అంతరంగ సాధన
🕉🌞🌎🌙🌟🚩
ఇదే ప్రతి ఒక్కరి చివరి గమ్యస్థానం ఇంతకుమించి చెప్పేది అంటూ ఏమీ లేదు > ఇంతకుమించి తెలుసుకోవాల్సింది అంటూ ఏమీ లేదు >
1. మెలకువ,
2. కలలు,
3. నిద్ర
ఈ మూడు స్థితులనూ జాగ్రత్, స్వప్న, సుషుప్తిగా చెబుతారు. వీటినే అవస్థాత్రయం అంటారు.
మెలకువ స్థితిలో బాహ్య ప్రపంచజ్ఞానంతో వ్యవహరిస్తాం. పనులు చేస్తుంటాం.
మెలకువగా ఉన్నప్పటి అనుభవాలు, గతంలోని జ్ఞాపకాలు మనసులో సూక్ష్మసంస్కారాలుగా ఏర్పడి స్వప్నంలో మనకు అడ్డదిడ్డంగానో, క్రమపద్ధతిలోనో కనిపిస్తాయి.
స్వప్నావస్థను అర్ధసుషుప్తి అని కూడా అంటారు. అంటే సగం నిద్ర అన్నమాట. స్వప్నంలో శరీర అవయవాలకు విశ్రాంతి లభించినా, జ్ఞానేంద్రియాలకు విశ్రాంతి లభించదు.
సుషుప్తిలో.. అంటే గాఢనిద్రలో శరీరంతో పాటు ఇంద్రియాలకు కూడా పూర్తి విశ్రాంతి లభిస్తుంది. హాయిగా నిద్రిస్తాం.
జీవుడు జాగ్రదవస్థలో కన్నులయందు ఉండును. జీవుడు స్వప్నావస్థలో కంఠంలలో ఉండును. జీవుడు సుషుప్తిలో హృదయంలో ఉండును. జీవుడు తురియంలో సహస్రారం మేదడులో ఉండును.
4. అవస్థాత్రయం కాకుండా ఆత్మకు నాల్గవ పాదం ఉన్నది. అది తురీయ స్థితి.
‘యోగః చిత్తవృత్తి నిరోధః’ అన్నది పతంజలి యోగ సూత్రం.
చిత్తవృత్తులను ఆపడమే యోగం. చిత్తవృత్తులంటే మనసులో కలిగే చాంచల్యాలు. నిశ్చలంగా ఉన్న కొలను నీటిలో రాయివేస్తే తరంగాలు లేస్తాయి. అదే విధంగా భౌతిక ప్రపంచంలో జ్ఞానేంద్రియాల ద్వారా మనకు కలుగుతున్న అనుభవాలన్నీ మనసులో వృత్తులుగా ఏర్పడతాయి. ఈ వృత్తులను ఆపాలంటే మనసు ఏకాగ్రం కావాలి.
కొలనులోని నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు, నీరు స్వచ్చంగా ఉన్నప్పుడు మనకు అడుగుభాగం కూడా చక్కగా కనిపిస్తుంది. అలాగే.. మనసు నిశ్చలమైనప్పుడే ఆత్మానుభూతి కలుగుతుంది. ధ్యానాన్ని అభ్యాసం చేసినప్పుడు మనసు నిశ్చలమౌతుంది. ఇది అంతరంగ సాధన.
అష్టాంగయోగంలో >
1. యమ,
2. నియమ,
3. ఆసన,
4. ప్రాణాయామ
5. ప్రత్యాహారం అనే ఐదు అంగాలు బహిరంగ సాధనలు.
6. ధారణ,
7. ధ్యాన,
8. సమాధి అను మూడు అంగాలు అంతరంగ సాధనలు. బహిరంగ సాధనల తరువాత యోగి అంతరంగ సాధనలో సమాధి స్థితికి చేరుకుంటాడు. ఇదే తురీయ స్థితి. సాధకుడు తన సాధనను బట్టి తురీయ స్థితిలోని వివిధ స్థాయీఘట్టాలను అనుభవిస్తుంటాడు.
1. మూలాధార చక్రం గుదస్థానం.
2. స్వాధిష్ఠాన చక్రం లింగస్థానం
3. మణిపూరక చక్రం నాభిస్థానం
4. అనాహత చక్రం హృదయస్థానం
5. విశుద్ధచక్రం కంఠస్థానం
6. ఆజ్ఞచక్రం భ్రూమధ్యం
7. సహస్రారం బ్రహ్మరంధ్రం.
1. బ్రహ్మ గ్రంధి
2. విష్ణు గ్రంధి
3. రుద్ర గ్రంధి
గ్రంధి త్రయము గ్రంధులు అంటే ముడులు అని అర్థం. ఇవి శరీర అంతర్భాగంలో ఉండి జీవుని పరమాత్మవద్దకు చేరకుండా మార్గ మధ్యంలో ఉంటాయి >
1. బ్రహ్మ గ్రంధి ఈ దృశ్య ప్రపంచం దేహ ఇంద్రియములు అన్ని శాశ్వతం అని భ్రమ పడటం, అన్ని అనుభవిస్తూ భ్రాంతికిలోను కావడమే ఈ గ్రంథి లక్షణం, ఈ గ్రంథి స్వాదిస్థానం కుండలిని శక్తి దాటగానే బ్రాంతి తొలగిపోవును. బ్రహ్మ గ్రంధి ఇక్కడనే బుద్ధి వికసిస్తుంది.
2. విష్ణు గ్రంధి ఇది స్థూల శరీరంలో అంతర్లీనంగా ప్రకాశిస్తుంది సూక్ష్మశరీరం. ఇది ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం అనబడే సమిష్టి స్వరూపం భ్రాంతి. భౌతిక నుండి దూరమైన విష్ణు మాయ అనబడును.
అద్వైత భావ భ్రమలో పాడగలడు నేను సూక్ష్మశరీరము అని బ్రహ్మములో అను అనుభవమునకు కలిగించుట ద్వారా కుండలిని శక్తి మణిపూరక నుండి విడిపడగానే విష్ణు గ్రంధి చేధించడం సాధకుడు ఈ సూక్ష్మ శరీరం కూడా నేను కాదు అని ఇది కూడా ఒక కల్పితమే ఇది నా స్వరూపం కాదు అని భావన కలగడమే విజ్ఞాన జ్ఞాన స్థితికి రాగలడు సాధకుడు.
3. రుద్రగ్రంధి సమస్త శక్తులకు పుట్టినిల్లు ఆజ్ఞాచక్రం కుండలిని శక్తి చేరగానే సాధకుడికి విశ్వ విశ్వంతరాల సమస్త విషయముల యొక్క యదార్ధ తత్వము తెలుసుటయే కాక మహత్తరమైన దైవత్వం అద్భుతం దివ్య శక్తులు అష్టసిద్ధులు రాగలవు అట్టి స్థితిలో జీవ బ్రహ్మ యొక్క సంయోగమునకు విస్మరించడం లేదా నేను అనునది ఏదో ఇంకా సరిగా అర్థం కాక ఉండుటయే అవిద్య రూపమైన రుద్రగ్రంధి లక్షణం.
ఈ రుద్రగ్రంధి కుండలిని శక్తి చేరిన వెంటనే సహస్రం కమలం విచ్చుకుంటుంది. అప్పుడు జీవుడు జీవబ్రహ్మైక్యం చెందుతాడు.
చెందగానే ఆత్మ సూక్ష్మాతిసూక్ష్మం అతిసూక్ష్మం గొప్పలలో మహత్ మహా గొప్పది సర్వవ్యాపకమైన అనంతమైనది. ఈ ఆత్మ నేను అని తెలిసి వస్తుంది. అప్పుడు సాధకుడడికిపై సంకల్పాలు లేని పరమోత్కృష్టమైన ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం పొంది > నిరంతరం శుద్ధ బ్రహ్మానందం అనుభూతి కైవల్య ప్రాప్తి అందగలడు.
దీని కొరకే అన్నీ యోగంలు అన్ని ముద్రలు అన్ని ఆసనంలు. సహస్రం వరకు కుండలిని శక్తి చేర్చుట కొరకే ఇక్కడికి కుండలినీశక్తి చేర్చిన సాధకుడు విజయం సాధించినవాడే అవుతున్నాడు ! అహం బ్రహ్మాస్మి’ అనే స్థితికి చేరుతాడు !!
🕉🌞🌎🌙?

No comments:
Post a Comment