Sunday, February 23, 2020

చెప్పుడు మాటలు

చెప్పుడు మాటలు

చరిత్ర చెప్పిన సత్యం

👉 వియ్యంకుడి చెప్పుడు మాటలు విని మహామంత్రి తిమ్మరసు కళ్ళు పీకించాడు
శ్రీ క్రిష్ణ దేవరాయలు

👉 తన సొంత ఖర్చులు కోసం టోపీలు కుట్టుకునే ఔరంగజేబు చెప్పుడు మాటలు విని అధికారం కోసం కన్న తల్లి తండ్రులని బంధించాడు

👉 తల్లి గర్భంలో చనిపోబోయే బిందుసారుడిని తన ఉపాయంతో బతికిస్తే చివరికి చెప్పుడు మాటలు విని బిందుసారుడే చాణక్యుడి మరణానికి కారణం అయ్యాడు

👉 చెప్పుడు మాటలు విని కురు సామ్రాజ్యంపై పగ పెంచుకున్నాడు శకుని
అదే శకుని చెప్పుడు మాటలు విని ధ్రుతరాష్టుడు పాండవులపై యుద్ధం చేసి సర్వం కోల్పోయారు కౌరవులు

👉 చెప్పుడు మాటలు విని రావణబ్రహ్మ అంతటి
మాహాజ్ఞానే సీతమ్మ తల్లిని అపహరించి రాముడితో యుద్ధానికి దిగి
రాక్షసుడు అయ్యాడు
కడకు మరణించాడు

👉 చెప్పుడు మాటలు విని స్నేహాన్ని కోల్పోయిన వారు కొందరు

👉 చెప్పుడు మాటలు విని సంసారాలని నాశనం చేసుకున్నవారు మరికొందరు

👉 చెప్పుడు మాటలు విని అధికారాన్ని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు

👉 శకుని చెప్పుడు మాటలు వినటం వలన హస్తినాపుర మహా సామ్రాజ్యమే సర్వనాశనం అయింది మనమెంత?

మనతో ఉంటూ చెప్పుడు మాటలు చెప్పే శకుని లాంటి వాళ్ళతో అప్రమత్తం గా లేకపోతే ఎంతటివారికైనా అపజయం తప్పదని చరిత్ర చెప్తున్న నగ్న సత్యం.

👉 ఒకరి గురించి నీకు చెబుతున్నాడు అంటే
నీ గురించి మరొకరికి చెప్పడా ?

Think it once again
లోకాసమస్తా సుఖినోభవంతు

No comments:

Post a Comment