☕టి మరియు కాఫీలని ఆయుర్వేద దృక్పథంతో అర్థం చేసుకోవడం వలన వాటి యొక్క ప్రభావము మన దేహం పైన త్రిదోషాల పైన మనసు పైన ఎలా ఉంటుంది తెలుసుకోవచ్చు.
🧘 మానసికంగా చూసుకున్నట్లయితే వీటిల్లో ఉండే ఉద్ ప్రేరకాల వలన మానసిక గుణాలైనా సర్ప రజోస్తమో గుణాలలో ఎక్కువగా రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది. సత్వగుణాన్ని తగ్గిస్తుంది.
*శారీరిక దోషాలపై వీటి ప్రభావం* వీటికి ఎక్కువగా ఉత్తేజితం చేసే శక్తి వలన ఎక్కువగా వాతాన్ని ప్రకోపింప చేస్తుంది. తీవ్రంగా మాత్రం పెరగటం వలన ఆందోళన విశ్రాంతి తీసుకోలేకపోవటము నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు పెరుగుతాయి.
* మరియు ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో పిత్త దోషం కూడా ఎక్కువ అవుతుంది అంటే శరీరంలో వేడి శాతం పెరుగుతుంది. శరీరంలో ఆమ్లత్వము చిరాకు కలగటము తుమ్ములు ఎక్కువగా రావడం తదితర సమస్యలు తలెత్తుతాయి.
* నిజంగా తీసుకోవడం వల్ల బద్దకంగా ఉండే సమస్యని తగ్గిస్తుంది కాబట్టి కఫ ప్రకృతి ఉన్న వారికి లేక శీతల ప్రదేశాల్లో ఉండే వారికి దీన్ని తీసుకోవటం వలన ఒక మంచి ఈ ఔషధకారిగా ఉపయోగపడుతుంది.
🫧 ఉదయమే లేచి ఏదో ఒకటి పానీయం తాగే అలవాటు ఉన్నవారికి వారి ప్రకృతి అనుసారంగా పానీయం ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం.
* అనగా వాత ప్రకృతి ఉన్నవారు ఎక్కువగా అల్లము మిరియాలు ఇలాంటి కషాయాలు తీసుకోవడం. పిట్ట ప్రకృతి ఉన్నవారు యాలుకలు గాని, గ్రీన్ టీ కానీ ,లెమన్ గ్రాస్ , కొబ్బరి నీళ్లు బార్లీ డికాక్షణ గ్రీన్ టీలు లాంటివి తీసుకోవడం ఉత్తమం. కఫ ప్రకృతి ఉన్నవారు దాల్చిన చెక్క మిరియాలు అల్లము వేసిన కషాయాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
* ☕ టీ కాఫీ విషయం వరకు వస్తే వాత ప్రకృతి పిత్త ప్రకృతి వారు తీసుకోకపోవడం చాలా మంచిది కఫ ప్రకృతి వారు మితంగా తీసుకోవటం మంచిది. Dr. Alekhya
*
No comments:
Post a Comment