*“పాదంలో ముల్లు తొలగితే నడక సౌకర్యంగా మారుతుంది,*
*మనసులో అహంకారం తొలగితే జీవితం సుఖసమృద్ధిగా మారుతుంది.”*
*“కానివారికి అన్నం పెట్టినా కృతజ్ఞతతో తల వంచుతారు,*
*అయినవారికి ఆస్తులు పంచినా అసంతృప్తే మిగులుతుంది.”*
*“రెండు నాలుకలున్న పాము కన్నా,*
*రెండు రకాలుగా మాట్లాడే మనిషి మరింత ప్రమాదకరుడు.”*
*“మన మంచిని నిశ్శబ్దంగా చూసే కళ్ళు తక్కువే,*
*మన చెడును ఎదురుచూసే కళ్ళు ఎక్కువ.”*
*“దేవుడు గుడ్డివానికి వరమిస్తే,*
*అతడు కోరుకోవలసింది అష్టైశ్వర్యాలు కాదు, రెండు కళ్ళే కావాలి.”*
*“నిజాన్ని నిర్భయంగా చెప్పిన వాడే*
*సమాజంలో అసలైన ధైర్యవంతుడు.”*
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌸🌺🌸 👁️👃👁️ 🌸🌺🌸
No comments:
Post a Comment