Saturday, February 29, 2020

ధ్యానములొ కూర్చోవటం అంటే ఎందుకు చాలా మంది ఇబ్బంది పడతారు అంటే

ధ్యానములొ కూర్చోవటం అంటే ఎందుకు చాలా మంది ఇబ్బంది పడతారు అంటే, “ధ్యానము లొ ఏదో అద్భుతం జరిగింది, లేక జరుగు తుంది” అని కొంత మంది చెబుతుంటారు. అది విని చాలా మంది ఏదో జరగాలన్న కోరికలతో ధ్యానానికి కూర్చుంటారు.
ఏమి జరగక పోతే నాకు ధ్యానం కుదరటం లేదు అని వదిలేస్తారు. ఇలా ఏదో జరుగుతుందన్న expectation తో చేసే ధ్యానం వల్ల ఏమీ జరగదు. వారి దృష్టి అంతా ఎదురు చూపుతో జరుగుతుంది.
ధ్యానం అంటే మనసు ఆత్మలో అణగారటం! మనసు ఉనికిని కోల్పోవటం!
ధ్యానం అంటే సమాధి స్థితి!
సమాధి స్థితి అంటే బుద్ధి సమస్థితి లోకి వెళ్ళడం. అంటే మనసు ఆలోచనలు, కోరికలు, ఏమీ లేకుండా నిర్వికారంగా వుండి పోవటం.
అప్పుడు ఏమి జరుగు తుంది?
ఉద్వేగాలు ఉండవు. దానితో
శ్వాస (నెమ్మదించి )
తగ్గుతుంది. తద్వారా సకల
నాడీ వ్యవస్థ నెమ్మదిస్తుంది.
గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది.
క్రమేపీ త్రికోశాలూ విశ్రాంత స్థితిలోకి వెళ్లి పోతాయి.
చక్రాలన్ని శుద్ధి అవుతాయి.
తద్వారా మూలాధార చక్రం ఎక్కువ ఆక్టివేట్ అవుతుంది. క్రమేపీ అద్భుతాలు జరుగుతాయి.

ఆత్మ స్వరూపదర్శనం కలుగుతుంది!
అంటే ఆత్మ తత్వం బోధ పడుతుంది. మనస్తత్వం లో మార్పులు జరుగుతాయి తద్వారా శరీర తత్వం కూడా మారు తుంది.
ఇవన్నీ జరగాలంటే, ముందు మనసు నిర్వికార స్థితిలో ఉండగలగాలి. అంటే ఏదో జరుగుతుంది, జరగాలి అన్న ఆశ, ఎదురు చూపుతో కూడిన ధ్యానం చెయ్యకూడదు.
ధ్యానం చెయ్యాలి. అంతే! నీ సమయం కొంత త్యాగం చెయ్యాలి.. అంతర్ముఖం అవ్వాలి.

No comments:

Post a Comment