Monday, February 10, 2020

ఆరోగ్యం(10 అంశాలు)

💁‍♂ఆరోగ్యం(10 అంశాలు)⬇

<><><><><><><><><>
1) భోజనం తర్వాత సోంపు తింటే?
భోజనం చేసిన వెంటనే సోంపు తినడం చూసే ఉంటాం. అయితే ప్రస్తుతం సోంపు తినే వారు తక్కువైపోతున్నారు. కానీ భోజనం తినగానే ఓ స్పూన్ సోంపు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా వాత, పిత్త దోషాల వల్ల కలిగే రోగాలు నయమవుతాయి. మధుమేహం ఉన్నవారు భోజనం అవ్వగానే సోంప్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. BP, గుండె సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. జీర్ణాశయ, రుతు సమస్యలు కూడా తగ్గిపోతాయి.

<><><><><><><><><>
2) మీకోసం కొన్ని హెల్త్ చిట్కాలు
♣ బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే నిత్యం గోధుమ జావ తాగండి
♣ విపరీతమైన తలనొప్పి తగ్గాలంటే పది తులసి ఆకులు, 10 నల్ల మిరియాలను నూరి అందులో టీ స్పూన్ తేనె కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి
♣ బాదం పప్పు, గసగసాలు కలిపి తింటే రక్తం శుద్ధి అయ్యి చెడు కొలెస్ట్రాలు తొలిగిపోతుంది
♣ బెల్లంలో మిరియాల పొడి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని నిద్రించే ముందు తీసుకుంటే జలుబు తగ్గుతుంది

<><><><><><><><><>
3) ఫ్రిడ్జ్‌లో ఉంచకూడని పదార్థాలు?
☞ ఫ్రిడ్జ్‌లో టమాటాలు ఉంచితే వాటి ఫ్లేవర్‌ పోతుంది.
☞ రొట్టె, బ్రెడ్‌ ఫ్రిడ్జ్‌లో పెడితే వెంటనే పాడైపోతాయి.
☞ చాకోలేట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఉండడం మంచిది
☞ ఫ్రిడ్జ్‌లో పెట్టిన బంగాళదుంపలు తినడం వల్ల కండరాలు బలహీనం అవుతాయి.
☞ తేనెను ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. చల్లటి ప్రదేశాల్లో తేనె గడ్డకడుతుంది.
☞ ఉల్లిపాయలనూ పెట్టకూడదు. అయితే కట్‌ చేసిన ఉల్లిపాయల్ని కంటైనర్‌లో సీల్‌ చేసి పెట్టుకోవచ్చు.

<><><><><><><><><><>
4) ఓట్స్‌తో ప్రయోజనాలు ఏంటంటే?
ఓట్స్‌లో కొలెస్ట్రాల్, రక్తపోటును నివారించే బీటా గ్లూటెన్ అనే కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును నివారిస్తుంది. రోజూ ఒక కప్పు ఉడికించిన ఓట్ బ్రాన్ లేదా కప్పున్నర ఓట్ మీల్ తినడం వల్ల లభించే బీటా గ్లూటెన్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను 5% మేర తగ్గిస్తుంది. అంతేకాకుండా హార్ట్ ఎటాక్ ముప్పును 10% తగ్గిస్తుంది. ఓట్స్‌ను పాలు లేదా వేడి నీటిలో ఉడికించి తీసుకుంటే బరువు తగ్గుతారు.

<><><><><><><><><><>
5) కొర్రలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
సిరి ధాన్యాల్లో ప్రముఖంగా చెప్పుకునే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొర్రలు అధిక శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరానికి అధిక పీచు పదార్థాలను అందిస్తాయి. కొర్రలలో మాంసకృతులు, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం, కొలెస్ట్రాల్‌ని అదుపులో కావడం, రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండటం, కీళ్ల నొప్పులు, కాలిన గాయాలు త్వరగా మానడానికి కొర్రలు ఉపయోగపడతాయి.

<><><><><><><><><><>
6) కోడిగుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
రోజుకో గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. కోడిగుడ్లు తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు తెలుసుకోండి
➳ శరీరానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి
➳ మంచి కొవ్వు పెరుగుతుంది
➳ శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, మినరల్స్ అందుతాయి
➳ కళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి
➳ గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి
➳ మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది

<><><><><><><><><><>
7) పరీక్షల సమయంలో తినాల్సిన ఆహార పదార్థాలు
☞ కోడిగుడ్లు తినడం వల్ల న్యూరో ట్రాన్స్‌మీటర్స్ చురుగ్గా పనిచేస్తాయి. ఇవి మెదడు పనితీరును వేగవంతం చేస్తాయి.
☞ పరీక్షల సమయంలో వాల్ నట్స్ తింటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. ఇవి మెదడుకు బూస్టర్స్‌గా పని చేస్తాయి.
☞ ఆకుకూరల్లో బ్రెయిన్ ప్రొటెక్టివ్‌కు సహాయపడే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
☞ అవకాడో జ్యూస్ వారానికి 3 సార్లు తాగితే బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. వీటిలో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.

<><><><><><><><><><>
8) సబ్జా గింజల వల్ల లాభాలెన్నో!
☞ అధిక బరువు ఉన్నవారు వీటిని తింటే బరువు తగ్గుతారు
☞ జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి
☞ గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా పోతాయి
☞ సబ్జా గింజలను పొడి చేసి గాయాలపై వేసి కట్టు కడితే త్వరగా మానుతాయి.
☞ సబ్జా గింజలను నీటిలో కలుపుకుని తింటే తలనొప్పి తగ్గుతుంది
☞ నీటిలో కలుపుకుని తాగితే నీరసం తగ్గిపోతుంది

<><><><><><><><><><>
9) వేడి నీటిని తాగడం వల్ల ఉపయోగాలు
☕ వేడి నీటిని తాగడం వల్ల అజీర్ణం సమస్యలు, తలనొప్పి మాయం
☕ రక్తంలో మలినాలు తగ్గి, ఉదర సంబంధిత వ్యాధులు దూరం
☕ శొంఠిపొడి కలుపుకుని తాగితే వాత సంబంధిత వ్యాధులకు చెక్
☕ భోజనానికి ముందు వేడి నీరు తాగితే బరువు తగ్గుతారు
☕ స్పూన్ బార్లీ పౌడర్ కలుపుకుని నీళ్లు తాగితే చర్మం మెరుస్తుంది

<><><><><><><><><><>
10) బీట్‌రూట్ తింటే కలిగే ప్రయోజనాలు
☞ రోజూ బీట్‌రూట్ తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరి చేరవు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
☞ బీట్‌రూట్ తినడం వల్ల రక్తంలో నైట్రేట్ రెట్టింపు అవుతుంది. దీనివల్ల కండరాలు చురుగ్గా పనిచేస్తాయి.
☞ బరువు తగ్గాలనుకునే వారికి బీట్‌రూట్ ఔషధంగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది.
☞ గర్భిణులు రోజూ గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుంది.🙋‍♂

No comments:

Post a Comment