Sunday, September 7, 2025

 అందరికీ నమస్కారం,  శరీరంలో కాళ్లకు మొహానికి వాపులు వస్తున్నాయి అంటే అది సిస్టమిక్ కారణాల వల్ల వస్తోంది అని గమనించాలి. ముఖ్యంగా హార్ట్ అండ్ లంగ్స్,  లివర్ మరియు కిడ్నీస్ వలన. 
ఇక్కడ ఆయుర్వేద ప్రకారంగా చూస్తే అగ్ని మందగించడం వలన మనకు అవయవాల్లో రోగ ప్రతికార క్షమత తగ్గి ఇలాంటి వాపులు రావచ్చు, మరికొన్ని కారణాల్లో శ్రోతస అవరోధం కూడా ఉండొచ్చు. కాబట్టి ఇతర లక్షణాలని పరిగణలకు తీసుకొని తదనుసారంగా పత్యం చేస్తూ చికిత్స చేయాలి. చికిత్సలో ముఖ్యంగా స్త్రోతస్ అవరోధాన్ని దూరం చేసి అగ్నిని పెంచడం ఇవి ముఖ్య ఉద్దేశాలు ఉంటాయి.
హృదయ వికార సంబంధిత వాపులు శరీరంలో వస్తే దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా గురు ఆహార పదార్థాలు భోజనంలో తీసుకోకూడదు, గురు ఆహార పదార్థాలు అంటే ఏవైతే లేటుగా జీర్ణమైతాయో వాటిని గురు ఆహార పదార్థాలు అంటారు. అందులో ముఖ్యంగా మాంసము, గేదె పాలు, మినుములు, సాబుదాన అట్లాగే పెరుగు మొదలగునవి.. దీనితోపాటు హృదయ వికారము ఉంది కాబట్టి పికిల్స్ (Pickles) ముఖ్యంగా అవాయిడ్ చేయాలి, అధ్యషనము చేయకూడదు, అంటే భోజనం తిన్న తర్వాత మళ్లీ సిక్స్ అవర్స్ తర్వాత లేదా సరిగ్గా ఆకలి అయినప్పుడు భోజనం చేయాలి.
హృదయ వికారాలకు సంబంధించిన ఆయుర్వేదిక్ ఔషధాలు చాలా ప్రచులితమైనవి, ముఖ్యంగా అర్జున కషాయం,  అర్జునారిష్టం వంటి ఔషధాలు బాగా పనిచేస్తాయి, అయినా సరే మీ యొక్క కండిషన్ ని వివేచన చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక వైద్యుణ్ని కలవండి.
Dr P Srikanth 
7382665346

No comments:

Post a Comment