మొదట నీలోని దుర్గుణాలను జయిస్తే సమాజంలో దేన్నైనా జయించటానికి అర్హత లభిస్తుంది. ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటే అదే. జీవనంలో ధర్మాచరణ ద్వారానే మనం దోషాలన్నింటిని పరిహరించగలం. పురాణాలు, ధర్మశాస్త్రాలు, అవతార పురుషుల జీవితాలు మనకు సహనాన్ని బోధిస్తున్నాయి. భారతీయ హృదయానికి ఆయువుపట్టులాంటి సహనాన్ని వదిలి ధ్యానం మాత్రమే చేయాలనుకోవటం అత్యాశే అవుతుంది. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. తన 12వ ఏటనే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు. బ్రహ్మకు సైతం అంతుచిక్కని శక్తిని ప్రదర్శించాడు. అయినా ఆయన వచ్చిన పనులన్నీ పూర్తి చేయటానికి 120 సంవత్సరాల కాలం జీవించాల్సి వచ్చింది. మన జీవన పరమార్థమేమిటో, వచ్చిన పనేమిటో, మనకు తెలియకపోవచ్చు ! కానీ అవతరించిన దైవానికి అన్నీ తెలుసు. సహనం నేర్పటం కూడా అవతార రహస్యంలో భాగం కాబట్టి వారు కూడా కాలానుగుణంగానే వ్యవహరించారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి మనసులు వేరైనా అనుసరించిన ధర్మం, ఆచరించి చూపిన సచ్ఛీలం ఒక్కటే. శ్రీరాముని పూజించడం అంటే ఆయన సద్గుణాలను అలవర్చుకోవటం. సద్గుణ సంపత్తితో దేన్నైనా జయించవచ్చు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment