Thursday, February 27, 2020

మన జీవితంలో దేన్నైనా సరే ఉన్నది ఉన్నట్లు వుండనియ్యాలి..

మన జీవితంలో
దేన్నైనా సరే ఉన్నది ఉన్నట్లు వుండనియ్యాలి..

అది కష్టమా,,,,? నష్టమా,,,?
ఇష్టం లేనిదా,,,?ఇష్టమైనదా...?
కోరుకున్నదా,,,?కొరకుండా వచ్చినదా..,?
చావా....? పుట్టుకా....?
నచ్చినదా....? నచ్చనిదా....?
బరువైందా....? సులువైందా...?
భాధపెట్టేదా....? సుఖపెట్టేదా....?

ఇలా నీదైన ఎంపికలోకి వెళ్లకుండా,,,
కేవలం ఏది ఉంటే దాన్ని ,,,,ఉన్నది ఉన్నట్లు...
వుండనీ,,, దానితో మనకేం సంభంధం లేదు...

ఈ జ్ఞానం ఒక మల్లెచెట్టుకు బాగా తెలుసు..
అది పడమర గాలి వస్తే పడమర వైపుకు వంగుతుంది....ఉత్తరం గాలి వస్తే ఉత్తరానికి వంగుతుంది...ఎటువైపు గాలి వస్తే అటు వైపు వంగుతుంది...

అలా గాక ఎదురు నిలబడ్డ ప్రతి చెట్టు
కూలడానికి సిద్దమైనట్లే......ఎదురు నిలబడడం
అంటే,,,,

నేనెందుకు వంగాలి....
పడమర వైపు గాలి వస్తే ,,,దానికేదురుగా
నేను తూర్పు వైపు నిలబడతాను అంటే...
నిలబడు.... ఎవరేం చెయ్యలేరు...

ఇప్పుడు మనం ఏ స్థితిలో వున్నా,,,
ఖచ్చితంగా ఆ స్థితిని అంగీకరించడమే
మోక్షం యొక్క ద్వారం.

ఏది ఉందొ...అది...
అందులోనే సహజంగానే మోక్షం దాగివుంది..

ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లు కాక మార్చుకుంటామో
అప్పుడే జీవితంలో ధ్యానం యొక్క అవసరం,,
ఆధ్యాత్మిక యొక్క అవసరం ఏర్పడింది....

ఆ ధ్యానం మనల్ని మళ్లీ ఉన్నందున్నట్లు
చూడగలిగే స్థాయికి తీసుకెళ్తుంది....

🙏🙏🙏

No comments:

Post a Comment