Sunday, September 7, 2025

 కాశీ క్షేత్రములో జరిగిన యధార్థ సంఘటన...2 వ బాగం 

తనకు స్పృహ వచ్చేసరికి ఒక గట్టు మీద ఒకావిడ వొడిలో పడుకుని ఉన్నాడు.ఆవిడ ఎవరో తెలియదు .ఎక్కడ ఉన్నాడో తెలియదు,ఆవిడ అతన్ని ఒక చోటుకి తీసుకుని వెళ్ళింది.

అక్కడ ఒకతను ధ్యానంలో కుర్చుని ఉన్నాడు.అప్పుడే ధ్యానం ముగిసి కళ్ళు తెరిచి ఈ కుర్రవాడ్ని చూసాడు తను. వొళ్ళంతా భస్మం రాసుకుని, జుట్టంతా ఎర్రగా ఉంది , జడలు కట్టిన జుట్టుతో ఉన్న అతన్ని చూస్తే ఈ కుర్రవాడికి తెలియని భక్తి భావం కలిగింది.

" స్వామి మీరెవరు ..... " అని అడగాలనుకున్నాడు కాని అతనికి నోట మాట రావడం లేదు ..

అలా కాసేపు తదేక దృష్టితో చూస్తుండగా ఇతని హృదయంలో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది.మనసు నెమ్మదించి స్వస్వత పొందింది.కళ్ళు మూతలు పడుతూ ధ్యానస్తుడయ్యాడు.అలా ఎంత సేపు ధ్యానంలో ఉండిపోయాడో కుడా తెలియదు.

నిదానంగా ధ్యానం నుండి బాహ్య స్మృతిలోకి రాగానే ఆ సాధువును గుర్తు పట్టాడు. తను చిన్నప్పుడు ఇంట్లో వారి గురించి బాధ పడుతుండగా తన మనస్సును మార్చి విశ్వనాధుని వైపుకి త్రిప్పింది ఈ సాధువే అని జ్ఞాపకానికి వచ్చింది. ఇరవైయేళ్ళ క్రితం చుసిన ఆ సాధువును మళ్ళీ కలిసినందుకు పట్టరాని ఆనందం కలిగింది . 

ఎవరి ప్రేరణ వలన తన మనస్సు భగవంతుని వైపు తిరిగిందో ,ఎవరిని దర్శిస్తుండడం వలన మనస్సు ప్రశాంతత పొందుతోందో ఆయన్ని మళ్ళీ చూడగలిగాను,ఇది నా తండ్రి ఆ విశ్వనాధుని అపార కరుణే అనుకుని , ఆ సాధువుకు భక్తి పూర్వకంగా నమస్కరించి ఒక ప్రశ్న అడగాలనుకున్నాడు .

సేకరణ 🙏

No comments:

Post a Comment