Sunday, September 7, 2025

 *ఇక్కడ రెండు ఆసక్తికరమైన సంఘటనలు చెప్పాలి...కర్మ రిటర్న్స్ అంటారు కదా. అది మంచైనా చెడైనా తప్పకుండా రిటర్న్ అవుతుంది అని నాకు అనుభవపూర్వకంగా తెలిసింది.*

*1. మంచి రిటర్న్ - FB లో నా దృష్టికి వచ్చిన ఏ సమస్యకైనా 1k నుంచి 5k దాకా నేను హెల్ప్ చేస్తూ వచ్చాను. అలాగే వైజాగ్ కళాకారులకు ఆక్సిడెంట్స్ లాంటివి ఏదైనా జరిగితే 10k నుంచి 20k దాకా కూడా ఇచ్చాను.*

       *ఈ రోజు మా నాన్నగారి స.ర్జ.రీకి నేను అడగకపోయినా సరే ఒక మంచి మనిషి నుంచి నాకు పెద్ద సహాయం అందింది. అలా మంచి కర్మ రిటర్న్ అయింది.*

*2. నేను లీడ్ గా చేసిన ఒక సినిమా రిలీజ్ అయ్యాక, అనుకోకుండా వారితో చిన్న మిస్ండర్స్టాండ్ వల్ల డిఫరెన్స్ వచ్చింది. ఆఫకోర్స్ ఆ తర్వాత మళ్ళీ క్లియర్ అయింది లెండి. కానీ ఆ గ్యాప్ లో వాళ్ళు నన్ను ఆ పోస్టర్ అండ్ థంబనైల్ నుంచి తీసేసారు. కొంచెం బాధపడ్డాను...*

       *ఇప్పుడు same అదే విషయం వాళ్లకు కూడా జరిగింది. వారిని ఇంకో ప్రాజెక్ట్ థంబనైల్స్ 👇 నుంచి తీసేసారు.అలా బ్యాడ్ కర్మ కూడా రిటర్న్ అయింది.*
      *దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థం అయింది. మన పని మనం సిన్సియర్ గా చేసుకుంటూ వెళ్తుండాలి అంతే. ఈ ప్రకృతి అన్ని లెక్కలు నోట్ చేసి ఏదో ఒకరోజు అది కూడా మనకు సరిగ్గా కావలసినప్పుడు తిరిగి బ్యాలెన్స్ చేస్తుంది అని.*

Sekarana 

No comments:

Post a Comment