Sunday, September 7, 2025

++++++++++++++++++++++
మనలోని రోగనిరోధక వ్యవస్థ
(Immune System)
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
ఏదేని పత్రికను తిరగేస్తుండగా పొరపాటున మధ్య పేజీలో " పిన్ను మీ వేలుకు గీసుకుని గాయమవుతుంది. చివ్వుమన్న నొప్పికి మీరు చటుక్కున వేలును నోట్లో పెట్టుకుంటారు.

పిన్ను గుచ్చుకున్న వెంటనే మీ శరీరంలో ఏఏ మార్పులు జరుగుతాయోపిన్ను గుచ్చుకున్న సమయాన అనేకానేక సూక్ష్మక్రిములు మీ శరీరంలోకి ప్రవేశించటానికి ప్రయత్నిస్తాయి. ఆ వెంటనే మీ శరీరంలోని రోగనిరోధక యంత్రాంగం అలెర్ట్ అయి ఆ బాక్టీరియాని నశింపజేసే ప్రయత్నంలోనూ, గాయాన్ని మానుపరిచే ప్రయత్నంలోనూ తల మునకలవుతుంది. ఆ పోరాటంలో రోగక్రిములు నశించవచ్చు. లేక ఒకోసారి మీ శరీర కణజాలము నశించవచ్చు.

గుండె, ఊపిరితిత్తులులాగే రోగనిరోధక వ్యవస్థను కూడా మన శరీరంలోని ఒకానొక అవయవంగా చెప్పుకోవచ్చు. ఈ ఆవయవం మన శరీరమంతటా వ్యాపించి ఉంటుంది. బాహ్యాన్నుంచి మన శరీరం మీద దాడిచేసే మిలియన్ల కొద్దీ రసాయనాలు, సూక్ష్మక్రిముల నుంచి అది జీవితం పొడుగుతా మన శరీరాన్ని కాపాడుతుంటుంది.

మనలోని రోగనిరోధక వ్యవస్థకు మన శరీరానికి సంబంధించిన కణాలేవో శరీరానికి సంబంధించని కణాలేవో స్పష్టంగా తెలిసి ఉంటుంది. శరీరానికి సంబంధించని కణజాలం (బాక్టీరియా లాంటిది) ఏదన్నా లోపలికి ప్రవేశించినప్పుడు రోగనిరోధక వ్యవస్థ వెంటనే రియాక్ట్ అయి వాటి మీద దాడి సల్పుతుంది. శరీరం లోపల యాంటీబాడీస్ (Antibodies)ని సృష్టించుకుని బాక్టీరియాతో పోరాడించవచ్చు.లేదా బాక్టీరియాతో నేరుగా పోరాడే కణజాలాన్ని ప్రేరేపించి రోగక్రిములను నశింపచేయటానికి ప్రయత్నించనూ వచ్చు. మన శరీరంలోని రోగనిరోధకవ్యవస్థ ఈ క్రింది అవయవాల ద్వారా

పనిచేస్తుంది.

1. థైమస్ గ్రంధి (Thymus gland)

2. ఎముకలోని మూలుగ (Bone Marrow)

3. లింఫ్ గ్రంథులు (Lymph Nodes)

4. లింప్ నాళాలు (Lymphatic vessels)

5. ప్లీహము (Spleen)

ఇప్పుడు వీటిలో ఒకోదాని గురించీ విడివిడిగా చూద్దాము:

1. థైమస్ గ్రంథి (Thymus gland)

* ఛాతీ ఎముకకు వెనక వైపున వుండే ఈ గ్రంధి ఉత్పత్తి చేసే తెల్లరక్త Lymphacytesగా పరిణతి చెంది శరీరం లోపలికి ప్రవేశించిన వైరస్లతో పోరాడతాయి.

O T-Cells గా పిలువబడే ఈ కణాలకు మరికొన్ని కణాలు తొడై అన్నీ కలిసి వైరస్ మీద జమిలిగా పోరాటానికి దిగుతాయి.

T-Cells తో జత కూడే మిగతా కణాలు

I. సహాయక టి-సెల్స్ (Helper T-Cells or co-operator cells) O ఈ కణాలు B-Lymphacyte అనబడే మరో రకపు కణాలలో యాంటీబాడీస్ వృద్ధి కావటానికి దోహదం చేస్తాయి. (ఎయిడ్స్ వ్యాధిలో ఎయిడ్స్ వైరస్ ఈ హెల్పర్ టీ - సెల్స్ నే నాశనం చేసి మనిషిని నిర్వీర్యం చేస్తాయి.) ii. కిల్లర్ టి-సెల్స్ (Killer T-Cells or Cytotoxic cells)

O మన శరీరానికి సంబంధించని బయటి కణజాలం లోపలికి ప్రవేశించినప్పుడు ఇవి త్వరితంగా వృద్ధి చెంది వాటిని నాశనం చేయటానికి ప్రయత్నిస్తాయి. Tumourలు, ఇన్ఫెక్షన్లను నాశనం చేసేది ఈ కిల్లర్ టి సెల్సేయ్యే,

iii. సప్రెసర్ టి - సెల్స్ (Supressor T-cells)

మన శరీరంలోకి ప్రవేశించిన శత్రువు (ఇన్ఫెక్షన్) ఓడిపోగానే ఇంక యుద్ధాన్ని ఆపమంటూ ఈ కణాలు యుద్ధ విరమణ సూచనను ఆదేశిస్తాయి. • సప్రెసర్ టీ-సెల్స్ కనుక బలహీనపడ్డా లేక పనిచేయకపోయినా రోగనిరోధక వ్యవస్థకు చెందిన మిగతా కణాలు పోరాటాన్ని ఆపవు. అలాంటి సందర్భంలో ఇన్ఫెక్షన్ అనబడే శత్రువు లేకపోతే అవి మన శరీర కణజాలం. మీదే పోరును కొనసాగించి Rheumatiod Arthritis లాంటి కీళ్ళ వ్యాధులకు దారి తీస్తాయి.

2. ఎముకలోని మూలుగ (Bone Marrow)

మన ఎముకల లోపల వుండే మూలుగ (Bone Marrow) అనే పదార్థం తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ తెల్లరక్త కణాలు శరీరం లోపలికి ప్రవేశించిన సూక్ష్మక్రిములతో పోరాడతాయి.

3. లింఫ్ గ్రంథులు (Lymph Nodes)

౦ లింఫ్ గ్రంథులు బి- లింఫో సైట్స్ (B-Lymphocytes) అనబడే ఒక రకమైన తెల్ల రక్త కణాలను తయారు చేస్తాయి. ఈ B-Cells పై భాగాన ఇ మ్యునోగ్లోబులిన్ (Immunoglobulin) అనే ఒక ప్రోటీన్ పదార్థం వుంటుంది. ఈ B - Cells ఇన్ఫెక్షన్లో పోరాడే యాంటీ బాడీన్ని ఉత్పత్తి చేస్తాయి.

4. లింఫ్ నాళాలు (Lymphatic vessels)

ఈ నాళాలు మన శరీరంలో ఇన్ఫెక్ట్ అయిన భాగాన్నుంచి సూక్ష్మక్రిములను లింఫ్ గ్రంధుల వద్దకు తీసుకువెళ్తాయి. అక్కడ లింఫ్ గ్రంధులు తయారుచేసే యాంటీబాడీస్ ఆ సూక్ష్మక్రిముల మీద దాడిచేసి వాటిని నాశనం చేస్తాయి.

5. ప్లీహము (Spleen)

• రక్త ప్రవాహం ద్వారా వచ్చిన సూక్ష్మక్రిములు ఇక్కడ తెల్లరక్త కణాలతోముంచెత్తబడి నాశనం చేయబడతాయి.

 🔸రక్తనాళాలు

* రక్తనాళాల ద్వారా తెల్ల రక్తకణాలు, యాంటీ బాడీస్, శరీరమంతా ప్రయాణిస్తూ శరీరానికి అపకారం కలిగించే బాక్టీరియా నుంచి శరీరాన్ని కాపాడుతూ మన ఆరోగ్యానికి పహరా కాస్తుంటాయి.

*రోగనిరోధక వ్యవస్థ (Immune system)లో రెండు రకాలుంటాయి.

1. Innate Immunity

2. Adaptive Immunity

 🔸innate munity లో చర్మం కొంత ప్రాముఖ్యత వహిస్తుంది. నోరు, గొంతు, కళ్లు దేవులు, యాష్, మూత్రనాళాలలో తయారయ్యే ఎంజైములనబడే పదార్థాలు. మిగతా ప్రాముఖ్యత వహిస్తాయి. మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుంటాయి.

పనిపిల్లలు తల్లిగర్భంలో వుండగా తల్లి శరీరం నుంచి లభించే యాంటీబాడీస్ ద్వారా రక్షణను పొందితే ఆ తర్వాత తల్లి అందించే స్తన్యం ద్వారా రక్షణను పొందుతారు. 

🔹 మనిషి పెరిగి పెద్దవుతూ వివిధరకాల సూక్ష్మక్రిములు దాడికి గురవుతున్న కొద్దీ అతని శరీరం తనకు తాను రోగ నిరోధక చర్యలను సంతరించుకుంటుంది. దీనిని Adaptive Immunity అంటారు. దీని మూలంగా శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మక్రిములను శరీరంలో తయారయ్యే యాంటీబాడీస్ నశింపచేయ గలుగుతాయి.

🔸Adaptive immunity మూలంగా ఒకసారి శరీరంలోకి ప్రవేశించిన 1. సూక్ష్మక్రిములను తెల్ల రక్తకణాలు గుర్తుంచుకుని మళ్ళీ అలాంటి క్రిములు లోపలికి ప్రవేశించినప్పుడు. పూర్వతరహా యాంటీబాడీన్ని తిరిగి సృష్టించుకుని విజయాన్ని పాధిస్తాయి.

 🔹ఈ సిద్ధాంతం ఆధారంగానే కృత్రిమంగా టీకాలను తయారుచేసుకుని, వాటితో రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరుచుకుని పోలియోలాంటి కొన్ని వ్యాధులను దరికి రాకుండా చేసుకోగలుగుతున్నాము.

 👉ఇన్ఫెక్షన్ని నిరోధించే మిగతా చర్యలు

🔸లాలాజలం: నోటి లోపలికి ప్రవేశించే సూక్ష్మక్రిములను లాలాజలంలో వుండే ఎంజైములు నాశనం చేస్తాయి.

👁️కన్నీరు: కంటి లోపలికి ప్రవేశించే సూక్ష్మక్రిములను కన్నీటి ద్వారా బయటికి పంపేయటం జరుగుతుంది. ఇంకా ఏమన్నా సూక్ష్మక్రములు కంట్లో మిగిలి ఉంటే కన్నీరు తాలూకు ఎంజైములు వాటిని నశింపచేస్తాయి.

👃ముక్కు: దుమ్ము, ధూళి ద్వారా ముక్కులోపలికి ప్రవేశించే సూక్ష్మక్రిములను ముక్కులోపల వుండే కేశనాళికలు బంధించి చీమిడి ద్వారా బయటికి నెట్టేస్తాయి. లేదా తుమ్ముల ద్వారా, శ్వాసనాళం ద్వారా ఇంకా ఏమన్నా లోపలికి వెళ్ళితే దగ్గటం ద్వారా మనం వాటిని బయటికి నెట్టేస్తాము.

 🔹ప్రేవులు: కడుపులో తయారయే యాసిడ్ అక్కడికి చేరుకున్న సూక్ష్మక్రిములను నశింపజేస్తుంది. ప్రేవులలోకి ప్రవేశించిన సూక్ష్మక్రిములను ప్రేవులలో
నిలవవుండే ఉపకార బాక్టీరియా' నశింపచేస్తాయి.

🔸 మూత్రనాళాలు:
 మూత్రనాళాలలోని 'ఉపకార బాక్టీరియా' అక్కడికి ప్రవేశించే సూక్ష్మక్రిములను నశింపచేస్తాయి. స్త్రీకి యోనిలో వుండే Mucus Lining కూడా అక్కడికి ప్రవేశించే సూక్ష్మక్రిములను నాశనం చేయటానికి ప్రయత్నిస్తుంది. చర్మం: చర్మగ్రంధులు, స్వేదగ్రంధులలో ఉత్పత్తి అయ్యే నూనె, స్వేదం, చర్మం ద్వారా లోపలికి ప్రవేశింప జూసే సూక్ష్మక్రిములను నశింపచేయటానికి ప్రయత్నిస్తాయి.

- ఈ రకంగా మన శరీరంలోని ప్రతి భాగమూ బయటి నుంచి దాడిచేసే సూక్ష్మక్రిములను నశింపచేయటంలో తన రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తుంటుంది. వంతు పాత్రను నిర్వహిస్తూ మన

 🔹రోగనిరోధక వ్యవస్థ పటిష్టతకు సూత్రాలు

*మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను పటిష్టపరుచుకోవటానికి ఈ క్రింది సూత్రాలను పాటించాలి : విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా లభించే సమతుల్యమైన
పోషకాహారాన్ని తీసుకోవాలి.

* రెగ్యులర్ ఎక్సర్ సైజుల్ని చేయాలి. అయితే అతిగా మాత్రం కాదు. 
* మానసికంగా, శారీరకంగా కృంగదీసే వొత్తిడులకు దూరంగా వుండాలి. 
* పొగతాగటం, మద్యాన్ని తాగటాన్ని మానుకోవాలి.


అరోగ్య మస్తు యూట్యూబ్ ఛానల్ లో మరెన్ని హెల్త్ టిప్స్ చూడండి

https://youtu.be/xyMSaBl0Qqc
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు ఓం సర్వేభవంతు సుఖిన: సర్వే సంతు నిరామయా: సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దు:ఖ భాగ్భవేత్
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.
...

No comments:

Post a Comment