కాలం ఎన్నో కబుర్లు చెప్పగలదు. గతాన్ని తవ్వి పోసి మన చరిత్రను మనకు బహుమతిగా ఇవ్వగలదు. మన దేశంలో ఒక్కో మూలకూ ఒక్కో కథ ఉంది. అడుగడుగునా అద్వితీయత ఉంది. ప్రపంచం కంటే ఎన్నో శతాబ్ధాలు ముందు నడిచిన మన పూర్వీకుల మేధస్సు ఉంది. మన కథలు మనం తెలుసు కోవాలి. పది మందికీ చెప్పి తీరాలి. మనల్ని మోస్తోన్న దేశం కథను మనం ఎత్తుకుని తిరగాలి. తలెత్తుకుని తిరగాలి.
యుద్ధానికి వెళ్లిన…
అవి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్లు పరిపాలిస్తున్న రోజులు… అది మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ ప్రాంతం. కల్నల్ పదవిలో ఉన్న అప్పటి అధికారి పేరు మార్టిన్. అక్కడి బ్రిటిష్ ప్రభుత్వానికీ, ఆఫ్గన్లకూ యుద్దం జరుగుతోంది. పదిరోజుల క్రితం వచ్చిన ఉత్తరం తప్ప… యుద్ధానికి వెళ్లిన మార్టిన్ గురించి తన భార్యకు ఎలాంటి సమాచారమూ లేదు. ఆమె హృదయమంతా భర్త చుట్టూనే తిరుగుతోంది. మార్టిన్ ఎప్పుడొస్తాడా… అని ఆమె కళ్లు గుమ్మం వైపే చూస్తున్నాయి. లెక్కలేనన్ని కన్నీటి చుక్కలు నేల రాలుతూనే ఉన్నాయి. మార్టిన్ బతికే ఉన్నాడా లేదా అనే భయం క్రమక్రమంగా పెరిగిపోతోంది. అతడు మరణించాడేమోనన్న ఊహకు కూడా ఆమె వణికిపోతోంది. చెంపల మీద కన్నీరు పారుతూనే ఉంది. భర్త కోసం ఎదురుచూస్తూనే ఉంది.
జోడించి వేడుకుంది…
విషయం తెలుసుకున్న ఒక హిందూ సాధువు నేరుగా మార్టిన్ ఇంటికి వచ్చాడు. ఆమె పడుతోన్న బాధ నుంచి విముక్తి కావడానికీ, మార్టిన్ సజీవంగా ఇంటికి చేరడానికీ తనకో ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయం ఆమెలో చిన్ని ఆశను పుట్టించింది. ఆ సాధువు ఇచ్చిన సలహా… నిండా చీకటి పరుచుకున్న ఆమె హృదయంలో ఒక దీపంలా వెలిగింది. కొండంత నమ్మకాన్ని ఇచ్చింది. సాధువు చెప్పినట్టు శివపూజ చేయడానికి నిశ్చయించుకుంది. దగ్గర్లోని ఒక శిధిల దేవాలయానికి చేరుకుంది. బైద్యనాథ మహాదేవ శివుడి ఆలయం. తాను అక్కడికి వెళ్లగానే… ఆ గుడి గంటలు నాట్యం చేస్తున్నట్టు మోగుతున్నాయి. ధూపాల పొగా, హారతి దీపాల వెలుగూ ఆమె నమ్మకాన్ని మరింత పెంచాయి. ఆ ఆలయంలో కొలువైన లింగాకారంలోని శివుడిని చూడగానే, రెండూ చేతులూ జోడించి వేడుకుంది. ఆ మహత్తర రూపాన్ని దర్శించిన క్షణం… అప్పటి వరకూ తానెప్పుడూ చూడని శక్తిని అనుభూతిచెందింది. ఆ ఆలయ పూజారి కూడా విషయం తెలుసుకుని, ఆమెకు అండగా నిలిచాడు. “బైద్యనాథ మహాదేవుడి అండ ఉండగా… ఏ ఆపదైనా సరే చిటికినవేలుని కూడా తాకదు. ఈ దేవదేవుడి ముందు మృత్యువు చాలా చిన్నది. ఈ విశ్వంలో ఏ మూలనున్నా సరే… నమ్ముకున్న వాళ్లను కాపాడుకుంటాడు. గుండెల నిండుగా బైద్యనాధుడిని నింపుకోండి. ఓ నమఃశివాయ అనే మంత్రాన్ని పదకొండు రోజుల పాటు లఘురుద్రి జపం చేయండి. అంతా మంచే జరుగుతుంది” అని చెప్పాడు.
ఆ మరుసటి రోజు నుంచే అన్ని పనులూ పక్కన పెట్టి, జపం మొదలు పెట్టింది. గుండెల నిండా శివయ్యను నింపుకుంది. అన్నపానాలూ మానేసింది. ఆమె నరనరాన ఓం కారం ప్రవహిస్తోంది. ప్రతిరక్తపు బొట్టూ శివయ్యనే తలుస్తోంది. ఓ నమఃశివాయ… ఓ నమఃశివాయ… ఓ నమఃశివాయ… అంటూ జపిస్తూనే ఉంది. మరో ధ్యాస లేదు, ఇంకే ధ్యానమూ లేదు. శివనామం సుముద్రంలా ప్రవహిస్తోంది. అక్కడి గాలి మొత్తం ఓంకారాన్ని పులుముకుంది. రోజులు గడుస్తున్నాయి.
మృత్యవు సిద్ధంగా…
జపం కొనసాగుతోంది. పదకొండో రోజున పంచాక్షరిని జపించింది. అదే రోజు సాయంత్రాన భర్త నుంచి ఉత్తరం వచ్చింది. మెల్లిగా ఉత్తరం తెరిచింది. లేఖ చివర ఉన్న భర్త సంతకాన్ని చూసి ఊపిరి పీల్చుకుని, చదవడం మొదలు పెట్టింది. “డియర్… కొద్దిరోజుల క్రితం నీకో లేఖ రాసాను కదా… ఆ తర్వాత రోజే ఆఫ్గన్లు మా సైన్యాన్ని చుట్టుముట్టారు. నలు వైపుల నుంచీ భీకరమైన దాడి చేశారు. ఒక్కరిలోనూ బతకగలమన్న ఆశ లేదు. హత్తుకోవడానికి మృత్యవు సిద్ధంగా ఉంది. మా దగ్గర ఆయుధాలు లేవు. ఆహారమూ లేదు. సైన్యమూ పలచబడింది. వారి చేతులో హతమవ్వడం తప్ప మరేదారీ కనిపించలేదు. అనుకున్నట్టు గానే… ఒకపొడవాటి ఖడ్గంతో ఆఫ్గన్ సైనికుడు నా మీదకి దూకబోయాడు. భయంతో కళ్లు మూసుకున్నాను. ఆ క్షణాన నువ్వు తప్ప మరేదీ గుర్తు లేదు. హృదయం నిండా నిన్ను నింపుకుని, ఊపరి వదిలేందుకు సిద్ధపడ్డాను. అంతలోనే అద్భుతం జరిగింది. అప్పటి వరకూ అక్కడ లేని మనిషి మా సైన్యంలోకి వచ్చాడు. ఆఫ్గన్లపై విరుచుకుపడ్డాడు. ఆయన్ని మేమెవ్వరమూ అంతకుమునుపు చూడలేదు. ఒంటి నిండా తెల్లగా ఏదో రాసుకుని ఉన్నాడు. మొలకి సింహం చర్మం కట్టి ఉంది. చేతిలో ఒక పదునైన ఆయుధంతో ఉన్నాడు. ఆ ఆయుధాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. చూడటానికి శూలంలా ఉండి, మూడు కొనలగా చీలి ఉంది. ఆ యోధుడి ధాటికి ఆఫ్టన్ సైన్యం చెల్లాచెదురైపోయింది. ఆ వీరుడే కనుక రాకపోయి ఉంటే… ఈ పాటికి నా శెవం ఇంటిని చేరు ఉండేది.” ఈ లేఖ చదివాక ఆమె ఊపిరిపీల్చుకుంది. మరోసారి గుండెల నిండా శివయ్యను నింపుకుని నమస్కరించుకుంది.
చివరి శ్వాస వరకూ
1880 అఫ్గన్‌తో యుద్ధం ముగిసాక… సతీసమేతంగా కల్నల్ మార్టిన్ కొండ మీద ఉన్న బైద్యనాథ్ మహాదేవుడిని దర్శించుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆలయానికి కొత్త శోభను తీసుకొచ్చారు. పదిహేనువేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ రోజు నుంచీ ఆ గుడి బాధ్యతలను మార్టిన్ దంపతులే చూసుకున్నారు. కాలం గడిచాక… తిరిగి ఇంగ్లడ్ వెళ్లిపోయారు. వారి స్వదేశానికి చేరాక కూడా, ఇంట్లో శివుడి విగ్రహాన్ని పెట్టుకుని చివరి శ్వాస వరకూ పూజిస్తూనే ఉన్నారు. మీకూ ఈ ఆలయాన్ని చూడాలనిపిస్తే… బైద్యనాథ్ మహాదేవుడిని దర్శించుకోవాలనిపిస్తే…
మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని అగర్ మాల్వాకు చేరుకోండి. భారతదేశంలో బ్రిటిష్ వారు కట్టించిన మొదటిదీ… చివరదీ… ఒకేఒక్కటీ అయిన హిందూ అలయం ఇదే.

No comments:
Post a Comment