దేవాలయమంటె ఏమిటి?
ఈ దేవాలయాలు ఎందుకు? అన్న ప్రశ్నలు తలెత్తినప్పుడు,
‘దేవానాం దేవస్య వా ఆలయా అని సమధానమిచ్చారు మన ఋషిపుంగవులు.
దేవాలయం ప్రార్థన కోసం, పూజ కోసం, దేవతావిగ్రహాలను, ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్టించి, వాటి రక్షణకోసం కట్టించిన కట్టడమే దేవాలయమని అన్నారు.
అందుకే మనవాళ్ళూ దేవలయాన్ని సప్తసంతానాలలో ఒకటిగా పేర్కొన్నారు.
కొడుకు లేక కూతురు,
తటాకం,
కావ్యం,
విధానం,
ఆలయం,
వనం,
భూదేవస్థాపనం
అనేవి సప్తసంతానాలుగా చెప్పబడ్డాయి.
దేవాలయన్ని దేవగృహం, దేవగార, దేవాయతనం, దేవకులం, మందిరం, భవనం, స్థానం, దేవస్థానం, వెష్మం, కీర్తనం, హర్మ్యం, విహారం అని, విమానం, ప్రాసాదం అని పిలవడం జరుగుతోంది.
మన సంస్కృతి, కళలు, శిల్పం, వాస్తు, వేదాంతం పురాణం మొదలైఅన వాటి సంగమ స్థానం హిందు దేవాలయం.
పరిపూర్ణమైన, సుందరమైన ఆలయమంటె మానవశరీరం. ఇక్కడ “తత్” (ఆత్మ) ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది.
దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమత్మ. జీవాత్మ పరమాత్మకంటె వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం; నేనే అతనని పూజించలి అని అగమాలు ఘోషిస్తాయి.
దేవాలయం ఒక దేహం లాంటిది.
శిఖరం శిరస్సు;
గర్భగృహం మెడ,
ముందరి మంటపం ఉదరం;
ప్రాకారపు గోడలు కాళ్ళూ;
గోపురం పాదాలు;
ధ్వజ స్తంభమే జీవితం.
ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము.
దేవాలయ ప్రాచీనత
భగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడననీ, శివుని అజ్ఞ లేనిదే చీమైనాకుట్టందనీ, అందుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు. ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం. అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం (ఫిజికల్ బాడీ) మానసిక శరీరం (సైకిక్ బాడీ), తైజసిక శరీరాలను (సూపర్ కాన్ షియస్ బాడీ) ప్రతిబింబిచే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కొక్కీ (లింక్) అని విజ్ఞుల అభిప్రాయం.
దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వే
దకాలాల్లో దేవాలయాలు లేవనీ, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వెదకాలపు చివరిదశలో, రామాయణ, మహాభారత కాలల్లో ఆరంభమైందనీ, వేదకాలపు యాగశాలలే కాలక్రంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం.
‘దేవాలయాలు వైదికయుగంలో నిర్మితములైనట్లు కనబడదు. దేవతా స్వరూపము, దేవతల వాహనములు, ప్రతిమా వర్ణనము మొదలైన విషయములకు సంబంధించిన వాక్యములు వేదములందు కొన్ని గలపు గాని, విగ్రహారాధన ఆచరణ లోనికి వచ్చిన తర్వాత గాని, దేవాలయ నిర్మాణమునకు అవకాశముండదు.
విగ్రహారాధన ఏర్పడిన వెంటనే దేవాలయ నిర్మాణము సైతము ప్రారంభింపబడినది.
బ్రహ్మస్వరూపమైన ఆత్మకు దేహము నిలయమైనట్లుగా, దేవతా విగ్రహానికి దేవాలయం నిలయముగా భావించి, దేవాలయ నిర్మాణము శరీర నిర్మణము ననుసరించి కావించినారు.
దేవాలయ వాస్తు
దేవాలయాలను మనం రెండువర్గాలుగా విభజించుకోవచ్చు.
1.గ్రామదేవతాలయలు
2.శిష్టదేవతాలయాలు.
మొదటివర్గం గ్రామరక్షణ కోసం తరతరాలుగా గ్రామసంస్కృతిలో నిలద్రొక్కుకున్న ఎల్లమ్మ, గంగమ్మ, మారమ్మ, పోచమ్మ, మైసమ్మ మొదలైన దేవతల చిన్న చిన్న గుడులు.
గ్రామదేవతలలో అధికం స్త్రిలే .
ఒక విధంగా వీరు శక్తిదేవతలు. ఈ దేవాలయాల్లో చెప్పుకోదగ్గ వాస్తుశిల్పం కనపడదు. ఆలయాలు సాధారనంగా ఉంటాయి.
ఇక రెండవవర్గం బ్రహ్మ, విష్ణు, శివ, విఘ్నేశ్వర మొదలైన శిష్టదేవతల ఆలయాలు, ఈ దేవతలను పూజించేవాళ్ళు అగమాలలో చెప్పిన రీతిగా ఈ దేవతలకు షోడశోపచారాలు, చతుష్పష్టి ఉపచారాలు జరుగుతాయి.
శిష్టదేవాలయాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మించబడ్డాయి. గృహ, గ్రామ, నగర, దేవాయతన, ప్రాసాద, దుర్గ, ఆరామ, తటాక, సేతుబంధ ఇత్యాది నిర్మాణ లక్షణాలను తెలిపే శిల్పశాస్త్రమే వాస్తుశాస్త్రం. ఈ వాస్తు సంప్రదాయం ఆగమాల మీద ఆధార పడింది, ఆగమాలలో దేవాలయ నిర్మాణం, ఉత్సవాలు పేర్కొనబడ్డాయి, కామిక, కారణ ఆగమాలలో నియమ నిబంధనలు చెప్పబడ్డాయి.
వాస్తుశాస్త్రం త్రిమూర్తుల నుండి ఇంద్ర, బృహస్పతి, నారదులకు అనుగ్రహింపబడిందనీ, వాళ్ళ ద్వారా అనేక ఋషులకు సంక్రమించిదని అంటారు. పురాతన పట్టణాలు, కట్టడాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మింప బడుతుండేవి.
వేదకాలంలో యజ్ఞాలకోసం శాలలను, వేదికలను, ఇటుక, కొయ్య, వెదురులతో నిర్మించేవారు. ఇవన్నీ శిల్పసూత్రాన్ని అనుసరించే నిర్మింపబడుతుండెవి. అవే భారతఖండ వాస్తువిద్యకు మూలరూపాలని కొంతమంది అభిప్రాయం.
దేవాలయ నిర్మాణం
దేవాలయ నిర్మాణంలో మొట్టమొదటి అంశం ఆలయ నిర్మాణానికి భూమిని ఎన్నుకోవడం ఉంది. పవిత్రములైన దేవాలయాలు సాధారణంగా నదీతీరాల్లోకాని, నీటి బుగ్గలు ఉన్న పర్వతాగ్రాల
వామిపుష్కరిణి, ఉత్సవమూర్తుల నుంచే గది ఇత్యాదులు సర్వసాధారణంగా ఉంటాయి.సాధారణంగా
శివాలయం పట్టణానికి ఈ
శాన్య దిశలోను,
విష్ణ్యాలయం పశ్చిమదిశలోను,
సూర్యదేవాలయం తూర్పు దిక్కులోను,
దుర్గ ఆలయాలు ఉత్తరదిశలోను,
బ్రహ్మాలయం పట్టణ మధ్యభాగంలోను ఉండాలట.
సామాన్యంగా శివాలయాల్లో లింగమే మూలబేరంగా ఉంటుది. లింగం ఎత్తునుబట్టి శివాలయాలు ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ మున్నగు విధాలుగా వర్గీకరించబడతాయి. గర్భగుడిలో లింగంతోపాటు ఇచ్చ, మరియు క్రియా అనే శక్తులు ఉంటాయి. ప్రవేశా ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు.
వినాయకుడు, దక్షిణామూర్తి, విష్ణువు లేదా ఆర్థనారీశ్వరుడు, లింగోద్భవ, బ్రహ్మ, దుర్గ మరియు చండీశ్వరాలయాలు సాధారణంగా ప్రధాన ఆలయం చుట్టూ ఉంటాయి.
రెండవ ప్రాకరంలో సూర్య, వినాయక, సుబ్రహ్మణ్య, గజలక్ష్మి మరియు భారతదేశం అంతటా ఇదంతా ఒకే లాగ ఉండదు.
శైవాలయాల్లో గర్భగుడికి ముందు నంది విగ్రహం ఉంటుంది
వైష్ణవాలయల్లో గర్భ గుడికి ముందు బలిపీఠం, ధ్వజస్థంభాలు కలిగిన గరుడ విగ్రహం ఉంటుంది. తక్కిన చిన్నచిన్న దేవుళ్ళ విగ్రహాలు, ఆలయాలు కూడా ఆలయప్రాంగణంలో ఉంటాయి. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు.
భక్తులు స్నానం చేయడానికి “తీర్థం” లేదా “పుష్కరిణి” ఆలయ సమీపంలో ఉంటుంది. ప్రసిధ్ధ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల చెంత “పుణ్యతీర్థాలు” ఉంటాయి. దైవానికి కాక జలానికి ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సాధారంగా “పుణ్యతీర్థా” అంటారు.
ప్రాచీన కాలంనుంచీ ఆంధ్రదేశం శిల్పకళకు, చిత్రకళకు, వాస్తుకళకు, పుణ్యక్షేత్రాలకు, ఇలా మన ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి నేడు మనకు ఉన్న పుణ్యక్షేత్రాలు – దేవస్థానాలు కూడ ఒక సాధనంగా ఉపకరిస్తున్నాయి. శిధిలప్రాయమయిన దేవలయాల్లో కూడ నేటికి పుజా పునస్కారాలు జరుగుతునే ఉన్నాయి. భగవంతుడి మీద ఉన్న భక్తి విశ్వాసాలు దీనికి ప్రత్యక్ష కారణాలైతే, నాటి విగ్రహ శిల్పసౌందర్యాన్నీ, దేవాలయ నిర్మాణాన్ని మట్టిపాలు చేసుకోలేక, నాటి ఆంద్రమహా వైభవాన్ని గుర్తుచేసుకొని వాటిని పునరుద్ధరించాలనే మహదాకాంక్ష ప్రరోక్ష కారాణంగా కనిపిస్తుంది.
ఎన్నో దేవాలయాలు పరమత ద్వేషం వల్ల మట్టిపాలయ్యాయి. పోయినవి పోగా ఉన్న వాటినైనా నిలుపుకొని వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అది మనందరి కర్తవ్యం..

No comments:
Post a Comment