ఒత్తిడిని అధిగమించాలంటే... అధునాతన జీవనసరళిలో ఉరుకులు, పరుగుల నేపథ్యంలో మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న కుటుంబ, సామాజిక వ్యవస్థలో మనిషి అనేక మానసిక సంఘర్షణలకు గురవుతున్నాడు. దైనందిన జీవితంలో నిద్ర లేచింది మొదలు విశ్రమించేవరకు అంతా యాంత్రిక వ్యవహారమే. ఆలోచనల్లో ఒత్తిడి, మాటల్లో ఒత్తిడి, ప్రవర్తనలో ఒత్తిడి... అంతటా ఒత్తిళ్లే.
రక్తపోటు ఎందుకు పెరుగుతుంది- ఆలోచనలు, ఆశల తీవ్రత వల్ల! ఆ తీవ్రత దేనివల్ల- ఆహారనియమం, నిష్ఠ పాటించకుండా, ఎక్కడ, ఏది, ఎలా దొరికితే అది తిన్న తరవాత ‘ధర్మసాధనకు మన శరీరమే ముఖ్యం’ అన్న సూక్తిని వల్లెవేసినంత మాత్రాన ఆరోగ్యంగా ఉంటామా?
ప్రహ్లాదుడు గర్భంలో ఉండగా లీలావతి కఠోరమైన ఆహారనియమాలు పాటించడంవల్లనే అంతటి భక్త శిఖామణిని కన్నది.
శరీరం పుష్టిగా ఉంటే మనసూ శక్తిమంతంగానే ఉంటుంది. శక్తిపొందిన హృదయాన్ని కామక్రోధాధులేవీ ఆవేశించలేవు. ఆశ, కోరిక తీరనప్పుడు క్రోధం పెరుగుతుంది. అసంతృప్తి, ద్వేషం, అసూయ, హింసాప్రవృత్తి పెచ్చరిల్లి మనిషిని అనేకవిధాల ఒత్తిళ్లకు లోనుచేస్తాయి. వాటివల్ల మనిషి విచక్షణ కోల్పోయి, వివేకహీనుడై ఎంతటి అకృత్యానికైనా వెనకాడడు. మనిషి ఓటమివల్ల, భయంవల్ల లోభత్వంవల్ల కూడా ఒత్తిళ్లకు బలైపోతాడు. వివేకవంతుడై అధ్యయనం, సత్సాంగత్యం, ధ్యానం అలవరచుకుంటే ప్రసన్నత, ప్రశాంతత అనే రక్షాకవచాలు సర్వదా అతణ్ని కాపాడుతుంటాయి.
ఏ సమస్యకైనా ప్రత్యామ్నాయ పరిష్కార మార్గం కనిపిస్తుందన్న ఆశావహ దృక్పథంతో ఉన్నవాణ్ని అనారోగ్యకరమైన ఏ ఆహారమూ ప్రలోభపెట్టలేదు, ప్రభావితుణ్ని చేయలేదు.
జీవితమన్నది కష్టసుఖాల పడుగుపేక. ఈ రెండింటినీ అనుభవించక తప్పదు. అనేకమైన భౌతిక ఆకర్షణలు, ప్రలోభాలవల్ల కలిగే ఒత్తిళ్లను దూరం చేసుకోవాలంటే ఇంద్రియ సంయమనమే ప్రధానం. మనిషి తన స్వేచ్ఛను పరిమితం చేసుకుని, మనసును నిష్కపటంగా, నిరామయంగా, నిశ్చలంగా ఉంచుకుని ధ్యాన, యోగదిశగా జీవనయానం కొనసాగిస్తే- ఏ ఒత్తిడీ అతడి ద

No comments:
Post a Comment