ వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు, చందన్ వాడి నుండి 50 కిలో మీటర్ల లోపల గుహలకై వెతుకగా "బరఫ్ గుహ" నచ్చి అందులో "బరఫ్ బాబా" గా పేరుపొందాను. ఇది నా శరీరాల యాత్ర .ప్రతి శరీరంలో ఉన్నప్పుడు నేను ఏకాంతతను, యోగాభ్యాసాన్ని, ధ్యానాభ్యాసాన్ని, తపస్సునే..... ఇష్టపడ్డాను. శరీరాలు మారిన నేను..... ఒక్కడినే కదా! అభిరుచి, మనస్తతత్వం ఒక్కటే గదా! నేను ఏకాంత ప్రియుణ్ణి... అని చెప్పారు బాబా.

ప్రశ్న :- ఆదిశంకరులు మీలాగే, రాజు శవంలోకి ప్రవేశించారని విన్నాను. బాబా, యోగి బ్రతికి ఉన్న శరీరంలో కూడా ప్రవేశించగలడా?

జ :- ప్రవేశించగలడు ఉదా:- రామకృష్ణపరమహంస వివేకానందలోకి ప్రవేశించి నేను బికారినైనా, నాకు ఉన్నదంతా నీకిచ్చేశాను. నీవే నేను అన్నారు. వారి సంకల్పాలన్నీ, వివేకానంద శరీరంతో పూర్తి చేయించిరి. గార్గి జనకునిలోకి ప్రవేశించి వాదన జరిపినది కదా !యోగి ఏ శరీరంలో ప్రవేశించిననూ, తన ఇచ్చా ప్రకారం కార్యాలు జరిపించగలడు. అవే భావాలున్న వాడైతే అర్థం చేసుకొనును. వ్యతిరేక భావనల వాడైతే సతమతమౌను. ఇతరుల ప్రారబ్దానికి వ్యతిరేకంగా ఏది చేయడు యోగి.

ప్రశ్న :- మీరు దేహం త్యజించి కొత్త శరీరం పొందొచ్చుగదా! శవంలోకి ప్రవేశించుటదేనికి ?

జ :- ఈ సారి ఇక అలాగే చేస్తాను. అది నేను యోగవిద్యతో చేసిన విన్యాసం, నాయనా! ఈ సారి ఒక జన్మతీసుకొని తపమాచరించి లోక సేవజేసి జీవన్ముక్తి పొందుతాను. మరల జన్మకురాను.

ప్రశ్న :- మళ్లీ జన్మిస్తే తపస్సుదేనికి ? పూర్వ తప ఫలం తోడు రాదా?

జ :- మళ్లీ జన్మిస్తే సంస్కారాలు ఉంటాయి. కాని మళ్లీ కొంత తపస్సు చేయవలసిందే. అది లోక ఆదర్శం . కాని త్వరగా, సిద్ది ప్రాప్తి లభించును. జన్మ సంస్కారంచేత.

ప్రశ్న :- బాబా, మీరు యాత్రికుల దృష్టిలో పడలేదా? ఇన్ని శరీరాల్లో ఎప్పుడైనా?

జ :- మేము ఎప్పుడు ఎవరికి కనిపించాలో ఎవరితో మాట్లాడాలో, ఎవరికి విద్య నేర్పాలో, ఎవరికి సందేశమివ్వాలో వారికే అవకాశం దొరుకుతుంది. ఇతరులకు దొరకదు.

ప్రశ్న :- ఇప్పటి వరకు ఎంత మందితో మాట్లాడి ఉంటారు స్వామీ?

జ :- ప్రతి శరీరం మారినప్పుడల్లా 100 లేదా 150, మందితో మాట్లాడి ఉంటాను. సుకృత జీవులు సంపూర్ణ సాధకులకే, సిద్ద గురువుల దర్శన భాగ్యము లభించును. వారితో సంభాషణ, వారితో సందేహ నివృత్తి చేసుకొనుట, విద్య నేర్చుకొనుట జరుగును. అందరికీ ఈ అవకాశం ఉండదు.

ప్రశ్న :- బాబా ఎవరైనా , యాత్రికులు, దారి తప్పి మీ ఏకాంతానికి వస్తే ఏమి చేస్తారు?

జ :- మా రూపమును పక్షిగా మార్చి చెట్టుపై ఉండుట, రాయిగానో మారుట చెట్టుగానో మారుట, జంతువులుగానో మారుట, ఈగ, దోమగానో మారుట, లేదా సూక్ష్మంగా అంతర్ధానమవుట చేస్తాను. అంతే. ఎవరికి కనిపించకుండా, సూక్ష్మంగా మారుటనో చేస్తాము.

ప్రశ్న :- మీరు ఒకే సారి గొప్ప సిద్ధులు పొందారా?

జ :- లేదు, ఏ యోగి అయిన క్రమంగా ఒకటి తర్వాత ఒకటి మెట్టుమెట్టుగా క్రమంగా సిద్దిని పెంచుకుంటూ పోతాడు. చిన్న మొక్క మహావృక్షంగా క్రమంగా పెరిగే విధంగా, చిన్నగా ఉన్న శరీరం క్రమంగా పెరిగే లాగా, సిద్ది ప్రాప్తి జరుగుతుంది. సాధనాబలాన్ని బట్టి క్రమంగా వికాసం అవుతుంది. దూరదృష్టి , దూర శ్రవణం, (దూర శబ్దాలను కూర్చున్న చోటే వినుట), ఎంత దూరమైన సందేశం పంపుట, శరీరంతో ఆకాశంలో ప్రయాణించుట, ఏదైనా సృష్టించుట, ఏ రూపమైన దాల్చుట, కనిపించకుండా పోవుట, ఒకేసారి ఎన్ని రూపాలుగానైన మారుట , ఏదైన చేయగలుగుట ......ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి సాధన బలంచే సిద్దించును.

అయితే, ఇదంతా మాయనే . నీ ఆత్మలో నీవు లయంచెంది, నిర్వికల్ప నిష్టపొంది ఆత్మజ్ఞానం పొందుటే ముఖ్యము. సిద్ధులన్ని కొత్త సాధకులకే ఆసక్తి కలిగించును. సిద్ద పురుషులు, అంతా నేనే లీలలు ఎవరికి చూపించకూడదు అనుకుంటారు. పరిస్థితులను బట్టి వారి నుండి సమాజ శ్రేయస్సుకు అభిమానం, అహంకార మమకారాలు లేకుండా, నిస్వార్థంగా వారి నుండి సిద్దులు ఒక లీలలాగ జరిగి పోతుండును. కాని వారెటువంటి ప్రచారాలు ప్రదర్శనలు కోరరు. వారిలో వారు బ్రహ్మానందంలో ఉంటారని బరఫ్ బాబా ఓపికగా ఎన్నో యోగపరమైన, ధ్యానపరమైన, సిద్ధి పరమైన విషయాలు తెలియజేసారు.

సంకలనం : భట్టాచార్య

Source - Whatsapp Message

ప్రభుత్వాలు జనం పై ఎన్ని రకాల పన్నులు, వేస్తాయో?

<div id="preview" class="unselectable">పరిపాలించే <b>ప్రభుత్వాలు జనం పై ఎన్ని రకాల పన్నులు</b> వేస్తాయో? ఒక్కసారి గమనించండి.<br><b>ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు మన కష్టార్జితాలే</b><br> అవి ఎలానో తెలుసుకుందాం.<br><br>1 <b>సంపాదిస్తే  income tax</b><br>2. <b>అమ్మితే sales tax</b><br>3. <b>ఉత్పత్తి చేస్తే peoduction tax</b><br>4. <b>మార్కెట్‌ చేస్తే</b> commercial tax<br>5. <b>సినిమాకి వెళ్తే        entertainment tax</b><br>6. వెహికల్‌ <b>కొంటే life tax</b><br>7.  <b>దాన్ని రోడ్‌ పైకి తెస్తే road tax</b><br>8. లాంగ్‌ <b>జర్నీ చేస్తే toll tax</b><br>9. <b>బండిలో పెట్రోల్‌ పోస్తే fuel surcharge tax</b><br> 10. <b>భార్య, పిల్లలతో పార్క్‌ కి వెళితే entery tax</b><br>11. <b>ఉద్యోగం చేస్తే professional tax</b><br>12. వ్యాపారం చేస్తే  trade tax<br>13. <b>బట్టలు కొంటే vat tax</b><br>14. <b>కరెంటు, వాటర్‌ బిల్‌ కడితే<br>     series tax</b><br>15. <b>ఆస్థి పై property tax</b><br>16. చివరకి పబ్లిక్‌ <b>urinals కి వెళ్తే swachh bharat charge</b><br>17. <b>సబ్బు కొంటే customer charge</b><br>18. ఒక వస్తువు <b>కొంటె tax, దాన్ని వినియోగిస్తే tax,</b><br><b>దాన్ని రిపేరు చేపిస్తే tax,</b><br>దాన్ని లెక్కల్లో చూపిస్తే tax,<br>19. <b>సంపాదించింది ఖర్చుపెడితే tax</b><br>20. మొత్తం మీద మనిషి <b>జన్మిస్తే tax,</b><br>21. <b>మనిషి సంపాదిస్తే tax</b>,<br>మనిషి <b>సంతోషిస్తే tax,</b><br>మనిషి <b>మరణిస్తే tax.</b><br><br><b>ఇలా పలు రకాల టాక్స్'లతో మనిషి పుట్టిపెరిగిన నుండి మొదలుకొని అతడు చచ్చే వరకు</b> వారి శక్తికి మించి పన్నులు చెల్లిస్తూ, ఆ వచ్చే <b>రాయితీలు ప్రభుత్వాల, నాయకుల బిక్షగా భావించుకుంటున్నారు అది నిజంకాదు, అవన్నీ ప్రజల యొక్క కష్టార్జితాలే.</b><br><br>👏👏👏👏<br><br>Source - Whatsapp Message</div><style>.unselectable {-webkit-touch-callout: none; /* iOS Safari */ -webkit-user-select: none; /* Safari */ -khtml-user-select: none; /* Konqueror HTML */ -moz-user-select: none; /* Old versions of Firefox */ -ms-user-select: none; /* Internet Explorer/Edge */ user-select: none; /* Non-prefixed version, currently supported by Chrome, Opera and Firefox */ -khtml-user-select: none; -o-user-select: none; cursor: default; user-select: none; -webkit-user-select: none; /* Chrome/Safari/Opera */ -moz-user-select: none; /* Firefox */ -ms-user-select: none; /* Internet Explorer/Edge */ -webkit-touch-callout: none; /* iOS Safari */}</style>

రాజుగారి భయంకరమైన కల

రాజుగారి భయంకరమైన కల👺

చాలా ఏళ్ళ క్రితం ఒక రాజుగారికి కలలో ఒక మహమ్మారి👹 అంటువ్యాధి వచ్చి,
"నీ రాజ్యంలోని ఒక 500 మంది జనాన్ని త్వరలో పొట్టన బెట్టుకోపోతున్నాను." అని బెదిరించింది

ఉదయాన్నే రాజు మంత్రులను పిలిచి రాజ్యమంతా అంటువ్యాధి గురించి దండోరా వేసి విస్తృతంగా ప్రచారం చేయించాడు. అయితే ఈ ప్రచారం మంచి చేయకపోగా, ప్రజల్లో భయాన్ని, ఆందోళననీ కలగజేసింది. మహమ్మారి రానే వచ్చింది. జనం పిట్టల్లా రాలిపోయారు.😳 అంటువ్యాధి తన పని ముగించుకొని పోతూపోతూ, రాజుగారి కలలోకి వచ్చింది. రాజు కోపంతో, "నీవు 500 మందిని చంపుతానని, 5,500 మందిని ఎందుకు బలి తీసుకున్నావ్."🤷‍♂️

"నిజానికి నేను 500 మందిని కబళించడానికే వచ్చాను. కానీ మీరు చేసిన ప్రచారం వల్ల భయాందోళనలతో మరో 5000 మంది చనిపోయారు." అంటూ మాయమైంది.

1.ఇటువంటి కఠిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా ఉండడం నేర్చుకోవాలి.👍
2. నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటూ, రేటింగ్ కోసం అర్రులు చాచే మీడియాకు, వార్తలకు దూరంగా ఉండాలి.👎

3. నిర్లక్ష్యం ఒదిలి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చెయ్యాలి. తర్వాత జరిగేది జరుగుతుంది

4. భయాన్ని పారద్రోలి ఆనందంగా ఉంటూ, ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి.😁

5.పాజిటివ్ గా ఉండలేక పోవడం, వ్యాధి సోకుతుందేమోననే భయం, వ్యాధి సంక్రమణకు సగం కారణం.☹️

😁 పాజిటివ్ గా ఆలోచిస్తే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.👍. ఉండండి💪 ఆరోగ్యంగా ఉండండి🙏

మీ మానస సరోవరం.

Source - Whatsapp Message

పరోపకారం

💎పరోపకారం🌈
🕉️🌞🌎🏵️🌼🚩

మనిషి ఎలా బతకాలో చెప్పింది వేదం. చక్కగా చూస్తూ, చక్కగా వింటూ, మంచిగా మాట్లాడుతూ ఎవరికీ అధీనుడు కాకుండా ఉంటే మనిషి నూరేళ్లు బతుకుతాడని వేదం చెబుతోంది. ఎవరి ధనాన్నీ దొంగిలించకూడదు. అంటే, ధనార్జన ధర్మంగా ఉండాలి. అంతేకాదు- ద్వేషం లేని ప్రేమైక సమాజం మంచిదని వేదం బోధించింది.
ఉపనిషత్తులో ఓ మాట ఉంది. నిత్యం ఏదో ఓ మంచి విషయాన్ని వింటూ ఉండాలి. చదువుతూ ఉండాలి. చదివినదాన్ని మననం చేసుకుంటూ ఉండాలి.
ఎన్ని కష్టాలొచ్చినా సత్యాన్ని వదులుకోకూడదు. నైతికంగా పతనం కాకూడదు. నేను, నాది అన్న సంకుచిత భావనను వదిలిపెట్టాలి. చేసేవాడు, చేయించేవాడు ఆ భగవంతుడే అనుకుంటే- ఫలితాలమీద ఆపేక్ష ఉండదు.
‘మా, మేము, నా’ అనే స్వార్థానికి కౌరవులు జీవితంలో మొదటిస్థానం ఇచ్చారు. రెండో స్థానం ప్రపంచానికి, మూడో స్థానం భగవంతుడికిచ్చారు. ఫలితం అందరికీ తెలిసిందే. పాండవులు తమ జీవితంలో మొదటి స్థానాన్ని భగవంతుడికి ఇచ్చారు. ద్వితీయ స్థానాన్ని నిస్వార్థ బుద్ధితో ప్రపంచానికిచ్చారు. తరవాత తమ గురించి ఆలోచించారు. అందుకే భారత యుద్ధంలో విజేతలయ్యారు.
ఎవరైనా జీవితంలో ప్రథమస్థానం భగవంతుడికి ఇవ్వాలి. స్వార్థాన్ని మరచి పరోపకారానికి పాటుపడి త్యాగాలు చేయాలి. ఆ పైనే తమ గురించి ఆలోచించాలి . అప్పుడే జీవితం సంతోషభరితం అవుతుంది. ప్రతి మనిషీ ప్రపంచంలో ఒకడిగా తనదైన ముద్రవేయాలి తప్ప మందలో ఒకరిగా కలిసిపోకూడదు. విలువలతో కూడిన జీవితం గడపడం, సక్రమమైన మార్గంలో ప్రయాణించడంవల్లే మనిషి లక్ష్యాలను చేరుకోగలుగుతాడు. ఈ దేశంలో పుట్టిన సద్గురువులు ఎందరెందరో మానవసేవను మాధవసేవగా భావించారు. పరోపకారమే లక్ష్యంగా బతికారు. వినమ్రతతో దానధర్మాలు చేశారు.
మనుషులు రుషుల్లా మారారు. సంఘసేవకు నడుం బిగించారు. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ మహాత్ముడయ్యాడు. కాలడి నుంచి హిమాచలం వరకూ కాలినడకన వెళ్ళి నిష్ఠగా ధర్మాన్ని ప్రబోధించిన శంకరాచార్యులు జగద్గురువయ్యారు. వారందరూ సంఘ శ్రేయం కోసం తమ జీవితాలు ధారపోసి చిరస్మరణీయులయ్యారు.
ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు. సింహం నోరు తెరుచుకుని ఉన్నంత మాత్రాన వన్యమృగం దాని నోటికి అందదు కదా! అసలు మన ఆలోచనలనుబట్టే ప్రపంచం ఉంటుంది. మన దృష్టి మంచిదైనప్పుడు లోకం మంచిగానే కనిపిస్తుంది. చెడుగా చూస్తే ప్రపంచం చెడ్డగానే కనిపిస్తుంది. ఇతరులకు మేలు చేయకపోయినా కీడు తలపెట్టకుండా ఉండటం మంచిది. ప్రియంగా మాట్లాడితే శత్రువులైనా క్రమంగా మిత్రులవుతారు. సమాజశ్రేయానికి ప్రతి మనిషీ కృషిచేయాలి. నైతిక విలువలు పాటించి న్యాయమార్గంలో నడవాలి. ప్రేమను, జ్ఞానసంపదను అందరికీ పంచాలి. అప్పుడు మనిషి మనీషి అవుతాడు. అతడిలో భగవంతుడు కొలువై ఉంటాడు! అటువంటి ధన్యజీవులే ధరిత్రిని సంతోష ధామంగా, పుణ్యమూర్తులు నడయాడే ఆనందనందనంగా తీర్చిదిద్దడంలో కీలక భూమిక పోషించగలుగుతారు.

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

ఒక్కడే... ఒక్కడిగా మొదలయ్యాడు కోట్ల మందికి స్పూర్తిగా నిలిచాడు అతనే అంకిత్‌ కవాత్రా

Rami Reddy Manasa Sarovaram:
🖕 ఒక్కడే... ఒక్కడిగా మొదలయ్యాడు కోట్ల మందికి స్పూర్తిగా నిలిచాడు

నిండా పాతికేళ్లు కూడా లేని వయసులో అభాగ్యుల ఆకలి గురించి ఆలోచించాడు. అనుకున్న దారిలో అడుగు వేశాడు. కోట్ల మంది ఆకలి తీర్చి హీరో అయ్యాడు.
అతనే అంకిత్‌కవాత్రా.

దేశ రాజధానిలో మొదలైన అతని ప్రయాణం దేశంలోని 43 నగరాలకు, పట్టణాలకు విస్తరించింది.
పెళ్ళిలో పడిన తొలి అడుగు…

ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి, విలాసవంతమైన జీవితం గడుపున్న ఓ కుర్రాడు అకస్మాత్తుగా అనార్ధుల ఆకలి గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. దానికి తొలి అడుగు పడింది కూడా ఓ పెళ్ళిలో.

2014 ఆగస్టులో అంకిత్ ఓ సెలెబ్రెటీ పెళ్ళికి వెళ్ళాడు. పెళ్ళికి వచ్చిన అతిధులకు అద్భుతమైన విందు ఏర్పాట్లు చేశారు. దాదాపు 35 రకాల వంటలు చేశారు. భోజనం చేస్తుండగా క్యాటరింగ్ అతనితో మాటా మాటా కలిపాడు.

ఎంతమంది వచ్చారని అడిగితే.. క్యాటరింగ్ అతను “వెయ్యి మందే సర్.. కానీ వంటలు మాత్రం 5వేల మందికి చేయించారు” అని చెప్పాడు. 4వేల మంది తినే #ఆహారం
వృధా అయిపోతుండడంతో అంకిత్ కళ్ళు చెమ్మగిల్లాయి.

రోడ్డు మీద ఆకలితో అలమటించే వాళ్ళంతా తన కళ్ల ముందు కనిపించినట్టైంది అతనికి. వెంటనే తేరుకుని ఇక మీదడ ఎక్కడైనా ఫంక్షన్‌లో భోజనం వృధా అయితే తనకి ఫోన్ చెయ్యమని క్యాటరింగ్ అతనికి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు.

పెళ్లి జరిగిన వారం తిరిగే లోపే అంకిత్‌కి #క్యాటరింగ్ అబ్బాయి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వెంటనే తన స్నేహితుడిని తీసుకుని పెద్ద పాత్రలను తన కారులో వేసుకుని వెళ్ళాడు. అక్కడ మిగిలిన ఆహారాన్ని తీసుకుని నేరుగా దగ్గరలోని మురికి వాడకి పోనిచ్చాడు.

ఆకలి బాధతో అలాగే పడుకుని ఉన్న వారందరినీ తట్టి లేపాడు. కడుపు నిండా భోజనం పెట్టాడు. వారి కళ్ళల్లో సంతోషాన్ని చూసి తన కర్తవ్యం ఏంటో తెలుసుకున్నాడు. మరుసటి రోజే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. #ఆశయం వైపు అడుగులు వేశాడు.

ఒకవేళ ఆశించిన దానికంటే ఎక్కువ భోజనం వస్తే ఎలా అని ఆలోచించాడు. దాన్ని వృధా అవ్వకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాడు.
వెంటనే అన్ని #క్యాంటీన్లు, #రెస్టారెంట్లు, పెద్ద పెద్ద #హోటళ్లు, కంపెనీల వద్దకి వెళ్ళి భోజనం మిగిలితే తనకు ఫోన్ చెయ్యమని అర్ధించాడు.

అర్ధం చేసుకున్నవాళ్లు ఖచ్చితంగా ఫోన్ చేస్తామని చెప్పి అతన్ని మెచ్చుకున్నారు. అర్ధం చేసుకోలేని మూర్ఖులు మాత్రం అవమానించి పంపేశారు. మరి కొందరైతే ప్లేట్‌కి ఇంత అని కొంత డబ్బు ఇస్తేనే ఇస్తామన్నారు.

కార్యాచరణ మొదలయ్యింది…

కాళ్లా వేళ్ళా పడి మిగిలిన ఆహారాన్ని ఇచ్చే కొందరిని సంపాదించాడు. అప్పటి వరకూ తాను కూడబెట్టిన డబ్బుని తీసుకుని ఆహారం నిల్వ ఉండే వాహనం కొనాలనుకున్నాడు. అంకిత్ అంకిత భావాన్ని చూసిన కొందరు దాతలు అతనికి సాయం చెయ్యడంతో వెంటనే 24 గంటలూ ఆహారం నిల్వ ఉంచగలిగే #రిఫ్రిజిరేటెడ్ వాహనం కొన్నాడు.

తన ఆశయాన్ని స్నేహితులతో, గతంలో పని చేసిన సహ ఉద్యోగులతో పంచుకున్నాడు. మానవత్వం ఉన్నవారు అంకిత్‌కి చేయూతనిచ్చారు.
‘#ఫీడ్ఇండియా’గా ఉద్యమించాడు..
తాను ఉద్యోగానికి రాజీనామా చేసి మూడు నెలలు గడిచే లోపే ‘ఫీడ్ ఇండియా’ అనే సంస్థ స్థాపించాడు.

ఎక్కడ ఆహారం వృధా అవుతుందని తెలిసినా వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఆహారాన్ని #అనాధాశ్రమాల్లోనూ, #వృద్ధాశ్రమాల్లోనూ, ప్రభుత్వ పాఠశాలల్లోనూ, రోడ్డుపై ఆకలితో ఉన్నవారికీ, #వికలాంగులకు నేరుగా అందించ సాగాడు.

తాను చేసే సేవకి త్వరగానే గుర్తింపు వచ్చింది. వెంటనే ‘#డొనేషన్
డ్రైవ్స్’ కార్యక్రమాలు నిర్వహించి వాటికి #ఫుడ్బ్లాగర్లను, పెద్ద పెద్ద రెస్టారెంట్ #ఓనర్లను, #బుల్లితెర తారలను పిలిచి అందరికీ తెలిసేలా ప్రచారం చేసేవాడు.

#సోషల్
మీడియాని కూడా విపరీతంగా వాడి ప్రచారం చేసేవాడు. మూడేళ్లలోనే ‘ఫీడ్ ఇండియా’ 43 నగరాలకు, పట్టణాలకు వ్యాప్తి చెందింది.
ఒక్కడిగా మొదలై వేలమందితో…

ఒక్కడిగా అడుగేసిన అంకిత్ తనలాంటి భావాలే ఉన్న ప్రతి వ్యక్తిని తనతో కలుపుకున్నాడు. ఇప్పుడు ప్రతి రోజూ #2వేలకి పైగా తనతో భాగస్వాములవుతున్నారు.

★2030నాటికి ఆకలి లేని భారతాన్ని చూడాలనే కలతో పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నారు. వృధాగా మిగిలిన ఆహారం చెత్త కుప్పల పాలై దుర్వాసన వస్తూ వ్యాధులు రాకుండా ఆపుతున్నారు.

#మిథేల్ వాయువు విడుదలయ్యే #గ్లోబల్వామింగ్ జరగకుండా అడ్డుకుంటున్నారు.
ప్రపంచ దేశాలకు #సెలెబ్రెటీ..
#ఐక్యరాజ్య
సమితి ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన- 2030’ కార్యమానికి 186 దేశాల నుండి సుమారు 18000 మండి పోటీ పడగా అందులో అంకిత్ ఎంపికయ్యాడు.

వందలమంది ప్రపంచ దేశాల నాయకుల మధ్యలో ఆకలి లేని భారతాన్ని ఎలా నిర్మించాలో ఉపన్యాసం చెప్పాడు.

సామాజిక సేవతో పని చేస్తున్న 30ఏళ్ల లోపు యువత కోసం ఓ ప్రముఖ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలోనూ అంకిత్‌కు గౌరవ స్థానం దక్కింది.

#బ్రిటన్_రాణి తన సింహాసనాన్ని అధిష్టించి 60
ఏళ్ళు పూర్తి చేస

ుకున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సామాజిక సేవ చేస్తున్న 30 ఏళ్ల లోపు యువకుల్ని పురస్కరించాలనుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వారు ఎంపిక చేసిన 60మంది యువకుల్లో మన అంకిత్ కూడా ఉన్నాడు.

రాణీ ఎలిజబెత్ చేతుల మీదగా అవార్డు అందుకున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూసేలా చేసిన అంకిత్ అంకిత భావాన్నీ మెచ్చుకోకుండా ఉండగలమా…

మరెందరో అంకిత్‌లు దేశం కోసం ముందుకి రావాలని ఆశిస్తూ, అంకిత్‌లా సమాజ సేవ చేసే ప్రతి ఒక్కరినీ అభినందించి చేయూతనిద్దాం.
🙏

Source - Whatsapp Message

జ్ఞానోదయం

💥జ్ఞానోదయం💥
🕉️🌞🌎🏵️🌼🚩

వేకువ కోసం చరాచర జగత్తూ ఎదురుచూస్తుంది. పొద్దు పొడుపుతో భళ్ళున తెల్లారి ప్రకృతి అంతా శోభాయమానమవుతుంది. కోవెలలో మోగే జేగంటలు విడుదల చేసే ఆధ్యాత్మిక తరంగాలు మనసును తాకి ఉత్సాహం నింపుతాయి. ఉల్లాసపరుస్తాయి. ఆత్మనూ తట్టి లేపుతాయి.

ఉషోదయ వేళల్లో మనుషులు తమకు తెలియకుండానే ఒక జీవనోత్సవం జరుపుకొంటారు. మరో మాటలో చెప్పాలంటే- ఆ వేళ వారు దివ్యత్వంతో ప్రకాశిస్తారు. అందువల్లే దేవాదిదేవుడి సుగుణాలైన ప్రేమాభిమానాలు పంచడానికి, దానధర్మాలు చెయ్యడానికి మనుషులు ఆ పూట సుముఖంగా ఉంటారు.

ప్రభాతవేళ సూర్యుడు మనిషికి ఆరోగ్యప్రదాత. ఉదయం పూట నడక వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతోపాటు లేత ఎండలో శరీరానికి కావాల్సిన ‘డి’ విటమిన్‌ అందుతుంది. ఆరోగ్యరీత్యా ఎక్కడో బాట వెంబడి సాగే సాధారణ నడకకన్నా గుడి చుట్టూ చేసే ప్రదక్షిణల వల్ల ఫలితాలు పెద్ద మొత్తంలో అందుతాయి. ఆలయ ప్రాంగణంలో భక్తి భావనతో కుదురైన మనసుతో, స్థిర చిత్తంతో చేసే నడక దేహాన్ని ఒక క్రమతలో ఉంచుతుంది. అప్పుడు శరీరం, మనసు ఒకే తాటిపై ఉంటాయి. వాటికి తోడుగా ఆత్మచైతన్యమూ జాగృతమై ‘త్రికరణశుద్ధి’ జరుగుతుంది.
ప్రభాకరుడి ఆగమనంతో సకల ప్రాణుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. విశాల జగత్తుకు వెలుగులు పంచే సూర్యుణ్ని భగవంతుడితో సమానంగా భావిస్తారు. తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి అత్యంత భక్తి ప్రపత్తులతో చేతులెత్తి సంధ్యావందనం చేస్తారు. ఆరోగ్యానికి మేలు జరగాలని ఆదిత్యహృదయం పఠిస్తారు. సూర్య నమస్కారం ప్రకృతి పట్ల మనిషికుండే సంస్కారం. లోక కల్యాణార్థమై యోగశాస్త్రంలోనూ ‘సూర్యనమస్కారాలు’ పొందుపరచారు.

తోమాల సేవతో భగవంతుడి సన్నిధి చేరేందుకు పూలు పూసి ఉదయానే సిద్ధంగా ఉంటాయి. ఆ సమయాల్లో సుప్రభాత సేవలతో భక్తుల మనసులు పులకించిపోతాయి. పండుగలు, పర్వదినాలు, శుభకార్యాలు దాదాపు ఉదయం వేళల్లోనే పురుడు పోసుకుంటాయి. జ్ఞానానికి భౌతికరూపం వెలుగు. ఉషస్సు చీకట్లను పారదోలి దారి చూపుతుంది. జ్ఞానమూ అంతే. అది అజ్ఞాన తిమిరాలను తరిమి బతుకు బాట పరుస్తుంది. ప్రాపంచిక జ్ఞానమైనా, పారమార్థిక జ్ఞానమైనా మానవ జీవితానికి గొప్ప వెలుగునిస్తాయి. ఒకటి అజ్ఞానాన్ని తొలగించి లౌకికవిజ్ఞానం అందిస్తుంది. మరొకటి అంతరంగాన్ని శుద్ధిచేసి ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేస్తుంది. అందుకే జ్ఞానోదయాన్ని సూర్యోదయంతో పోల్చి చెబుతారు.
విద్య- అంటే వెలికి తీయడం. విద్యార్జన చేసే వయసులో తెల్లవారు జామునే నిద్ర లేచి చదువుకొంటారు. వివిధ రంగాల్లోని అభ్యాసకులు అదే పద్ధతి కొనసాగిస్తుంటారు. ఎందుకంటే, ఉదయం పూట మనసు నిర్మలంగా ఉంటుంది. చదివే అంశం పూర్తిగా మనసుకు హత్తుకుంటుంది. బ్రాహ్మీ కాలంలో దేవతలు సంచరిస్తారంటారు. అందువల్ల ఆ వేళల్లో మనసుపెట్టి చేసే పనులన్నింటినీ ప్రార్థనతో సమానంగా భావిస్తారు. అలా చేసే కార్యాలకు మెరుగైన ఫలితాలు లభిస్తాయంటారు. ఆ కారణంగానే సాధకులు సూర్యోదయానికి ముందు సమయాల్లో ధ్యాన ప్రక్రియలు చేపడుతుంటారు.

మనిషి జీవితానికి అర్థం ‘అంతిమ సత్యం’ తెలియడం. అదే జరగకపోతే మానవ జన్మ వ్యర్థం. సత్యాన్వేషణలో ఏళ్లు గడిచినా మొక్కవోని ధైర్యంతో, అకుంఠిత దీక్షతో, అచంచల విశ్వాసంతో ధ్యాన సాధన సాగుతుంటే... ఒక రోజు భృకుటి మధ్య మిరుమిట్లు గొలిపే దీప కాంతులతో జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. అది అచ్చు వెలుగులు విరజిమ్ముతూ ఉదయించే సూర్యబింబం ప్రక్రియలా ఉంటుంది!

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

దయచేసి అవసరం లో ఉన్నవారికి సాయపడదాం..మిత్రులారా!

దయచేసి ఈ కథను ఎవరూ మిస్ కావద్దు.

రాత్రి చీకటి పడుతోంది. తాళం వేసిఉన్న ఇనుప ద్వారం బయట నుండి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి చూశాను. గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు. చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి ఉన్నారు. అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, ఇంటి నెంబర్ 8, ఇదే కదూ!" అని అడిగారు. "అవును నేనే ఆనంద్. మీరూ ..." అని నసిగాను. అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో తడుపుకుంటూ "బాబూ! నేను మీ నాన్నగారి మిత్రుడిని. మీ ఊరినుండే వస్తున్నాను. నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు.

అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను. అందులో "ప్రియమైన ఆనంద్! నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు. పేరు రామయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది. ఆక్సిడెంట్ జరిగిన తరువాత పోలీస్ వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్ని సేకరించి నీకు పంపాను. డబ్బులు Head Office లో తీసుకోమన్నారు. ఆయనకు హైదరాబాద్ కొత్త. ఏమి తెలియదు. నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ
మీ నాన్న" అని ఉంది.

నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్యగారు. ఒక్క నిమిషం అలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను. మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి "ఏమైనా తిన్నారా" అని అడిగాను. "లేదు బాబూ. ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నాన"ని చెప్పారు.

నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను. "మీరు తింటూ ఉండండి" అని చెప్పి, ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్ లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను. నేను వచ్చి చూసే సరికి ఆయన దోశలు ఆరగించి, చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు. నన్ను చూసి ఆ పేపర్ లు నా చేతిలో పెట్టారు. అందులో ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు. సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.

"ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు. అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు. ఇతడు మాత్రమే మాకు మిగిలాడు. పేరు మహేష్. కష్టపడి చదివించాను. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు. మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు. ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది. అక్కడికక్కడే చనిపోయాడు. నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాము. కానీ రోజు రోజుకీ నాలో శక్తి తగ్గిపోతోంది. నా భార్య ఆరోగ్యం బాగా లేదు. మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను. నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు" అని ముగించారాయన.

"సరే పొద్దు పోయింది, పడుకోండి" అని చెప్పి నేను కూడా నిదురపోయాడు ...

ఆయన మాసిన బట్టలు చిరిగిన చెప్పులు చూసి అర్థం అయ్యింది అతని ప్రస్తుత పరిస్థితి తెల్లవారే దగ్గరలో ఉన్న ఓ షాప్ కు వెళ్లి అతనికి సరిపడే బట్టలు చెప్పులు కొని తీసుకొచ్చి అతనికిచ్చాను ...
అవి తీసుకునేందుకు ఒప్పుకోలేదు ...మా నాన్నగారే ఇమ్మన్నారు అని చెప్పి ఒప్పించి ఇచ్చాను...

స్నానాదికాలు ముగించుకుని, కాఫీ తాగి ఇద్దరం బయల్దేరాము. దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్ల లోని అడ్రెస్ ప్రకారాం ఆ ఆఫీస్ కు చేరుకున్నాము. "ఆనంద్! ఇక నేను చూసుకుంటాను. నువ్వు ఆఫీస్ కు వెళ్ళు బాబు" అన్నారాయన. "పర్లేదండి. నేను లీవ్ పెట్టాను" అన్నాను. దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను. చాలా థాంక్స్ బాబూ! నేను ఊరికి బయల్దేరుతాను. మా ఆవిడ ఒక్కతే ఉంటుంది ఇంట్లో" అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు. "రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా" అని చెప్పి, టిక్కెట్ తీసి ఇచ్చి, ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య గారి చేతిలో పెట్టాను.

ఆయన సంతోషంగా "ఆనంద్ బాబూ! నాకోసం సెలవు పెట్టుకొని, చాలా సాయం చేశావు. ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి. కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు....

అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని "నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ ని కాదండీ. నా పేరు కూడా ఆనంద్ నే మీరు చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు. ఆ ఆనంద్ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట మరో 2 km ప్రయాణం చేయాలి. మీరేమో అలసిపోయి ఉన్నారు. అందుకే నేను నిజం చెప్పలేదు. మీరు తెచ్చిన లెటర్ లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను. ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట. ఆయన భార్య చెప్పారు. మీ మిత్రుడికి విషయం చెప్పాను. అయన చాల బాధ పడ్డారు. నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు. మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది. కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది. నాకు ఆ తృప్తి చాలండి" అన్నాను. బస్సు కదలడం తో ఒక్కసారి రామయ్యగారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. "నువ్వు బాగుండాలి బాబు" అని ఆశీర్వదించారు. ఆ మాటే చాలనుకున్నాను నేను. పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖం లో మా నాన్నగారు కనిపించారు.

ఆ వయసులో కష్టాలలో కనపడే ప్రతి పెద్దలకు ముస్లివాళ్లకు తల్లి/తండ్రికిచ్చే గౌరవమే ఇచ్చి కుదిరితే సహాయం చెయ్యాలి

ఆకాశంలోకి చూశాను. అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మానాన్న. "నాన్నా! నా అభివృద్ధి చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు! ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా? మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్నా! మీకు సంతోషమేనా నాన్నా!" అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను.
మరి ప్రకృతికి ఏమి అర్థమయ్యిందో లేక పైనున్న మా నాన్న కూడా నాలాగే ఆనందబాష్పాలు రాల్చడా తెలియదు కాని చిరు చినుకుల జల్లులు రాలి నన్ను ఆశీర్వదించాయి ఆ క్షణాన ...

"సాయం చెయ్యడానికి మనసు ఉంటే చాలు. మిగిలినవన్నీ
దానికి తోడుగా నిలబడతాయి"


దయచేసి అవసరం లో ఉన్నవారికి సాయపడదాం..మిత్రులారా!

Source - Whatsapp Message

Tuesday, June 8, 2021

వధూవరుల తల్లితండ్రులకు మనవి

♦️ వధూవరుల తల్లితండ్రులకు మనవి ♦️

వివాహ వయస్సు
స్త్రీకి 18-25
పురుషునికి 23-27

25దాటి ,30.... ,35.... ,40.... సంవత్సరాలు వచ్చినా వివాహం చెయ్యని యువతీ యువకుల తల్లిదండ్రులకు మనవి.

🌹 అయ్యా,అమ్మా !
మనం మన పిల్లలకు 35, 40 ఏళ్ళు వచ్చినాకూడా
సాఫ్టువేర్ ఉద్యోగం,
లక్షల్లో జీతాలు
కోట్ల ఆస్తి లేదని మరియు ఉమ్మడి కుటుంబమని,
వ్యాపారస్తుడని,
తల్లిదండ్రులు పాతసామాన్లని అన్నదమ్ములు పనికిమాలినవారని, అక్కా చెల్లెళ్లు ముష్టివాళ్ళని.....
అనేక కారణాలతో మన అర్హతనుబట్టి కాకుండా మాకే అమ్మాయి ఉంది మేమే చాలా గొప్ప వాళ్ళం అని అత్యాశకు పోయి మంచి సంబంధాలు వచ్చినా పెళ్లిచేయ్యకుండా,
మనం మాత్రం మన అమ్మాయిలు/అబ్బాయిలు కష్టపడి సంపాదించిన లక్షలాది జీతాలతో ఇల్లు కొనుక్కొని AC రూంలో రకరకాలుగా భోగం అనుభవిస్తూ మన పిల్లలకు కుంటి సాకులు చెబుతూ త్రిశంకు స్వర్గాన్ని చూపిస్తున్నాం.

🌹 చాలా మంది తల్లిదండ్రులు మంచి సంబంధం ఐనా జాతకాలు బాగాలేదని లేదా
ఏదో వంకతో సంబంధాలు తామే చెడిపేస్తున్నారు.
తల్లిదండ్రులు, అన్నదమ్ములు,అక్కా చెల్లెల్లు లేకుండా అనాధలకు ఇస్తారా పిల్లలను!.

కోటీశ్వరులు ఎక్కడో....... ఉంటారు
అది వంశ పరంపరగానో లేక,
పెద్దగా వ్యాపారం చేసో లేక,
ఎదో అదృష్టం కలిసొచ్చో అయి ఉంటారు.
మిగిలిన వారు పెళ్లికి అనర్హులేనా?

🌹 ఎవళ్లు ఉండకూడ దంటే మీరుకూడా మీ అమ్మాయి /అబ్బాయి కి పెళ్ళిచేసి చచ్చిపోండి?

🌹 చాలామంది అమ్మాయిలు/అబ్బాయిలు ఇలా ఘోఘషిస్తున్నారు.👇
"మాకు పెళ్ళిచేసి పంపిస్తే....
మేం ఎలా బ్రతికేది... అని మా అమ్మా నాన్నలే మాకు వచ్చే మంచి సంబంధాలు చెడిపేస్తున్నారు., అని అమ్మాయిలు/అబ్బాయిలు భోరున ఏడ్చి చెప్పిన సన్నివేశాలు చాలా చూస్తున్నాం!

🌹 పెళ్లి చెయ్యడం మన బాధ్యత.. దేవుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా మనం కస్టపడి జీవిస్తేనే మనకు గౌరవం అని ఆఖరి టైంలో మన కూతురు - అల్లుడు / కొడుకు - కోడలు చూస్తే చూస్తారులే అని అనుకొని గర్వంగా జీవించేలా ప్రణాళిక చేసుకోవాలి...


🌹గుర్తుంచుకోండి.
పిల్లల పెళ్లిళ్లకు నవ గ్రహాలు అడ్డుపడడం లేదు
తల్లిదండ్రులుగా మనమే అడ్డు పడుతున్నాం

🌹 కోటీశ్వరులు అని అనుకుంటున్నారు.,
వాళ్లకు (అబ్బాయి తరుపున గాని/అమ్మాయి తరుపున గాని ఎన్ని బ్యాంకులలో అప్పులు ఉన్నాయో,బంగారం మీద ఎంత అప్పు ఉందో,
చిట్ఫండ్ కంపెనీల్లో ఎన్ని చిట్స్ ఉన్నాయో, ఇల్లు/కారు వాయిదాలు ఎన్ని ఉన్నాయో
ఆ వివరాలు తెలుసుకోండి. అప్పుడు Clarity వస్తుంది అబ్బాయిల సంపద మీద.🙏

🌹 కోట్లాది రూపాయల దొంగ వ్యాపారులు, లంచగొండ్లు, నేరస్తులు, దొంగల వద్ద ఉంటాయి కోట్లు. వాళ్లకు మీ అమ్మాయి/ అబ్బాయిని ఇస్తారా?

🌹 35,40 సం లు వచ్చినా కోటీశ్వరుడు/కోటేశ్వరాలు రాలేదని పెళ్లి చేయకుండా ఉంటే వాళ్లకు పిల్లలు ఎప్పుడు పుడతారు? ఎపుడు సంసారం చేస్తారు? 35,40 దాటాక సరదాలు తీరతాయా!?.

🌹 ఇప్పటికె చాలామంది అబ్బాయిలు ఇలాంటి తల్లి దండ్రుల వల్ల వర్ణాంతర వివాహాలు చేసుకుంటున్నారు. 👉వర్ణ సంకరానికి కారణం మీరే, ఆ పుణ్యం కూడా మీదే.


🌹 అబ్బాయిలు కూడా వాళ్ళ అత్యాశ,కోరికలు వదలి తమ అందానికి, అర్హతకు తగిన అమ్మాయిని చేసుకోవాలి

🌹 పెళ్ళి అయిన తరువాత అబ్బాయి/అమ్మాయి తల్లి దండ్రులు ముఖ్యంగా వాళ్ల వాళ్ల కోరిక మేరకు నడుచు కోవాలి... వాళ్ల సంసార జీవితంలో వాళ్ల అభిరుచులలో అడ్డు పుల్లలు వేయకుండా ఉండాలి. కొంత మంది అబ్బాయి తరుపు తల్లితండ్రులు వాళ్ల అబ్బాయి వాళ్ల ఆధీనంలోనే ఉండాలని కోరుకుంటారు మరియు వాళ్ల అబ్బాయి కొచ్చే సంపాదన మీద అజమాయిషీ చేస్తారు... అదే తప్పు !! అక్కడే వాళ్ల మధ్య గొడవలకు కారణం ఔతారు... ఆ గొడవల్లో అమ్మాయి తరుపున వారు కూడా కలవటం వల్ల వారి చేతులారా వాళ్ల పిల్లల జీవితాలు పాడుచేసుకొంటారు .

🌹 భర్త /భార్య చనిపోయిన అమ్మాయిలు/అబ్బాయిలు విడాకులు తీసుకున్న అమ్మాయిలకు/అబ్బాయిలకు కూడా పెళ్లికాని అమ్మాయిలు/అబ్బాయిలు కంటే ఎక్కువ కోరికలు కోరుతున్నారు. ఇదొక దౌర్భాగ్యం.

🌹 ఇప్పటికైనా మనం కళ్ళు తెరచి మంచి వాడు, గుణవంతుడు, కష్టపడే వాడు, సాంప్రదాయ కుటుంబం లోని అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్ళిచేసి వాళ్ళ సంతోషాన్ని చూసి ధన్యత పొందుదాం అలాగే గుణవంతురాలు, సాంప్రదాయ కుటుంబం లోని అమ్మాయికి మీ అబ్బాయినిచ్చి పెళ్ళి చేసి వాళ్ళ సంతోషాన్ని చూసి ధన్యత పొందుదాం

🌹 లేదు మేము మారం అని అనుకొంటే భగవంతుడా మాకు, మా అమ్మాయిలకు/అబ్బాయిలకు ఈ భూలోకంలో తగిన వరుణ్ణి/వదువు నీవు పొరపాటున సృష్టించటం మరచివుంటావు. మరుజన్మలోనైనా మాకోరికలకు తగిన వరుడిని / వదువును సృష్టించు అని ప్రార్ధిద్దాం!.🌹 🙏

Source - Whatsapp Message

సంయమనం...

సంయమనం...

ఒక పాము వడ్రంగి దుకాణంలోకి దూరి, అక్కడ వున్న రంపం పై నుండి పాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది. వెంటనే పాము కోపముతో రంపమును గట్టిగా కరిచింది. ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, రంపం తనపైన దాడి చేస్తుందనుకొని, వెంటనే రంపమును గట్టిగా చుట్టుకుని, తన బలమంతా ఉపయోగించి, రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని నిర్ణయించుకొని, చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకొంది.

మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై ఇలానే స్పందించి‌, చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికి అసలు జరిగినదానికి సంబంధం లేదని తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరిగిపోతుంది.

_జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే కొన్నిసార్లు అనవసరమైన కొన్ని పరిస్థితుల్ని, మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలను, అసూయలను మరియు ద్వేషాలను పట్టించుకోకుండా ఉండాలి. కొన్నిసార్లు అసలు రియాక్ట్ కాకపోవడమే ఆరోగ్యానికి మంచిది.

#పెద్దల మాట

Source - Whatsapp Message

ఎవరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు.

🙏 ఎవరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా
ఆలోచించకూడదు.🙏

🌹 ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి.

☀అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే,
దీనివల్ల చాలా లాభాలున్నాయి.

☀నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటంవల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది. అది అవతలవారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కాని, ముందు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది అనిచెప్పటంలో తిరుగు లేదు.
దీనికి శాస్త్రీయమైన దాఖలాలు ఉన్నాయి.

☀రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం అదుపు తప్పుతుంది.మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడంటారు. చెడుగా ఆలోచించి, ఆలోచించి చెడ్డలో మునిగిపోతే మన మనసును దయ్యంలా చెడు పట్టుకుంటుంది.
అది అవతలవారికి హాని చేసే లోపలే మనం దానికి బలి అయిపోతాం.

☀నేడు చాలామంది తనలోనిమంచిని వదిలేసి ఎదుటివారిలో చెడుని చూస్తున్నారు-చూపిస్తున్నారు.
దీనివలన ఎదుటివారికి చెందవలసిన అశుభపరిణామాలను ప్రత్యక్షంగాకాని పరోక్షంగాకాని వీరు అనుభవిస్తున్నారు.

☀దుర్యోధనుడు ఒకసారి వెదికితే ఎక్కడా అతడికి ఒక్క మంచివాడు కూడా కనపడలేదట.
చెడ్డవాడికి మంచి ఎక్కడ కనిపిస్తుంది?
ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది.

☀ఉదయం లేవగానే ఈ లోకం బాగుండాలి, అందరూ బాగుండాలి అని హృదయపూర్వకంగా పది నిమిషాలపాటు కోరుకోవాలి. ఇలా చేస్తే...
మందులు వేసుకోకుండానే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నా యి. గురువులు బోధిస్తున్నారు.

☀మనం కూడా ఆలోచించాలి, ఆచరించాలి. మంచి చెడుల మిశ్రమమే జీవితం. సుఖదుఃఖాల సంగమమే జీవనం. త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరాముడున్నాడు. మంచికి, ధర్మానికి మారుపేరు ఆయన. ఆ యుగంలోనే అతి దురాత్ముడు, మహా పాపి అయిన రావణాసురుడూ ఉన్నాడు. ఏ యుగమూ చెడ్డను తప్పించుకోలేదు.
మంచిని నిర్మించే శక్తి మనకు లేకపోవచ్చు. చెడ్డను నిరసించే శక్తి కావాలి. చెడుభావనలు మనసును హింస పెడుతున్నప్పుడు తత్సమానమైన మంచి భావాలతో నింపుకోవాలి.

☀అంతేకాని మీకు సంబంధం లేని ఎదుటివారి పాపకర్మలను నిందించి లేదా ప్రచారం చేసి వారికి చెందవలసిన చెడు ను మీరు అనుభవించకండి.

☀పుట్టుకతో ఎవరూ దుర్మార్గులుకాదు, పాపాత్ములుకాదు ప్రతివారిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి.
కానీ మన దురదృష్టమేమిటంటే నేటి సమాజం చెడును చూసినంత ఎక్కువగా మంచిని చూడటంలేదు దీనివల్ల అలాంటివారిపై దుష్ప్రభావం ఎక్కువగా ఉండి అనేకరకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారు.

☀ దయచేసి అంతా క్షమాగుణం కలిగి, ఎదుటివారిలోగల చెడుని వదిలేసి మంచిని మాత్రమే చూద్దాం, మంచిగురించిమాత్రమే చెబుదాం!

🙏 సర్వేజనా సుఖినోభవంతు🙏

Source - Whatsapp Message

కన్యాదానం - విశిష్టత

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌍🌎🌏🌍🌎🌏🌍🌎🌏🌍🌎

🕉 మన సనాతన ధర్మం - ఆచారం 🕉

🕉🇮🇳 కన్యాదానం - విశిష్టత 🕉🇮🇳🕉

🕉🇮🇳🕉 వివాహకాండలో కీలక ఘట్టం కన్యాదానం. నిజానికి వివాహమంటేనే కన్యాదానం. కన్యాదానం కూడా ఒక రకమైన దానమే అయినా ఇది విభిన్నమైనది మరియు విశిష్టమైనది. సంతానార్ధం, త్రిధర్మ రక్షణార్ధం కన్యాదానం చేస్తారు. ఒక్కో యుగంలో ఒక్కో ధర్మానికి ప్రాముఖ్యతనిచ్చింది. కృతయుగంలో తపస్సుకు, త్రేతాయుగంలో జ్ఞానానికి, ద్వాపరయుగంలో యజ్ఞాలకి, కలియుగంలో దానానికి విశిష్ట స్థానం కల్పించింది. ఇది స్పష్టంగా పద్మపురాణంలో చెప్పబడి ఉన్నది...

🕉🇮🇳🕉 మొత్తం 16 రకాల దానాలు చెప్పబడ్డాయి. వాటిలో నాలుగు దానాలు మరింత విసిష్టమైనవి. అవి కన్యాదానం, గోదానం, భూదానం మరియు విద్యాదానం. వీటిని చతుర్విధ దానాలంటారు...

🕉🇮🇳🕉 భూదానంలో భూమి మీదనో, గోదానంలో గోవు మీదనో గల అన్ని హక్కులనూ దానం పుచ్చుకున్నవారికి ఇచ్చి వేస్తారు. వారు వాటిని అనుభవించవచ్చు. ఇంకొకరికి ఇవ్వవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. కన్యాదానం వాటికి భిన్నమైనది. వధువు యొక్క సర్వబాధ్యతలను మరి ఒకరికి బదిలీ చేయడానికి, కన్యాదాన ఉద్దేశ్యం ఇంత దాకా ఆమె పోషణ, రక్షణ, సంతోషం, ఓదార్పు, ప్రోత్సాహం, అన్నీ తల్లిదండ్రుల బాధ్యతలు. ఇకపై ఆమె భర్తకు, అత్తవారింటికి మార్చబడతాయి. వివాహం అనేది ద్వైపాక్షిక ఒప్పందం. దాన్ని దైవసాక్షిగా, అగ్నిసాక్షిగా, మనస్సాక్షిగా అంగీకరించాలి, గౌరవించాలి, అనుసరించాలి. ఇవి వధూవరులకి కాదు, వారి కుటుంబీకులకు వర్తిస్తుంది...

🕉🇮🇳🕉 కన్యాదానకాండ లక్ష్యం ఒక్కటే. పుట్టింట్లో లభించిన ప్రేమాభిమానాలు, రక్షణ, ప్రోత్సాహకాలూ అత్తింట్లోనూ నిరాటంకంగా లభించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఘట్టం అత్తవారింట్లో కలిసిపోవడానికి, సర్దుకుపోవడానికి మానసికంగా సంసిద్ధపరుస్తుంది. భరోసా కల్పిస్తుంది. ధైర్యస్థైర్యాలనిస్తుంది. వరుని కాళ్ళు కడిగి కన్యాదాత శచీదేవిని పూజించి కన్యాదానం చేస్తాడు. వధూవరుల మధ్య తెరను సుముహూర్తం వరకు అలానే ఉంచి కన్యాదానం చేస్తూ, నాకు బ్రహ్మలోకం సిద్ధించే నిమిత్తం సువర్ణ సంపన్నురాలైన ఈ కన్యను విష్ణుస్వరూపుడైన నీకు ఇస్తున్నాను. నా పితరులు తరించడానికి ఈ కన్యను దానం చేస్తున్నాను. భగవంతుడు, పంచభూతాలు, సర్వదేవతలు సాక్షులగుదురుగాక. సాధుశీలమైన, అలంకరింపబడిన ఈ కన్యను ధర్మ, కామార్ధ సిద్ధి కలిగే నిమిత్తము మంచి శీలం కలిగిన, బుద్ధిమంతుడవైన నీకు దానం చేస్తున్నాను, అంటూ చతుర్ధీవిభక్తి వేయకుండా కన్యాదాత దానం చేస్తాడు...

🕉🇮🇳🕉 సాక్షాత్ విష్ణుస్వరూపుడైన అల్లుడి పాదాలు కడిగి కన్యాదానం చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా దానం చేయడు కన్యాదాత. వరుడి దగ్గిర నుండి కొన్ని ప్రమాణాలు అడుగుతాడు. మరి ఇన్ని సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచుకున్న గారాలపట్టిని, తన ఇంటి మహారాణిని, కన్యాదాత అంత సులువుగా వరుడి చేతిలో పెట్టకుండా కొన్ని ప్రమాణాలు అడుగుతాడు...

🕉🇮🇳🕉 1. నీవు ధర్మమునందు ఈమెను అతిక్రమించకూడదు అని అడిగితే, వరుడు దానికి అంగీకరిస్తాడు. ధర్మమునందు ఈమెను అతిక్రమించనని ప్రమాణం చేస్తాడు...

🕉🇮🇳🕉 2. అర్ధము నందు నీవు ఈమెను అతిక్రమించకూడదు. నీవు ఇప్పటి వరకు ఎంతైతే సంపాదించావో, ఇక ముందు సంపాదించబోయెదానికి ఈవిడ సర్వాధికారిణి. ఒప్పుకుంటావా...??? అని అడిగితే దానికి కూడా వరుడు అంగీకారం తెలుపుతాడు...

🕉🇮🇳🕉 3. నీ మనసులో కామం కలిగితే నీకు మా అమ్మాయే గుర్తుకు రావాలి. నా కూతురి ద్వారానే నీవు సంతానాన్ని పొందాలి. అర్హత ఇంకొకరికి ఇవ్వడానికి వీలులేదు అనగానే, దానికి కూడా వరుడు అంగీకారం తెలుపుతాడు...

🕉🇮🇳🕉 అప్పుడు ఒక మహాద్భుతమైన కన్యాదాన ఘట్టం జరుగుతుంది. ముందుగా విష్ణుస్వరూపుడిగా ఉన్న వరుడు ఎదురుపడితే, మరి ఆయన ఆతిధ్యం ఇవ్వాలంటే అర్ఘ్యం, పాద్యం ఇవ్వాలి కదా...!!! దీనికంటే ముందు కన్యాదాత, వరుడు వివాహవేదికకు వచ్చే ముందే ఒక ఆసనం ఏర్పాటు చెయ్యాలి. అది దర్భాసనం అయి ఉండాలి. ఎందుకంటే విష్ణుమూర్తి వచ్చి నీ ఎదురుగా నుంచుంటే ఉచితాసనం వేసి గౌరవించాలి కదా...!!! మరి దర్భాసనాన్ని మించిన ఉచితాసనం ఏముంటుంది కనక. అందుకని కన్యాదాత తప్పక దానిని ఏర్పాటు చేసుకోవాలి...

🕉🇮🇳🕉 కాళ్ళు కడిగేటప్పుడు కూడా ముందుగా కుడికాలుని ఉంచితే, తనకు కాబోయే మామగారు, అత్తగారు మరచెంబుతో సన్నటి ధారతో నీటిని పోస్తుంటే, మామగారు బహు జాగ్రత్తగా రెండు చేతులతో ఆ పాదాలను కడుగుతాడు. అలాగే, దాని తరువాత ఎడమ పాదాన్ని ఉంచాలి. ఆ పాదాన్ని కూడా మామగారు అంతే ప్రీతితో కడుగుతాడు. మామగారు, అల్లుడి పాదాలు కడుగుతుంటే చాలా ఆనందంగా, వింతగా Photographer వంక, Videographer వంక చూడడం కాదు, వరుడు చెయ్యాల్సింది. తనకంటే వయసులో పెద్దాయన తన కాళ్ళు కడుగుతున్నాడు. తాను చేసుకున్న పుణ్యం అంతా తరిగిపోతుంది. కాబట్టి, ఒక చిన్న శ్లోకం చదువుకోవాలి (మయి, మయి, యశోమాయి) అని. బ్రహ్మగార్ని అడిగితే ఆయన చెబుతాడు. ఈ విషయం వరుడి తండ్రి చెప్పుకోవాలి. కన్యాదాత చెప్పుకోలేడు కదా... బాబూ! నేను నీ కాళ్ళు కడుగుతుంటే నువ్వు అలా మెడ వేళ్ళాడేసి Videographer వంక చూడటం కాదు, ఇది చదువుకో అని చెబితే తనను తాను పోగుడుకున్నట్లు అవుతుంది అని తండ్రి చెప్పుకోవాలి. నీ పుణ్యం ఎగిరిపోతుందిరా... నువ్వు ఇది చదువుకో అని, లేకపోతే బ్రహ్మస్థానంలో కూర్చున్న బ్రహ్మగారు చెప్పాలి. మనకి ఇవేమీ అఖ్ఖర్లేదు, అల్లరి తప్ప. అలా అల్లుడి కాళ్ళు కడిగిన తరువాత కన్యని సాలంక్రుతకన్యాదానం చేస్తారు. ఏమి పెట్టినా, పెట్టకపోయినా ఆడపిల్లకి సాధ్యమైనంత వరకు కన్యాదానం సమయంలో వడ్డాణము, చెవికి తాటంకాలు, ముక్కుపుడక పెట్టి కన్యాదానం చెయ్యాలి...

🕉🇮🇳🕉 మరి, అందరి ఆడపిల్లల తండ్రులకి అంత ఆర్ధిక పరమైన శక్తి ఉండదు కదా...!!! మన సనాతన ధర్మము, శాస్త్రము ఎంతో ఉత్తమమైనటువంటివి. నీవు ఊరంతా అప్పులు చేసి ఇవన్నీ పెట్టాల్సిందే అని చెప్పదు. మనకి తరుణోపాయం తెలియచేస్తుంది. పైగా, """కన్యాదానం""" అనేది చాలా పెద్ద దానం. అందుకే కదా ఆడపిల్లలు లేనివారు """కన్యాదానం""" చెయ్యాలని ఉవ్విళ్ళూరేది. అందుకే """కన్యాదానం""" కంటే ముందు """కన్యాదాత""" """దశదానాలు""" చెయ్యాలి. మరి అంత శక్తి లేనివారు """కన్యాదానం""" చేసే ముందు వధువు చేతిలో పూర్ణఫలం, కొబ్బరిబోండాం పెడతారు. దానిమీద గుమ్మడిపండు, దానిపైన మంచి గంధపు చెక్క పెట్టి కన్యాదానం చేస్తే, కన్యాదాత దశదానాలు చేసి సాలంక్రుత కన్యాదానం చేసినట్లే. ఈ పూర్ణ ఫలంతో ఉన్న అమ్మాయి చేతిని అబ్బాయి దోసిట్లో పెట్టి సన్నటి నీటి ధారతో ప్రక్కన భార్య పోస్తుండగా కన్యాదాత కన్యాదానం చేస్తాడు. సామాన్యంగా భార్య, భర్తకి ఎడమ చేతి ప్రక్కన కూర్చుంటుంది. కానీ, కొన్ని విశేష క్రతువులు చేసేటప్పుడు భార్యాస్థానం మారిపోతుంది. ఆవిడ ఆ సమయంలో కుడివైపుకి వస్తుంది...

🕉🇮🇳🕉 ఇలా కన్యాదానం జరుగుతుంది. కన్యాదానం జరిగేటప్పుడు బ్రహ్మగారు వరుడిని, వధువుని కొన్ని ప్రమాణాలు చెయ్యమని దానికి """అగ్ని, వాయువు, ఇంద్రుడు""" మొదలైనవారు సాక్షులనుకుని """ధర్మేచ, అర్ధేచ, కామేచ, నాతిచరామి""" అని వారిద్దరిచేతా ప్రమాణాలు చేయిస్తాడు. వారి చేత ఈ మంత్రాలను పలికించాలి. ఇలా ఎంతో మహోన్నతమైన కన్యాదానం జరిగేటప్పుడు పితృదేవతలు కూడా తన కొడుకు లేక మనవడు కడుగుతున్న శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలని చూసి వారు పితృదేవతా స్థానంలో ఉండి కన్యాదానం చేస్తున్నవారిని, వధూవరులను ఆశీర్వదిస్తారు...

🕉🇮🇳🕉 మన వివాహకాండ ఎంతో మహోన్నతమైనది. అంతటి ఉత్తమమైనది కాబట్టే పాశ్చాత్య దేశాలు కూడా మన వివాహ సంస్కృతిని చూసి చేతులెత్తి నమస్కరిస్తున్నాయి. ఈ వివాహ సంస్కృతిని మన సనాతన ధర్మం ఎలా చెప్పిందో అలా ఆచరిస్తూ, ఇంతే పదిలంగా ముందు తరాలకు అందించాల్సిన కర్తవ్యం ప్రతి ఒక్కరిపైనా ఉంది. కాబట్టి, మనందరం వీటి గురించి తెలుసుకుంటూ పదిమందికి ఈ విషయములను తెలియచేస్తూ మన సంస్కృతి, సాంప్రదాయాలపట్ల ఆసక్తిని పెంచే దిశతో అందరం పయనిద్దాం...

🕉సర్వేజనా సుఖినోభవంతు...
🕉గో బ్రాహ్మణేభ్యః శుభం భవంతు...

🕉🇮🇳🕉భారత్ మాతాకీ జై
🕉🇮🇳🕉జై జవాన్ జై కిసాన్
🕉🇮🇳🕉జైహింద్
🕉🇮🇳🕉జై భారత్
🕉🇮🇳🕉జయహో మన భారతదేశం

💞💞💞💞💞💞💞💞💞💞💞💯💯💯💯💯💯💯💯💯💯💯🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

Source - Whatsapp Message

అక్షర సత్యాలు

🤹‍♂అక్షర సత్యాలు🤹‍♂

🍟ఆలోచనా తరంగాలు ఎంత సరళంగా ఉంటే మనలో ప్రశాంతత అంత స్థిరంగా ఉంటుంది.. మన ప్రశాంతత ఎంత స్థిరంగా ఉంటే మన పనులు అంత అద్భుతంగా
ఉంటాయి.

🍟ఈ క్షణం లో జీవించడమే జీవితం. మిగిలిన వన్నీ అందులో భాగాలే..!!

🍟మనకి కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు.. ధైర్యం చెప్పే వారు బంధువులు.. కళ్ళను తుడిచి వారు స్నేహితులు.. కనపడకుండా కంట తడి పెట్టే వారు తల్లి దండ్రులు..!!

🍟నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి.. ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకు పోవాలి..!!

🍟మీరు ఎక్కడ మొదలు పెట్టారు అనేది "మీగతం".. గెలిచి ఎక్కడ నిలబడ్డారు అనేది మీజీవితం..!!

🍟కలిసి ఈ క్షణంలో ఒకే ఆత్మ లక్ష్యం కోసం జీవించడమే ఆత్మబంధం..!!

🍟నీ అవసరం ఎవరికీ లేదని, నీకు ఎవ్వరి అవసరం లేదని అనుకోకు.. ఎందుకంటే బొగ్గు,వజ్రం రెండూ మట్టిలోనే దొరుకుతాయి..దేని విలువ దానిదే.రెండూ అవసరమే.అందుకే నలుగురి కోసం జీవించు.నలుగురిలో జీవించు..!!

మానస సరోవరం.

Source - Whatsapp Message

పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏది లేదు.

ఈరోజు మంచిమాట. 💥పట్టుదల💥


బడిలో ఆటల గంట మోగింది.పిల్లలందరూ హుషారుగా ఆటలు ఆడుకుంటున్నారు.వినయ్ తప్ప,
వినయ్ కొత్తగా ఆ బడికి వచ్చాడు.
మిత్రులు లేకపోవడంతో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు.

వినయ్ కి నత్తి ఉండటంతో ఎవరు మిత్రులుకాలేదు..జ్వరం కారణంగా రాము చాలా రోజులు బడికి రాకపోవడం వల్ల వినయ్ కొత్తగా కనిపించాడు .స్నేహం చేశాడు.

వినయ్ నత్తి గమనించి ప్రేమగా మాట్లాడుతూనే నత్తిని ఎలా పోగొట్టుకోవచ్చు చెప్పాడు.

బడి వదిలిన తర్వాత రాము వినయ్ నీ దూరంగా పొలాల వైపు తీసుకెళ్ళి చిన్న చిన్న పదాలను వినయ్ తో గట్టిగా పలికేవాడు.అక్కడ తనను హేళన చేసేవారు లేరుఅనే ధైర్యంతో వినయ్ గట్టిగా పలుమార్లు చదివేవాడు.
ఇలా కొన్ని నెలల చేయడం వల్ల వినయ్ లో నత్తి పోయింది.

బడిలో పిల్లలందరూ వినయ్ నత్తి లేకుండా మాట్లాడటం గమనించి నీ నత్తి ఎలా పోయింది అని అడిగారు.

నా మిత్రుడు రాము నాలో ఆత్మవిశ్వాసం నింపాడు.నా లోపాన్ని ఎలా సరిచేసుకోవాలి అనేది నేర్పించాడు అని రాము తనకు చేసిన సహాయాన్ని వివరంగా చెప్పాడు వినయ్.

మిత్రున్నిలో లోపం ఉంటే సరిచేయాలి. కానీ హేళన చేయరాదు అని తోటి మిత్రులకు రాము చెప్పాడు.

సారీ వినయ్ నిన్ను చాలా బాధపెట్టం .ఫ్రెండ్ అంటే రాములా ఉండాలి అని అందరూ అనుకున్నారు.


నీతి,:పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏది లేదు.

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు.

Dedicated to all Telugu lovers👍మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు.

Please Share all Telugu People

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
5. అనువు గాని చోట అధికులమనరాదు
6. అభ్యాసం కూసు విద్య
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12. ఇంట గెలిచి రచ్చ గెలువు
13. ఇల్లు పీకి పందిరేసినట్టు
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19. కోటి విద్యలూ కూటి కొరకే
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
22. పిట్ట కొంచెం కూత ఘనం
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
29. ఆది లొనే హంస పాదు
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32. ఆకాశానికి హద్దే లేదు
33. ఆలస్యం అమృతం విషం
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35. ఆరోగ్యమే మహాభాగ్యము
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
41. ఏ ఎండకు ఆ గొడుగు
42. అగ్నికి వాయువు తోడైనట్లు
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48. అప్పు చేసి పప్పు కూడు
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51. బతికుంటే బలుసాకు తినవచ్చు
52. భక్తి లేని పూజ పత్రి చేటు
53. బూడిదలో పోసిన పన్నీరు
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు
55. చాప కింద నీరులా
56. చచ్చినవాని కండ్లు చారెడు
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
58. విద్య లేని వాడు వింత పశువు
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
61. చక్కనమ్మ చిక్కినా అందమే
62. చెడపకురా చెడేవు
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
65. చింత చచ్చినా పులుపు చావ లేదు
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు
68. డబ్బుకు లోకం దాసోహం
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71. దాసుని తప్పు దండంతో సరి
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు
73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75. దొంగకు తేలు కుట్టినట్లు
76. దూరపు కొండలు నునుపు
77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78. దురాశ దుఃఖమునకు చెటు
79. ఈతకు మించిన లోతే లేదు
80. ఎవరికి వారే యమునా తీరే
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
83. గాజుల బేరం భోజనానికి సరి
84. గంతకు తగ్గ బొంత
85. గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు
87. గొంతెమ్మ కోరికలు
88. గుడ్డి కన్నా మెల్ల మేలు
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
105. కాకి ముక్కుకు దొండ పండు
106. కాకి పిల్ల కాకికి ముద్దు
107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
109. కాసుంటే మార్గముంటుంది
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
112. కలిమి లేములు కావడి కుండలు
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114. కంచె చేను మేసినట్లు
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
116. కందకు కత్తి పీట లోకువ
117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
118. కీడెంచి మేలెంచమన్నారు
119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
124. కూటికి పేదైతే కులానికి పేదా
125. కొరివితో తల గోక్కున్నట్లే
126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
127. కొత్తొక వింత పాతొక రోత
128. కోటిి విద్యలు కూటి కొరకే
129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
130. కొత్త బిచ్చగాడు పొద్దు నెరగడు
131. కృషితో నాస్తి దుర్భిక్షం
132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
135. ఉన్న లోభి కంటే లేని దాత నయం
136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక
137. మెరిసేదంతా బంగారం కాదు
138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
141. మనిషి మర్మము.. మాను చేవ...
బయటకు తెలియవు
142. మనిషి పేద అయితే మాటకు పేదా
143. మనిషికి మాటే అలంకారం
144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ
145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా
148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
149. మొక్కై వంగనిది మానై వంగునా
150. మొరిగే కుక్క కఱవదు కరిసే కుక్క మొఱగదు
151. మొసేవానికి తెలుసు కావడి బరువు
152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు
157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
159. నవ్వు నాలుగు విధాలా చేటు
160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
161. నిదానమే ప్రధానము
162. నిజం నిప్పు లాంటిది
163. నిమ్మకు నీరెత్తినట్లు
164. నిండు కుండ తొణకదు
165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు
166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి
167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
172. ఊరు మొహం గోడలు చెపుతాయి
173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
174. పాము కాళ్ళు పామునకెరుక
175. పానకంలో పుడక
176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు
178. పండిత పుత్రః పరమశుంఠః
179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
183. పెళ్ళంటే నూరేళ్ళ పంట
184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
188. పిచ్చోడి చేతిలో రాయిలా
189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
191. పిండి కొద్దీ రొట్టె
192. పిట్ట కొంచెము కూత ఘనము
193. పోరు నష్టము పొందు లాభము
194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు
195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
199. రామాయణంలో పిడకల వేట
200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
202. రెడ్డి వచ్చె కథ మొదలెట్టు అన్నట్టు
203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
204. రౌతు కొద్దీ గుర్రము
205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
207. సంతొషమే సగం బలం
208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే
209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు.🙏

Source - Whatsapp Message