మనిషికి సాధన ఎక్కడో లేదు. తన మనసే సాధన. అది అనేక విషయాలను పట్టుకొని నిరంతరం పరుగులు పెడుతూ ఉంటుంది. ఎప్పుడూ ఒక బాధనో,భయన్నో, ఈర్ష్యనో, అసూయనో లేక కోరికనో పట్టుకొని పదే పదే దానినే గుర్తు చేస్తూ సాగుతూ ఉంటుంది. ఇది కేవలం భావ రూపమే. ఆ భావమే పదే పదే మదిలో మెదులుతూ ఉంటుంది. మనిషి ఆ భావానికి గురి అయ్యి దుఖితుడు అవుతూ ఉంటాడు లేదా చెడ్డ కార్యాలు చేస్తాడు.
ఇక్కడే సాధన పని చేసేది. మనసుకు ఆ వ్యతిరేక తలంపులు రాకుండా - ఒకవేళ వచ్చినా - మనము మంచిగా మాత్రమే ఆలోచించాలి, చెడు ఆలోచించకూడదు అని ఆ ఆలోచనలు సరిదిద్దుకొని - ఆ స్థానములో మంచివి, శాంతిని కలిగించి భావాలతో ఆలోచనలు కదిలించాలి.
ఈ ప్రక్రియ మొత్తం మనకు మనము చెప్పుకోవటము లోనే ఉంటుంది తప్ప - ఇళ్ళు వదిలేసి, మనుషులను వదిలేసి, ఆ పరిస్థితులను ప్రస్తుతానికి తప్పించుకున్నా
- మనలోని మనసు - దాని పని తీరు మారవు కదా..... జ్ఞానము అంటే మనను మనము చూసుకుంటూ - వివేకముతో మంచిని, సంతృప్తిని మనసుకు నేర్పుకుంటూ ఆ భావాలతో జీవించటమే. ఇది నిత్య సాధన..
ఎవరికి వారు - ఎవరిలో వారు గుణ మార్పు చేసుకునే సాధన.ఇదే నిజమైన ఆధ్యాత్మికత...
Source link -
http://youtube.com/post/UgkxIoUE8WuEZoOxj8Eu6mhQzfGT2OxM7q0J?si=m6p7WB1bM3YO80gV
No comments:
Post a Comment